
శ్రీజాకు ఊహ తెలిసేనాటికే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెంచుకుంది. అందుకే స్కూల్‌కి వెళ్లే వయసులోనే పెద్దయ్యాక తను ఫ్యాషన్ డిజైనర్ కావాలని నిశ్చయించుకుంది. అనుకున్నట్టుగానే ఫ్యాషన్ రంగంలోనే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. చదువయ్యాక ఫ్యాషన్ మ్యాగజీన్స్‌లో పనిచేసింది. ఆ సమయంలోనే ఒక ఫ్రెండ్ ద్వారా అప్పటికే సెలబ్రిటీ స్టయిలిస్ట్‌గా పాపులర్ అయిన మిథిలా పాల్కర్, మసాబా గుప్తా వంటి ప్రముఖులను కలసి స్టయిలింగ్ నేర్చుకుంది. ఇండివిడ్యువల్ పర్సనాలిటీని హైలైట్ చేసే ఆమె డిజైన్స్, స్టయిలింగ్ ఎంతోమంది పెళ్లికూతుర్లకు నచ్చింది. స్పెషల్ అకేషన్ ఏదైనా స్టయిలిస్ట్‌గా శ్రీజా ఉండాల్సిందే అనిపించుకుంది.
కొన్ని నెలల్లోనే బొటిక్‌తో పాటు ‘డ్రేపింగ్ డ్రీమ్స్’ అనే వెడ్డింగ్ ఫ్యాషన్ సర్వీసెస్‌ను స్టార్ చేసింది. వివాహాది శుభకార్యాలకు పెళ్లికూతుర్లకు, అతిథులకు డ్రెస్ డిజైనింగ్, స్టయిలింగ్ చేస్తూ వెడ్డింగ్ స్పెషలిస్ట్‌గా పాపులర్ అయింది. దేశీ బ్రైడల్ దుస్తులకు పర్‌ఫెక్ట్ బ్రాండ్‌గా స్థిరపడింది. ఆ క్రియేటివ్ కంఫర్ట్‌కి సామాన్యులే కాదు సెలబ్రిటీలూ ముచ్చటపడ్డారు. మిథిలా పాల్కర్, శ్రియా పిల్గొంకర్, కాజల్ అగర్వాల్, తాప్సీ పన్ను, నిహారిక కొణిదెల, శ్రద్ధా శ్రీకాంత్, సయీ మంజ్రేకర్, హన్సిక, ఆలియా భట్ లాంటి వాళ్లెందరికో శ్రీజా స్టయిలిస్ట్‌గా పనిచేసింది.
⇒ జెట్ స్పీడ్‌తో పరుగెట్టే ఫ్యాషన్‌తో పాటే.. తాను పరుగెడుతూ, పడిపోతూ, తిరిగి లేస్తూ.. బ్రైడల్ స్పెషలిస్ట్ట్ అనిపించుకుంది డిజైనర్, స్టయిలిస్ట్ శ్రీజా రాజ్‌గోపాల్. ఫ్యాషన్లపై మోజుగల సెలబ్రిటీలు ఆమె డిజైన్లకు ఫిదా అవుతున్నారు. తన ప్రతిభతో ఫ్యాషన్‌లో మ్యాజిక్ చేసిన ఆమె గురించిన కొన్ని విషయాలు..
⇒ పెళ్లిలో పెళ్లికూతురు గిల్టు నగలు ధరించకూడదని చాలామంది నమ్ముతుంటారు. వారి నమ్మకాన్ని గౌరవిస్తూ, ఉన్నవాటితోనే పెళ్లికూతుర్లను అందంగా చూపించా. అదే నా కెరీర్ గ్రోత్‌కు ఫ్లస్ అయింది. – శ్రీజా రాజ్‌గోపాల్
Comments
Please login to add a commentAdd a comment