ఆ సినిమాలో పుట్టుమచ్చ..ఇక్కడ మన్మథ రేఖ!
‘ఫ్యాషన్ డిజైనర్’లో అమాయకమైన అమ్ములు పాత్రలో కనిపిస్తా. నా రెగ్యులర్ సై్టల్‌లో మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించను. పల్లెటూరు అమ్మాయిలా చీర కట్టులోనే కనపడతా’’ అన్నారు మనాలీ రాథోడ్. సుమంత్ అశ్విన్ హీరోగా అనీషా ఆంబ్రోస్, మనాలీ రాథోడ్, మానసా హిమవర్ష హీరోయిన్లుగా వంశీ దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ‘ఫ్యాషన్ డిజైనర్’ జూన్ 2న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా మనాలి రాథోడ్ మాట్లాడుతూ– ‘‘వంశీగారు కథానాయికలను తెరపై చక్కగా చూపిస్తారు. ఆయన సినిమాల్లో హీరోయిన్స్‌కు నటన పరంగా మంచి స్కోప్ ఉంటుంది. ఈ చిత్రంలో నా పాత్రకు ప్రాముఖ్యం ఉంది. అమ్ములు పాత్రకు వంశీగారు నన్ను సెలక్ట్ చేస్తారని అనుకోలేదు. లక్కీగా ఆ అవకాశం నాకు దక్కింది. పూర్తిగా సినిమాను మార్చే పాత్ర నాది.
ఓ పాటలో గ్లామరస్‌గా కనిపిస్తా. సుమంత్ అశ్విన్ మంచి కోస్టార్, హార్డ్ వర్కర్. ‘లేడీస్ టైలర్’ చిత్రంలో పుట్టుమచ్చ కథాంశం ఉంటే ‘ఫ్యాషన్ డిజైనర్’లో హీరోకి మన్మథరేఖ కాన్సెప్ట్ ఉంటుంది. వంశీగారు సెట్స్‌లో చాలా కూల్‌గా పని చేసుకుంటూ వెళతారు. మధుర శ్రీధర్‌గారు సెట్స్‌లో అందరికీ ఎంతో మర్యాద ఇస్తారు. ఆయన సెట్‌లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది’’ అన్నారు.