Kalyan Ram Movie Bimbisara Director Clarity On Sequel Of The Movie - Sakshi
Sakshi News home page

Bimbisara: కల్యాణ్ రామ్ బింబిసార సీక్వెల్.. దర్శకుడి క్లారిటీ ఇదే..!

Published Fri, Oct 28 2022 7:22 PM | Last Updated on Fri, Oct 28 2022 9:30 PM

Kalyan Ram Movie Bimbisara Director Clariry On Sequel Of The Movie - Sakshi

కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'బింబిసార'. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించింది. టాలీవుడ్  ప్రేక్షకులకు థియేటర్లలో వినోదాన్ని పంచింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో స్ట్రీమింగ్‌ అవుతోంది. బింబిసారుడు అనే ఓ రాజు జీవిత కథను ఆధారంగా చేసుకుని సోషియో ఫాంట‌సీ డ్రామాగా డైరెక్టర్‌ వశిష్ఠ్‌  ఈ సినిమాను తెరకెక్కించాడు.

తాజాగా ఈ మూవీతోనే దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠ మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. అభిమానులు ఊహించినట్లుగానే ఈ చిత్రానికి సీక్వెల్ బింబిసార-2 ఉంటుందని వెల్లడించారు. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు.  

వశిష్ఠ మాట్లాడుతూ.. 'సోషియో ఫాంటసీ సినిమాగా వచ్చిన బింబిసారను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ప్రస్తుతం వారంతా ఈ సినిమా సీక్వెల్‌ కోసం వెయిట్ చేస్తున్నారు.  వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాను తెరకెక్కించనున్నాం. కల్యాణ్‌ రామ్‌ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత బింబిసార-2 షూటింగ్‌  ప్రారంభిస్తాం' అని అన్నారు. కాగా.. ప్రస్తుతం కల్యాణ్‌ రామ్‌ నవీన్‌ మేడారం దర్శకత్వంలో తెరకెక్కుతున్న డెవిల్‌ సినిమాలో నటిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ కథను పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement