
కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన నటనతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఒకవైపు కమెడియన్‌గా రాణిస్తూనే.. మరోవైపు జాతిరత్నాలు, విరాటపర్వం, ఆర్‌ఆర్‌ఆర్ లాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించాడు. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లతో నటిస్తూ.. బీజియెస్ట్ ఆర్టిస్ట్‌గా మారాడు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి ఈ టాలెంటెండ్ యాక్టర్ తండ్రైన విషయం తెలిసిందే. పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచి.. గతేడాది నవంబర్‌లో తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించి అందరికి షాకిచ్చాడు.
(చదవండి: రూ. 37 కోట్లతో ఇల్లు కొన్న అలియా.. ఆ వ్యాపారం కోసమేనట!)
ఇక సంక్రాంతి రోజు అబ్బాయి పుట్టాడని ట్వీట్ చేశాడు. కానీ అతని కొడుకు ఫోటోని మాత్రం చూపించలేదు. ఇన్నాళ్లకు తన వారసుడిని ప్రపంచానికి పరిచయం చేశాడు. తన కొడుకు పేరు రూమి అని చెబుతూ.. ఓ ఫోటోని ట్విటర్‌లో షేర్ చేశాడు. అందులో రాహుల్ భార్య కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. రూమి.. జూనియర్ రాహుల్ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. పేరు కొత్తగా ఉందని, దాని అర్థం ఏంటి? అని అభిమానులు కామెంట్ పెడుతున్నారు. కాగా, రూమి పాపులర్ పర్సియన్ కవి. అతడి పేరును తన తనయుడికి రాహుల్ రామకృష్ణ పెట్టడం గమనార్హం.
Meet Rumi along with his family 😘 pic.twitter.com/SJefvm2Gho
— Rahul Ramakrishna (@eyrahul) April 24, 2023