రామ్ చరణ్‌కి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ (ఆస్కార్ కమిటీ) తాజాగా వెల్లడించిన ‘మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్’ జాబితాలో రామ్‌చరణ్‌కి సభ్యత్వం దక్కింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో రామరాజు పాత్రలో అద్భుతంగా నటించినందుకుగాను చరణ్‌కి ఈ స్థానం లభించింది. కాగా ‘ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ ఆ మధ్య విడుదల చేసిన యాక్టర్స్ బ్రాంచ్‌లో తెలుగు నుంచి ఎన్టీఆర్‌కి చోటు దక్కిన విషయం తెలిసిందే.
తాజాగా రామ్‌చరణ్‌తో పాటు మరికొందరు హాలీవుడ్ నటీనటులకు ఈ కమిటీలో చోటు దక్కింది. ‘‘ఈ నటులు వెండితెరపై తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించారు. వాస్తవానికి, కల్పితానికి మధ్య వారధులుగా నిలిచారు. ఎన్నో సినిమాల్లో వారి నటనతో పాత్రలకు ప్రాణం పోశారు.
వారి కళతో సాధారణ సినిమాతో ప్రేక్షకులకు అసాధారణ అనుభవాలను అందిస్తున్నారు. అలాంటి వారిని ‘యాక్టర్స్ బ్రాంచ్’లోకి ఆహ్వానిస్తున్నాం’’ అని సోషల్ మీడియా వేదికగా ఆస్కార్ అకాడమీ ప్రతినిధులు షేర్ చేశారు. కాగా 96వ ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment