shruthi
-
ప్రముఖ బుల్లితెర నటి గౌరి శృతి నూతన గృహ ప్రవేశం.. పాల్గొన్న సినీతారలు (ఫొటోలు)
-
ట్రెండ్‌సెట్టర్
‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తాను’ అనే డైలాగ్ లాగే, ప్రయోగాత్మక డిజైన్స్‌తో పాపులర్ అయి, ఫ్యాషన్ ప్రపంచంలో ఒక ట్రెండ్‌సెట్టర్ స్టయిలిస్ట్‌గా మారిన శ్రుతి మంజరి గురించి కొన్ని విషయాలు..ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలు తిరుగుతూ, కొత్తగా ట్రై చేస్తుంటేనే మనలోని ఓల్డ్ వర్షన్ అంతా పోయి, అప్డేట్ అవుతాం. అచ్చం అలాగే ఫ్యాషన్‌లోనూ, కొత్తగా ట్రై చేస్తుంటూనే అప్డేట్ అవుతుంటాం. – శ్రుతి మంజరి.చెన్నైలో పుట్టిపెరిగిన శ్రుతికి చిన్నప్పటినుంచే ఫ్యాషన్ పట్ల మక్కువ ఎక్కువ. కాలేజీ రోజుల్లో తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ మొత్తం ఫ్యాషన్ మ్యాగజైన్స్కే ఖర్చు చేసేది. తర్వాత ప్రముఖ డిజైనర్ల దగ్గర ఇంటర్న్‌గా చేరి, ఫ్యాషన్‌పై మరింత ప్రావీణ్యం సాధించింది. ఆ సమయంలోనే రకరకాల డ్రెస్సింగ్ స్టయిల్స్‌ను గమనించింది. డిజైనింగ్‌పై దృష్టిపెడితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. వెంటనే, తనకున్న ఫ్యాషన్ స్పృహ, సృజనే క్వాలిఫికేషన్‌గా, ఒక బొటిక్ ప్రారంభించింది. కొత్త కొత్త డిజైన్స్ రూపొందించి, తనకంటూ ఒక సిగ్నేచర్ స్టయిల్‌ను క్రియేట్ చేసుకుంది.ఫ్యాషన్ ఇండస్ట్రీలో సంపాదించిన అనుభవంతో స్టయిలింగ్ చేయటం కూడా స్టార్ట్ చేసింది. అదే ఆమెకు సినీ తారల లుక్స్, స్టయిల్‌ను తీర్చిదిద్దే చాన్స్‌నిచ్చింది. అలా శ్రుతి తొలిసారి ‘బ్యాడ్ గర్ల్’ అనే తమిళ చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టయిలిస్ట్‌గా పనిచేసింది. అందులోని ఆమె పనితీరు ఆమెకు మరెన్నో సినిమాల్లోనూ స్టయిలింగ్ చేసే అవకాశాన్నిచ్చింది. అలా శ్రుతి తమిళ చిత్ర పరిశ్రమలో ఒక బిజీ స్టయిలిస్ట్‌గా మారింది. ‘భూమ్’, ‘మోడర్న్ లవ్ చెన్నై’, ‘రఘు తాత’, ‘సొర్గవాసల్’ వంటి ఎన్నో సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా పనిచేసింది. కీర్తి సురేష్, ఐశ్వర్య లక్ష్మీ, సానియా అయ్యప్పన్, కళ్యాణి ప్రియదర్శిని, ప్రియాంకా మోహన్, గౌరి జి.క్రిష్ణన్ వంటి స్టార్స్‌కి కొంతకాలం స్టయిలిస్ట్‌గా పనిచేసింది. -
శ్రుతి జీవితంలో మరో పెను విషాదం
వయనాడ్ విలయంతో కుటుంబాన్ని కోల్పోయిన ఆమెకు.. కాబోయేవాడు అండగా నిలిచాడు. కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు శ్మశానవాటికకు చేరుకొని.. ఒకరికొకరు జీవితాంతం తోడుంటామని ప్రమాణం చేశారు. ఇంకొన్ని రోజుల్లో ఇద్దరూ వివాహంతో ఒక్కటి కావాల్సి ఉంది.ఈ లోపు విధి ఆమెపై మరోసారి కన్నెర్ర చేసింది.కేరళ వయనాడ్ విలయం తర్వాత.. ప్రధాని మోదీ బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఆ టైంలో ఓ యువతి, యువకుడు కలిసి మోదీతో మాట్లాడడం జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే.. ఆమెకు అంతటి కష్టం వచ్చింది కాబట్టి. తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యుల్ని పొగొట్టుకుందామె.చూరాల్మల గ్రామానికి చెందిన శ్రుతి (24)కి తన చిరకాల మిత్రుడైన జెన్సన్ (27) ప్రేమించుకున్నారు. ఇద్దరి మతాలు వేరైనా.. తల్లిదండ్రులు వివాహానికి పచ్చ జెండా ఊపారు. జూన్ 2న ఎంగేజ్మెంట్ జరిగింది.జూన్ 30న వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో తన తల్లిదండ్రులు, సోదరితో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయింది. ఈ విషాద సమయంలో తన ఉద్యోగాన్ని వదులుకుని మరీ జెన్సన్ ఆమెకు అండగా నిలిచాడు. మోదీ పర్యటన టైంలో జాతీయ మీడియా సైతం ఈ జంట గురించి కథనాలు ఇచ్చింది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఈ నెలలోనే రిజిస్టర్ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.అయితే..వివాహ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 10న శ్రుతి, జెన్సన్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఓమ్నీ వ్యానులో బయలుదేరారు. కోజికోడ్ కొల్లేగల్ జాతీయ రహదారిపై వీరి వాహనం, ఓ ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. జెన్సన్ తీవ్రంగా గాయపడగా, శ్రుతితో పాటు మిగతా వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. చికిత్స పొందుతూ జేన్సన్ బుధవారం రాత్రి మరణించాడు. అటు కుటుంబ సభ్యులను, ఇటు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన శ్రుతి బాధ వర్ణణాతీతంగా మారింది. -
Rosa Shruti Abraham: సెరామిక్ అండ్ గ్లాస్ డిజైనర్..
సెరామిక్ అండ్ గ్లాస్ డిజైనింగ్ కష్టమైనదిగా భావిస్తూ మహిళలు ఈ కళను ఎంచుకోవడానికి వెనుకంజ వేస్తుంటారు. అలాంటి ఈ కళను ఎంతో ఇష్టంగా ఎంచుకొని, అందులో రాణిస్తోంది తిరువనంతపుర వాసి రోసా శ్రుతి అబ్రహాం. సాధారణంగా పెద్ద పెద్ద కర్మాగారాల నుంచి భారీగా ఉత్పత్తి అయ్యే సిరామిక్ వస్తువుల గురించి మనకు తెలిసిందే. అత్యంత వేగవంతమైన ప్రపంచంలో ప్రాచీన కళారూప్రాల వెనక దాగి ఉన్న నైపుణ్యాన్ని ఈ తరానికి పరిచయం చేస్తోంది రోసా శ్రుతి.‘‘మురికి పట్టిన ఏప్రాన్, మట్టితో నిండిన చేతులు, చిక్కుబడిపోయినట్టు చిందర వందరగా ఉండే జుట్టు.. రోజులో ఎక్కువ పనిగంటలు ఇలాగే కనిపిస్తాను. అయితే, కొంతకాలంగా వరసగా ఆర్డర్లు పొందుతున్నాను. అందుకే రోజులో ఎక్కువ గంటలు స్టూడియోలోనే ఉండిపోతున్నాను. అందుకు ఎంతో ఆనందంగా ఉన్నాను.నేను ఓ స్టూడియో ఓనర్ అనేకంటే నా స్టూడియోలో నిరంతరం పనిచేసే ఒక శ్రామికురాలిని అని చెప్పుకోవడానికే ఇష్టపడతాను. స్టూడియో అంటే పెద్దదేమీ కాదు ఒక గది. అయితే, బయట పచ్చదనం ఉంటుంది. నాదైన ఈ ప్రపంచంలో అందమైన సిరామిక్స్, గ్లాస్ డిజైన్స్ రూపొందిస్తుంటాను. మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఏడేళ్లుగా ఈ తయారీని చేపడుతూనే ఉన్నాను. నిజానికి ఇది ప్రతిరోజూ ఒక కొత్త ప్రాఠమే. నా స్టూడియోలో గడిపే ప్రతి క్షణం ఎంతో విలువైనది.యజ్ఞంలా.. కళారూప్రాలు!సిరామిక్స్ అండ్ గ్లాస్ డిజైనింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశాక కొన్ని కంపెనీలలో వర్క్ చేశాను. ఏడేళ్లప్రాటు వివిధ కంపెనీలలో చేసిన ఉద్యోగాలు నాకు అంతగా సంతృప్తినివ్వలేదు. దీంతో ఉద్యోగంలో సంప్రాదించిన కొద్ది మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి ఇంటి దగ్గరే ‘కొసావో’ పేరుతో ఓ స్టూడియోను ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఇదే నాకు జీవనాధారం అయ్యింది. కళాకారిణి నుంచి వ్యవస్థాపకురాలిగా ఎదగడం, నేర్చుకోవడం ... నా ప్రయాణం ఇలాగే కొనసాగించాలనుకుంటున్నాను.ఐదేళ్లుగా ఈ పని ఓ యజ్ఞంలా కొనసాగుతూనే ఉంది. కళారూప్రాల సృష్టిలోనే కాదు ఇతరులకు బోధించడంలోనూ ఆనందాన్ని, ఆదాయాన్నీ పొందుతున్నాను. అందుకే నా స్టూడియోలో ప్రతిరోజూ అన్ని సీజన్లలోనూ క్లాసులు ఉంటూనే ఉంటాయి. ‘ఐదేళ్ల కిందటి వరకు మీరెక్కడ ఉంటారో మాకు తెలియదు, ఇప్పుడు ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు’ అని క్లాసులకు వచ్చినవారు అంటుంటే చిరునవ్వే నా సమాధానంగా ఉంటుంది.దేనికదే ప్రత్యేకం..!బయట మనకు ఎన్నో రకాల మిషన్ మేడ్ కళారూప్రాలు లభించవచ్చు. కానీ, వాటిలో ఒక ఆత్మ అంటూ ఉండదు. ఈ కళను ఏ డిజిటల్ పరికరాలతోనూ భర్తీ చేయలేం. వీటి తయారీలో ఓర్పు, పట్టుదల అవసరం. అందుకు మంచి ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఉద్యోగంలో మరొకరి కోసం పనిచేస్తున్నప్పుడు మనకు పరిమితులు ఉంటాయి. సొంతంగా ఏదైనా ్రప్రారంభించాలంటే అందులో నైపుణ్యం అవసరం. వివిధచోట్ల పనిచేసిన అనుభవం కూడా నాకు చాలా సహాయపడింది.అలాగే, విభిన్న వ్యక్తుల నుంచి వారి ప్రవర్తనల నుండి రకరకాల పద్ధతులు, మార్గాలను అర్థం చేసుకోగలిగాను. ఇవన్నీ నన్ను నేను కొత్తగా మలుచుకోవడానికి సహాయపడ్డాయి. వస్తువుల తయారీని ఫొటోలుగా తీసి, వాటిని ఆన్లైన్ ద్వారా కస్టమర్లకు షేర్ చేస్తుంటాను. ఆ తర్వాత రకరకాల పద్ధతుల్లో అనుకున్న రూప్రానికి తీసుకువస్తాను. ముఖ్యంగా ప్రాత సినిమాలు, డైలాగ్‌ల నుండి ప్రేరణ పొందిన థీమ్లతోనూ వస్తువుల తయారీకి ΄్లాన్ చేస్తుంటాను. ఇవి చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. సిరామిక్ అండ్ గ్లాస్ డిజైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను’ అని వివరిస్తుంది రోసా శ్రుతి.ఇవి చదవండి: Priya Desai: అవగాహనే ప్రథమ చికిత్స -
టీమిండియా యువ క్రికెటర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?!
Venkatesh Iyer Engagement Pics: టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ తన అభిమానులుకు శుభవార్త చెప్పాడు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తనకు నిశ్చితార్థమైన విషయాన్ని తెలియజేస్తూ.. కాబోయే శ్రీమతితో దిగిన ఫొటోలు పంచుకున్నాడు. ఈ మేరకు.. ‘‘నా జీవితంలో తదుపరి అధ్యాయానికి నాంది’’ అంటూ మంగళవారం ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ సహా హర్‌ప్రీత్ బ్రార్ తదితరులు వెంకటేశ్‌ను విష్ చేశారు. ఫ్యాషన్ డిజైనర్! కాగా వెంకటేశ్ అయ్యర్‌కు కాబోయే భార్య పేరు శృతి రఘునాథన్. పీఎస్జీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో బీకామ్ చదివిన శృతి.. నిఫ్ట్(NIFT) నుంచి ఫ్యాషన్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నట్లు సమాచారం. ఆమె ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. టీమిండియా తరఫున అరంగేట్రం చేసి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించిన వెంకటేశ్ అయ్యర్.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. స్వదేశంలో 2021లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. మరుసటి ఏడాది వన్డేల్లోనూ అరంగ్రేటం చేశాడు. ఇక ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన 28 ఏళ్ల అయ్యర్‌కు కొన్నాళ్లుగా భారత జట్టులో చోటు కరువైంది. కాగా తన అంతర్జాతీయ కెరీర్లో వెంకటేశ్ ఇప్పటి వరకు.. 2 వన్డే, 9 టీ20 మ్యాచ్‌లు ఆడి వరుసగా 24, 133 పరుగులు సాధించాడు. టీ20 ఫార్మాట్లో 5 వికెట్లు పడగొట్టాడు. చదవండి: గెలుపోటములు సహజం.. అదొక్కటే విషాదం! కోహ్లిని ఓదార్చిన సచిన్ View this post on Instagram A post shared by Venkatesh R Iyer (@venky_iyer) -
Sriti Shaw : మల్టీ టాలెంట్.. శృతిలయల విజయ దరహాసం
‘రెండు పడవల మీద ప్రయాణం’ కష్టం అంటారు. రెండు పడవలేం ఖర్మ...ఎన్ని పడవలైనా కొందరు సునాయసంగా ప్రయాణించగలరు. శృతి షా ఈ కోవకు చెందిన ప్రతిభావంతురాలు. దుబాయ్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్న ఇరవై అయిదు సంవత్సరాల షా నటి,మోడల్‌గా రాణిస్తుంది. ‘టిస్కా మిస్ ఇండియా 2021’ టైటిల్‌ను గెలుచుకుంది. సంగీతంలో కూడా తన ప్రతిభ చాటుకుంటుంది. రకరకాల మ్యూజిక్ ఆల్బమ్‌లకు రూపకల్పన చేసింది. శృతి ప్రొడ్యూసర్ కూడా. మరోవైపు సామాజిక సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ‘టైం లేదు అని సాకు వెదుక్కుంటే చిన్న పని కూడా చేయలేం’ అంటున్న శృతి షాకు ఎప్పటికప్పడు కొత్త విద్యలు నేర్చుకోవడం అంటే ఇష్టం. కోల్‌కతాలో పుట్టిపెరిగిన శృతి చిన్నప్పుడు స్కూల్లో ఒక నాటకంలో వేషం వేసింది. ఎన్నో ప్రశంసలు లభించాయి. నటన మీద తనకు మక్కువ అలా మొదలైంది. అయితే నటప్రస్థానంలో భాగంగా తెలుసుకున్న విషయం ఏమిటంటే...‘మన నటనకు ఎప్పుడూ ప్రశంసలు మాత్రమే రావు. విమర్శలు కూడా వస్తాయి. ప్రశంసల వల్ల ఉత్సాహాన్ని పొందినట్లే, విమర్శల నుంచి గుణపాఠాలు తీసుకోవాలి’ అనే స్పృహ ఆమెలో వచ్చింది. ‘నిన్ను నువ్వు బలంగా నమ్ము’ అనేది శృతి షా విజయసూత్రాలలో ఒకటి. ఎందుకంటే నీ గురించి నీకు తప్ప మరెవరికి తెలియదు. ‘చేసిన తప్పును మళ్లీ చేయకు’ అనేది ఆమె ఎప్పుడూ గుర్తుంచుకునే పాఠం. ‘ప్రతి వ్యక్తి ఒక బడి. అందులో నుంచి మనకు కావాల్సింది నేర్చుకోవచ్చు’ అనేది ఆమె విశ్వాసం. -
సివిల్స్ టాపర్ శ్రుతీ శర్మ
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్–2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సోమవారం వెల్లడించింది. తొలి ర్యాంకును చరిత్ర విద్యార్థిని శ్రుతీ శర్మ సొంతం చేసుకుంది. ఈసారి టాప్–3 ర్యాంకులూ మహిళలే దక్కించుకున్నారు! రెండో స్థానంలో అంకితా అగర్వాల్, మూడో స్థానంలో గామినీ సింగ్లా నిలిచారు. ఐశ్వర్య వర్మకు నాలుగు, ఉత్కర్ష్ ద్వివేదికి ఐదో ర్యాంకులు లభించాయి. టాప్ 25లో 15 మంది పురుషులు, 10 మంది మహిళలున్నారు. 685 మంది ఎంపిక కాగా, వీరిలో 508 మంది పురుషులు, 177 మంది మహిళలు. విజేతల్లో 25 మంది దివ్యాంగులున్నారు. 2015లో తొలి నాలుగు ర్యాంకులూ మహిళలే సాధించారు. 2021 అక్టోబర్ 10న జరిగిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు 5,08,619 మంది హాజరయ్యారు. 9,214 మంది మెయిన్ రాతపరీక్షకు అర్హత సాధించారు. ఈ ఏడాది జనవరిలో పరీక్ష జరిగింది. 1,824 మంది ఇంటర్వ్యూకు అర్హత పొందగా 685 మంది ఎంపికయ్యారు. ఫలితాలను www. upsc. gov. in. వెబ్సైట్లో పొందుపర్చారు. చదవండి: సివిల్స్‌లో తెలుగు తేజాల సత్తా.. వారి నేపథ్యం, మనోగతాలివీ హిస్టరీ ఆప్షనల్‌గా టాప్ ర్యాంక్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి హిస్టరీ(ఆనర్స్)లో పట్టభద్రురాలైన శ్రుతీ శర్మ సివిల్స్ పరీక్షలో హిస్టరీ సబ్జెక్టును అప్షనల్గా ఎంచుకొని టాప్ ర్యాంకుతో జయకేతనం ఎగురవేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి ఎకనామిక్స్(ఆనర్స్)లో గ్రాడ్యుయేట్ అయిన అంకితా అగర్వాల్ సివిల్స్‌లో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకున్నారు. రెండో ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఇక కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తిచేసిన గామినీ సింగ్లా సోషియాలజీ ఆప్షనల్‌గా సివిల్స్ రాశారు. మూడో ర్యాంకు సాధించారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్ టాప్–25 ర్యాంకర్లలో చాలామంది ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, కామర్స్, మెడికల్ సైన్స్ గ్రాడ్యుయేట్లే ఉన్నారు. వీరంతా ఐఐటీ, ఎయిమ్స్, వీఐటీ, పీఈసీ, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, జీబీ పంత్ యూనివర్సిటీ తదితర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. వీరు సివిల్స్(మెయిన్) రాత పరీక్షలో ఆంథ్రోపాలజీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, హిందీ లిటరేచర్, హిస్టరీ, మ్యాథ్స్, మెడికల్ సైన్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జువాలజీ సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకున్నారు. ప్రధాని మోదీ అభినందనలు సివిల్స్ విజేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న నేపథ్యంలో దేశ అభివృద్ధి ప్రయాణంలో ఇదొక కీలక దశ. ఈ సమయంలో పరిపాలనాపరమైన ఉద్యోగ జీవితంలోకి అడుగుపెడుతున్న యువతకు శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. సివిల్స్‌లో ఆశించిన ఫలితం సాధించలేకపోయిన అభ్యర్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఎంచుకున్న రంగంలో వారు అద్భుతాలు సృష్టించగలరని, దేశాన్ని గర్వపడేలా చేయగలరని తెలిపారు. వారికి సైతం అభినందనలు తెలిపారు. మొదటి ర్యాంకు ఊహించలేదు: శ్రుతీ శర్మ సివిల్స్ పరీక్షలో తనకు మొదటి ర్యాంకు వస్తుందని ఊహించలేదని శ్రుతీ శర్మ చెప్పారు. ఇది ఊహించని ఫలితం అని ఆనందం వ్యక్తం చేశారు. తన సివిల్స్ ప్రయాణంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్నేహితుల సహాయం మర్చిపోలేనిదని తెలిపారు. ఈ క్రెడిట్ మొత్తం వారికే చెందుతుందని పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన శ్రుతి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. నాలుగేళ్లుగా సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. జామియా మిలియా ఇస్లామియాకు చెందిన రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో సివిల్స్ శిక్షణ పొందారు. మహిళల సాధికారతకు కృషి: అంకితా అగర్వాల్ మహిళల సాధికారత కోసం కృషి చేస్తానని, ప్రాథమిక ఆరోగ్యం, పాఠశాల విద్యా రంగాలను బలోపేతం చేయడం తన లక్ష్యమని సెకండ్ ర్యాంకర్ అంకిత చెప్పారు. కోల్‌కతాకు చెందిన ఆమె 2020 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం హరియాణాలో ప్రొబేషన్‌లో ఉన్నారు. ఈసారి రెండో ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈసారి సివిల్స్‌లో మొదటి మూడు ర్యాంకులు మహిళలకే దక్కడం దేశానికి గర్వకారణమని అంకిత అన్నారు. కల నెరవేరింది: గామినీ సింగ్లా కష్టపడే తత్వం, అంకితభావం ఉన్న మహిళలు ఏదైనా సాధించగలరని మూడో ర్యాంకర్ గామినీ సింగ్లా వ్యాఖ్యానించారు. తన కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఐఏఎస్‌ను ఎంచుకుంటానని, దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని వివరించారు. గామినీ సింగ్లా రెండో ప్రయత్నంలో సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించారు. ఆమె తల్లిదండ్రులు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వంలో మెడికల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. -
నీకు అవకాశాలు రావాలంటే ఈ పాడు పనులు తప్పవులే అంటూ
కోల్‌కతా: ‘‘ఆ దర్శకుడితో డేటింగ్లో ఉన్నందుకే నీకు ఆఫర్లు వస్తున్నాయి. లేదంటే నువ్వు ‘కమిట్మెంట్’ ఇస్తేనే తప్ప నిన్ను ఎవరు సీరియల్లో పెట్టుకుంటారు. నీలాంటి మేని ఛాయ ఉన్నవాళ్లకు అవకాశాలు రావాలంటే అలాంటి పాడు పనులు తప్పవులే’’... బెంగాలీ నటి శృతిదాస్పై కొంతమంది నెటిజన్ల విద్వేషపు కామెంట్లు ఇవి. ప్రస్తుతం ఆమె.. ‘దశేర్ మాతీ’ అనే సీరియల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో శృతితో పాటు పాయల్ దే, రుక్మా రే అనే మరో ఇద్దరు నటీమణులు కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మేని ఛాయతో శృతి స్కిన్ కలర్‌ను పోలుస్తూ ఈ విధంగా ట్రోల్స్ రెచ్చిపోతున్నారు. గత రెండేళ్లుగా ఆమెపై విద్వేష విషం కక్కుతూనే ఉన్నారు. దీంతో విసిగిపోయిన శృతి... ఆన్లైన్లో తనకు వస్తున్న వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె... ‘‘బ్లాక్ బోర్డు, నలుపు అమ్మాయి.. ఇలాంటి పేర్లతో నన్ను వేధించడం కొంతమందికి పనిగా మారింది. అసలు నీలాంటి వారిని హీరోయిన్లుగా ఎలా పెట్టుకుంటారంటూ కించపరుస్తున్నారు. అంతేకాదు లీడ్‌రోల్స్ కోసం నేను దర్శకులతో ‘రాజీ’ కుదుర్చుకుంటున్నానని ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. మరికొంత మందేమో... స్వర్నేందు(బెంగాలీ సీరియల్ డైరెక్టర్)తో రిలేషన్షిప్లో ఉన్నందు వల్లే ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు. కానీ అవన్నీ నిజం కావు. నా ప్రతిభే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. ఎవరో రికమెండ్ చేస్తేనో, లేదంటే ‘మరో’ విధంగానో నేను అవకాశాలు దక్కించుకోవడం లేదు. ప్రేక్షకులు ఆదరించకపోతే.. ఎవరూ ఏం చేయలేరు. నా కారణంగా నష్టపోవడానికి సిద్ధపడరు. గత రెండేళ్లుగా నాపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే నిన్ననే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను’’ అని తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. కాగా త్రినయని సీరియల్‌తో టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శృతి దాస్.. ప్రస్తుతం దశర్ మాతీ సీరియల్లో.. టీచర్‌గా నటిస్తున్నారు. -
వనవాసం పెద్ద హిట్ అవుతుంది
‘‘యాక్టర్ అవుదామని వచ్చిన సంజయ్ కుమార్‌గారు నిర్మాత అయ్యారు. ఈ సినిమాను నిర్మిస్తున్న తన ఫ్రెండ్ చనిపోవడంతో సంజయ్‌గారు ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ట్రైలర్ చూస్తుంటే ‘వనవాసం’ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నా’’అని హీరో ‘అల్లరి’ నరేశ్ అన్నారు. నవీన్‌రాజ్ శంకరపుడి, శశికాంత్, శ్రావ్య, శృతి ముఖ్య తారలుగా భరత్.పి, నరేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వనవాసం’. భవాని శంకర ప్రొడక్షన్స్ పతాకంపై బి.సంజయ్ కుమార్ నిర్మించారు. మోహన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సంజయ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘20 ఏళ్ల క్రితం యాక్టింగ్ స్కూల్లో పరిచయమయ్యారు నరేశ్. ఇప్పుడు నా సినిమాని ప్రోత్సహించడానికి రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ మధ్య చిన్న సినిమాలే బాగా ఆడుతున్నాయి. కథ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’’ అన్నారు నిర్మాత తుమ్ముళ్లపల్లి రామసత్యనారాయణ. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది. సంజయ్‌గారు ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమా తీశారు’’ అన్నారు భరత్.పి, నరేంద్ర. నిర్మాత రాజ్ కందుకూరి పాల్గొన్నారు. ∙ నవీన్,శ్రావ్య -
టైటిల్ బాగుంది
నవీన్‌రాజ్ శంకరాపు, శశికాంత్ హీరోలుగా, బందెల కరుణశ్రావ్య, శృతి హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం ‘వనవాసం’. భరత్ కుమార్.పి నరేంద్ర దర్శకత్వంలో సంజయ్ కుమార్ బి. నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. ఈ చిత్రం పోస్టర్, టైటిల్‌ని ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘వనవాసం’ టైటిల్ బాగా నచ్చింది. ఈ టైటిల్‌లానే సినిమా కూడా బాగుంటుందని ఆశిస్తున్నా. టీమ్‌కి అభినందనలు’’ అన్నారు. ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం. ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు భరత్. ‘‘ భరత్ చాలా బాగా తీశారు. త్వరలోనే సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని సంజయ్ కుమార్. బి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కుమార్, కెమెరా: ప్రేమ్ జై. విన్సైట్. -
రేప్ చేస్తానని బెదిరిస్తున్నారు : శ్రుతి
తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేస్తామని బెదిరింపులు వస్తున్నట్లు నటి శ్రుతి ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి, విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస తమిళులను మోసం చేసి డబ్బు దోచుకున్న ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యి కలకలం సృష్టించిన నటి శ్రుతి ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. సేలంకు చెందిన బాలమురుగన్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కోవై, పాపనాయగన్పాళైయంకు చెందిన నటి శ్రుతిని ఆమెకు సహకరించిన తల్లిదండ్రులు, సోదరుడిని పోలీసులు గత ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. ఆ తరువాత శ్రుతిపై పలు కేసులు నమోదయ్యాయి. ఆమె సోదరుడు సుభాష్‌తో పాటు మరో ముగ్గురిని గూండా చట్టం క్రింద అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. నటి శ్రుతి మాత్రం ఇటీవల నిబంధనలతో కూడిన బెయిల్‌పై విడుదలైయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం ఆమె కోవై 5వ నేర విభాగ కోర్టుకు వచ్చి సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనపై పోలీసుల బెదిరింపుల పరంపర కొనసాగుతోందని పేర్కొన్నారు. విచారణ సమయంలో పోలీసు అధికారులు బలవంతపు ఒత్తిడి గురించి మానవహక్కుల సంఘం, మహిళా సంఘాలకు ఫిర్యాదు చేశానని, వారికి అందుకు తగిన ఆధారాలను అందించనున్నట్లు తెలిపారు. కొందరు అగంతకులు తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీంతో తనకు బయటకు రావాలంటేనే భయమేస్తోందని శ్రుతి పేర్కొన్నారు. -
నటికి నాన్‌బెయిలబుల్ వారెంట్..
సాక్షి, టీనగర్: పెళ్లి పేరుతో నటి శృతి పలువురిని మోసం చేసిన విషయం తెలిసిందే. అందుకు ఆమెపై ఏడాదిపాటు నాన్‌బెయిలబుల్ గూండా చట్టాన్ని ప్రయోగించారు. ఆమె తల్లి చిత్ర, తండ్రి ప్రసన్న వెంకటేశ్‌లపై కూడా శనివారం కోయంబత్తూరు పోలీసులు గూండా చట్టం నమోదు చేశారు. ఆడిపోనాల్ ఆవని చిత్రంతో నటిగా గుర్తింపు పొందిన శృతి మోసం కేసులో చిక్కుకుంది. తీగ లాగితే డొంగ కదిలినట్లు ఆమె మోసాల చిట్టా బయటపడింది. అనేక మందిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేయడం, వారి నుంచి అక్రమ వసూళ్లు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన తల్లిదండ్రులను కటకటాల్లోకి పంపారు. -
నటిపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు..!
సాక్షి, చెన్నై: నటి శ్రుతిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. స్వదేశీయులనే కాదు, విదేశీ తమిళులను ఈమె తన బుట్టలో పడేసుకుని డబ్బును లక్షల్లో గుంజేసింది. పోలీసుల విచారణలో పలువురు శ్రుతి బాధితుల చిట్టా బయట పడుతోంది. కోవై జిల్లా పాపనాయగన్ పాళయంకు చెందిన నటి శ్రుతి ప్రేమ,పెళ్లి పేరుతో పలువురు యువకులను తన మాయలో పడేసి వారి నుంచి లక్షల్లో డబ్బును లాగి ఆడంబర జీవితాన్ని అనుభవిస్తూ ఆమె గుట్టురట్టవ్వడంతో ప్రస్తుతం జైల్లో ఊసలు లెక్కపెడుతున్న విషయం తెలిసిందే. 8 మంది శ్రుతి ప్రేమ బాధితుల ఫిర్యాదుతో ఆమెను కోవై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. భయంతో భాగోతం బయటపెట్టలేదు.. ఇప్పటి వరకూ గౌరవ మర్యాదలు, ఎవరూ తమకు పిల్లను ఇవ్వడానికి ముందుకు రారన్న భయంతో శ్రుతి భాగోతాన్ని బయట పెట్టడానికి ముందుకురాని ఆమె బాధితులు పలువురు ఇప్పుడు పోలీసులకు పిర్యాదు చేస్తున్నారు. మరి కొందరిని పోలీసులు శ్రుతి సెల్‌ఫోన్ ఆధారంగా గుర్తించి విచారించడానికి సిద్ధం అవుతున్నారు. నటి శ్రుతి మోజులో పడి లక్షలు పోగొట్టుకున్న ఒక యువకుడు పేర్కొంటూ తాను వివాహానికి వధువు కోసం ఇంటర్నెట్లో వివరాలను పొందుపరిచానన్నాడు. అవి చూసి శ్రుతి తనకు ఫోన్ చేసి పరిచయం పెంచుకుందన్నాడు. ఆ తరువాత పరిచయం స్నేహంగా మారి పెళ్లి చేసుకుందామని చెప్పిందని తెలిపాడు. ఆ తరువాత కుటుంబ ఖర్చులు. వైద్య ఖర్చులు అంటూ పలుమార్లు లక్షల్లో డబ్బు గుంజిందని చెప్పాడు. మోసగత్తె అని తెలిసింది.. దీంతో ఆమెపై అనుమానం కలగడంతో తను ఫోన్‌ను పరిశీలించగా తనో మోసగత్తె అని తెలిసిందని తెలిపాడు. శ్రుతి గురించిన వివరాలు తనకు తెలిసిన విషయం తను గ్రహించి తనకు దూరం అయ్యిందని చెప్పాడు. అలా తన అందంతో పలువురిని శ్రుతి మోసం చేసిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రుతి అందాల మోజులో పడి మోసపోయిన వారిలో అమెరికాలో నివశిస్తున్న కోవైకి చెందిన ఇంజినీర్ ఒకతను ఉన్నాడు. అతనికి పెళ్లి ఆశ పెట్టి రూ.15 లక్షలను శ్రుతి స్వాహా చేసిందట. అతనిప్పుడు కోవైలోని తన అన్నయ్య ద్వారా కోవై పోలీసులకు ఫిర్యాదు చేయించారు. అంతే కాదు మరో ఇద్దరు ఇంజినీర్ యువకులు కూడా శ్రుతి అందమైన మోసానికి గురైయ్యారట. అలాంటి వారందరిని పోలీసులు విచారించడానికి సిద్ధం అవుతున్నారు. -
శృతి పెళ్లి వార్త నిజమేనా?
-
ఆ ఎర్రని మందారం.. రాలిపోయింది!
ఈమె పేరు శృతి.. వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన యువతి. బీటెక్ పూర్తి చేసిన శృతి ప్రస్తుతం నల్ల మల్లారెడ్డి కాలేజీలో ఎంటెక్ చదువుతోంది. తండ్రి పేరు సుదర్శన్. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో ప్రభుత్వ టీచర్. ఆయనకు నలుగురు కూతుళ్లు. వాళ్లలో శృతి రెండో అమ్మాయి. సుదర్శన్ విరసంలో సభ్యుడు. శృతి పుట్టినప్పుడు ఆయన రాసుకున్న కవిత ఇది.... మా ఇంటి చెట్టులో ఒక కొమ్మకూ విరబూసే ఎర్రని మందారం ఆగస్టు 22నాడు మసక చీకట్లు కమ్మేటీ కాలంబులో వాన చినుకన్న లేకుండా భూగోళం వేడేక్కిపోతున్న కాలంబులో లోకానికే అన్నదాత అయిన రైతు ప్రాణాలు దీసుకునే కాలంబులో పోరుకే ప్రయోగశాలయైన పోరు ఖిల్లన్న పేరున్న జిల్లాలోనా 60 ఏండ్ల పోరులోన అసువులు బాసి సాధించుకున్న తెలంగాణలోన ఆదివాసులే జనతన సర్కారయి స్వావలంబన జేసేటీ కాలంబులో దండకారణ్యమే ఎర్రసైన్యమయ్యి గ్రీనుహంటును ఎదిరించే కాలంబులో శ్రామిక రాజ్యం స్థాపనకై శ్రవజీవులేకమై తీరాలని