![Fashion designer Shruthi Manjari](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/F9-starstyle.jpg.webp?itok=APZo_vAF)
‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను’ అనే డైలాగ్ లాగే, ప్రయోగాత్మక డిజైన్స్‌తో పాపులర్ అయి, ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ట్రెండ్‌సెట్టర్ స్టయిలిస్ట్‌గా మారిన శ్రుతి మంజరి గురించి కొన్ని విషయాలు..
ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలు తిరుగుతూ, కొత్తగా ట్రై చేస్తుంటేనే మనలోని ఓల్డ్ వర్షన్ అంతా పోయి, అప్‌డేట్ అవుతాం. అచ్చం అలాగే ఫ్యాషన్‌లోనూ, కొత్తగా ట్రై చేస్తుంటూనే అప్‌డేట్ అవుతుంటాం. – శ్రుతి మంజరి.
చెన్నైలో పుట్టిపెరిగిన శ్రుతికి చిన్నప్పటినుంచే ఫ్యాషన్ పట్ల మక్కువ ఎక్కువ. కాలేజీ రోజుల్లో తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ మొత్తం ఫ్యాషన్ మ్యాగజైన్స్‌కే ఖర్చు చేసేది. తర్వాత ప్రముఖ డిజైనర్ల దగ్గర ఇంటర్న్‌గా చేరి, ఫ్యాషన్‌పై మరింత ప్రావీణ్యం సాధించింది. ఆ సమయంలోనే రకరకాల డ్రెస్సింగ్ స్టయిల్స్‌ను గమనించింది. డిజైనింగ్‌పై దృష్టిపెడితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. వెంటనే, తనకున్న ఫ్యాషన్ స్పృహ, సృజనే క్వాలిఫికేషన్‌గా, ఒక బొటిక్ ప్రారంభించింది. కొత్త కొత్త డిజైన్స్ రూపొందించి, తనకంటూ ఒక సిగ్నేచర్ స్టయిల్‌ను క్రియేట్ చేసుకుంది.
ఫ్యాషన్ ఇండస్ట్రీలో సంపాదించిన అనుభవంతో స్టయిలింగ్ చేయటం కూడా స్టార్ట్ చేసింది. అదే ఆమెకు సినీ తారల లుక్స్, స్టయిల్‌ను తీర్చిదిద్దే చాన్స్‌నిచ్చింది. అలా శ్రుతి తొలిసారి ‘బ్యాడ్ గర్ల్’ అనే తమిళ చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్‌గా పనిచేసింది. అందులోని ఆమె పనితీరు ఆమెకు మరెన్నో సినిమాల్లోనూ స్టయిలింగ్ చేసే అవకాశాన్నిచ్చింది. అలా శ్రుతి తమిళ చిత్ర పరిశ్రమలో ఒక బిజీ స్టయిలిస్ట్‌గా మారింది. ‘భూమ్’, ‘మోడర్న్ లవ్ చెన్నై’, ‘రఘు తాత’, ‘సొర్గవాసల్’ వంటి ఎన్నో సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా పనిచేసింది. కీర్తి సురేష్, ఐశ్వర్య లక్ష్మీ, సానియా అయ్యప్పన్, కళ్యాణి ప్రియదర్శిని, ప్రియాంకా మోహన్, గౌరి జి.క్రిష్ణన్ వంటి స్టార్స్‌కి కొంతకాలం స్టయిలిస్ట్‌గా పనిచేసింది.
Comments
Please login to add a commentAdd a comment