Oscars 2023: RRR 'Naatu Naatu' wins best original song at the 95th Academy Awards - Sakshi
Sakshi News home page

ఊర నాటు.. ఆస్కార్‌ హిట్టు.. దేశం మురిసిన వేళ.. తెలుగు స్క్రీన్‌ ఆనందించిన వేళ

Published Tue, Mar 14 2023 7:35 AM | Last Updated on Tue, Mar 14 2023 10:35 AM

95th Oscar Awards Ceremony 2023 Rrr Natu Natu Song - Sakshi

‘నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా...’ పాటలో దమ్ముంటే లోకం పాడుతుంది.. ఆడుతుంది.. ఆ పాట విశ్వ విజేత అవుతుంది. ‘నాటు నాటు...’ అందుకో ఉదాహరణ.  క్లాస్, మాస్‌ తేడా లేకుండా నాటు బీటు అందరి మనసుల్లోకి చొచ్చుకుపోయింది. తెలుగు పరిశ్రమ తొలి ఆస్కార్‌ ఆనందాన్ని చవి చూసేలా చేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, దర్శకుడు రాజమౌళి, డాల్బీ థియేటర్‌లో ఇతరుల కరతాళ ధ్వనుల మధ్య చిత్రసంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్‌ ఆస్కార్‌ని అందుకున్నారు. దేశం మురిసిన వేళ.. తెలుగు స్క్రీన్‌ ఆనందించిన వేళ 95వ ఆస్కార్‌ అవార్డు విశేషాలు తెలుసుకుందాం...

అంతర్జాతీయ వేదికపై తెలుగోడి ‘నాటు నాటు’ మారుమోగిపోయింది. ఆస్కార్‌ వేదికపై నాటు నాటు స్టెప్పులు అదిరిపోయాయి. ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డు దక్కింది. దాదాపు 80 పాటలను పరిశీలించి 15 పాటలను బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో అవార్డు కోసం షార్ట్‌లిస్ట్‌ చేసింది ఆస్కార్‌ కమిటీ. ఈలోపు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ప్రమోషన్స్‌తో ‘నాటు నాటు..’ విదేశీయులకు కూడా మరింత చేరువైంది. ఈ క్రమంలోనే జనవరి 24న వెల్లడైన ఆస్కార్‌ నామినేషన్స్‌లో ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో ‘నాటు నాటు..’కు చోటు దక్కింది. ‘

నాటు నాటు’ పాటతో పాటు ‘టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌’ చిత్రంలోని ‘అప్లాజ్‌’, ‘బ్లాక్‌పాంథర్‌: వకాండ ఫరెవర్‌’లోని ‘లిఫ్ట్‌ మీ అప్‌’, ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ చిత్రంలోని ‘దిస్‌ ఈజ్‌ ఏ లైఫ్‌’, ‘టాప్‌గన్‌: మ్యావరిక్‌’లోని ‘హోల్డ్‌ మై హ్యాండ్‌’ పాటలు బరిలో నిలిచాయి. అయితే వీటన్నింటినీ దాటుకుని తెలుగు ‘నాటు నాటు’ ఆస్కార్‌ అవార్డును తెచ్చింది. ప్రపంచ సినిమా చరిత్రలో సరికొత్త చరిత్రకు పునాది వేసింది. ఇలా దేశానికి ఆస్కార్‌ తెచ్చిన తొలి చిత్రంగా, తొలి తెలుగు చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిలిచింది (గతంలో కొందరు భారతీయులు, ఇండో–అమెరికన్స్‌ ఆస్కార్‌ అవార్డులు సాధించినప్పటికీ అవి భారతీయ చిత్రాలు కావు). ఒక ఏషియన్‌ చిత్రం (ఆర్‌ఆర్‌ఆర్‌) నుంచి ఓ పాటకు (నాటు నాటు) అవార్డు రావడం ఇదే తొలిసారి.

అలాగే నాన్‌–ఇంగ్లిష్‌ పాటల్లో ఆస్కార్‌ అవార్డు సాధించిన నాలుగో పాటగా ‘నాటు నాటు’ నిలిచింది. ఇక ఆస్కార్‌ అవార్డు సాధించిన తొలి తెలుగు వ్యక్తులుగా కీరవాణి, చంద్రబోస్‌ రికార్డు సృష్టించారు. అలాగే బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డు సాధించిన రెండో భారతీయుడుగా కీరవాణి, రెండో గీత రచయితగా చంద్రబోస్‌ నిలిచారు. 2009లో జరిగిన 81వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో ఇంగ్లిష్‌ చిత్రం ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’కి గాను ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో ఏఆర్‌ రెహమాన్, రచయిత గుల్జార్‌ ఆస్కార్‌ అవార్డులను అందుకున్నారు. 

ఇక 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో ప్రకటించిన మొత్తం 23 విభాగాల జాబితాల్లోకి వస్తే... 
ఉత్తమ చిత్రం: ఎవ్రీవేర్‌ ఎవ్రీథింగ్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌
ఉత్తమ దర్శకుడు: డానియల్‌ క్వాన్, డానియల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీవేర్‌ ఎవ్రీథింగ్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
ఉత్తమ నటుడు: బ్రెండెన్‌ ఫ్రాసెర్‌ (ది వేల్‌)
ఉత్తమ నటి: మిషెల్‌ యో (ఎవ్రీవేర్‌ ఎవ్రీథింగ్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
ఉత్తమ ఒరిజినల్‌సాంగ్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’(మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి, లిరిక్‌ రైటర్‌ చంద్రబోస్‌)
ఉత్తమ సహాయ నటుడు:  కి హుయ్‌ క్వాన్‌ (ఎవ్రీవేర్‌ ఎవ్రీథింగ్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
ఉత్తమ సహాయ నటి: జామి లీ కర్టిస్‌ (ఎవ్రీవేర్‌ ఎవ్రీథింగ్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
ఉత్తమ క్యాస్ట్యూమ్‌ డిజైన్‌: రూథ్‌ కార్టర్‌(బ్లాక్‌ పాంథర్‌: వకండా ఫరెవర్‌)
ఉత్తమ స్క్రీన్‌ ప్లే: డానియల్‌ క్వాన్, డానియల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీవేర్‌ ఎవ్రీథింగ్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
ఉత్తమ సినిమాట్రోగ్రఫీ: జేమ్స్‌ఫ్రెండ్‌ (ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌)
ఉత్తమ ఎడిటర్‌: పాల్‌ రోజర్స్‌ (ఎవ్రీవేర్‌ ఎవ్రీథింగ్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)
ఇంటర్‌నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రంట్‌ ఫ్రంట్‌ (జర్మనీ)
బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌: నవాల్నీ
బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌: ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌
బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌: క్రిస్టియన్‌ ఎం గోల్డ్‌ బెక్‌ (ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రంట్‌ ఫ్రంట్‌)
బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌: అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌ (అవతార్‌ 2)
బెస్ట్‌ సౌండ్‌: టాప్‌గన్‌: మ్యావరిక్‌
బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టయిల్‌: ది వేల్‌
బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: పినాషియో
లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ఏన్‌ ఐరిస్‌ గుడ్‌ బై
యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ద బాయ్, ద మోల్, ద ఫాక్స్‌ అండ్‌ ది హార్స్‌
బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే: షెరా పాల్లే (ఉమెన్‌ టాకింగ్‌)
బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌: బ్రెటెల్‌మాన్‌ (ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రంట్‌ ఫ్రంట్‌)

హోస్ట్‌ జిమ్మిపై నెటిజన్ల ఆగ్రహం
ఆస్కార్‌ వేడుక ప్రారంభంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రస్తావన వచ్చినప్పుడు హోస్ట్‌ జిమ్మి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బాలీవుడ్‌ మూవీ అన్నట్లుగా చెప్పారు. దీంతో నెటిజన్లు జిమ్మి కిమ్మెల్‌ను తప్పుపడుతూ  కామెంట్ల వర్షం కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తెలుగు సినిమా అని గుర్తింపు పొందిన నేపథ్యంలో ఆస్కార్‌లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డుకు  హోస్ట్‌ అయిన జిమ్మీ బాలీవుడ్‌ మూవీ అనడం సరికాదని çపలువురు నెటిజన్లు సోషల్‌ మీడియాలో విమర్శించారు.

డు యూ నో నాటు?
‘నాటు నాటు’ పాట ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్కక్కర్లేదు. కానీ ఆస్కార్‌ వేదికపై ‘డు యూ నో నాటు?.. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు’.. అంటూ దేశం నుంచి ఆస్కార్‌ అవార్డ్స్‌కి ఓ ప్రెజెంటర్‌గా వెళ్లిన దీపికా పదుకోన్‌ ‘నాటు నాటు’ పాటను పరిచయం చేశారు. వేదికపై రాహుల్‌ సిప్లిగంజ్, కాలభైరవ ‘నాటు నాటు’ పాటను పాడగా, వెస్ట్రన్‌ డ్యాన్సర్స్‌ కాలు కదిపారు. ఈ వేడుకలో వీక్షకుల్లో ‘నాటు నాటు..’ పాట ఎంత జోష్‌ నింపిందంటే.. పాట పూర్తయ్యాక అందరూ స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇచ్చారు.
చదవండి: ఆస్కార్ వేదికపై నల్ల గౌనులో మెరిసిన దీపిక.. ట్విస్ట్ ఏంటంటే..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement