
మైనా చిత్రంలోపాపులర్ అమలా పాల్, తమిళం, తెలుగు మరియు మలయాళ చిత్రాలలో తనదైన ప్రతిభను చాటుకుంటోంది. నీలతమర (2009) అనే మలయాళ చిత్రంతో రంగప్రవేశం, ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ హీరోలతో కలిసి నటించింది. జగత్ దేశాయ్‌ని రెండో పెళ్లి చేసుకున్న అమలా త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఇన్‌స్టాలో బేబీ బంప్‌తో అందమైన ఫోటోలను షేర్ చేసింది. నిండు గర్భంతో పసుపు పచ్చని చీరలో కళకళలాడుతోంది. అంతేకాదు భర్తతో మెరిపెంగా అలిగిన వీడియోకొట్టిన రీల్‌ను కూడా పోస్ట్‌చేసింది. దీంతో ఇవి వైరల్‌గా మారాయి. ఫ్యాన్స్ లవ్ హార్ట్ ఈమోజీలను పోస్ట్ చేస్తూ అమలా, జగత్ దేశాయ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే అమలాపాల్ తన నెక్ట్స్ మూవీ `లెవల్ క్రాస్` కి సంబంధించి స్వయంగా తను పాడిన పాటను పోస్ట్ చేసింది. విశాల్ చంద్రశేఖర్ స్వర పర్చిన సాంగ్‌ను పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన ఆడియో వేడుక ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment