సినీ గేయ రచయిత చంద్రబోస్
బంజారాహిల్స్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా తప్పనిసరిగా తన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకుంటా.. ఓటు వేసిన తరువాతే మిగతా కార్యక్రమాలు చూసుకుంటా.. అని వివరించారు ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్. ప్రస్తుతం మణికొండలో ఉంటున్నానని ఈసారి కూడా తప్పనిసరిగా వినియోగించుకుంటానని వెల్లడిస్తూ సర్కార్‌సినిమాలో తాను రాసిన పాటను పంచుకున్నారు.
(సర్కార్ సినిమాలో ఓటర్లను చైతన్యపరిచే గీతాన్ని రాశారు చంద్రబోస్. ఇప్పుడు సోషల్‌మీడియాలో ఈ పాట సూపర్‌హిట్‌గా నిలిచిఓటర్లలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తోంది.)
పాట ఇదే...
ఉరికితే ఉద్యమం– ఉరిమితే విప్లవం
వేలి చివర నలుపు రంగు – మార్చునంటా బతుకురంగు
మనకంఠం గంటలు మోగిస్తే అధికారపీఠం అదరాలే...
సగటు మనిషి చేతి స్పర్శకే జగతి రాత మారాలే.
బెదురుగా ఆగడం– కిందకే అణగడం
ఎదురుగా నిలవడం– ఎత్తుకే ఎదగడం
నోటుకు ఓటు అమ్మేశావే– మందే తాగి తొంగున్నావే
మత్తే దిగి మేల్కోన్నావే
ఉరిమితే ఉద్యమం–ఉరికితే విప్లవం
మీ రంగుల బొమ్మల వెల
మా రక్తం అయితే ఎలా
ఈ రాజ్యం మారుట కల
నిలదీసి అడుగుదాం
మోసమే జరిగితే – కన్నులే మూసినం
ద్రోహమే పెరిగితే– ఖర్మగా తలచినాం
విందులే వద్దులే– తిండినే అడిగినాం
మేడలే వద్దులే– నీడకై నలిగినాం
నదులలో నీటినే– కళ్ళలో దాచినాం
గుండెలో మండినాం–బూడిదై బతికినాం
కమ్ముకున్న మత్తు వీడితే–
కనబడునోయ్ కొత్త కాంతులే
Comments
Please login to add a commentAdd a comment