వైరల్
సోషల్ మీడియా ప్రపంచంలో మామ్‌ఫ్లూయెన్సర్‌లు పవర్‌ఫుల్ ఫోర్స్‌గా మారారు. ఇన్‌స్పిరేషనల్ వైరల్ కంటెంట్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో కొందరు పాపులర్ మామ్ ఫ్లూయెన్సర్‌ల గురించి...
ఫ్యాషన్, బ్యూటీటిప్స్ నుంచి పేరెంటింగ్ అండ్ వర్క్–లైఫ్ బ్యాలెన్స్ వరకు తల్లులకు ఉపయోగపడే ఎన్నో సలహాలు ఇస్తోంది మాసుమ్ మినవాలా మెహతా. ఎన్నో బ్రాండ్‌లు, పబ్లికేషన్‌లతో కలిసి పనిచేస్తోంది.
తన పేరెంటింగ్ జర్నీ విషయాలు, డిఐవై(డూ ఇట్ యువర్‌సెల్ఫ్) ్రపాజెక్ట్స్, హోమ్ డెకార్ ఐడియాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది కరిష్మ దొండే. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కరిష్మ కామన్ పేరేంటింగ్ చాలెంజెస్‌కు క్రియేటివ్ సొల్యూషన్స్ అందిస్తోంది. మామ్‌గా తన అనుభవాలను పంచుకోవడంతో పాటు ఇతర తల్లులకు టిప్స్, సలహాలు ఇస్తోంది.
బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లతో పాపులర్ అయిన శ్వేతా సాల్వే మామ్‌ఫ్లూయెన్సర్‌గా సోషల్ మీడియాలో మంచి పేరు తెచ్చుకుంది. ఫిట్‌నెస్ టిప్స్ నుంచి ఫ్యాషన్ వరకు ఎంతో కంటెంట్‌ను తల్లుల కోసం షేర్ చేస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో హెల్తీ మీల్స్, సెల్ఫ్–కేర్ ్రపాక్టీసెస్‌తో పాటు తన పేరెంటింగ్ జర్నీని కూడా షేర్ చేస్తోంది. మదర్‌హుడ్‌ను కెరీర్ అండ్ పర్సనల్ గోల్స్‌తో ఎలా బ్యాలెన్స్ చేయాలో చెబుతోంది.
సోషల్ మీడియాలో మాసివ్ ఫాలోయింగ్ ఉన్న మామ్‌ఫ్లుయెన్సర్‌లలో నిరాళి మెహతా ఒకరు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మెహతా తన పేరెంటింగ్ జర్నీ, ట్రావెల్ అడ్వెంచర్స్, ఫ్యాషన్ ఇన్‌స్పిరేషన్‌లను షేర్ చేస్తుంటుంది. ‘మోర్ ఫన్ అండ్ క్రియేటివ్’ అనే కోణంలో పేరెంటింగ్‌కు సంబంధించిన ట్రిక్స్, టిప్స్‌ను తల్లుల కోసం షేర్ చేస్తుంటుంది నివేదిత గౌడ. తన పేరెంటింగ్ జర్నీతోపాటు కుకింగ్ టిప్స్, డిఐవై (డూ ఇట్ యువర్‌సెల్ఫ్) ఐడియాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment