సెరామిక్ అండ్ గ్లాస్ డిజైనర్..
సెరామిక్ అండ్ గ్లాస్ డిజైనింగ్ కష్టమైనదిగా భావిస్తూ మహిళలు ఈ కళను ఎంచుకోవడానికి వెనుకంజ వేస్తుంటారు. అలాంటి ఈ కళను ఎంతో ఇష్టంగా ఎంచుకొని, అందులో రాణిస్తోంది తిరువనంతపుర వాసి రోసా శ్రుతి అబ్రహాం. సాధారణంగా పెద్ద పెద్ద కర్మాగారాల నుంచి భారీగా ఉత్పత్తి అయ్యే సిరామిక్ వస్తువుల గురించి మనకు తెలిసిందే. అత్యంత వేగవంతమైన ప్రపంచంలో ప్రాచీన కళారూప్రాల వెనక దాగి ఉన్న నైపుణ్యాన్ని ఈ తరానికి పరిచయం చేస్తోంది రోసా శ్రుతి.
‘‘మురికి పట్టిన ఏప్రాన్, మట్టితో నిండిన చేతులు, చిక్కుబడిపోయినట్టు చిందర వందరగా ఉండే జుట్టు.. రోజులో ఎక్కువ పనిగంటలు ఇలాగే కనిపిస్తాను. అయితే, కొంతకాలంగా వరసగా ఆర్డర్లు పొందుతున్నాను. అందుకే రోజులో ఎక్కువ గంటలు స్టూడియోలోనే ఉండిపోతున్నాను. అందుకు ఎంతో ఆనందంగా ఉన్నాను.
నేను ఓ స్టూడియో ఓనర్ అనేకంటే నా స్టూడియోలో నిరంతరం పనిచేసే ఒక శ్రామికురాలిని అని చెప్పుకోవడానికే ఇష్టపడతాను. స్టూడియో అంటే పెద్దదేమీ కాదు ఒక గది. అయితే, బయట పచ్చదనం ఉంటుంది. నాదైన ఈ ప్రపంచంలో అందమైన సిరామిక్స్, గ్లాస్ డిజైన్స్ రూపొందిస్తుంటాను. మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఏడేళ్లుగా ఈ తయారీని చేపడుతూనే ఉన్నాను. నిజానికి ఇది ప్రతిరోజూ ఒక కొత్త ప్రాఠమే. నా స్టూడియోలో గడిపే ప్రతి క్షణం ఎంతో విలువైనది.
యజ్ఞంలా.. కళారూప్రాలు!
సిరామిక్స్ అండ్ గ్లాస్ డిజైనింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశాక కొన్ని కంపెనీలలో వర్క్ చేశాను. ఏడేళ్లప్రాటు వివిధ కంపెనీలలో చేసిన ఉద్యోగాలు నాకు అంతగా సంతృప్తినివ్వలేదు. దీంతో ఉద్యోగంలో సంప్రాదించిన కొద్ది మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి ఇంటి దగ్గరే ‘కొసావో’ పేరుతో ఓ స్టూడియోను ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఇదే నాకు జీవనాధారం అయ్యింది. కళాకారిణి నుంచి వ్యవస్థాపకురాలిగా ఎదగడం, నేర్చుకోవడం ... నా ప్రయాణం ఇలాగే కొనసాగించాలనుకుంటున్నాను.
ఐదేళ్లుగా ఈ పని ఓ యజ్ఞంలా కొనసాగుతూనే ఉంది. కళారూప్రాల సృష్టిలోనే కాదు ఇతరులకు బోధించడంలోనూ ఆనందాన్ని, ఆదాయాన్నీ పొందుతున్నాను. అందుకే నా స్టూడియోలో ప్రతిరోజూ అన్ని సీజన్లలోనూ క్లాసులు ఉంటూనే ఉంటాయి. ‘ఐదేళ్ల కిందటి వరకు మీరెక్కడ ఉంటారో మాకు తెలియదు, ఇప్పుడు ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు’ అని క్లాసులకు వచ్చినవారు అంటుంటే చిరునవ్వే నా సమాధానంగా ఉంటుంది.
దేనికదే ప్రత్యేకం..!
బయట మనకు ఎన్నో రకాల మిషన్ మేడ్ కళారూప్రాలు లభించవచ్చు. కానీ, వాటిలో ఒక ఆత్మ అంటూ ఉండదు. ఈ కళను ఏ డిజిటల్ పరికరాలతోనూ భర్తీ చేయలేం. వీటి తయారీలో ఓర్పు, పట్టుదల అవసరం. అందుకు మంచి ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఉద్యోగంలో మరొకరి కోసం పనిచేస్తున్నప్పుడు మనకు పరిమితులు ఉంటాయి. సొంతంగా ఏదైనా ్రప్రారంభించాలంటే అందులో నైపుణ్యం అవసరం. వివిధచోట్ల పనిచేసిన అనుభవం కూడా నాకు చాలా సహాయపడింది.
అలాగే, విభిన్న వ్యక్తుల నుంచి వారి ప్రవర్తనల నుండి రకరకాల పద్ధతులు, మార్గాలను అర్థం చేసుకోగలిగాను. ఇవన్నీ నన్ను నేను కొత్తగా మలుచుకోవడానికి సహాయపడ్డాయి. వస్తువుల తయారీని ఫొటోలుగా తీసి, వాటిని ఆన్‌లైన్ ద్వారా కస్టమర్లకు షేర్ చేస్తుంటాను. ఆ తర్వాత రకరకాల పద్ధతుల్లో అనుకున్న రూప్రానికి తీసుకువస్తాను. ముఖ్యంగా ప్రాత సినిమాలు, డైలాగ్‌ల నుండి ప్రేరణ పొందిన థీమ్‌లతోనూ వస్తువుల తయారీకి ΄్లాన్ చేస్తుంటాను. ఇవి చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. సిరామిక్ అండ్ గ్లాస్ డిజైనింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను’ అని వివరిస్తుంది రోసా శ్రుతి.
ఇవి చదవండి: Priya Desai: అవగాహనే ప్రథమ చికిత్స
Comments
Please login to add a commentAdd a comment