
రాహుల్ రామకృష్ణ.. కమెడియన్‌గా, నటుడిగా తనేంటో నిరూపించుకున్నాడు. 'జాతిరత్నాలు' సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకున్న ఈయన తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇకమీదట సినిమాల్లో నటించనని వెల్లడించాడు. 2022 వరకు మాత్రమే సినిమాల్లో నటిస్తానని, ఆ తర్వాత నటనకు దూరం అవుతానని ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ఎవ్వరేమన్నా తను ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నాడు. ఇలా ఉన్నట్టుండి ఎందుకు సినిమాలు మానేస్తున్నాడని అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
'ఇదంతా ప్రాంక్ కదా', 'నిజం చెప్పు రాహుల్', 'ఇదేదో వెబ్‌సిరీస్ ప్రమోషన్ అయ్యుంటుంది', 'నావల్ల ప్రాబ్లమ్ అయితే నేను వెళ్లిపోతా మామా.. అన్న డైలాగ్‌ను నిజం చేయట్లేదుగా' అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాతో తెరంగేట్రం చేసిన రాహుల్ 'అర్జున్ రెడ్డి'లో విజయ్ దేవరకొండ స్నేహితుడి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత 'జాతిరత్నాలు', 'కల్కి', 'స్కైలాబ్' చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు. ఈ ఏడాదితో తన యాక్టింగ్ కెరీర్‌కు ఎందుకు ఫుల్‌స్టాప్ పెడుతున్నాడనేది తెలియాల్సి ఉంది.
2022 is my last.
— Rahul Ramakrishna (@eyrahul) February 4, 2022
I will not do films anymore.
Not that I care, nor should anybody care
Comments
Please login to add a commentAdd a comment