ఆస్కార్ వేదికపై తెలుగు ‘నాటు నాటు’ మారుమోగనుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట నామినేట్ అయిన సంగతి తెలిసిందే.
మార్చి 12న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13) జరగనున్న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘నాటు నాటు..’ పాటను పాడిన గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్‌లో పాడనున్నట్లు ఆస్కార్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. యం.యం. కీరవాణి స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన విషయం తెలిసిందే.
అమెరికాలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్
ఆస్కార్ అవార్డుల వేడుక దగ్గర పడటంతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాజమౌళి, ఆయన సతీమణి రమ, కీరవాణి తదితరులు అమెరికాలో ఉన్నారని తెలిసిది.
ఆస్కార్‌కి సంబంధించిన వరుస ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు రామ్‌చరణ్ కూడా ఈ నెల 12కు వరకు యూస్‌లోనే ఉంటారట. మరో హీరో ఎన్టీఆర్ వీరిని త్వరలో జాయిన్ కానున్నారు. అలాగే ఇటీవల ఆస్కార్ నిర్వాహకులు అవార్డుల నామినీల కోసం ఏర్పాటు చేసిన లంచ్‌కు కీరవాణి, చంద్రబోస్ హాజరైన విషయం తెలిసిందే. ఈ నెల 9న అమెరికాలో నామినీల కోసం డిన్నర్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ విందులో కీరవాణి, చంద్రబోస్ పాల్గొననున్నారు.
ఎన్టీఆర్... చరణ్... హుక్ స్టెప్?
ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటను లైవ్‌లో సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడతారు కాబట్టి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంటే బాగుంటుందని పలువురు నెటిజన్లు పో స్ట్ చేస్తున్నారు. వీటికి తోడు ఇటీవల ఓ అమెరికా మీడియాకు రామ్‌చరణ్ ఇంటర్వ్యూ ఇస్తూ...‘‘ఇప్పటివరకు ప్రేక్షకులు మాకు చాలానే ఇచ్చారు. నా ప్రేమను ప్రేక్షకులకు చూపించడానికి ‘నాటు నాటు’ పాటను ఆస్కార్ లైవ్‌లో ప్రదర్శించడం ఓ మార్గంలా భావిస్తున్నాను.
ఇది నేను వారికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్‌లా అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. దీంతో ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటకు ఎన్టీఆర్, చరణ్ డ్యాన్స్ చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే మరో ఇంటర్వ్యూలో రామ్‌చరణ్ ‘నాటు నాటు’ పాట గురించి మాట్లాడుతూ– ‘‘ఈ పాట చిత్రీకరణ సమయంలో దాదాపు 300మందిప్రొ ఫెషనల్ డ్యాన్సర్లు సెట్స్‌లో ఉన్నారు. 7 రోజుల రిహార్సల్స్ తర్వాత 17 రోజుల పాటు ఈ పాటను షూట్ చేశాం.. ‘నాటు నాటు’ పాటను మేం ప్రదర్శించిన ప్రతిచోటా మంచి స్పందన లభిస్తోంది. అలా అని అన్ని చోట్లా చేయలేం.
ఇక ఆస్కార్ నిర్వాహకులు రిక్వెస్ట్ చేస్తే, టైమ్ కలిసొస్తే ‘నాటు నాటు’ పాట పెర్ఫార్మ్ చేస్తాం. అయితే పాట మొత్తం ప్రదర్శించడం అనేది కష్టం. ఎందుకంటే ఈ పాటకు స్టెప్స్ వేసే టైమ్‌లో చాలా బ్రీత్ కావాలి, ఎనర్జీ ఉండాలి. కానీ చాన్స్ ఉంటే ‘నాటు నాటు’లోని ‘హుక్ స్టెప్’ను ఎందుకు ప్రయత్నించకూడదు? అను కుంటున్నాను’’ అని పేర్కొన్నారు. మరి.. ఎన్టీఆర్, చరణ్‌ల లైవ్ పెర్ఫార్మెన్స్ ఉంటుందా? లేదా అనేది 13న తెలిసి పో తుంది.
Comments
Please login to add a commentAdd a comment