Oscars 2023: Naatu Naatu Performance Gets A Standing Ovation At 95th Academy Awards - Sakshi
Sakshi News home page

ఆస్కార్ స్టేజీపై 'నాటు నాటు' సందడి.. మనకు పోటీ ఇస్తున్న సాంగ్స్ ఇవే..

Published Mon, Mar 13 2023 7:07 AM | Last Updated on Mon, Mar 13 2023 10:55 AM

Rrr Natu Natu Song at Oscar Awards Ceremony 2023 Stage - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా జరుగుతున్న 95వ ఆస్కార్ ప్రదానోత్సవ వేడుకల్లో ఆర్‌ఆర్‌ఆర్‌- నాటు నాటు పాట సందడి చేసింది. అవార్డుల ప్రకటనకు ముందే స్టేజీపై ఈ పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు హాలీవుడ్ డాన్సర్లు. ఈ బీట్‌కు హాలీవుడ్ నటీ నటులు ఊర్రూతలూగారు.

ఆస్కార్‌ అవార్డుకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం నుంచి నాటు నాటు పాట నామినేట్ అయిన విషయం తెలిసిందే. మన పాటకు లిస్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్ (అప్లాజ్), హోల్డ్ మై హాండ్( టాప్ గన్ మావరిక్), ఠిస్ ఇస్ ఏ లైఫ్ ( ఎవరీ థింగ్ ఏవిరివేర్ ఆల్ ఇట్ వన్స్) పాటలు గట్టి పోటీ ఇస్తున్నాయి.


కాగా.. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ హీరోలుగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం రూపొందింది. గతేడాది మార్చి 25న విడుదలైన ఈ చిత్రం అద్భుత విజయం సాధించింది. పాన్ ఇండియానే గాక, పాన్ వరల్డ్ స్థాయిలో సినీ అభిమానులను అలరించింది. ముఖ్యంగా నాటు నాటు పాటుకు ప్రపంచ నలుమూలల నుంచి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలోనే ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది.

ఈ పాటకు మ్యూజిక్ మాంత్రికుడు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ ఈ పాటను ఆలకించారు. ఆస్కార్ స్టేజీపైనా వీరు లైవ్‌లో ఈ పాట పాడి అభిమానులను అలరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement