
లక్ష్మీ పార్వతి, ముస్కాన్ శెట్టి
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న లక్ష్మీ పార్వతి తొలిసారి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రాధాకృష్ణ’. అనురాగ్, ముస్కాన్ శెట్టి జంటగా నటించారు. ప్రసాద్ వర్మ దర్శకత్వం వహించారు. దర్శకుడు ‘ఢమరుకం’ శ్రీనివాస్ రెడ్డి సమర్పణలో హరిణి ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై పుప్పాల సాగరిక, శ్రీనివాస్ కానూరు నిర్మించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కనుమరుగవుతున్న నిర్మల్ కొయ్య బొమ్మల కథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అందరి హృదయాలను హత్తుకునే ఆప్యాయతలు ఉంటాయి. పల్లె వాతావరణంలోని అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన ఒక అందమైన ప్రేమకథ ఇది. ఎక్కడా రాజీ పడకుండా అనుకున్న విధంగా చిత్రీకరించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు అతి త్వరలో పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. సంపూర్ణేష్ బాబు, అలీ , కృష్ణ భగవాన్, చమ్మక్ చంద్ర ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: ఎమ్.ఎమ్.శ్రీలేఖ.
Comments
Please login to add a commentAdd a comment