![Nancy Tyagi Fashion Designer](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/F9-zen-Z.jpg.webp?itok=_GHIbdMC)
లైఫ్‌స్టయిల్ అండ్ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాన్సీ వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)ప్రిపరేషన్ కోసం ఢిల్లీ చేరింది. అక్కడికి వెళ్లాక తెలిసింది తన ప్యాషన్ ఫ్యాషన్ అని. ‘కాల్ మి బే’ సిరీస్ కోసం నటి అనన్య పాండేకి అవుట్ ఫిట్స్ డిజైన్ చేసి బాలీవుడ్‌ని, కాన్స్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ వాక్ కోసం గౌన్‌ను డిజైన్ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
ఫ్యాషన్ వరల్డ్‌లోని తన అనుభవాలను, లైఫ్‌స్టయిల్ థింగ్స్‌ని, ఫ్యాషన్ టిప్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ @nancytyagi లో షేర్ చేస్తూ సోషల్ మీడియా జర్నీనీ స్టార్ట్ చేసింది. ఆమె చెబుతున్న ఆ సంగతులు, టిప్స్‌కి దేశంలోని స్మాల్ టౌన్ అమ్మాయిలు, మహిళలు బాగా కనెక్ట్ అయ్యి తక్కువ టైమ్‌లోనే మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ పెరిగిపోయారు. అందుకే ఆమెను ఫోర్బ్స్.. 2024కు గాను ఇండియా టాప్ డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment