‘ఓం భీమ్‌ బుష్‌’ ఓటీటీ వివరాలు.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడ? | Om Bheem Bush Movie OTT Release Date And Streaming Platform Details Inside - Sakshi
Sakshi News home page

Om Bheem Bush OTT Release: ‘ఓం భీమ్‌ బుష్‌’ ఓటీటీ వివరాలు.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు? ఎక్కడ?

Mar 24 2024 3:45 PM | Updated on Mar 24 2024 5:26 PM

Om Bheem Bush OTT Streaming Platform ,Release Date Details - Sakshi

శ్రీవిష్ణు హీరోగా, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ‘ఓమ్‌ భీమ్‌ బుష్‌’ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. మార్చి 22న థియేటర్స్‌లో రిలీజైన ఈ సినిమా ఫస్ట్‌డే ఫస్ట్‌ షో నుంచే పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకుంది. ఫలితంగా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 10.44 కోట్ల గ్రాస్‌ వసూళ్ల సాధించి, ఔరా అనిపిస్తోంది. లాజిక్‌తో సంబంధం లేకుండా  మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడంలో దర్శకుడు  శ్రీహర్ష సక్సెస్‌ అయ్యాడు.

(చదవండి: ఓం భీమ్ బుష్' సినిమా కలెక్షన్స్‌ ఊహించలేరు..)

ఈ మధ్య కాలంలో ఫుల్‌లెన్త్‌ కామెడీ చిత్రాలేవి తెలుగులో రిలీజ్‌ కాకపోవడం కూడా ఓం భీమ్‌ బుష్‌కి బాగా కలిసొచ్చింది. వీకెండ్‌లో కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ డిటేల్స్‌ బయటకు వస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయబోతుందనే వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

(చదవండి: ఓటీటీలోకి 'ఓపెన్‌హైమర్‌' తెలుగు వర్షన్‌ వచ్చేసింది)

రిలీజ్‌కి ముందే ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ దక్కింకుంది. మంచి రేటుకే ఓటీటీ రైట్స్‌ అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. సినిమాకు హిట్‌ టాక్‌ రావడంతో ఓటీటీ రిలీజ్‌ పోస్ట్‌పోన్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు వారాల వరకు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం లేదు. ఏప్రిల్‌ చివరి వారంలో అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు మాత్రం ఆగాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement