నందమూరి హీరోకు జోడిగా..! | kalyanram with manali rathod | Sakshi
Sakshi News home page

నందమూరి హీరోకు జోడిగా..!

Published Thu, Jun 1 2017 1:07 PM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM

నందమూరి హీరోకు జోడిగా..!

నందమూరి హీరోకు జోడిగా..!

పటాస్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చినట్టుగానే కనిపించిన కళ్యాణ్ రామ్ తిరిగి వరుస ఫ్లాప్లతో కష్టాల్లో పడ్డాడు. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేందుకు బ్రేక్ తీసుకున్న ఈయంగ్ హీరో ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ హీరోగా జై లవ కుశ సినిమాను నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్.. త్వరలోనూ తాను హీరోగా సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఉపేంద్ర మాధవన్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు అంగీకరించాడు కళ్యాణ్ రామ్.

మంచి లక్షణాలున్న అబ్బాయి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్కు జోడిగా మనాలి రాథోడ్ను ఫైనల్ చేశారు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఫ్యాషన్ డిజైనర్ సినిమాలో ఒక హీరోయిన్గా నటిస్తున్న మనాలి, కళ్యాణ్ రామ్ లాంటి హీరో సరసన చాన్స్ రావటంతో తెగ సంబరపడిపోతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement