Manali Rathod
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ నటి
నటి మనాలీ రాథోడ్ పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. గ్రీన్ సిగ్నల్’, ‘ఓ స్త్రీ రేపు రా’, ‘నేను లోకల్’, ‘ఫ్యాషన్ డిజైనర్’, ‘హౌరా బ్రిడ్జ్’, ‘ఎంఎల్ఏ’ వంటి చిత్రాల ద్వారా సిల్వర్ స్క్రీన్‌పై మెరిసిన హైదరాబాదీ అమ్మాయి మనాలీ రాథోడ్. ఆమె 2019 నవంబర్‌లో విజిత్ వర్మను వివాహం చేసుకుంది. విజిత్ వర్మ బీజేపీ నాయకుడు. కాగా వీరిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. ఆ మధ్య కాలంలో మనాలీ ప్రెగ్నెంట్ గా ఉన్న పొటోలు సోషల్ మీడియాలో సందడి చేసిన విషయం తెలిసిందే! కాగా మనాలీ ఇటీవలే పాపాయికి జన్మనిచ్చింది. జూలై 18న ఆమె పాపకి జన్మనివ్వగా ..ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో మనాలీకి అందరూ కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Manjula Rathod (@i_manalirathod) చదవండి: అభ్యంతరకర సీన్లే ఎందుకు? ఒక్కటైనా మంచి రోల్ ఇవ్వండి యంగ్ హీరో శ్రీవిష్ణుకు తీవ్ర అస్వస్థత -
సమంత మెచ్చుకున్నారు
మనాలి రాథోడ్, సౌమ్య వేణుగోపాల్, చిరుతేజ్ సింగ్ ముఖ్య తారలుగా ఆనంద్‌కుమార్ దర్శకత్వంలో ఎన్.ఎస్. నాయక్ నిర్మించిన బాలల చిత్రం ‘చిరుతేజ్ సింగ్’. బాలమేధావి చిరుతేజ్ సింగ్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘‘కేవలం మూడు నిమిషాల్లో 236 ప్రపంచ పటాలను గుర్తించి, బాలమేధావి చిరుతేజ్ సింగ్ రికార్డ్ సృష్టించాడు. అనాథ పిల్లలకోసం ఓ ప్రముఖ స్టూడియోలో ప్రివ్యూ వేసినప్పుడు ప్రముఖ హీరోయిన్ సమంత ఈ సినిమాను చూసి అభినందించారు. దర్శకుడు వీరశంకర్, నిర్మాత రాజ్ కందుకూరి, దర్శకులు ‘మధుర’ శ్రీధర్‌లతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా చిత్రాన్ని మెచ్చుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. రాజశేఖర్, ఎన్.ఎస్. నాయక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గీతా పూనిక్. ∙మనాలి రాథోడ్, ఆనంద్, చిరుతేజ్ -
లవ్లీ జర్నీ
‘‘రేవన్ యాదు నా కోసం మంచి పాత్రను తీర్చిదిద్దారు. అందుకు ఆయనకు థ్యాంక్స్. ‘హౌరా బ్రిడ్జ్’ సినిమా బాగా వచ్చింది. అందుకే ప్రమోషన్స్ విషయంలో రాజీ పడటం లేదు. చాందిని, మనాలి చక్కగా నటించారు. శేఖర్ ఎక్స్ట్రార్డినరీ ట్యూన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఈ సినిమా లవ్లీ జర్నీ’’ అని హీరో రాహుల్ రవీంద్రన్ అన్నారు. ఆయన హీరోగా చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వచనాలతో ఈఎమ్వీఈ స్టూడియోస్ పతాకంపై రూపొందిన చిత్రం ‘హౌరా బ్రిడ్జ్’. శేఖర్‌చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘దర్శకుడిగా నా రెండో చిత్రం ‘హౌరా బ్రిడ్జ్’. సినిమా చాలా బాగా తీశాం’’ అన్నారు రేవన్ యాదు. హీరో నిఖిల్, ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, చాందినీ చౌదరి, శేఖర్ చంద్ర, హీరోలు నారా రోహిత్, నవీన్‌చంద్ర, సంగీత దర్శకుడు సాయికార్తీక్, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అనుబంధాల వారధి
రాహుల్ రవీంద్రన్, చాందిని చౌదరి, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘హౌరా బ్రిడ్జ్’. ఇ.ఎమ్.వి.ఇ స్టూడియోస్ ప్రై లిమిటెడ్ సంస్థ నిర్మించింది. ‘‘ఈ సినిమాకు ‘హౌరా బ్రిడ్జ్’ అనే టైటిల్ పెట్టడం వెనుక ఓ రీజన్ ఉంది. హ్యూమన్ రిలేషన్స్ ఒక బ్రిడ్జ్ అయితే ఈ సినిమాలో మరో బ్రిడ్జ్ ఏంటి అనేది సస్పెన్స్. చాందిని చౌదరి, మనాలీ బాగా యాక్ట్ చేశారు. దర్శకుడు చాలా క్లారిటీతో ఈ సినిమా తెరకెక్కించారు’’ అని పేర్కొన్నారు రాహుల్ రవీంద్రన్. ‘‘రాహుల్ అద్భుతంగా నటించారు. మంచి ట్విస్టులతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రమిది’’ అని దర్శకుడు అన్నారు. రావు రమేశ్, పోసాని కృష్ణమురళి, అజయ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 2న విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు, కెమెరా: విజయ్ మిశ్రా. -
మనుషుల్ని విడదీసే గోడ
‘‘గోడ, బ్రిడ్జ్ ఒకే మెటీరియల్‌తో తయారవుతాయి. కానీ, గోడ మనుషుల్ని విడదీస్తుంది. బ్రిడ్జ్ మనుషుల్ని కలుపుతుంది. అదే ‘హౌరా బ్రిడ్జ్’ సినిమా కథ. హార్ట్ టచింగ్ ఎమోషనల్ డ్రామాగా సాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు రేవన్ యాదు అన్నారు. రాహుల్ రవీంద్రన్ హీరోగా, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరోయిన్లుగా ఆయన దర్శకత్వంలో శ్రీ వడ్డేపల్లి సత్యనారాయణ ఆశీర్వాదాలతో ఈ.ఎమ్.వి.ఈ. స్టూడియోస్ పతాకంపై రూపొందిన ‘హౌరా బ్రిడ్జ్’ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ –‘‘ఈ సినిమా నాకొక లవ్లీ జర్నీ. డైరెక్టర్ చాలా క్లియర్‌గా అనుకున్న కథని తెరపైకి తీసుకొచ్చారు. చాందిని వెరీ టాలెంటెడ్. డైరెక్టర్ తర్వాత కెమెరామెన్ విజయ్ మిశ్రా హీరో అనొచ్చు. అంతమంచి క్వాలిటీతో సన్నివేశాలు తీశారు. నిర్మాతలు సపోర్టివ్‌గా ప్రమోషన్స్ చేస్తున్నారు’’ అన్నారు. ‘‘లాంగ్ అండ్ ఎమోషనల్ జర్నీ ఇది. సినిమా చాలా రిచ్‌గా వచ్చింది’’ అన్నారు చాందినీ చౌదరి. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, మనాలి రాథోడ్ పాల్గొన్నారు. రావు రమేశ్, అజయ్ నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజు. -
నందమూరి హీరోకు జోడిగా..!
పటాస్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చినట్టుగానే కనిపించిన కళ్యాణ్ రామ్ తిరిగి వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడ్డాడు. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేందుకు బ్రేక్ తీసుకున్న ఈయంగ్ హీరో ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ హీరోగా జై లవ కుశ సినిమాను నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్.. త్వరలోనూ తాను హీరోగా సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఉపేంద్ర మాధవన్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు అంగీకరించాడు కళ్యాణ్ రామ్. మంచి లక్షణాలున్న అబ్బాయి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌కు జోడిగా మనాలి రాథోడ్‌ను ఫైనల్ చేశారు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఫ్యాషన్ డిజైనర్ సినిమాలో ఒక హీరోయిన్గా నటిస్తున్న మనాలి, కళ్యాణ్ రామ్ లాంటి హీరో సరసన చాన్స్ రావటంతో తెగ సంబరపడిపోతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఆ సినిమాలో పుట్టుమచ్చ..ఇక్కడ మన్మథ రేఖ!
‘ఫ్యాషన్ డిజైనర్’లో అమాయకమైన అమ్ములు పాత్రలో కనిపిస్తా. నా రెగ్యులర్ సై్టల్లో మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించను. పల్లెటూరు అమ్మాయిలా చీర కట్టులోనే కనపడతా’’ అన్నారు మనాలీ రాథోడ్. సుమంత్ అశ్విన్ హీరోగా అనీషా ఆంబ్రోస్, మనాలీ రాథోడ్, మానసా హిమవర్ష హీరోయిన్లుగా వంశీ దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ‘ఫ్యాషన్ డిజైనర్’ జూన్ 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మనాలి రాథోడ్ మాట్లాడుతూ– ‘‘వంశీగారు కథానాయికలను తెరపై చక్కగా చూపిస్తారు. ఆయన సినిమాల్లో హీరోయిన్స్‌కు నటన పరంగా మంచి స్కోప్ ఉంటుంది. ఈ చిత్రంలో నా పాత్రకు ప్రాముఖ్యం ఉంది. అమ్ములు పాత్రకు వంశీగారు నన్ను సెలక్ట్ చేస్తారని అనుకోలేదు. లక్కీగా ఆ అవకాశం నాకు దక్కింది. పూర్తిగా సినిమాను మార్చే పాత్ర నాది. ఓ పాటలో గ్లామరస్‌గా కనిపిస్తా. సుమంత్ అశ్విన్ మంచి కోస్టార్, హార్డ్ వర్కర్. ‘లేడీస్ టైలర్’ చిత్రంలో పుట్టుమచ్చ కథాంశం ఉంటే ‘ఫ్యాషన్ డిజైనర్’లో హీరోకి మన్మథరేఖ కాన్సెప్ట్ ఉంటుంది. వంశీగారు సెట్స్‌లో చాలా కూల్‌గా పని చేసుకుంటూ వెళతారు. మధుర శ్రీధర్‌గారు సెట్స్‌లో అందరికీ ఎంతో మర్యాద ఇస్తారు. ఆయన సెట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది’’ అన్నారు. -
మానవీయ విలువలకు వారధి
రాహుల్ రవీంద్రన్ హీరోగా రేవన్ యాదు దర్శకత్వంలో ఎమ్.వి. స్టూడియోస్ ప్రై.లి. సంస్థ నిర్మిస్తున్న సినిమా ‘హౌరా బ్రిడ్జ్’. చాందినీ చౌదరి, మనాలీ రాథోడ్ హీరోయిన్లు. హైదరాబాద్‌లో ప్రచార చిత్రాలను విడుదల చేశారు. రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ – ‘‘హ్యూమన్ రిలేషన్స్కి ఈ కథ బ్రిడ్జ్‌గా ఉంటుంది. ఇందులో మరో బ్రిడ్జ్ కూడా ఉంది. ఆ బ్రిడ్జ్ ఏంటి? అనేది ఇప్పుడే చెప్పను. ప్రస్తుతానికి సస్పెన్స్’’ అన్నారు. రేవన్ యాదు మాట్లాడుతూ – ‘‘ఓ వంతెన (బ్రిడ్జ్) నేపథ్యంలో జరిగే ఆసక్తికరమైన కథ ఇది. వచ్చే నెల మొదటి వారంలో టీజర్, రెండో వారంలో ఆడియో, నెలాఖరున సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చాందినీ చౌదరి, మనాలీ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమేరా: విజయ్ మిశ్రా, సంగీతం: శేఖర్ చంద్ర. -
గ్రీన్ సిగ్నల్ సినిమా హీరోయిన్స్ స్టిల్స్
-
గ్రీన్ సిగ్నల్ మూవీ స్టిల్స్
-
సమస్య చుట్టూ అల్లుకున్న సరదా
సామాజిక సమస్యలకి వినోదాన్ని మేళవించి యువతరమే లక్ష్యంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గ్రీన్ సిగ్నల్’. రేవంత్, మానస్, గోపాల్‌సాయి, అశుతోశ్, ‘బస్‌స్టాప్’ ఫేం రక్షిత, శిల్పి శర్మ, మనాలి రాథోడ్, భార్గవి ముఖ్య తారలు. విజయ్ మద్దాల దర్శకుడు. రుద్రపాటి రమణరావు నిర్మాత. మారుతి సమర్పకుడు. మే రెండోవారంలో విడుదల చేయనున్న ఈ చిత్రం గురించి నిర్మాత చెబుతూ- ‘‘విజయ్ చక్కని కథ చెప్పారు. జె.బి. స్వరాలందించిన పాటలను ఈ నెల 18న విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: రామస్వామి, కెమెరా: ఆర్.ఎం. స్వామి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: జి.పి.ఆర్.రాజు, ఎస్.కె.ఎన్, జి.శ్రీనివాసరావు. -
యువతరాల అంతర్యానం
ఇరవై నాలుగేళ్ల ఇంటీరియర్ డిజైనర్ మనాలీ రాథోడ్, ఒక్క ఉదుటున ఇహ బంధాలన్నిటినీ తెంచుకుని... తనలోని ఆధ్యాత్మిక అంతర్లోకాలను అలంకరించుకునేందుకు ‘దీక్ష’ పట్టారు. సాధ్వి అవడం కోసం సకల విలాసాలను, సదుపాయాలను, ఆఖరికి... కనీస అవసరాలను సైతం పరిత్యజించిన ఈ సంపన్న యువతి, నిష్ఠతో కూడిన ఇంత కఠిన జీవనశైలిని ఎందుకు ఎన్నుకున్నట్లు? మనాలిలా, ఇప్పటికే భక్తిపారవశ్యపు దారిలో తదాత్మ్యతతో ప్రయాణిస్తున్న యువతరానికి ప్రేరణనిస్తున్నది ఏమిటి?! విలాసవంతమైన జీవితంలోని ఉరుకులూ పరుగులా? సాధుజీవనంలో వారు వీక్షిస్తున్న పరలోకపు సిరిసంపదలా? చదవండి... ఈవారం ‘ప్రజాంశం’లో. ఆమె పేరు మనాలి రాథోడ్. సంపన్న జైన్ కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేసింది. కోయంబత్తూరులోని వస్త్రవ్యాపారి మోతీలాల్ రాథోడ్ కుమార్తె ఆమె. మోతీలాల్... పిల్లల్ని కాలు కిందపెట్టనివ్వకుండా, ఎండకు కందకుండా పెంచాడు. నాలుగేళ్ల క్రితం ఒక రోజు ఉన్నట్లుండి ‘తాను సాధ్విగా మారాలనుకుంటున్నాను’ అంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది మనాలి. ఈ మాట ఏ తల్లిదండ్రులకైనా దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. అయితే ఇటీవల మనాలిలాగానే తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తున్న యువతీయువకులు ఎక్కువగానే ఉంటున్నారు. ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్న వారిలో వజ్రాల వ్యాపార కుటుంబాలకు చెందిన పిల్లలు, కోట్లాదిరూపాయల వేతనం తీసుకుంటున్న ఐటీ నిపుణులు కూడా ఉంటున్నారు. సేవామార్గాన్ని ఎంచుకుంటున్న వీరందరూ దైవత్వానికి దగ్గరగా జీవించాలనుకుంటున్నారు. జీవితాన్ని బ్రహ్మకుమారీ ఈశ్వరీయ సేవకు అంకితం చేసిన అన్నాచెల్లెళ్లు వంశీ, సుమలత. వీరిద్దరూ హైదరాబాద్‌లో పెరిగిన ఉన్నత విద్యావంతులు. ఇద్దరూ డబుల్ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశారు. ఈశ్వరీయ మార్గంలో నడవాలనుకునే వారికి మార్గదర్శనం చేసే బాధ్యతను తీసుకున్నారు ఈ అన్నాచెల్లెళ్లు. క్రైస్తవ సన్యాసినులదీ దాదాపుగా ఇదే దారి. జీవితాన్ని ప్రభువు సేవకు అంకితం చేయాలనుకునే వాళ్ల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. సాటి మానవునికి సేవ చేయడం అంటే ప్రభువుని సేవించడమే అనేటంత విశాల దృక్పథం వీరిది. సేవ చేయాలంటే సన్యసించాల్సిందేనా? ఆశ్రమ జీవనం, గృహస్థ జీవనం... ఉన్నట్లే సాధు జీవనం కూడా ఒక రకమైన జీవనశైలి అంటారు వంశీ. ‘జీవితం అంటే ఇప్పుడు గడుపుతున్నది కాదు, సమాజం కోసం ఏదైనా చేయాలి, ముందుగా ‘నేనెవరు’ అనేది తెలుసుకోవాలి, ఆ తర్వాత భగవంతుడి గురించి తెలుసుకోవాలి, దానిని పదిమందికి తెలియచెప్పాలనే ఆలోచనలే వీరిని సాధు జీవనం వైపు మళ్లిస్తున్నాయి. కొన్ని మతాల్లో సన్యాసి జీవనం కఠోరంగా ఉంటుంది. ఇటీవల సాధ్విగా మారిన మనాలి రాథోడ్ సాధ్విగా మారడానికి ముందే ఇంట్లో జైనసన్యాసులు ఆచరించాల్సిన నియమాలను ఏడాదికి పైగా ఆచరించింది. రావలసిన చోటుకే వచ్చాను..! ‘బ్రదర్ వంశీ’ గచ్చిబౌలి శాంతిసరోవర్ (ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో చురుకైన నిర్వహకుడు. ‘‘ఆధ్యాత్మికంగా పయనించాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. క్రమంగా పెద్దయ్యే కొద్దీ సృష్టిలో ఇంకా ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి అనిపించేది. నా తోటి విద్యార్థులలో చాలామంది పరీక్షల ముందు గుడికి వెళ్లి పూజలు చేసేవాళ్లు. అలాంటి సంఘటన కంటపడిన ప్రతిసారీ ‘ఇంత స్వార్థం ఎందుకు, దేవుని మీద భక్తి ఉంటే ఎల్లప్పుడూ పూజించవచ్చు కదా!’ అనిపించేది. నాకు నేనుగా ధ్యానంలో నిమగ్నం కావడాన్ని గమనించిన మా అమ్మానాన్నలు నన్నోసారి బ్రహ్మకుమారీ ఈశ్వరీయ సంస్థకు తీసుకెళ్లారు. ధ్యానంలో ఒక్కోదశ దాటుతూ ఉంటే క్రమంగా నాకు ‘నేను రావల్సిన చోటుకే వచ్చాను’ అనిపించసాగింది. నాకు తెలియకుండానే నేను దేని గురించో పరిశోధిస్తున్నానని కూడా తెలిసింది. నాకు దేవతలంటే ఇష్టం. దైవత్వగుణాన్ని గౌరవిస్తాను. అయితే దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికంటూ చేసే క్రతువులను విశ్వసించను. ప్రతి మనిషీ ఎదుటి మనిషిని గౌరవించాలి, అంతే తప్ప పూజించకూడదు. మా జీవనశైలి భిన్నంగా ఉంటుంది. తెల్లవారు జామున మూడున్నరకు లేస్తాం. ధ్యానం ఇత్యాదివన్నీ పూర్తి చేసుకున్న తర్వాత సంస్థ నిర్వహణ పనుల్లో నిమగ్నం అవుతాం. ధ్యానసాధన కోసం వచ్చిన వారికి మేము విలువల ఆధారిత ఆధ్యాత్మిక చింతన గురించి వివరిస్తాం. ఉద్యోగం చేస్తూనే... ఆధ్యాత్మికత మార్గంలో..! ‘సాధుజీవనం మీద సమాజంలో ఒక దురభిప్రాయం ఉంది. ఏమీ సాధించలేని అసమర్థులే ఆధ్యాత్మిక చింతన, సమాజ సేవ అంటూ ఈ రకమైన జీవనశైలికి ఆకర్షితమవుతారనే అపోహ కూడా ఉంది. నేను 22 ఏళ్ల వయసులో ఈశ్వరీయ సేవకు అంకితం అయ్యాను. ఆ సమయంలో మా తల్లిదండ్రులు కొంత ఇబ్బందికి లోనయ్యారు. నీ మీద అలాంటి ముద్ర పడితే మాకది కష్టంగా ఉంటుంది. ముందు నువ్వు ఏదైనా సాధించు, నీ నైపుణ్యాన్ని ప్రదర్శించు. అప్పుడు నీకు నచ్చిన మార్గంలో నడిస్తే అది మాతోపాటు నీకూ సంతృప్తినిస్తుంది’ అని చెప్పారు. వారు చెప్పినట్లే... నేను ఎంఎస్సీ కంప్యూటర్స్, పీజీ డిప్లమో ఇన్ మల్టీమీడియా వంటి కోర్సులు చేసి సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తూనే ఆధ్యాత్మిక బాటను కొనసాగించాను. మనసులో స్పిరిచ్యువల్ థాట్ బలంగా ఉంటే ఇతర కారణాలేవీ మనల్ని అడ్డుకోలేవు. మనిషి వికారాలకు అతీతంగా జీవించినప్పుడు, వికారాలను జయించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అప్పుడే మనిషి భగవంతుడు కోరుకున్న విధానంలో వెళ్లగలుగుతాడు. నేను దీనిని విశ్వసిస్తాను, కాబట్టి ఈ జీవనాన్ని ఎంచుకున్నాను’’ అన్నారు. ధ్యానంతో పరిష్కారం..! సిస్టర్ సుమలత... ‘‘చిన్నప్పటి నుంచి అమ్మానాన్నలతో కలిసి సత్సంగాలకు వెళ్లేదాన్ని. అప్పట్లో మతానికి, ఆధ్యాత్మిక చింతనకీ మధ్య ఉన్న తేడా తెలిసేది కాదు. స్కూల్లో ఇతర మతాల వాళ్లు చెప్పిన విషయాలతో ఏర్పడిన సందేహాలకు సమాధానం నాకు బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. ధ్యానం ద్వారా ఏకత్వ భావన, ప్రశాంతత వంటివి అనుభవంలోకి వచ్చాయి నాకు చిన్నప్పుడు వెన్నునొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండేవి. రోజూ స్కూలుకెళ్లడం కూడా నా వల్ల అయ్యేది కాదు. అలాంటి సందర్భంలో ధ్యానం చేసుకుంటూ ఇంట్లోనే ఉండి చదువుకుని సెవెన్త్, టెన్త్ క్లాసులను డిస్టింక్షన్లో పాసయ్యాను. ఆ తర్వాత ఎం.ఎ, ఎం.ఎస్సీ పూర్తి చేశాను. భగవంతుని మీద విశ్వాసం ఉంచి ధ్యానం చేస్తే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని నేను చాలా గట్టిగా విశ్వసించాను. అందుకే శారీరక, మానసిక బాధలతో జీవిస్తున్న వారిని చైతన్యవంతం చేయడానికి నా జీవితాన్ని అంకితం చేయాలనుకున్నాను. నేనలా అంకితం అయ్యి 15 ఏళ్లయింది’’ అని చెప్పారు. ప్రార్థనలోనే అనిర్వచనీయమైన సంతృప్తి! మానవ సేవకే జీవితాన్ని అంకితం చేసిన క్రైస్తవ సన్యాసిని సిస్టర్ శోభ... దేవుని ప్రార్థనలో అసలైన సంతోషం ఉందంటారు. ‘అసలైన సంతోషాన్ని సన్యసించిన తర్వాత మాత్రమే పొందుతున్నాను’ అంటున్నారామె. ‘‘ప్రతి ఒక్కరినీ ప్రేమించాలి, ఎవరి పట్లా ఈర్ష్యాసూయలు ఉండకూడదు. డబ్బు, సుఖాలు ఇవ్వలేని ఆత్మసంతృప్తి సృష్టికర్తను ప్రార్థించినప్పుడు కలుగుతుంది. దేవుని బోధనలకు ప్రభావితం అయిన తర్వాత ప్రార్థన చేసిన ప్రతిసారీ అనిర్వచనీయమైన అనుభూతి కలిగేది. దానిని మళ్లీ మళ్లీ పొందాలనే కాంక్ష కూడా పెరిగింది. సృష్టికర్త మీద ప్రేమను పెంచుకోవడంలో ఆత్మసంతృప్తి ఉంటుంది. మనిషి మరణిస్తాడు, ఆత్మకు మరణం లేదు. ఆ ఆత్మను దేవుని మార్గంలో నడిపించే పనిని మనిషి చేయాలి. అందుకోసమే నా జీవితాన్ని దేవుని కోసం, దేవుని మాటలను బోధించడానికే అంకితం చేశాను’’ అంటారామె. ‘నేను’ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించి సాధువులుగా మారిన వాళ్లు ఉన్నారు. సృష్టి ఆరంభం నుంచి సృష్టికి మూలం ఏమిటో తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. బుద్ధుడు, ఆదినాథ్ జైన తీర్థంకరుడు, జీసస్, ప్రజాపిత బ్రహ్మ... వంటి పరమాత్మస్వరూపులు చెప్పిన మాటల ప్రభావం ప్రతి తరం మీద ఉంటుంది. అయితే ఈ తరం మీద ఆ ప్రభావం ఎక్కువగా ఉందేమో అనిపిస్తోంది. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి యువతలో చాలామంది చదువు, పరీక్షలు, ఇతర ఆనందాల్లో మునిగిపోతున్నారు. మత విశ్వాసాల ఆచరణ కోసం సమయం కేటాయించలేకపోతున్నారు. నేను లౌకికంగా నా జీవితాన్ని సంపూర్ణంగా జీవించాను. ఇక నుంచి సాధ్విగా జీవించాలనుకుంటున్నాను. - మనాలి రాథోడ్, జైనసాధ్వి సాధ్వి నియమాలు ఇలా ఉంటాయి! తొలి భోజనం సూర్యోదయానికి ముందు, మలి భోజనం సూర్యాస్తమయానికి ముందు తీసుకోవాలి సాయంత్రం ఆరు గంటల తర్వాత పురుషులతో సంభాషించరాదు సంవత్సరానికి రెండుసార్లు ఎవరి తలవెంట్రుకలను వారే తీసివేసుకోవాలి చాప లేదా బల్ల మీద నిద్రించాలి కాలి నడకనే పయనించాలి భిక్ష ద్వారా లభించిన ఆహారాన్ని మాత్రమే ఆరగించాలి కూర్చునే ముందు ఆ ప్రదేశాన్ని నెమలి పింఛాలతో తుడవాలి. మా అమ్మాయి మూడేళ్ల క్రితం ఒకరోజు తాను సాధ్విగా మారాలనుకుంటున్నట్లు చెప్పింది. ఆ మాట వినగానే హతాశులయ్యాం. సాధ్విగా జీవించడం కష్టం అనీ, నియమాలు కఠినంగా ఉంటాయనీ నచ్చచెప్పే ప్రయత్నం చేశాం. కానీ గడచిన ఏడాది కాలంగా మనాలి ఇంట్లోనే సాధ్విగా జీవించింది. దాంతో ఆమె నిర్ణయం ఎంత గట్టిదో తెలిసి, ఆమెను ప్రోత్సహించాం. మనాలి ఇక మా ఇంటికి రాదు, తనని చూడాలంటే మేమే ఆమె ఉన్న చోటకు వెళ్లాలి. -మోతీలాల్ రాథోడ్, మనాలి తండ్రి తరిగిపోతున్న మానవ సంబంధాలే కారణం ఆధునిక కాలంలో తరిగిపోతున్న మానవసంబంధాలు యువత ఆధ్యాత్మిక చింతనవైపు ఆకర్షితం కావడానికి కారణమవుతున్నాయి. సన్యసిస్తున్న చాలామంది విషయంలో... వారికి బిఎండబ్ల్యుకార్లు ఉంటున్నాయి, చేతి నిండా డబ్బు ఉంటోంది, కానీ ప్రశాంతత కరువవుతోంది. డబ్బుతో దేనినైనా కొనవచ్చు, కానీ ప్రశాంతతను కాదు అని తెలుసుకుంటున్నారు. దాంతో వేదాంత ధోరణి అలవడి, హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు. - డాక్టర్ కల్యాణ్,సైకియాట్రి్స్ట్