inspirational
-
'నా ఇన్స్పిరేషన్ మా అమ్మ'..!: సొనాలీ బెంద్రే
ప్రతి ఆడపిల్ల ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. అప్పుడే మనం ఏం చెప్పిన నెగ్గుతుంది. ఎంతటి ధనవంతుడిని పెళ్లి చేసుకున్న ధైర్యంగా ఉండలేం. ఆర్థికంగా బాగుంటేనే స్థైర్యం దాతనంతటే అదే తన్నుకుంటూ వస్తుంది. ఆ విషయంలో నాకు మా అమ్మే స్ఫూర్తి అంటోంది బాలీవుడ్ నటి సొనాలీ బెంద్రే. అదెలాగో ఆమె మాటల్లో చూద్దామా..!.ఎలాగంటే...‘మేము ముగ్గురం అక్కచెల్లెళ్లం. ఆడపిల్లలకు చదువు, ఆర్థిక స్వాతంత్య్రం చాలా ముఖ్యమని నమ్ముతుంది మా అమ్మ (పేరు.. రూప్సీ బెంద్రే). నేను మోడలింగ్ ట్రయల్స్‌లో ఉన్న రోజుల్లో ఒకసారి.. నన్ను, నా సిస్టర్స్‌ని కూర్చోబెట్టుకుని చెప్పి ‘మీరు ఎంత సంపన్నులను తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పినా నేను పర్మిషన్ ఇవ్వను. మీ కాళ్ల మీద మీరు నిలబడి.. ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అయ్యాకే.. పెళ్లి! ఆర్థిక స్వాతంత్య్రం ఉంటేనే మీకు వాయిస్ ఉంటుంది.. గుర్తుపెట్టుకోండి’ అని చెప్పింది. ఆ మాట మంత్రంలా పనిచేసింది మాకు. కెరీర్లో ఎదగడానికి స్ఫూర్తినిచ్చింది. నేనీ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే స్ఫూర్తి అమ్మే! నిజంగానే ఆడపిల్లకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలి. దాని వల్ల ఒక భరోసా వస్తుంది. ఆ భరోసా మనల్ని స్ట్రాంగ్‌గా నిలబెడుతుంది!’.(చదవండి: ఆ చేప పోరాటానికి ఫిదా కావాల్సిందే..!) -
కుమారుడి ఒకే ఒక్క మాటకోసం : ఏకంగా 22 కిలోలు తగ్గాడు!
పిల్లలకోసం, పిల్లల కోరికమేరకు కొండ మీది కోతిని తెమ్మన్నా తేవడానికి సిద్ధంగా ఉంటారు తల్లిదండ్రులు. పిల్లల సంతోషం కోసం ఎంత కష్టమైనా భరించడానికి సన్నద్దమవుతారు. అలా 40 ఏళ్ల తండ్రి చేసిన సాహసం గురించి వింటే ఔరా అంటారు. నిబద్దతతో ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించాడు. క్షణం ఆలస్యం చేయకుండా అంతటి ఆశ్చర్యకరమైన స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి మరి..సుమిత్ దబాస్ (40) రీటైల్ మేనేజర్‌గా పనిచ్తేస్తున్నారు. తన ఆరోగ్యం గురించి లేదా శరీరం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. అప్పటికి అతను బరువు 90 కిలోలు. గతంలో ఉన్నంత బలం లేదు. అయితే ఏడేళ్ల కుమారుడి కోరిక మేరకు 40 ఏళ్ల వయసులో సాహసానికి పూనుకున్నాడు. ఏకంగా 22 కిలోల బరువు తగ్గి సిక్స్‌ప్యాక్ బాడీ సాధించాడు అయితే ఈ ప్రయాణం అంత ఈజీగా ఏమీ సాగలేదు. క్రమశిక్షణతో ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని, వ్యాయామం సాయంతో అనుకున్నది సాధించి స్ఫూర్తిగా నిలిచాడు. ఇంతకీ కొడుకు కోరిక ఏమిటంటేకానీ అతని కొడుకు నివాన్ ఒక రోజు తండ్రిని చూసి "నాన్న, మీ బలమైన శరీరాన్ని ఎప్పుడూ చూడలేదు. మీరు మళ్ళీ ఫిట్ బాడీని పొందగలరానా స్నేహితులకు చూపించాలని ఉంది’’ అన్నాడు. అంతే ఎలి అయినా సిక్స్ ప్యాక్‌తో ఫిట్ బాడీ సాధించాలనుకున్నాడు.సుమిత్‌కు క్రికెట్ అతనికి ఇష్టమైన ఆట. కానీ అంత పెద్ద భారీ కాయంతో క్రికెట్ ఆడే ఓపిక లేదు. ప్రొఫెషనల్ పర్సనల్ ట్రైనర్ అయిన సుమిత్, తన బరువు తగ్గే ప్రయాణంలో, మనస్తత్వాన్ని మార్చుకోవడం ముఖ్యమని కూడా అర్థమైంది. View this post on Instagram A post shared by Sumit Dabas (@sumitdabas2020)తొలి అడుగుతొలి ఆరు నెలలు విపరీతంగా కష్టపడ్డాడు. కానీ చాలా అర్థమైంది. జీవనశైలి మార్పులుతో 15 కిలోల బరువు తగ్గి 90 కాస్త 75కి వచ్చింది. కానీ ఇంకా తగ్గాలి. కండలు రావాలి. సిక్స్ ప్యాక్ బాడీ రావాలంటే, ప్రొఫెషనల్ ట్రైనర్ అవసరమని గ్రహించాడు.హేమంత్ అనే ఫిట్నెస్ కోచ్ ఆధ్వర్యంలో ట్రాక్‌లోకి వచ్చింది. అధిక ప్రోటీన్, తక్కువ కేలరీల ఆహారాన్ని సిద్ధం చేశాడు. ఇక వ్యాయామం విషయానికి వస్తే, సుమిత్ హెవీ ఎక్సర్సైజ్ల మక్కువ పెంచుకున్నాడు. ఇదే కండల నిర్మాణంలోనూ మొత్తం శారీరక రూపాన్ని అందంగా మార్చడంలో తోడ్పడింది అంటాడు కండలు తిరిగిన దేహంతో సుమిత్.మొత్తానికి ఏడాది కష్టం తరువాత ఇపుడు సుమిత్ బరువు 68 కిలోలు. తన కొడుకుకు గర్వకారణమైన తండ్రిగా నిలిచాడు. తన పిల్లలతో ఆడుకోవడమైనా, తనకు ఇష్టమైన క్రీడ క్రికెట్ ఆడటమైనా, గతంలో కష్టంగా కాకుండా, ఇష్టంగా,హాయిగా ఆడుతున్నాడు. ఈ వెయిట్ లాస్ జర్నీలో సహకరించిన కుటుంబానికి, కోచ్‌కీ సుమిత్ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రతి దశలోనూ తన భార్య , కుమార్తె ప్రోత్సహించారని, నివాన్ ఉత్సాహం తన బరువు తగ్గే ప్రయాణాన్ని సులభతరం చేసిందని సుమిత్ చెప్పాడు.బరువు తగ్గాలనుకునే వారికి సుమిత్ ఇచ్చే చిట్కాలు ఏమిటి?చీట్ మీల్ తీసుకున్నా లేదా అప్పుడప్పుడు వ్యాయామం దాటవేసినా పెద్దగా బాధపడకండి. చేయాల్సిన దానిపై దృష్టిపెట్టి, ముందుకు సాగండి. పట్టుదలగా లక్ష్యం వైపు సాగండికుటుంబం, స్నేహితులు , కోచ్ సహాయం తప్పనిసరిగా తీసుకోండి. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది...బరువు తగ్గడం అనేది రాత్రికి రాత్రే అయ్యే పనికాదు. సుదీర్ఘకాలంపాటు పట్టుదలగా క్రమశిక్షణతో చేయాలి.ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి, ఏ దశలోనూ ప్రయత్నాన్ని వదులుకోవద్దు. -
YS Jagan: నేను జైల్లో ఉన్నప్పుడు నా భార్య నా కోసం.. గూస్ బంప్స్ స్పీచ్
-
చూపును మించిన ‘దృష్టి’ : గంగాధర్ స్ఫూర్తిదాయక స్టోరీ
కాకినాడలోని ముతానగర్ తీరప్రాంత గ్రామానికి చెందిన 35 ఏళ్ల గంగాధర్‌ను కలుద్దాం. అతను ధైర్యం, నాయకత్వం, సేవకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు. దృష్టి లోపం ఉన్న గంగాధర్ తన జీవితాన్ని తన సమాజానికి, ముఖ్యంగా సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార సంఘాలకు సహాయం చేయడానికి అంకితం చేశాడు.ఆయన శారీరక వైకల్యం ఉన్న నూకరత్నంను వివాహం చేసుకున్నారు, వారు ప్రభుత్వ దివ్యాంగుల పింఛను, అతని తల్లిదండ్రుల సహాయంతో తమ కుటుంబ ఖర్చులను వెళ్లదీస్తున్నారు.2013 నుండి రిలయన్స్ ఫౌండేషన్‌తో లబ్ది పొందుతున్న గంగాధర్, ఈ ఫౌండేషన్ హెల్ప్‌లైన్, వాయిస్ మెసేజ్‌లను ఉపయోగించి వాతావరణ హెచ్చరికలు, అల్లకల్లోలమైన సముద్రజలాలు, చేపలు బాగా లభ్యమయ్యే ప్రాంతాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. ఈ ముఖ్యమైన సమాచారాన్ని స్థానిక మత్స్యకార సంఘాలతో పంచుకుంటాడు. తద్వారా వారు సురక్షితంగా ఉండటానికి, జీవనోపాధిని సంపాదించుకోవడానికి సహాయం చేస్తాడు. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ మరియు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి భారతదేశ తీరప్రాంతంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సమాచార మద్దతుతో భారతదేశ తీరప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు చేపలవేట మరింత సురక్షితమైందిగా, సుస్థిరమైందిగా, లాభదాయకంగా ఉండేలా చేయడానికి రిలయన్స్ ఫౌండేషన్ ప్రయత్నిస్తోంది.అంతేకాదు బయోమెట్రిక్ కార్డ్‌ల పెన్షన్ దరఖాస్తులు నింపడంలో సాయం చేస్తాడు. అర్హతలున్నప్పటికీ ఆయా పథకాలు పొందలేకపోయిన వారి సమస్యలను పరిష్కరించడంలో తన సంఘానికి సహాయం చేస్తాడు. అలాగే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి, ప్రభుత్వ రాయితీల కోసం దరఖాస్తు చేసు కోవడానికి మత్స్యకార సంఘంలోని యువకులకు మార్గనిర్దేశం చేస్తాడు గంగాధర్.అంకితభావం, కృషితో గంగాధర్ తన కమ్యూనిటీకి సహాయం చేస్తున్న తీరు, ఒక వ్యక్తి సవాళ్లను ఎలా అధిగమించగలడు, ప్రపంచంలో ఎలా మార్పు తీసుకురాగలడనే దానిపై అందరికీ స్ఫూర్తినిస్తుంది. గంగాధర్ కథ సంకల్పం, దయ శక్తిని గుర్తు చేస్తుంది, నిజమైన ‘దృష్టి’ హృదయం నుండి వస్తుందని రుజువు చేస్తుంది, అది చూపును మించిన దృష్టి.దివ్యాంగుల సమస్యలపై అవగాహన పెంపొందించడానికి మరియు వైకల్యాలున్న వ్యక్తుల గౌరవం, హక్కులు, శ్రేయస్సు కోసం మద్దతును సమీకరించడానికి డిసెంబరు 3వ తేదీన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహిస్తాం. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవితంలోని ప్రతి అంశంలో దివ్యాంగుల ఏకీకరణ మొదలుకొని వారు పొందగలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడానికి కూడా ఇది ప్రయత్నిస్తుంది. 2024 లో ఈ దినోత్సవం థీమ్ సమగ్రమైన, సుస్థిరమైన భవిష్యత్తు కోసం దివ్యాంగుల నాయకత్వాన్ని విస్తరించడం. -
మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీలో తెలుగు శాస్త్రవేత్త
పట్టుమని 200 కుటుంబాలు నివాసమున్న గ్రామం. నగర శివారులో ఉన్నా... కాంక్రీట్ జంగిల్ పోకడలు కనిపించవు. పదో తరగతి వరకూ గ్రామంలో బేల్దారి పనులు, నగరంలో పండ్ల విక్రయంతో తల్లిదండ్రులకు చేదోడు. చిరుప్రాయం నుంచే శారీరక మార్పులతో సహ విద్యార్థుల చిన్నచూపు. వ్యక్తి వెనుక సూటిపోటి మాటలు... అవమానకర వ్యాఖ్యలు. కట్ చేస్తే.. ప్రస్తుతం స్పెయిన్ దేశంలో ఫార్మా రంగ శాస్త్రవేత్త... ట్రాన్స్ఫ్యూజన్ శస్త్రచికిత్స తర్వాత ప్రపంచ దేశాలు గుర్తించేలా మిస్ వరల్డ్ రన్నరప్.. స్ఫూర్తిదాయక జీవనంతో పలువురికి ఆదర్శం. నవంబర్‌లో మిస్ యూనివర్స్ ట్రాన్స్ విజేత దిశగా అడుగులు. ఇది అనంతపురం జిల్లాకు చెందిన ట్రాన్స్‌జెండర్ హన్నా రాథోడ్ విజయ ప్రస్థానం. చదువుతో ఆమె సాధించిన ఒక్క గెలుపు కుటుంబాన్నే కాదు.. ఏకంగా జిల్లా కీర్తిప్రతిష్టలను పెంచింది. స్ఫూర్తిదాయకమైన ఆమె జీవనం ఆమె మాటల్లోనే... అనంతపురం రూరల్ పరిధిలోని సోములదొడ్డి గ్రామం. నాన్న మల్లేష్, అమ్మ పద్మావతికి మూడో సంతానంగా పుట్టాను. ఓ అన్న, అక్క ఉన్నారు. నాకు ఆనంద్‌బాబు అని పేరుపెట్టారు. అమ్మ, నాన్న అనంతపురం నగరంలోని తాడిపత్రి బస్టాండ్‌లో పండ్ల వ్యాపారం చేసేవారు. పేదరికం కారణంగా పస్తులతో గడిపిన రోజులెన్నో చూశా. దీంతో బడికి వెళ్లే సమయంలోనే ఏ మాత్రం వీలు చిక్కినా ఊళ్లో కూలి పనులకు, అమ్మ, నాన్నతో కలసి పండ్ల వ్యాపారం చేస్తూ వచ్చా. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు నాలో శారీరక మార్పులు గుర్తించా. సమాజానికి తెలిస్తే బయటకు గెంటేసి హేళన చేస్తారేమోనని భయపడ్డా. దీంతో ఎవరితోనూ చెప్పుకోలేదు. చిన్న కొడుకు కావడంతో మా అమ్మ నన్ను ఎంతో గారాబంతో పెంచుతూ వచ్చింది. నా వెనుక గేలి చేసేవారు సమాజంలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న వివక్ష నన్ను చాలా భయపెట్టేది. ఇలాంటి సమయంలో కేవలం చదువు ఒక్కటే నా సమస్యకు చక్కటి పరిష్కారమని గుర్తించాను. దీంతో పట్టుదలగా చదువుకుంటూ క్లాస్‌లో టాపర్‌గా నిలుస్తూ వచ్చా. ఇంటర్ వరకూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో తెలుగు మీడియం చదివిన నేను ఆ తర్వాత అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీ–ఫార్మసీ చేశా. అక్కడ చాలా మంది స్నేహితులు ఉండేవారు. వారిలో కొందరు నా ముందు ఏమీ అనకపోయినా... నా వెనుక చెడుగా మాట్లాడుకునేవారని తెలిసి బాధపడ్డాను. జన్యుపరమైన లోపాన్ని ఎవరూ గుర్తించలేదు. గేలి చేసినా కుంగిపోలేదు. పట్టుదలతో బీ–ఫార్మసీ, ఎం–ఫార్మసీ పూర్తి చేశా. పెళ్లి ప్రయత్నాల నుంచి బయటపడి ఎం–ఫార్మసీ పూర్తి చేసిన తర్వాత విదేశాల్లో ఎంఎస్ చేయాలని అనుకున్నా. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దీంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా రెండేళ్లు పనిచేశా. అదే సమయంలో జూనియర్ ఫార్మసీ విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చిన డబ్బును దాచుకుని విదేశీ విద్యావకాశాలపై అన్వేషిస్తూ వచ్చా. ఈ లోపు అనంతపురం కలెక్టరేట్లో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం తెలియగానే చాలా మంది అమ్మాయిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అయితే పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని నాశనం చేయకూడదని భావించిన నేను.. విదేశాలకు వెళ్లిపోతే పెళ్లి ప్రయత్నాలు వాయిదా పడతాయనుకున్నా. అదే సమయంలో విదేశీ విద్యావకాశాలపై అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్ష రాసి మెరుగైన ఫలితాలతో స్పెయిన్‌లో ఎంఎస్ సీటు దక్కించుకున్నా. కోర్సు పూర్తి కాగానే అక్కడే బయో ఇంజినీరింగ్ సొల్యూషన్స్‌లో శాస్త్రవేత్తగా పనిచేసే అవకాశం వచ్చింది. శాస్త్రవేత్తగా స్థిరపడిన తర్వాత 2021లో ట్రాన్స్ఫ్యూజన్ ఆపరేషన్ చేయించుకుని హన్నారాథోడ్గా పేరు మార్చుకుని ఇంట్లో వారికి విషయం చెప్పా. చదువే సెలబ్రిటీని చేసింది ట్రాన్స్జెండర్ల జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు. మన వ్యక్తిత్వం చెదరకుండా కాపాడుకోవాలి. ఎలాంటి వ్యక్తికైనా ప్రతికూల కాలమంటూ ఉంటుంది. నిరాటంకంగా అవరోధాల్ని అధిగమించి విజయం సాధిస్తే ఈ సమాజమే గౌరవప్రదంగా చూస్తుంది. మనం కోరకుండానే వచ్చే జన్యుపరమైన లోపాలకు కుంగిపోరాదు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, ధర్మాన్ని, దైవాన్ని నిందించడం కూడా పొరబాటే. అసలు ప్రతికూలతల్లో కూడా అనుకూలతను వెదికి అనుకూలంగా మలచుకునే యుక్తిని సాధించగలగాలి. అప్పుడే విజయం మన సొంతమవుతుంది. నా జీవితమే ఇందుకు నిదర్శనం. చదువే ననున్న సెలబ్రిటీని చేసింది. ఈ స్థాయికి నేను ఎదగడంలో ఎదుర్కొన్న కష్టాలు, బాధలు వివరిస్తూ తెలుగు, ఇంగ్లిష్, స్పానిష్ మూడు భాషల్లో పుస్తకం రచిస్తున్నా. త్వరలో ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకువస్తా. మిస్ వరల్డ్ పోటీల్లో ప్రతిభ గతేడాది స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో మిస్ వరల్డ్ ట్రాన్స్–2023 పోటీలు జరిగాయి. అక్కడే పనిచేస్తున్న నాకు ఈ విషయం తెలిసి భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహించేందుకు దరఖాస్తు చేసుకున్నా. దీంతో నిర్వాహకులు అవకాశం ఇచ్చారు. ఈ పోటీలో ఏకంగా రన్నరప్‌గా నిలవడంతో నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. దీంతో సేవా కార్యక్రమాలు చేపట్టి ట్రాన్స్ సమాజంలో సమూల మార్పులు తీసుకురావాలని భావించాను. ఆ దిశగా తొలి ప్రయత్నం చేశాను. ఇందుకోసం స్పెయిన్‌లోని కొన్ని కంపెనీలతో సంప్రదింపులు కూడా జరిపాను. ట్రాన్స్ సమాజంలో దుర్భర జీవితం గడుపుతున్న వారి సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని కంపెనీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఏడాదికి సంబంధించి నవంబర్‌లో న్యూఢిల్లీలో మిస్ యూనివర్స్ ట్రాన్స్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కింది. ఈ పోటీల్లో పాల్గొనడానికే ఇండియాకు వచ్చా. ఇక్కడ మా ఊరి ప్రజలు నన్ను చూసి చాలా సంతోష పడ్డారు. ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించారు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా నేనే చీఫ్ గెస్ట్. ఇంతకంటే గౌరవం ఏమి కావాలి? -
రతన్ టాటా..రతనాల మాటలు
ఢిల్లీ : బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా యావత్ భారతం ఘన నివాళులర్పిస్తుండగా.. రతన్ టాటా పలు సందర్భాలలో జీవితాల్ని మార్చేసే స్పూర్తిదాయకమైన ప్రసంగాల్ని గుర్తు చేసుకుంటున్నారు. 👉‘జీవితంలో విజయం సాధించాలంటే ఒడిదొడుకులు ఉండటం చాలా ముఖ్యం. ఈసీజీలో సరళ రేఖ ఉన్నదంటే ప్రాణం లేదనే అర్థం’👉కేవలం భౌతిక విషయాలతోనే జీవితం ముడిపడిలేదని ప్రతివాళ్లూ ఎప్పుడో ఒకప్పుడు గ్రహిస్తారు. మనం ప్రేమించే వారిని ఆనందంగా ఉంచడంలోనే మన సంతోషమూ ఉంది.👉తన కోసం పని చేస్తున్న వారి మేలు కోరే వాడే ఉత్తమ నాయకుడు👉వృత్తిని – జీవితాన్ని సమతులం చేయడంపై నాకు నమ్మకంలేదు. వృత్తిని – జీవితాన్ని మమేకం చేయాలి. మీ వృత్తిని, జీవితాన్ని అర్ధవంతంగా తీర్చిదిద్దుకోవాలి.👉ఏ ఇబ్బందినీ స్వీకరించకపోవడమే పెద్ద ప్రమాదం. అతి వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో ఏ సవాల్‌నూ స్వీకరించ లేకపోతే అపజయం తప్పదు.👉ఎన్ని కష్టాలనైనా పట్టుదలతో ఎదుర్కోండి. అవే మీ విజయానికి పునాది రాళ్లు👉ఎదుటివాళ్ల దయా గుణాన్ని, ప్రేమను ఏమాత్రం తక్కువగా అంచనా వేయకండి👉మీ జీవితం సాఫీగా ఉండకపోవచ్చు. సమాజంలోని సమస్యలను పరిష్కరించ లేకపోవచ్చు. అలాగని సమాజంలో మీ ప్రాముఖ్యాన్ని తక్కువగా అంచనావేయొద్దు. ధైర్యం, నమ్మకం మనకో దారి చూపిస్తాయి.👉అవకాశాల కోసం ఎదురు చూడకూడదు. అవకాశాల్ని సృష్టించుకోవాలి.👉నాయకత్వమంటే బాధ్యత తీసుకోవడం👉సరైన నిర్ణయాలు తీసుకోవడంపై నాకు దృష్టి లేదు. నిర్ణయం తీసుకొని దానిని విజయవంతం చేయడమే నా పని.👉విజయం అనేది నీవు చేపట్టిన పదవిపై ఆధారపడి ఉండదు. నీవు ఇతరులను ఎంతగా ప్రభావితం చేస్తున్నావన్న దానిపై ఆధారపడి ఉంటుంది. -
కేవలం వాయుభక్షణతో.. పదివేల ఏళ్లు తపస్సు!
సమస్త లోకాలకు ఆధారభూతమైన ధర్మాన్ని దేవ దానవులు ఎవరూ చూడలేదు. సత్య స్వభావం కలిగిన ధర్మ స్వరూపాన్ని దర్శించడం కోసం దుర్వాసుడు తపస్సు ప్రారంభించాడు.కేవలం వాయుభక్షణతో పదివేల ఏళ్లు తపస్సు కొనసాగించినా, ధర్ముడు కరుణించలేదు. దర్శనమివ్వలేదు. తపస్సు చేసి చేసి దుర్వాసుడు కృశించిపోయాడు. ఆయనకు ధర్ముడి మీద పట్టరాని ఆగ్రహం కలిగింది. కోపం పట్టలేని దుర్వాసుడు ధర్ముడిని శపించాలనుకున్నాడు. అది గ్రహించిన ధర్ముడు వెంటనే దుర్వాసుడి ముందు తన నిజస్వరూపంతో ప్రత్యక్షమయ్యాడు. తనతో పాటు సత్యం, బ్రహ్మచర్యం, తపస్సులను; యమ నియమ, దానాలను కూడా వెంటబెట్టుకు వచ్చాడు.సత్యం, బ్రహ్మచర్యం, తపస్సు బ్రాహ్మణుల రూపంలో రాగా, యమం ద్విజుడి రూపంలోను, నియమం ప్రాజ్ఞుడి రూపంలోను, దానం అగ్నిహోత్రుడి రూపంలోను వచ్చాయి. వారికి తోడుగా క్షమ, శాంతి, లజ్జ, అహింస, స్వచ్ఛత స్త్రీల రూపంలోను, బుద్ధి, ప్రజ్ఞ, దయ, శ్రద్ధ, మేధ, సత్కృతి, శాంతి, పంచయజ్ఞాలు, వేదాలు స్వస్వరూపాలతో వచ్చి నిలిచాయి. ఈ విధంగా ధర్ముడు సపరివారంగా దుర్వాసుడి ముందుకు వచ్చాడు.‘మహర్షీ! తపోధనుడివైన నువ్వు ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు? కోపం శ్రేయస్సును, తపస్సును నశింపజేస్తుంది. పుణ్యకర్మలను క్షయింపజేస్తుంది. అందువల్ల ప్రయత్నపూర్వకంగా కోపాన్ని విడనాడాలి. దయచేసి శాంతించు! నీ తపోధనం చాలా గొప్పది’ అన్నాడు ధర్ముడు.ధర్ముడు అనునయంగా మాట్లాడటంతో దుర్వాసుడు కొద్ది క్షణాల్లోనే శాంతించాడు.‘మహాత్మా! దివ్యపురుషుడిలా కనిపిస్తున్న నువ్వెవరివి? నీతో వచ్చినవారంతా తేజస్సంపన్నులుగా ఉన్నారు. వారంతా ఎవరు?’ అడిగాడు దుర్వాసుడు. ధర్ముడు తనతో వచ్చిన తన పరివారాన్ని ఒక్కొక్కరినే దుర్వాసుడికి సవివరంగా పరిచయం చేశాడు. ‘అందరిలోనూ వృద్ధురాలిగా కనిపిస్తున్న స్త్రీ నా తల్లి దయ. గొప్ప తపస్విని. నేను ధర్ముడిని, ధర్మ పురుషుణ్ణి’ అని పలికాడు. ‘ఓ ధర్మపురుషా! మంచిది. మీరంతా నా వద్దకు ఎందుకు వచ్చారు? నేను మీకు చేయగల సాయమేమైనా ఉందా?’ ప్రశ్నించాడు దుర్వాసుడు.‘మహర్షీ! శాంతించు. నా మీద ఎందుకు కోప్పడుతున్నావో చెప్పు? నేను నీ పట్ల చేసిన అపచారం ఏమిటి? కారణం చెప్పాలనిపిస్తేనే చెప్పు. ఇందులో నిర్బంధమేమీ లేదు’ అన్నాడు ధర్ముడు. ‘ధర్మపురుషా! నా కోపం నిష్కారణమైనది కాదు. నా కోపానికి తగిన కారణం ఉంది. చెబుతాను, విను! నేను చాలా కష్టపడి దయా శౌచాలతో నా శరీరాన్ని పరిశుద్ధం చేసుకున్నాను. నీ దర్శనం కోసం పదివేల ఏళ్లు అత్యంత కఠోరంగా తపస్సు చేశాను. అయినా, నువ్వు నన్ను కరుణించలేదు. ఇంతకాలం వేచి ఉండేలా చేశావు. నీకు నా మీద దయ లేదు. అందుకే నీ మీద కోపం వచ్చింది. అందుకే నిన్ను శపించాలనుకున్నాను’ కొంచెం కినుకగా పలికాడు దుర్వాసుడు.‘మహర్షీ! దయచేసి శాంతించు. నువ్వు తొందరపడి శపిస్తే, నీ శాపానికి నేను నాశనమైతే, ఈ లోకమంతా నశిస్తుంది. నీ బాధకు మూలకారణాన్ని తొలగిస్తాను. ఇహపరాల్లో నీకు గొప్ప సుఖం కలిగేలా చేస్తాను. లోకంలో ముందు సుఖాన్ని పొందినవాళ్లు తర్వాత దుఃఖాన్ని పొందుతున్నారు. ముందు దుఃఖాన్ని పొందినవాళ్లు తర్వాత సుఖాన్ని పొందుతున్నారు. పాపాత్ములు ఏ శరీరంతో పాపం చేస్తారో, అదే శరీరంతో బాధలు అనుభవిస్తారు. అది వారు చేసిన పాపానికి ఫలం’ అని ధర్ముడు హితబోధ చేశాడు.అంతా విన్నప్పటికీ దుర్వాసుడు కినుక మానలేదు. ‘ధర్మపురుషా! నువ్వెన్ని చెప్పినా, నీ మీద నాకు కోపం తగ్గడంలేదు. అందువల్ల నిన్ను శపించాలనే అనుకుంటున్నాను’ అన్నాడు. ‘ఓ మహర్షీ! నా వల్ల నీకు కోపం వస్తే, దయచేసి క్షమించు. క్షమించకుంటే నన్ను దాసీపుత్రుడిగా చేయి లేదా రారాజుగా చేయి లేదా చండాలుడిగా చేయి. వినయంగా ఉండేవారిపై బ్రాహ్మణులు ప్రసన్నత చూపరు కదా!’ అన్నాడు. దుర్వాసుడు వెంటనే, ‘ధర్మపురుషా! నువ్వు కోరినట్లే రారాజువుగా, దాసీ పుత్రుడిగా, చండాలుడిగా జన్మించు’ అని ఏకకాలంలో మూడు శాపాలనిచ్చి వెళ్లిపోయాడు.దుర్వాసుడి శాపఫలితంగా ధర్మపురుషుడు తర్వాతి కాలంలో పాండురాజుకు ధర్మరాజుగా, దాసీపుత్రుడు విదురుడిగా, విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని బాధించినప్పుడు చండాలుడిగా పుట్టాడు. చివరకు ధర్మపురుషుడు కూడా తాను చేసిన కర్మకు ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. – సాంఖ్యాయన -
సౌశీల్యం అంటే,,?
రాముడి పదహారు గుణాలలో ప్రత్యేక గుణం అని చెప్పదగినది సౌశీల్యం. శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి బయలుదేరి వెడుతున్నప్పుడు గుహుడి రాజ్యంలో ప్రవేశించాడు. అప్పుడు గుహుణ్ణి ‘‘ఆత్మవత్సఖః’’ అంటాడు. అంటే గుహుడు రాముడికి ఎంత అంటే తనతో సమానమైన వాడు. అరమరికలు లేకుండా ఎవరితో ఉండ గలడో అతడు. రాముడు వస్తున్నాడని తెలిసి గుహుడు వద్ధులైన మంత్రులతో కలిసి రాముడికి ఎదురు వెళ్ళాడు స్వాగతం చెప్పటానికి. రాముడు తానే ముందుగా అతడిని పలుకరించి కౌగిలించుకున్నాడు. రాముడు చక్రవర్తి కుమారుడు. గుహుడు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక సామాన్యమైన వనచర రాజ్యానికి అధిపతి మాత్రమే. రాముడికి అటువంటి భేదాలు లేవు. రాముడికి పట్టాభిషేకం అని ప్రకటించిన తరువాత సుమంత్రుడు రాముడి అంతఃపురంలో ప్రవేశించటానికి అనుమతి అడుగుతుంటే అటువంటిది అవసరం లేదు అంటాడు. తాను కాబోయే రాజు అయినా చిన్నతనం నుండి ఎత్తుకుని ఆడించిన వాడు కనుక తారతమ్యం చూపించ లేదు. జటాయువుని పక్షి అని చూడకుండా అంత్యక్రియలు నిర్వర్తించాడు. దశరథుడు కూడా అటువంటి సౌశీల్యం కలవాడు కనుకనే జటాయువుతో మైత్రి నెర΄ాడు. దేవతలు దశరథుడితో మైత్రి కలిగి ఉండటానికి ఈ గుణమే కారణమేమో! కృష్ణ సుధాముల మైత్రి కూడా ఇటువంటిదే. పైగా కుచేలుడుగా ప్రఖ్యాతి పోందిన సుధాముడు కృష్ణుడి ఐశ్వర్యాన్ని చూసి చనువుగా ఉండటానికి కొంచెం సందేహిస్తుంటే, తానే ఎదురు వెళ్ళి, తీసుకు వచ్చి, కాళ్ళు కడిగి, సకల మర్యాదలు చేసి, అతడిలో ఉన్న ఆ కాస్త బెరుకుని పోగొట్టటానికి గురుకులంలో గడిపిన కాలాన్ని గుర్తు చేస్తాడు. పైగా అతడికి ఏమీ ఇచ్చి పంపలేదు వెళ్లేటప్పుడు. అతడి లేమిని ఎత్తి చూపి, తన ఆధిక్యం చూపించుకున్నట్టు అవుతుంది అని. ఇంటికి చేరే సరికి గుట్టు చప్పుడు కాకుండా అన్నీ సమకూర్చాడు. ఎంతటి సౌశీల్యం! దీనికి భిన్నమైన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ద్రుపదుడు విద్యాభ్యాస సమయంలో ఇచ్చిన మాట తప్పి తనను చూడటానికి వచ్చిన ద్రోణుణ్ణి అవమాన పరుస్తాడు. తగిన ఫలం అనుభవించాడు. లోకంలో తరచుగా ఇటువంటివారే ఎక్కువగా కనపడుతూ ఉంటారు. స్నేహానికి కూడా అంతస్తు చూస్తారు. అవసరానికి స్నేహం నటించటం ఉంటుంది. పని అయిపోయిన తరువాత అంతకు ముందు ఉన్న సుహద్భావం కనపడదు. అవసరం వచ్చి నప్పుడు అడ్డు రాని అంతస్తులు, హోదాలు, పదవులు, ఆర్థిక వ్యత్యాసాలు అప్పుడు కనపడతాయి. మరొక ప్రధానమైన గుణం – మిత్రులు తక్కువ స్థాయిలో ఉన్నారు కనుక వారిని తమ స్థాయికి తీసుకు రావటానికి ప్రయత్నం చేయరు. అంటే, వారి స్థాయిని గుర్తించినట్టే కదా! అది వారిని అవమానించినట్టే అవుతుంది. వారు ఉన్న స్థితి వారికి నచ్చినది, తప్తి కలిగించేది. వారికి కావలసినది ప్రేమ, ఆత్మీయత, ఆదరణ. దానిని చూపించటమే సౌశీల్యం. ఈ లక్షణం ఎంత అపురూపమో కదా! – డా. ఎన్. అనంత లక్ష్మి‘‘మహతః మందై స్సహ నీరంధ్రేణ సంశ్లేషః సౌశీల్యం’’ జాతి చేత విద్య చేత ఐశ్వర్యం చేత చాలా గొప్పవాడైనా తన కంటే తక్కువ వారితో అరమరికలు లేక కలిసి ఉండటం సౌశీల్యం.ఒక్కసారి మైత్రి ఏర్పడిన తరువాత అది జిడ్డు లాగా అంటుకు పోతుంది. అందుకే దానిని స్నేహం అన్నారు. స్నేహం అంటే నూనె, పట్టుకుంటే వదలని జిడ్డు అని అర్థం. చిన్నతనంలో ఇటువంటి తేడాలు తెలియవు కనుక అందరితో కలిసి మెలిసి ఉంటారు. ఎదుగుతున్న కొద్ది దూరం జరగుతూ ఉంటారు. కానీ, సజ్జనులు అటువంటి భావాలని దారికి రానీయరు. -
'ఆమె ధర్మపత్ని'! గృహస్థాశ్రమ వైశిష్ట్యం!!
అహం ఎప్పుడూ కూడా మనిషిని పాషాణం అయ్యేట్టు చేస్తుంది. కామం తీరలేదనుకోండి. శత్రుభావం పెంచుకుని అవతలి వాళ్ళమీద కఠినంగా వ్యవహరించేటట్లు చేస్తుంది. అయితే ప్రేమ మాత్రం కరిగిపోయే లక్షణాన్ని పొంది ఉంటుంది. అవతలివాళ్ళల్లో ఎన్ని లోపాలున్నా వారి నాశనాన్ని ప్రేమ కోరుకోదు. వారు బాగుపడాలి, సంస్కరింపబడాలి, జీవితంలో వృద్ధిలోకి రావాలి... అని కోరుకుంటుంది తప్ప వారిపట్ల ద్వేషం పెంచుకోదు. అందుకే ప్రేమ అవసరం. దానికి పూర్వ పరిచయం లేదు, భవిష్యత్తు మాత్రం ఉంది. దానికి పునాది ప్రేమలోనే ఉంది తప్ప కామంలో లేదు. అందుకే ఆమె ‘ధర్మపత్ని’ తప్ప కామపత్ని కాదు. ఇంత పెద్దప్రాతిపదికచేసి గృహస్థాశ్రమ ప్రవేశం చేయిస్తారు. కాబట్టి వివాహం నిర్ణయించేటప్పుడు పెద్దలు ముందుగా శీలం, వయసు, వృత్తి పరిశీలిస్తారు... తరువాత అభిజనం... అంటే రెండు పక్కల వంశాలు ఎంత గొప్పవి! ఆ వంశాలలో పూర్వీకులు ఎంత గొప్పగా ప్రవర్తించారో అన్న జిజ్ఞాసతో ఆ వంశానికి కీర్తిప్రతిష్ఠలు జోడించేలా ప్రవర్తించాలి. అందువల్ల వాటిని కూడా పెద్దలు పరిశీలిస్తారు.రామాయణంలో... రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేయగానే జనకమహారాజు వచ్చి సీతను అప్పగించాడు, రాముడు వెంట తీసుకెళ్ళాడు... అని చాలామంది అనుకుంటూంటారు. కానీ అది సరికాదు. బాలకాండను అయోధ్యకాండతో కలిపి చదివితే... ఆశ్చర్యపోతాం.. వారి సంస్కారం చూసి... శివధనుర్భంగం కాగానే జనకమహారాజు జలకలశంతో గబగబా వచ్చి..‘‘మొదట ఇచ్చిన మాట ప్రకారం శివధనుర్భంగం చేసినవారికి నా కూతురును ఇస్తానని చె΄్పాను... ఆ పని నీవు విజయవంతంగా చేశావు కాబట్టి ఇదుగో నా కుమార్తె..స్వీకరించు’’... అన్నాడు.దానికి రాముడు.... ‘‘ఒక పిల్ల నాకు భార్య కావాలంటే చూడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి మా తండ్రిగారు చూడాలి. మా పురోహితులు, పెద్దలు, బంధువులను సంప్రదించి ఆయన నిర్ణయిస్తారు. దానికి నేను కట్టుబడతాను. అందువల్ల మా తండ్రిగారికి కబురు పంపండి’ అన్నాడు. కబురందుకుని దశరథ మహారాజు వచ్చారు.‘నేను స్వయంవరం ఏర్పాటు చేస్తే భూమండలంలోని రాజులందరూ వచ్చిపోటీపడ్డారు. కానీ మీ రాముడు మాత్రమే శివధనుర్భంగం చేయగలిగాడు. ముందు చెప్పిన షరతు ప్రకారం నా కుమార్తెని ఇస్తున్నా. మీ కోడలిగా స్వీకరించండి’ అని జనకుడు కోరాడు. దశరథుడు వెంటనే ఎగిరి గంతేసి అంగీకరించలేదు. ఆయన అన్నాడు కదా... ‘ఈమె నా ఇంటి కోడలిగా రావడానికి ముందు మన రెండు వంశాలు సరిపోతాయా.. దానికి అర్హతలు మనకున్నాయా..’’ అంటూ మరో గొప్పమాటంటాడు..‘‘రాముడు గొప్పవాడు ... పిల్లనివ్వడం మా అదృష్టం’’ అంటూ వంగి మాట్లాడకండి, జనక మహారాజా! మీరు పిల్లనిస్తేనే కదా మా వంశం నిలబడేది. అప్పుడే కదా రుణవిమోచనం. ఇచ్చేవారు మీరు, పుచ్చుకునేవాడిని నేను. ఇప్పుడు వినయంగా ఉండాల్సింది నేను మహారాజా !’’ అన్నాడు. ఆ తరువాత దశరథ మహారాజు కోరికపై వశిష్ఠుడు, జనకుడి కోరికపై వారి పురోహితుడు వారి వారి వంశాలను వివరించారు. అలా ఒకరి నుంచి మరొకరు క్షుణ్ణంగా తెలుసుకుని నిర్ణయించిన వివాహాలు కాలంలో ఆదర్శంగా నిలిచిపోయాయి. అందుకే గృహస్థాశ్రమానికి రామాయణం ఆదర్శం – అని కంచి మహాస్వామి అంటూండేవారు. – బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
Mothers Day 2024: సూపర్ మామ్ఫ్లూయెన్సర్
సోషల్ మీడియా ప్రపంచంలో మామ్ఫ్లూయెన్సర్లు పవర్ఫుల్ ఫోర్స్‌గా మారారు. ఇన్స్పిరేషనల్ వైరల్ కంటెంట్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో కొందరు పాపులర్ మామ్ ఫ్లూయెన్సర్ల గురించి...ఫ్యాషన్, బ్యూటీటిప్స్ నుంచి పేరెంటింగ్ అండ్ వర్క్–లైఫ్ బ్యాలెన్స్ వరకు తల్లులకు ఉపయోగపడే ఎన్నో సలహాలు ఇస్తోంది మాసుమ్ మినవాలా మెహతా. ఎన్నో బ్రాండ్లు, పబ్లికేషన్‌లతో కలిసి పనిచేస్తోంది.తన పేరెంటింగ్ జర్నీ విషయాలు, డిఐవై(డూ ఇట్ యువర్సెల్ఫ్) ్రపాజెక్ట్స్, హోమ్ డెకార్ ఐడియాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది కరిష్మ దొండే. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కరిష్మ కామన్ పేరేంటింగ్ చాలెంజెస్‌కు క్రియేటివ్ సొల్యూషన్స్ అందిస్తోంది. మామ్‌గా తన అనుభవాలను పంచుకోవడంతో పాటు ఇతర తల్లులకు టిప్స్, సలహాలు ఇస్తోంది.బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లతో పాపులర్ అయిన శ్వేతా సాల్వే మామ్ఫ్లూయెన్సర్గా సోషల్ మీడియాలో మంచి పేరు తెచ్చుకుంది. ఫిట్నెస్ టిప్స్ నుంచి ఫ్యాషన్ వరకు ఎంతో కంటెంట్‌ను తల్లుల కోసం షేర్ చేస్తోంది. తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో హెల్తీ మీల్స్, సెల్ఫ్–కేర్ ్రపాక్టీసెస్తో పాటు తన పేరెంటింగ్ జర్నీని కూడా షేర్ చేస్తోంది. మదర్‌హుడ్‌ను కెరీర్ అండ్ పర్సనల్ గోల్స్‌తో ఎలా బ్యాలెన్స్ చేయాలో చెబుతోంది.సోషల్ మీడియాలో మాసివ్ ఫాలోయింగ్ ఉన్న మామ్ఫ్లుయెన్సర్లలో నిరాళి మెహతా ఒకరు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మెహతా తన పేరెంటింగ్ జర్నీ, ట్రావెల్ అడ్వెంచర్స్, ఫ్యాషన్ ఇన్స్పిరేషన్లను షేర్ చేస్తుంటుంది. ‘మోర్ ఫన్ అండ్ క్రియేటివ్’ అనే కోణంలో పేరెంటింగ్‌కు సంబంధించిన ట్రిక్స్, టిప్స్‌ను తల్లుల కోసం షేర్ చేస్తుంటుంది నివేదిత గౌడ. తన పేరెంటింగ్ జర్నీతోపాటు కుకింగ్ టిప్స్, డిఐవై (డూ ఇట్ యువర్సెల్ఫ్) ఐడియాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. -
Archana Sinha: అలా వచ్చిన ఆలోచనే.. ఈ 'ఎన్ఎస్ఎఫ్'..
పిల్లలు, ఆటలు, పాటలు ఒకే కుటుంబం. ఆటపాటలంటే పిల్లలకు బోలెడు ఇష్టం. ఆ ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకొని పోషకాహారం నుంచి పరిసరాల పరిశుభ్రత వరకు ఎన్నో కాన్సెప్ట్‌లను ఆటల రూపంలో డిజైన్ చేసిన బెంగళూరుకు చెందిన నరిషింగ్ స్కూల్స్ ఫౌండేషన్(ఎన్ఎస్ఎఫ్) వారి కృషి వృథా పోలేదు. స్కూల్ గార్డెన్ నుంచి గ్రూప్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనడం వరకు పిల్లల్లో ఎంతో సానుకూల మార్పు కనిపిస్తోంది..ప్రభుత్వ పాఠశాలలకు వెళుతూ పిల్లల వయసు, ఎత్తు, బరువు.. మొదలైన విషయాల ఆధారంగా బేస్‌లైన్ సర్వేలు నిర్వహిస్తోంది ఎన్ఎస్ఎఫ్ ఫౌండేషన్. సర్వే ఫలితాల గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయడమే కాదు తగిన సూచనలు కూడా ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకోవడానికి ఈ సర్వే ఫలితాలు ఉపయోగపడుతున్నాయి.‘పారిశుధ్య ప్రాముఖ్యత, సరైన పౌష్టికాహారం గురించి పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా టూల్ కిట్ ఆధారిత విధానానికి రూపకల్పన చేశాము. వారికి తగిన పరిజ్ఞానాన్ని అందించి ఆలోచనాపరులుగా మార్చడమే మా లక్ష్యం’ అంటుంది ఎన్ఎస్ఎఫ్ కో–ఫౌండర్, సీయివో అర్చన సిన్హా.పోషకాహారం, పారిశుధ్యంతో పాటు నవీన వ్యవసాయ పద్ధతుల గురించి పిల్లలకు అవగాహన పరిచే పదిహేను గేమ్స్‌తో కూడిన టూల్కిట్లను ఎన్ఎస్ఎఫ్ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తోంది. పోషకాహార లోపాల లక్షణాలను గుర్తించడానికి ఈ టూల్కిట్లలోని ఎనిమీ కార్డ్, అలాగే... ఈ లోపాలను పరిష్కరించడానికి సహాయపడే ఆహార వనరుల గురించి తెలుసుకోవడానికి ఫ్రెండ్ కార్డు పిల్లలకు ఉపయోగపడుతుంది.వైకుంఠపాళిలోని పాములు, నిచ్చెనలతో కూడా పిల్లలు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండేవారి సత్ప్రవర్తనకు బహుమతులు, జంక్ ఫుడ్‌ను అమితంగా ఇష్టపడేవారికి ఈ ఆటలో శిక్షలు (పాముకాటు)లు ఉంటాయి. సబ్బు వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడానికి ఆకట్టుకునే కాన్సెప్ట్‌కు రూపకల్పన చేశారు.టూల్‌కిట్స్ యాక్టివిటీల ద్వారా పిల్లలు స్కూల్ గార్డెన్లను పెంచుతున్నారు. వారికి ఇచ్చిన గైడ్‌బుక్‌లో వెజిటేబుల్ క్యాలెండర్, మొక్కల పెంపకానికి సంబంధించి స్టెప్–బై–స్టెప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టూల్కిట్లు పిల్లలపై ఏ మేరకు ప్రభావం చూపాయి... అనే విషయంలో ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తుంటుంది ఫౌండేషన్.‘పిల్లల ఆహారపుటలవాట్లపై టూల్‌కిట్స్ సానుకూల ప్రభావం చూపించడమే కాదు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. గ్రూప్ యాక్టివిటీలలో చురుగ్గా పాల్గొనేలా చేస్తున్నాయి’ అంటుంది ఒకిత ఎం అనే గృహిణి. ‘ప్రభుత్వ పాఠశాలలతో పోల్చితే ప్రైవేట్ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగ్గా ఉండవచ్చు. అయితే ఊబకాయంలాంటి సమస్యలు ఉన్నాయి’ అంటుంది అర్చన సిన్హా. త్వరలో ప్రైవేట్ స్కూల్స్లోకూడా ఆన్లైన్ మాడ్యుల్ అందుబాటులోకి తీసుకు రానున్నారు. ‘ఎన్ఎస్ఎఫ్’ దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రభుత్వ పాఠశాలల్లో యాక్టివిటీ ్రపోగ్రామ్స్ నిర్వహించింది. వేలాదిమంది విద్యార్థులపై ఇవి సానుకూల ప్రభావం చూపుతున్నాయి.అలా వచ్చిన ఆలోచనే.. ఎన్ఎస్ఎఫ్..జర్నలిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టిన అర్చన సిన్హా ఆ తరువాత మేనేజ్మెంట్ అండ్ కన్సల్టింగ్లోకి వచ్చింది. సామాజికసేవా కార్యక్రమాలు అంటే మొదటి నుంచి ఇష్టం ఉన్న అర్చన ‘అశోక ఇన్నోవేటర్స్ ఫర్ ది పబ్లిక్’ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేసింది. ఒడిషాలోని గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడి మహిళలతో పౌష్టికాహారం గురించి మాట్లాడింది. అరుదుగా మాత్రమే వారు పౌష్టికాహారం గురించి పట్టించుకుంటున్నారు. పౌష్టికాహారం, పారిశుధ్యం గురించి వారికి అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించిన అర్చన ‘నరిషింగ్ స్కూల్స్ ఫౌండేషన్’కు శ్రీకారం చుట్టింది.ఇవి చదవండి: Priya Chhetri - 'ప్రియ'మైన విజయం -
Short Story: ఉదయాన్నే ఒక గంట శబ్ధం వినపండింది.. అదేంటో కనుక్కోండి..!
ఒకనాటి ఉదయాన్నే అడవిలోంచి ఒక గంట శబ్దం మృగరాజైన సింహం చెవుల్లో సోకి ఎంతగానో ఆకట్టుకుంది. దాని ఉనికి తెలుసుకోవాలన్న కుతూహలంతో వెంటనే అన్ని జంతువులనూ సమావేశపరచింది. ‘ఈరోజు ఉదయాన్నే ఒక గంట శబ్దం నా చెవిన పడి నన్ను ముగ్ధుడిని చేసింది. తక్షణమే దాని గురించి కనుక్కుని చెప్పండి’ అని తన గుహలోకి పోయింది. అది విన్న జంతువులన్నీ తమలో తాము గుసగుసలాడుకున్నాయి.‘ఔను! నేనూ ఈరోజు ఆ గంట శబ్దం విన్నాను భలేగా ఉంది.. గణగణలాడుతూ..’ అన్నది కుందేలు. ‘ఆ చప్పుడుకి తెల్లవారుతూనే నాకు తెలివొచ్చేసింది. ఏదో కొమ్మ మీంచి కొమ్మకు గెంతుతుంటే అదోవిధమైన ధ్వని నా మనసును హత్తుకుంది’ తోడేలు చెప్పింది. ‘మీకెందుకలాగ అనిపించిందో నాకైతే బోధపడటం లేదు. పదేపదే ఆ గంట మారుమోగుతుంటే చెడ్డ చిరాకేసింది. అది ఎవరు చేస్తున్నదీ తెలిస్తే చంపకుండా వదలను’ అని కోపం ప్రదర్శించింది ఎలుగుబంటి.‘మృగరాజు చెప్పిన పనిని మనం చేయడం ధర్మం. సరేనా!’ అన్నది ఒంటె. మళ్ళీ గంట శబ్దం అదేపనిగా వినబడసాగింది. చీకటిపడే సమయానికి కూడా దాని ఉనికి కనుక్కోలేక తమ గూటికి చేరాయన్నీ. మర్నాడు ఉదయం ఒక కోతి గెంతుకుంటూ వచ్చి ‘ఒక పిల్లి తన గంట మెడలో కట్టుకుంది. అది కదిలినప్పుడల్లా మారుమోగి అడవి అంతా వ్యాపిస్తోంది. ఇదే విషయం మనం సింహానికి చెప్పేద్దామా?’ అని సాటి జంతువులతో అన్నది. ‘చెబితే మనల్ని ఆ గంట తెమ్మని అడగవచ్చు. దానికి సిద్ధపడితేనే మనం చెప్పాలి. లేకపోతే అంతా ఆలోచించాక చెవిన వేద్దాం’ అన్నది ఏనుగు.అదే సమయంలో గుహలోంచి సింహం గర్జిస్తూ బయటకొచ్చి ‘మీరంతా గంట సంగతి ఏం చేశారో చెప్పారు కాదు. ఈ ఉదయం కూడా అది నాకు వినబడి మరింత ఆకట్టుకుంది. చెప్పండి..’ అని హుంకరించింది. ‘మరి.. మరి.. అది.. ఒక పిల్లి మెడలో ఉండటం ఈ కోతి కళ్ళబడింది’ అని చెప్పేసింది కుందేలు.‘ఆ! ఒక పిల్లి మెడలో గంటా? అది దాని మెడలోకి ఎలావచ్చింది? ఎవరు కట్టారు? ఒక పిల్లి అంత ధైర్యంగా గంట కట్టుకుని అడవంతా తిరగటమేమిటి? ఈ రోజు ఎలాగైనా ఆ గంటను తెచ్చి నా మెడకు కట్టండి. లేకుంటే ఏంచేస్తానో నాకే తెలీదు’ అని గర్జించింది సింహం. వెంటనే జంతువులన్నీ అడవిలో గాలించడం మొదలెట్టాయి. అదే సమయంలో ఒక లేడి చెంగుచెంగున గెంతుకుంటూ వచ్చి ‘పిల్లి మెడలో గంట కట్టింది ఎలుకలని తెలిసింది. అవి ఎందుకలా కట్టాయో వాటికి కబురుపెట్టి అడగండి..’ అని చెప్పింది.ఎలుకలకు కబురు వెళ్ళింది. ఎలుకల నాయకుడు జంతువుల ముందు హాజరై ‘మా ఎలుకలకు ప్రాణహాని కలిగిస్తున్న ఒక పిల్లి నుండి రక్షించుకోడానికి మెడలో గంటకడితే ఆ చప్పుడుకి దాని ఉనికి తెలుస్తుందని అప్పుడు మేమంతా జారుకోవచ్చని ఉపాయం ఆలోచించాం’ అన్నది. ‘మరి మీరు చేసిన పనికి మేమంతా ఇప్పుడు ఇరుక్కున్నాం. ఆ శబ్దం మృగరాజుకు తెగ నచ్చేసింది. అందువలన మీరు ఆ గంటను దాని మెడలోంచి తీసి మాకివ్వాలి. మేము దాన్ని సింహం మెడలో కట్టాలి. ఆ పని మీరు త్వరగా చేయాలి’ అని ఎలుగుబంటి హుకుం జారీ చేసింది. ‘అయ్యో రామ! మా రక్షణ నిమిత్తం చచ్చేంత భయంతో ధైర్యం చేసి కట్టాం. మళ్ళీ దాన్ని తీసి తేవాలంటే గండకత్తెరే! మా కంటే మీరంతా శక్తిమంతులు. ధీశాలులు. దయచేసి మీలో ఎవరో ఒకరు పిల్లి మెడలో గంటను తొలగించండి. మళ్ళీ మాకు పిల్లి నుండి ప్రాణగండం తప్పదు. అయినా భరిస్తాం’ నిస్సహాయంగా చెప్పింది ఎలుకల నాయకుడు. ‘ఐతే సరే! వెళ్ళు. దానిపని ఎలా పట్టాలో మాకు తెలుసు. మృగరాజు కోరిక తీర్చడం మాకు ముఖ్యం’ అని ఎలుకను పంపేసింది ఏనుగు.కుందేలు ఎగిరి గంతేస్తూ ‘పిల్లి మెడలో గంట శబ్దం మన మృగరాజుకి నచ్చడం మన అదృష్టం. సింహానికి ఎప్పుడు ఆకలి వేసినా ఎవరని కూడా చూడకుండా వేటకు సిద్ధపడుతుంది. అలాంటప్పుడు మెడలో గంట ఉంటే ఆ చప్పుడు మనందరికీ వినిపించి తప్పించుకోడానికి అవకాశం వస్తుంది. అందువలన ఆ పిల్లి మెడలో గంటను తీసుకొచ్చి సింహానికి కట్టేయాలి’ అని అందరి వైపు చూసింది.‘పిల్లి మెడలో గంట తస్కరించడం ఏ మాత్రం? మీరు ఊ అంటే చాలు.. సాయంత్రంకల్లా తెచ్చేస్తా’ అన్నది కోతి హుషారుగా. జంతువులు ‘ఊ’ కొట్టాక కోతి అడవిలోకి పోయి గంట చప్పుడైన దిశగా పయనించింది. కోతి రాకను గమనించిన పిల్లి చెట్లన్నిటి పైనా తిరిగి తప్పించుకో చూసింది. అప్పుడు కోతి ‘మిత్రమా! నీరాక తెలుసుకొని నీ నుండి తప్పించుకోడానికి ఎలుకలు పన్నిన కుట్రలో భాగమే నీ మెడలో ఈ గంట. దాన్ని తీసిస్తే నీకే మంచిది. నువ్వు సడి చప్పుడు లేకుండా వెళ్ళి ఎలుకల పనిపట్టి నీ ఆకలి తీర్చుకోవచ్చును’ అన్న మాటలకి సంతోషపడి ఒప్పుకుంది. దాని మెడలోని గంటను విప్పి పట్టుకెళ్లి జంతువులందరి ముందు ఎలుగుబంటి చేతిలో పెట్టింది కోతి. ‘ఇక చూడండి.. మన మృగరాజు తన గోతిలో తానే పడే సమయం వచ్చింది’ అని తోడేలు అంటున్నంతలోనే.. గుహ లోపలున్న సింహం దగ్గరకి వెళ్ళి గంట దొరికిందని చెప్పింది కుందేలు.‘ఆహా! ఎంత అదృష్టం! నేను కోరుకున్న గంటను ఇక నామెడలో అలంకరించండి. ఆ శబ్దంతో అడవంతా మారుమోగి పోవాలి’ అన్నది బయటకొచ్చిన సింహం. ఎలుగుబంటి తన దగ్గర ఉన్న గంటను ఏనుగుకు ఇవ్వగా అది మృగరాజు మెడలో వేసింది. గంటను పదేపదే చూసుకుని మెడను తిప్పుతూ గంట శబ్దానికి తెగ ముచ్చట పడిపోతూ అడవిలోకి పరుగు తీసింది మృగరాజు. దాని వైఖరికి జంతువులన్నీ ‘గంట చప్పుడుకి మురిసిపోతోంది కాని అది తనకే గండమన్న సంగతి తెలుసుకోలేకపోయింది పాపం!’ అంటూ నవ్వుకున్నాయి. ‘సింహం కోరిక తమ పాలిట వరం’ అనుకుంటూ తమ దారిన తాము వెళ్లిపోయాయి. – కె.కె.రఘునందనఇవి చదవండి: ప్రకృతి కూడా అతడి కోపానికి భయపడేది.. ఒకరోజు.. -
Anupam Kumar: 'మినీ మైన్స్'తో.. క్లీన్ ఎనర్జీ అండ్ క్లైమెట్ చేంజ్..
‘లో కాస్ట్ – జీరో వేస్ట్’ నినాదంతో ‘మినీ మైన్స్’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టారు అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్. ఈ–వ్యర్థాల నుంచి లిథియం ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికిల్(ఈవి) పరిశ్రమకు ఖర్చులు తగ్గిస్తున్నారు. దిగుమతులకు ప్రత్నామ్యాయంగా స్వావలంబనకు ప్రాధాన్యత ఇస్తూ విజనరీ ఫౌండర్స్‌గా పేరు తెచ్చుకున్నారు.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)కి సంబంధించి అతి పెద్ద ఖర్చు లిథియం–అయాన్ బ్యాటరీ. మన దేశంలో లిథియం వోర్ తక్కువగా ఉంది. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి. మరోవైపు చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, లాప్టాప్ల బ్యాటరీలకు సంబంధించి ఈ–వ్యర్థాలు కొండలా పేరుకు పోయాయి. ఈ కొండల్లో నుంచి లిథియం వెలికి తీయగలిగితే నికెల్, కోబాల్టును సేకరించగలిగితే దిగుమతులపై అతిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీల ఖర్చు తగ్గుతుంది. బెంగళూరు కేంద్రంగా అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్లుప్రారంభించిన ‘మినీ మైన్స్’ మన దేశంలోని ఈ–వ్యర్థాల నుంచి లిథియం, నికెల్, కోబాల్ట్‌లను సేకరించి వాటిని బ్యాటరీ తయారీదారులకు విక్రయిస్తుంది. మైనింగ్ కంటే లీ–అయాన్ బ్యాటరీల నుండి భాగాలను వెలికితీయడం మంచి రాబడి ఇస్తుంది. ఒక టన్ను లిథియం ఖనిజాన్ని తవ్విప్రాసెసింగ్ చేయడం వల్ల 2–3 కిలోల లిథియం లభిస్తుందని, ఒక టన్ను బ్యాటరీలను రీసైక్లింగ్ చేయడం వల్ల 20–30 కిలోల లిథియం లభిస్తుందని, నీటిని ఆదా చేస్తుందని, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని అంటున్నారు అనుపమ్, అరవింద్. ‘మన దేశంలోని స్పెంట్ బ్యాటరీల నుంచి 66 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు సరిపడా లిథియం అయాన్, నికెల్, కోబాల్ట్‌లను వెలికితీయవచ్చు’ అంటున్నాడు అనుపమ్ కుమార్. మొబైల్ ఫోన్, బటన్ సెల్స్, ల్యాప్‌టాప్ బ్యాటరీల తయారీకి కూడా లి–అయాన్‌ను ఉపయోగిస్తారు. లిథియం కార్బోనేట్‌ను ఫార్మాస్యూటికల్ రంగంలో, గ్లాస్ మాన్యుఫాక్చరింగ్లో ఉపయోగిస్తారు. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన అనుపమ్ కుమార్ బాబా ఆటోమిక్ రిసెర్చ్ సెంటర్లో కెరీర్ప్రారంభించాడు. అక్కడ రియాక్టర్ల వ్యర్థాల నుంచి యురేనియం, నికెల్లను వేరు చేసేవాడు. ‘లాగ్9 మెటరీయల్స్’లో అనపమ్, అరవింద్ భరద్వాజ్‌లకు పరిచయం జరిగింది. అక్కడ భరద్వాజ్ లిథియం–అయాన్ బ్యాటరీస్ డివిజన్ హెడ్‌గా ఉండేవాడు. వీరి మధ్య జరిగిన సంభాషణల్లో ‘యురేకా’ మూమెంట్ ఆవిష్కారం అయింది. అది ‘మినీ మైన్స్’ స్టార్టప్ అయింది. తమ పొదుపు మొత్తాలు 6.5 కోట్లతో కంపెనీప్రారంభించారు. మినీమైన్స్ టెక్నాలజీని నీతి ఆయోగ్ ధృవీకరించింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్, ది యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లు గ్రాంట్ ఇచ్చాయి. ‘ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మినీ మైన్స్ విలువైన లోహాలను పునర్వినియోగ రూపంలో ఈవీ పరిశ్రమకు మేలు చేస్తుంది’ అంటున్నాడు ఆవాజ్ ఫౌండేషన్ కన్వీనర్ సుమైరా అబ్దులాలీ. కమాడిటీ సేల్స్, లైసెన్సింగ్/రాయల్టీ....మొదలైన వాటితో కంపెనీకి సంబంధించిన రెవెన్యూ మోడల్‌ను రూపొందించుకుంది మినీ మైన్స్. ‘ఈ–వ్యర్థాలను రీసైకిల్ చేయగలిగితే మన దేశం మరింత స్వావలంబన దిశగా పయనించడమే కాదు ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు ఖర్చును తగ్గించవచ్చు అనుకున్నాం’ అంటాడు కంపెనీ సీయివో అనుపమ్ కుమార్. అతడి మాటలు వృథా పోలేదు అని చెప్పడానికి ‘మినీ మైన్స్’ సాధించిన విజయమే సాక్ష్యం. ఇవి చదవండి: Shambhavi Choudhary: అతి చిన్న వయసు దళిత అభ్యర్థి -
పర్యావరణ దీపికలు.. 'మనం నడవాల్సిన బాట ఇది!'
‘ఆట, పాట గురించే కాదు మనం నడిచే బాట గురించి కూడా ఆలోచించాలి’ అంటున్నారు ఈ యువ మహిళలు. మనం ప్రయాణించే మార్గం ఏది అనేదే భవిష్యత్‌ను నిర్దేశిస్తుంది. బంగారు భవిష్యత్ కోసం పర్యావరణ స్పృహతో ‘మనం నడవాల్సిన బాట ఇది’ అంటూ మార్గనిర్దేశ ఉద్యమ కార్యచరణలో భాగం అవుతున్నారు యువ మహిళలు. ‘అరుణోదయం ఊరుకోదు కిరణాలను సారించనిదే.. ప్రసరించే నీరు ఊరుకోదు పల్లం అంతుముట్టనిదే.. ప్రతిఘటించే మనసు ఊరుకోదు ప్రశ్నలను ఎక్కుపెట్టనిదే..’ అంటుంది ‘విశ్వంభర’ కావ్యం. ప్రశ్నలు ఎక్కుపెట్టి పర్యావరణ సంరక్షణ కోసం నడుం కట్టిన యువ మహిళల గురించి.. 'గర్విత గుల్హటి' నీరే ప్రాణాధారం.. బెంగళూరుకు చెందిన గర్విత గుల్హటి ఇంజనీరింగ్ చేసింది. ‘వై వేస్ట్?’ స్వచ్ఛంద సంస్థ కో–ఫౌండర్‌గా నీటి సంరక్షణకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. రెస్టారెంట్లలో నీటి వృథాను ఆరికట్టడంలో కీలక పాత్ర పోషించింది. బడి, కళాశాల, ప్రభుత్వ కార్యాలయాల్లో ‘నీటి సంరక్షణ’కు సంబంధించి ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. ‘వై వేస్ట్?’ సంస్థ దేశవ్యాప్తంగా 20 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘వై వేస్ట్?’ కోసం పనిచేస్తున్న తొలి దినాల్లో ‘సమయం వృథా చేయవద్దు. చదువు మీద దృష్టి పెట్టు’ ‘పర్యావరణ కార్యక్రమాల కోసం పనిచేయడానికి ఇది సరిౖయెన సమయం కాదు’ అని గర్వితతో అనేవారు కొందరు. వారి మాటలను పట్టించుకోకుండా ‘మన కోసం ΄్లానెట్ వేచి చూడదు కదా. మరి ఆలస్యం చేయడం ఎందుకు?’ అని ఆగకుండా ముందుకు వెళ్లింది. ‘వై వేస్ట్?’ ప్రారంభించడానికి కారణం గర్విత మాటల్లోనే..‘మహారాష్ట్ర, బెంగళూరులో కరువు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యల గురించి చదివి బాధపడ్డాను. తాగు నీటి కోసం మహిళలు ఎండలో మైళ్ల దూరం నడవడం చూశాను. మన దేశంలో కోట్లాది మంది పిల్లలకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేదు. దీని వల్ల ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. ఇలాంటి ఎన్నో కారణాలను దృష్టిలో పెట్టుకొని వై వేస్ట్ ఆవిర్భవించింది’ పద్దెనిమిది సంవత్సరాల వయసులో గర్విత గుల్హటి ‘గ్లోబల్ చేంజ్‌మేకర్’ టైటిల్‌కు ఎంపికైంది. 'రిధిమ పాండే' నిగ్గదీసి అడిగే నిప్పు స్వరం! ఉత్తరాఖండ్‌కు చెందిన రిధిమ పాండే చిన్న వయసులోనే క్లైమెట్ యాక్టివిస్ట్‌గా పెద్ద పేరు తెచ్చుకుంది. పర్యావరణ కార్యకర్తలైన తల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి పొందింది. ప్రకృతి విధ్వంసం, వాతావరణ మార్పులపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వడం లేదంటూ 2019లో రిధిమ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పర్యావరణ సంబంధిత కేసులను స్వీకరించడానికి 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఏర్పాటు చేశారు. ‘ఎన్జీటీ’ రిధిమ కేసును స్వీకరించినప్పటికీ ఈ కేసు ‘ఎన్విరాన్మెంట్ పాక్ట్ అసెస్మెంట్’ పరిధిలోకి వస్తుందని కొట్టివేసింది. వాతావరణ సంక్షోభంపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ, అర్జెంటీనా దేశాలపై ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసిన 14 మంది యువ ఉద్యమకారులలో రిధిమ ఒకరు. ఏకైక భారతీయురాలు కూడా.వాతావరణ సంక్షోభంపై రిధిమ గత కొన్ని ఏళ్లుగాఎన్నో వ్యాసాలు రాసింది. ఎన్నో దేశాలలో ఎన్నో ప్రసంగాలు చేసింది. వాతావరణ యువ ఉద్యమకారుల ప్రతి జాబితాలో చోటు సంపాదించింది. ‘చిల్డ్రన్ వర్సెస్ క్లైమెట్ చేంజ్’ పేరుతో పుస్తకం రాసింది. 'వర్ష రైక్వార్' ప్రతి ఊరుకు పర్యావరణ స్వరం! ‘గతంలో అద్భుతమైన పంట దిగుబడులు వచ్చేవి. క్రమక్రమంగా ఏటేటా పంట దిగుబడి క్షిణిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించే క్రమంలో పర్యావరణ అంశాలపై ఆసక్తి పెరిగింది’ అంటుంది మధ్యప్రదేశ్‌కు చెందిన వర్షా రైక్వార్. గతంలో చుట్టు పక్కల ఎన్నో వనాలు కనిపించేవి. అవి ఎందుకు అదృశ్యమయ్యాయి? అని స్థానికులను అడిగితే ‘విధిరాత. అంతే! మనం ఏం చేయలేం’ అని విధిపై భారాన్ని మోపారు. ఈ నేపథ్యంలో సామాన్య మహిళలకు ‘వాతావరణ మార్పులు–కారణాలు–మన కార్యచరణ’ గురించి తెలియజేయడానికి రేడియో జాకీగా ప్రస్థానంప్రారంభించింది వర్ష. పర్యావరణ రంగంలో కృషి చేస్తున్న చేంజ్మేకర్ల అసాధారణ కథలను ఎఫ్ఎం 90.4 రేడియో బుందెల్‌ఖండ్ ద్వారా వెలుగులో తీసుకువచ్చి పదిమందికి తెలిసేలా చేసింది. వాతావరణ మార్పులపై అవగాహనను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లిన వర్ష ‘యునైటెడ్ నేషన్స్ యంగ్ క్లైమెట్ లీడర్–2021’గా ఎంపికైంది. 'హీనా సైఫి' వాయు కాలుష్యంపై వార్.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరuŠ‡లో ఎంబీఏ చదువుతున్న హీనా సైఫి ‘క్లైమెట్ చేంజ్ ఛాంపియన్’గా గుర్తింపు పొందింది. ఉమెన్ క్లైమెట్ కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) వేదికలో పాలుపంచుకున్న 16 మంది ఉమెన్ ఛాంపియన్స్‌లో హీన ఒకరు. ఐక్యరాజ్య సమితి ‘వుయ్ ది చేంజ్’ క్యాంపెయిన్‌లో కూడా హీన భాగం అయింది. ఎనిమిదవ తరగతి పూర్తయిన తరువాత ‘ఇక చదివింది చాలు’ అన్నారు తల్లిదండ్రులు. అయితే హీన పట్టుదల ముందు వారి నిర్ణయం ఓడిపోయింది. పర్యావరణ సమస్యలపై అవగాహన లేకపోవడానికి చదువుకోకపోవడం ఒక కారణం అని గ్రహించిన హీన, పిల్లలు ఎవరైనా స్కూల్ మానేస్తే వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడేది. పిల్లలు తిరిగి స్కూలుకు వచ్చేలా చేసేది. అంతేకాదు...స్థానిక స్వచ్ఛంద సంస్థలో చేరి వాతావరణ మార్పులపై జరిగిన ఎన్నో సమావేశాలు, వర్క్‌షాప్‌లకు హాజరైయ్యేది. ‘క్లైమెట్ ఎజెండా’పై లక్నోలో జరిగిన సమావేశానికి హాజరై వాయు కాలుష్యం, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్....మొదలైన ఎన్నో విషయాల గురించి తెలుసుకుంది. తాను తెలుసుకున్న విషయాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేది. ‘సూరజ్ సే సమృద్ధి’ పేరుతో సౌరశక్తి ఉపయోగాల గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. బడులలో పర్యావరణ అంశాలకు సంబంధించి పోస్టర్–మేకింగ్ యాక్టివిటీస్ నిర్వహించింది. 'నేహా శివాజీ నైక్వాడ్' గ్రీన్ రికవరీ! మన దేశంలోని కొద్దిమంది పర్యావరణ ఆధారిత డేటా సైంటిస్టులలో నేహా ఒకరు. క్లైమేట్ టెక్నాలజీ ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్ల ద్వారా క్లైమేట్ డేటా ఫోకస్డ్ సొల్యూషన్స్ కోసం చేపట్టే కార్యక్రమాలకు సహకారం అందిస్తోంది నేహా. ‘క్లైమేట్ కలెక్టివ్’ ఫౌండేషన్ ద్వారా యువ ఎంటర్ప్రెన్యూర్లకు వ్యాపార పరిజ్ఞానం, మార్కెట్ కనెక్షన్లు, సాంకేతిక సామర్థ్యం విషయంలో సహాయపడుతోంది. ‘క్లైమేట్ కలెక్టివ్’కు ముందు సాఫ్ట్వేర్, టెక్నాలజీకి సంబంధించిన మల్టీ నేషనల్ కన్సల్టింగ్ ఫర్మ్ ‘జెడ్ఎస్ అసోసియేట్స్’లో పని చేసింది నేహా. తన నైపుణ్యాన్ని ఉపయోగించి 140కి పైగా గ్రీన్ స్టార్టప్లనుప్రారంభించడంలో సహాయపడింది. యూఎన్–ఇండియా ‘వుయ్ ది చేంజెస్’ క్యాంపెయిన్‌కు ఎంపికైన పదిహేడు మంది యంగ్ క్లైమేట్ చేంజ్ లీడర్లలో నేహా ఒకరు. ‘జీరో–వేస్ట్’పై పని చేసే యూత్ సెల్ ‘సెల్ పర్వాహ్’కు కో–ఫౌండర్ అయిన నేహా ‘గ్రీన్ రికవరీని వేగవంతం చేయడానికి నావంతుగా క్షేత్రస్థాయిలో పనిచేయాలనుకుంటున్నాను’ అంటుంది. ఇవి చదవండి: International Womens Day 2024: 'మనల్ని మనం' గౌరవించుకుందాం! -
International Womens Day 2024: 'మనల్ని మనం' గౌరవించుకుందాం!
‘మహిళలను గౌరవిద్దాం’ అనే మాట తరచూ వింటుంటాం. మహిళ గురించి మాట్లాడే ఉన్నతమైన పదాలు మహిళా దినోత్సవం వరకే పరిమితం అవడం కూడా చూస్తుంటాం. ‘సమాజంలో వస్తున్న మార్పులను ఆహ్వానించే క్రమంలో స్త్రీ గౌరవానికి, రక్షణకు వెన్నుదన్నుగా నిలిచేది కూడా మొదట మహిళే అయి ఉండాలి’ అంటూ వివిధ రంగాలలోని మహిళలు తమ మాటల ద్వారా ఇలా వినిపిస్తున్నారు. మహిళా దినోత్సవ స్ఫూర్తితో ఆ మాటలను ఆచరణలోనూ పెట్టి మంచి ఫలితాలను చూద్దాం. ప్రయత్నించడం మానకూడదు.. మగవారితో పోల్చితే ఇంట్లో, ఆఫీసులోనూ స్త్రీల పాత్ర ఎక్కువే. రెండుచోట్లా నిబద్ధతతో పని చేస్తుంటారు. కానీ, రెండు చోట్లా అర్థం చేసుకునేవారుండరు. విసుగు అనిపిస్తుంటుంది. అలాగని, మన ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ముప్పై ఏళ్ల క్రితం నేను పీజీ విద్యార్థిగా ఉన్నప్పుడు క్లాసులో అమ్మాయిలు ఐదు శాతం కన్నా తక్కువే ఉండేవారు. ఇప్పుడు.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్‌లో 60 నుంచి 70 శాతం మంది అమ్మాయిలు ఉంటున్నారు. బాయ్స్ హాస్టల్స్‌లో కొన్నింటిని గర్ల్స్ హాస్టల్‌గా మార్చేద్దామని కూడా చూస్తున్నాం. పీహెచ్‌డి చేసే అమ్మాయిల సంఖ్యా పెరిగింది. పోరాడి సీట్లు, పదవులు దక్కించుకుంటున్నాం. అయితే, ఎంత పెద్ద చదువులు చదివినా, ఏ హోదాలో ఉన్న ముందు ఎవరిని వారు గౌరవించుకోవాలి. చదువులో, హోదాలో సమానత్వం కోసం పాటుపడాలనే కాదు మన ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా ఆత్మస్థైర్యంతో ఎదగాలనుకోవాలి. కుటుంబంలో ఏ కష్టం వచ్చినా ఆ కుటుంబాన్ని కాపాడుకోగలమనే ధైర్యం ఉండాలి. రక్షించడానికి ఎవరో ఒక మగవాడైనా ఉండాలి అనే ఆలోచనను దూరం పెట్టాలి. అప్పుడే మన శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. అందుకు తగిన సత్తాను సంపాదించుకోవడం మన లక్ష్యం అవ్వాలి. ఆత్మరక్షణ, కుటుంబ రక్షణ సమాజంలో మనల్ని ఉన్నతంగా చూపుతుంది. –ప్రొఫెసర్ సి.వి. రంజని, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్, ఓయూ వ్యక్తిత్వాన్ని పోస్ట్‌మార్టం చేస్తున్నారు.. స్లోగన్స్ చెబుతున్నారు. కానీ, పాటించడం లేదు. మగవారితో సమానంగా కష్టపడుతున్నారు. కానీ, మగవారు స్త్రీని శారీరకంగా బలహీనులుగానే చూస్తారు. ఆమె శక్తి తెలిస్తే మగవారిలో ఆ ఆలోచనే రాదు. ఎక్కడైనా లైంగిక వేధింపులకు గురైన మహిళ ఎవరైనా ఉంటే ఆ సంఘటనను, సదరు వ్యక్తులను కాకుండా ముందు ఆమె వ్యక్తిత్వాన్ని పోస్ట్‌మార్టం చేస్తుంటారు. ఇంటి దగ్గర నుంచి పని ప్రదేశంలోకి ఒక మహిళ రావాలంటే ఎన్నో అడ్డంకులను దాటాల్సి ఉంటుంది. అక్కడా వేధింపులు తప్పవు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చిన అమ్మాయిలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెళ్లి చేసుకున్న అబ్బాయి వదిలేసి వెళ్లిపోతే, పుట్టింటి సహకారం అందక ఆ అమ్మాయి బతుకుదెరువులో చాలా వేధింపులను ఎదుర్కొంటున్నది. ఆమె జీవనం గురించి తప్పుగా మాట్లాడే మగవాళ్లు ఉన్నారు. సమస్యను ఎదుర్కోవడంలో గొడవ తప్పక జరుగుతుంది. కానీ, సింగిల్ ఉమెన్ గొడవ పడితే ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తుంటారు. తల్లి తన కూతురుకి ఒంటరిగా ఎలా జీవించాలో చెబుతూనే సమాజాన్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. సోషల్ మీడియాలో ‘ఆమె’గౌరవానికి సంబంధించిన దారుణమైన వీడియోలు చూస్తున్నాం. ఏదైనా అమ్మాయికి సంబంధించిన సంఘటన జరిగినప్పుడు ‘అమ్మాయి ఎలాంటిది?’ అని ఆమెను నెగిటివ్ంగాప్రొజెక్ట్ చేస్తున్నారు. స్వలాభం కోసం చేసే ఇలాంటి ఎన్నో పనులు ‘ఆమె’ గౌరవాన్ని తీసేస్తూ బతికేస్తున్నారు. – డాక్టర్ జయశ్రీ కిరణ్, కాకతీయ ఫౌండేషన్, హైదరాబాద్ మన మీద మనకు నమ్మకం! మగవారితో పోల్చుకుంటే టైమ్ మేనేజ్ చేయగల శక్తి స్వతహాగా స్త్రీకి ఉంటుంది. ఒక గోల్ రీచ్ అవ్వాలని కష్టపడితే అది ఎంత దూరంలో ఉన్నా మనకు దగ్గర కావల్సిందే. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆరోగ్యం బాగా లేదనో, సరైన చదువు లేదనో, కుటుంబ బాధ్యతలు ఉన్నాయనో.. ఇలా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఎంత కష్టమైన పరిస్థితులు ఎదురైనా మన కలలను మనమే డిజైన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి కూడా మనల్ని మనం బాగు చేసుకోవచ్చు. నాకు స్కూల్ వయసులో పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు. అయినా యోగా ట్రైనర్‌గా, బ్యుటీషియన్‌గా మేకప్ అకాడమీ నడుపుతున్నాను. పిల్లలిద్దరూ సెటిల్ అయ్యారు. ఇంటిని చక్కదిద్దుకుంటూనే నా పనులు చేసుకుంటూ వచ్చాను. సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. నా కెందుకు ఈ సమస్య వచ్చింది అని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ పరిష్కారం అవ్వదు. సానుభూతి తప్ప బయటి నుంచి గౌరవం కూడా లభించదు. మనమీద మనకున్న నమ్మకమే మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. – రూప, యోగా టీచర్ అండ్ బ్యూటీషియన్ భయం బిడియంతో శక్తి తగ్గుతుంది.. స్త్రీలను గౌరవించండి అనే మాట చాలా చోట్ల వింటూనే ఉంటాం. ఆ మాట వినటమే మన దౌర్భాగ్యం. ఎందుకంటే స్త్రీని గౌరవించాలి అని చెబితే గాని తెలియని సమాజంలో మనం జీవనం సాగిస్తున్నాం. ఉమ్మడి కుటుంబాలలో ఉన్నప్పుడు స్త్రీకి మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదు. ఇంటి పనుల్లో వంట పనుల్లో మునిగిపోయే వాళ్ళు. ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. మారుతున్న టెక్నాలజీతో పాటు మనలో కూడా మార్పు రావాలి. భయం, బిడియం అనే భావాలతో స్త్రీ తన శక్తిని గుర్తించటం లేదు. ఒక తల్లి యవ్వనంలో ఉన్న తన కూతురుతోనో కొడుకుతోనో తన చిన్నప్పటి కబుర్లు, నెరవేరని కలలు, రక్తసంబంధాలు, స్నేహితుల గురించి, జీవితంలో అనుభవించిన కష్టాలు వాటిని ఎదుర్కొనే నేర్పరితనం... చర్చించడం లేదనిపిస్తోంది. నాటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు అనుకుంటారు. కానీ, ఏ కాలమైనా స్త్రీ ఎప్పుడూ మెలకువతో తనను తాను కాపాడుకోవాలనే స్పృహతో ఉండాలి. పాలకులు కూడా స్త్రీని అన్ని రంగాల్లో పైకి తెస్తున్నాం అని చెబుతుంటారు. కానీ, అమ్మాయిలపై అఘాయిత్యాలను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. స్వతంత్ర దేశం కోసం ఎందరో స్త్రీలు తమ ్రపాణాలర్పించారు. వారి ్రపాణత్యాగాన్ని స్మరణ చేసుకున్నా మహిళగా ఈ సమాజంలో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. మనలో మనకు ఐకమత్యం ఉండాలి. ఏ కారణం వల్ల ఒంటరిగా ఉంటున్న స్త్రీని సాటి స్త్రీ అర్థం చేసుకొని, ఆమెకు మద్దతునివ్వగలిగితే చాలు ధైర్యం పెరుగుతుంది. స్త్రీలు ఒకరికి ఒకరుగా నిలవాలి. పనిమనిషి పనిని కూడా గౌరవించడం కుటుంబంలో వారికే అర్ధమయ్యేలా తెలపాలి. పారిశుద్ధ్య కార్మికురాలి, పనిమనిషి, రోజువారీ పనుల్లో తారసపడే ప్రతి స్త్రీని గౌరవించాలని పిల్లలకు చె΄్పాలి. రేపటి తరంలో వచ్చే మార్పు కూడా సమాజానికి మేలు కలుగజేస్తుంది. – వి. ప్రతిభ, బిజినెస్ ఉమెన్ ఇవి చదవండి: International Womens Day 2024: ప్రతి రంగంలో ప్రతిభ -
Inspiration is freedom: స్ఫూర్తిదాయకం స్వాతంత్య్రం
ఏ దేశానికైనా ప్రధానంగా ఉండాల్సింది స్వాతంత్య్రం. ప్రపంచంలో పలుదేశాలు ఏదో సందర్భంలో ఇతర దేశాల పాలనకు లోబడి అటుపైన స్వాతంత్య్రాన్ని సాధించు కున్నవే. స్వాతంత్య్రాన్ని సాధించుకున్న దినాన్ని ఉత్సవ దినంగా ప్రతి దేశమూ జరుపుకుంటూ ఉంటుంది. స్వాతంత్య్ర దినోత్సవం ప్రతి దేశానికి స్ఫూర్తిదాయకమే. ‘దేశానికి రూపకల్పన చేసేది ఏది? ఎత్తైన నిర్మాణాలు, భవనాల గోపురాలతో ఉండే గొప్ప నగరాలు కాదు; విశాలమైన ఓడరేవులు కాదు, కాదు; మనుషులు, గొప్ప మనుషులు’ అని ఒక గ్రీక్ చాటువును ఆధారంగా తీసుకుని ఇంగ్లిష్ కవి విలిఅమ్ జోన్స్ చెప్పారు. ఆ మాటల్ని తీసుకుని గురజాడ అప్పారావు ‘దేశమంటే మట్టికాదోయ్ /దేశమంటే మనుషులోయ్’ అని చెప్పారు. ఔను, దేశం అంటే మనుషులే. ‘నువ్వు నీ దేశాన్ని ప్రేమించు’ అని ఇంగ్లిష్ కవి ఆల్ఫెడ్ టెన్నిసన్ అన్నారు. ఆ మాటల్ని తీసుకునే గురజాడ అప్పారావు ‘దేశమును ప్రేమించుమన్నా‘ అని అన్నారు. దేశాన్ని ప్రేమించడం దేశ ప్రజల్ని ప్రేమించడం ఔతుంది; దేశప్రజల్ని ప్రేమించడం దేశాన్ని ప్రేమించడం ఔతుంది. దేశాన్ని ప్రేమించలేనివాళ్లు దేశ పౌరులుగా ఉండేందుకు ఎంతమాత్రమూ అర్హులు అవరు; వాళ్లు దేశానికి హానికరం ఔతారు. ‘నితాంత స్వాతంత్య్రమ్ము వెల్లి విరియు స్వర్గాన/నా మాతృదేశమును మేలుకొన నిమ్ము ప్రభూ’ ఈ మాటల్లో పలికిన రవీంద్రనాథ్ ఠాగూర్ భావం మాతృదేశం, దేశ స్వాతంత్య్రం ఆవశ్యకత నూ, ప్రాముఖ్యతనూ ఘోషిస్తూ ఉంది. విదేశీ ఆక్రమణ దారుల క్రూరమైన, భయానకమైన పాలనలో పెనుబాధను అనుభవించి, లెక్కలేనంత సంపదను కోల్పోయి, ఎన్నిటినో వదులుకున్న మనదేశం వందల సంవత్సరాల పరపీడన నుండి విముక్తమై 75 యేళ్లుగా స్వాతంత్య్రాన్ని శ్వాసిస్తోంది. మనం ఇవాళ స్వతంత్ర దేశంలో ఉన్నాం; మన దేశంలో మనం మనదేశ పౌరులుగా ఉన్నాం. ఈ దేశం మనది; ఈ మనదేశం మన సంతతికి పదిలంగా అందాలి. ఈ చింతన మనల్ని నడిపించే ఆశయమై మనలో, మనతో సర్వదా, సర్వథా ఉండాలి. ‘నువ్వు, నీ దేశం నీకు ఏం చేస్తుంది అని అడిగే రాజకీయవాదివా? లేకపోతే నువ్వు, నీ దేశానికి ఏం చెయ్యగలను అని ఆడిగే పట్టుదల ఉన్నవాడివా? మొదటి ప్రశ్న అడిగేవాడివి ఐతే నువ్వు పరాన్నజీవివైన పురుగువి, రెండవ ప్రశ్న అడిగేవాడివి ఐతే నువ్వు ఎడారిలో ఉద్యానవనంవి’ అని ఖలీల్ జిబ్రాన్ మాటలు మన మెదళ్లను కదిలించాలి; మనదేశానికి మనం ఉద్యానవనాలం అవ్వాలి. ‘జంబూద్వీపే వైవస్వత మన్వంతరే భరతఖండే... ‘ఇలా ఆలయాల్లో సంకల్పం చెప్పడం మనకు తెలిసిందే. ఈ సంకల్పం చెప్పడం కాశ్మీర్ నుండీ కన్యాకుమారి వరకూ ఉండే ఆలయాల్లో ఉంది. ఇప్పటి పాకిస్తాన్ ప్రాంతంలోనూ, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలోనూ ఉండే ఆలయాల్లోనూ ఉండేది. దీని ద్వారా భరతఖండం సాంస్కృతికంగా ఒకటే అన్న సత్యం విశదం ఔతోంది. 2,000 ఏళ్లకు పూర్వందైన తమిళ్ సాహిత్యం పుఱనానూఱులో ఉత్తరాన హిమాలయాల నుండీ దక్షిణాన కన్యాకుమారి వరకు ఉన్న దేశం ఇది అని చెప్పబడింది. దీని ద్వారా ఎప్పటి నుండో భారతం భౌగోళికంగా ఒకటే అన్న సత్యం అవగతం ఔతోంది. 2,300 యేళ్ల క్రితంనాటి గ్రీక్ చరిత్రకారుడు మెగస్తనీస్ హిమాలయం నుండీ దక్షిణాన కడలి వరకు ‘ఇండికా’ అని గుర్తించాడు. అవగాహనారాహిత్యంతో కొందరు మనదేశం అసలు ఒక దేశమే కాదని, మరొకటని మనలో దేశవ్యతిరేక భావ అనలాన్ని రగిలిస్తూ ఉంటారు. ఆ అనలాన్ని చదువుతోనూ, విజ్ఞతతోనూ మనం ఆర్పేసుకోవాలి. ‘నా తల్లీ, తండ్రీ సంతోషంగా ఉన్నది ఈ దేశంలోనే’ అనీ, ‘తియ్యనైన ఊపిరినిచ్చి కని, పెంచి అనుగ్రహించింది ఈ దేశమే’ అని అన్నారు తమిళ్ మహాకవి సుబ్రమణియ బారతి. ఆయన జాతీయతా సమైక్యతను కాంక్షిస్తూ ‘కాశి నగర పండితుల ప్రసంగాన్ని కంచిలో వినడానికి ఒక పరికరాన్ని చేద్దాం’ అనీ అన్నారు. జాతీయతా సమైక్యత ఆపై సమగ్రత దేశానికి ముమ్మాటికీ ముఖ్యం. ‘వందేమాతరం జయ వందేమాతరం; ఆర్యభూమిలో నారీమణులూ, నరసూర్యులూ చేసే వీరనినాదం వందేమాతరం’ అనీ, ‘వందేమాతరం అందాం; మా దేశమాతను పూజిస్తాం అందాం’ అనీ నినదించారు సుబ్రమణియ బారతి. మనదేశాన్ని ప్రేమిస్తూ ఉందాం, మనదేశాన్ని పూజిస్తూ ఉందాం, మనం దేశభక్తులుగా మసలుతూ ఉందాం. దేశభక్తితో, భారతీయతతో బతుకుతూ ఉందాం. భారతీయులమై మనసారా, నోరారా అందాం, అంటూ ఉందాం ‘వందేమాతరం’. ‘దేశవాసులు అందరికీ జాతీయతా భావం ఉండాలి. జాతీయతా భావం లేకపోవడం క్షంతవ్యం కాదు. జాతీయతా వ్యతిరేకత, దేశ వ్యతిరేకత అనేవి భయంకరమైన మానసికవ్యాధులు. అవి ఉండకూడదు. జాతీయత–దేశ విద్వేషవాదం నుండి మనల్ని, మనదేశాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి’ ‘భారత(ప్ర)దేశం... ‘భా’ అంటే ‘కాంతి’ లేదా ‘ప్రకాశం’ అనీ, ‘రత’ అంటే అంకితమైన, అసక్తి కల అనీ అర్థాలు. భగవంతుడు కాంతిరూపుడు. ‘భారతం’ అంటే ‘భగవంతుడికి అంకితమైంది’ లేదా ‘భగవంతుడిపై ఆసక్తి కలది’ అని అర్థం. ఈ అర్థాన్ని మనం ఆకళింపు చేసుకుందాం‘ – రోచిష్మాన్ -
Leander Paes: ఎదురుగా అంతా చీకటి, కళ్లు బైర్లుకమ్మాయి.. బతకడం కష్టమన్నారు.. అయినా
Leander Paes Inspirational Journey: 1996 ఆగస్టు 3.. భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయమైన రోజు.. ఒలింపిక్స్‌లో పతకం గురించి ఎదురు చూసి చూసి ఇక మనకు రాదులే అనుకొని నిట్టూర్చిన ఒక తరం క్రీడాభిమానులకు సుదినం.. ఒలింపిక్స్ వేదికపై జాతీయ జెండా ఎగురవేసేందుకు నేనున్నానంటూ ఒక్కడు దూసుకొచ్చాడు.. 16 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్‌ను చేర్చాడు. వ్యక్తిగత విభాగంలోనైతే 44 ఏళ్ల తర్వాత భారత ఆటగాడి పేరు వినిపించింది. మెగా వేదికపై విజయంతో తానేంటో చూపించిన అతని పేరు లియాండర్ పేస్! ఈ విజయంతో ఆగిపోకుండా ఆ తర్వాతా.. ఏళ్ల పాటు భారత టెన్నిస్‌కు పర్యాయపదంలా నిలిచిన స్టార్... వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో కనీసం ఒక్క పతకం కూడా సాధించలేని మన దేశం.. అసలు ఒలింపిక్స్ అంటే మనవి కావు, మనకు ఎలాగూ పతకాలు గెలిచే అవకాశమే లేదు.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు అనుకుంటున్న సమయం.. ఎప్పుడో 1980లో హాకీలో పతకం వచ్చింది. ఆ తర్వాత 1984, 1988, 1992.. క్యాలెండర్ మారింది కానీ కనీసం కంచు మోత కూడా వినిపించలేదు. భారత్‌కు మిగిలింది రిక్త హస్తమే.. సరిగ్గా చెప్పాలంటే ఒక తరం మొత్తం ఒలింపిక్స్ పతకం గురించి ఆలోచించడమే మానేసింది. ఇలాంటి సమయంలో వచ్చిన ఒలింపిక్స్ పతకం భారత క్రీడలకు కొత్త ఊపిరి పోసింది. అప్పటినుంచి ప్రతి ఒలింపిక్స్‌లో భారత్ వరుసగా ఏదో ఒక పతకం గెలుస్తూనే వచ్చింది. టీనేజర్ నుంచి వెటరన్ వరకు.. 1990లో టీనేజర్‌గా పేస్.. డేవిస్ కప్ డబుల్స్ మ్యాచ్‌లో సీనియర్ సహచరుడు జీషాన్ అలీతో కలసి ఐదు సెట్ల సుదీర్ఘ పోరులో జపాన్‌పై భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నాటి అతని పోరాటపటిమ ఒక్కసారిగా టెన్నిస్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత 47 ఏళ్ల వయసు వచ్చే వరకు అదే ఉత్సాహం, అదే జోరు.. పాయింట్, గేమ్, సెట్, మ్యాచ్.. దినచర్యలో భాగంగా మారిపోయిన ఈ అంకెల కోసం కోర్టు నలుమూలలా పరుగెత్తుతూనే ఉన్నాడు. అలుపు లేని ఆటసారి 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్.. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం... 55 కెరీర్ టైటిల్స్.. ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘వయసు’ దాటిన తర్వాత తన పేర వరుసగా లిఖించుకున్న రికార్డులు మరో ఎత్తు. ఫిట్నెస్ సమస్యలు అసలే లేవు, కాలు నొప్పితోనో, వేలు నొప్పితోనో ఆటకు దూరమైన రోజుల్లేవు.. ఇదెలా సాధ్యం ఈ మనిషికి? మూడు పదులు దాటగానే కెరీర్ చరమాంకంలోకి వచ్చిందని చాలా మంది భావించే ఆటలో 47 ఏళ్ల వయసు వచ్చినా గ్రాండ్‌గా ఆడి చూపించిన అద్భుతం పేరే లియాండర్ పేస్. అతను తొలి డేవిస్ కప్ మ్యాచ్ ఆడిన రోజు నుంచి ఆఖరి ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడే వరకు చూస్తే టెన్నిస్‌లో తరం మారిపోయింది. అతను వచ్చే సమయానికి ఎడ్బర్గ్, బెకర్, లెండిల్ లాంటి వాళ్లు ఆటకు గుడ్‌బై చెప్పే దశలో ఉన్నారు. ఆ తర్వాత సంప్రాస్, అగస్సీలతో సమాంతరంగా పేస్ కెరీర్ సాగింది. ఆపై ఫెడరర్, నాడల్, జొకోవిచ్‌ల కాలంలోనూ పేస్ రాకెట్ మాట్లాడింది. కెరీర్లో ఎక్కువ భాగం డబుల్స్‌లోనే అయినా మ్యాచ్ ఫిట్నెస్ పరంగా చూస్తే అదేమీ తక్కువ శ్రమతో కూడింది కాదు. టీమ్ గేమ్ అయిన క్రికెట్లో 24 ఏళ్లు ఆడిన సచిన్‌ను (ఆ)హాశ్చర్యంతో చూశారు భారత క్రీడాభిమానులు. కానీ టెన్నిస్‌లాంటి వ్యక్తిగత క్రీడలో 30 ఏళ్లు సత్తా చాటడం పేస్‌లాంటి దిగ్గజానికే సాధ్యమైంది. అట్లాంటాతో అంబరాన... 1990లో పేస్.. జూనియర్ వింబుల్డన్, 1991లో యూఎస్ ఓపెన్ గెలిచి వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచినప్పుడు కూడా అతను ఇంత కాలం సాగిపోగలడని ఎవరూ ఊహించలేదు. జూనియర్ స్థాయిలో సంచలనాలు చేసి అంతటితో సరిపెట్టే ఆటగాళ్ల జాబితాలోకి అతడిని చేర్చారు. 1992 ఒలింపిక్స్‌లో అతని వైఫల్యంతో అందరికీ అదే అనిపించింది. కానీ నాలుగేళ్ల తర్వాత పేస్ భారత జెండాను విశ్వవేదికపై రెపరెపలాడించాడు. నాడు 126వ ర్యాంక్‌లో ఉండి ఏ మాత్రం ఆశలు లేని స్థితిలో 44 ఏళ్ల తర్వాత భారత్‌కు వ్యక్తిగత ఒలింపిక్స్ పతకం అందించాడు. ఆ గెలుపుతో హీరోగా మారిన పేస్.. ఆ తర్వాత తనపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే వచ్చాడు. తన ఘనతలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. ఒలింపిక్స్ పతకం మొదలు అనేక సంచలన విజయాలు పేస్ వెంట నడుస్తూ వచ్చాయి. ఈ పెద్ద జాబితాలో ఒకసారి సింగిల్స్‌లో పీట్ సంప్రాస్‌ను ఓడించిన చిరస్మరణీయ మ్యాచ్ కూడా ఉంది. డేవిస్ కప్ సూపర్ స్టార్ పేస్‌కు సంబంధించి ప్రతి భారతీయుడు మెచ్చే, అతని నుంచి ఆశించే విషయం డేవిస్ కప్ పోటీల్లో అతని అద్భుత ప్రదర్శన. ప్రత్యర్థి ఎదురుగా నిలబడగానే ‘వాలి’ బలం రెట్టింపు అయిపోయినట్లు.. భారత జట్టు తరఫున ఆడే సమయంలో పేస్ ఆటతీరు కూడా అద్భుతంగా మారిపోతుంది. ఏటీపీ టోర్నీల సంగతి ఎలా ఉన్నా.. దేశానికి ప్రాతినిధ్యం వహించే సమయంలో అతని రాకెట్ మరింత పదునెక్కుతుంది. ఇన్నేళ్లలో అది ఎన్నోసార్లు నిరూపితమైంది. ఒలింపిక్స్ పతకం తర్వాత లియాండర్ ఆడిన అన్ని డేవిస్‌కప్ మ్యాచ్‌లలో ఇది పదే పదే కనిపించింది. తనలో కూడా కొత్త శక్తి వచ్చేస్తుందని అతను కూడా దీని గురించి చెప్పుకున్నాడు. ప్రత్యర్థి ఎంతటి ఆటగాడైనా సరే.. తన వీరోచిత ప్రదర్శనతో పేస్.. డేవిస్ కప్‌లో భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. హెన్రీ లెకాంటే, ఇవాన్సెవిక్, టిమ్ హెన్మన్, వేన్ ఫెరీరా తదిరులతో పాటు ఆ సమయంలో టాప్ ర్యాంక్‌ల్లో ఉన్న పలువురు ఆటగాళ్లపై వచ్చిన స్ఫూర్తిదాయక విజయాలు ఈ జాబితాలోనివే. 1993లో డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్‌లో భారత్ సెమీస్‌కు చేరడంలో పేస్‌దే కీలక పాత్ర. మృత్యువుతో పోరాడి.. 2003లో వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్ ఆడుతున్న సమయంలో కోర్టు అటు వైపు నుంచి బంతి పేస్ వైపు వచ్చింది. సునాయాసంగా రిటర్న్ చేయాల్సిన అతను, ఏమీ చేయకుండా అలా బంతిని చూస్తుండిపోయాడు. ఎదురుగా అంతా చీకటి, కళ్లు బైర్లుకమ్మాయి. శరీరంపై నియంత్రణ కోల్పోయి.. నిలబడేందుకు భాగస్వామి మార్టినా నవ్రతిలోవాను ఆసరాగా చేసుకున్నాడు. అది బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చని, ఎంతో కాలం బతకడం కూడా కష్టమని ప్రాథమికంగా కొందరు డాక్టర్లు తేల్చారు. అమెరికాలోని ఒర్లాండోలో అండర్సన్ క్యాన్సర్ సెంటర్లో చికిత్స తర్వాత ప్రమాదం లేదని తెలిసింది. చివరకు న్యూరోసిస్టోసర్కోసిస్ అనే నరాల సమస్యగా తేలింది. ఇలాంటి స్థితిలో ఆడలేనంటూ పేస్‌కు మద్దతుగా యూఎస్ ఓపెన్ నుంచి తప్పుకునేందుకు కూడా మార్టినా సిద్ధమైంది. దాన్నుంచి కోలుకున్న తర్వాత పేస్ మళ్లీ ప్రాక్టీస్‌కు దిగి తన విజయాలకు శ్రీకారం చుట్టాడు. ప్రస్థానం సాగిస్తూ... పేస్ ఆటతీరు భీకరమైన సర్వీస్‌లు, బెంబేలెత్తించే ఏస్‌లతో సాగదు. ఇన్నేళ్ల కెరీర్లో కూడా అతను వాలీలు, డ్రాప్ షాట్లనే నమ్ముకున్నాడు. ముఖ్యంగా నెట్ వద్ద పేస్ ఆట తన పార్ట్నర్ ఎవరైనా వారికి కొండంత అండ. టెన్నిస్.. కుర్రాళ్ల ఆటగా మారిపోయిన కొత్త తరంలో కూడా పేస్ నెట్ వద్ద అత్యంత బలమైన ఆటగాడు అంటూ మాజీ సహచరుడు మహేశ్ భూపతి ప్రశంసించడం అతని ఆటలో పదునును చూపించింది. రాడ్‌లేవర్ తర్వాత మూడు వేర్వేరు దశాబ్దాల్లో వింబుల్డన్ నెగ్గిన ఏకైక ఆటగాడైన పేస్.. వేర్వేరు భాగస్వాములతో కలసి 100కు పైగా మ్యాచుల్లో డబుల్స్ బరిలోకి దిగాడు. ఆటను పిచ్చిగా ప్రేమించిన పేస్ ఏ స్థాయిలోనైనా చివరి వరకు ఆడుతూనే వచ్చాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత్‌లో తొలిసారి అతను చాలెంజర్ టోర్నీ ఆడటానికి కూడా అదే కారణం. (క్లిక్ చేయండి: మేరీ కోమ్.. బాక్సింగ్ రింగ్‌ను శాశించిన ఉక్కు మహిళ) - మొహమ్మద్ అబ్దుల్ హాది -
Himaja Apparascheruvu: మల్టిపుల్ వర్క్స్‌తో సక్సెస్.. ఇంగ్లీషు ఎంత ముఖ్యమో..
కెరీర్లో విజయం సాధించిన మహిళలు కుటుంబంపై దృష్టి పెట్టలేరని చాలామంది అనుకుంటారు. అలాగే, మహిళలు కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకున్నా, తమ కోసం తాము టైమ్‌ను కేటాయించుకోరు అనీ అంటుంటారు. అయితే ఈ ఊహలన్నీ తప్పని హిమజ అప్పరాశ్చెరువు రుజువు చేస్తోంది. మన శక్తి ఏంటో మనకే తెలుసు అని తన పనుల ద్వారా చూపుతోంది. అనంతపురం వాసి అయిన హిమజ అప్పరాశ్చెరువు బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా, మారథా రన్నర్‌గా సత్తా చాటుతోంది. ఇద్దరు పిల్లలకు తల్లిగా కుటుంబ బాధ్యతలతోనూ మల్టిపుల్ వర్క్స్‌తో రాణిస్తోంది. చిన్న పట్టణంలో పెరిగిన హిమజ పెద్ద కలలు కనడమే కాకుండా వాటిని సాకారం చేసుకుంటోంది. తన కెరీర్‌తో పాటు ఇద్దరు పిల్లల బాధ్యతనూ నిర్వహిస్తోంది. దీనితోపాటు, తన స్వంత అభిరుచినీ నెరవేర్చుకుంటోంది. సున్నా నుంచి మొదలు ‘నా జీవన ప్రయాణం సున్నాతో మొదలుపెట్టి ఈ రోజు చేరుకున్న చోటికి రావడం అంత తేలిక కాలేదు. ఐఐటీ రూర్కీలో ఇంజనీరింగ్ చేశాను. కాలేజీలో చేరేసరికి నాకు ఇంగ్లీషు సరిగా రాదు, హిందీలోనూ సరిగా మాట్లాడలేను. కానీ సంకల్పంతో, నేను ప్రతి సవాల్‌ను అధిగమిస్తూ, జీవితంలో చాలా నేర్చుకుంటూ విజయం వైపు పయనిస్తూనే ఉన్నాను. రానిదంటూ లేదని.. ఇంజినీరింగ్ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబిఏ పూర్తి చేశాను. ఆస్ట్రేలియన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి బిఎఎమ్ పట్టా అందుకున్నాను. 2017లో అమెజాన్ కంపెనీలో సప్లై చైన్ ఎగ్జిక్యూషన్ టీమ్ పోస్ట్‌పై సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరాను. నేటి కాలంలో విద్యార్థులైనా, పనిచేసే వృత్తి నిపుణులైనా వారికి ఇంగ్లీషు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో నాకు కూడా అర్థమైంది. ఈ అవసరాన్ని స్వయంగా గ్రహించి, నేను అమెజాన్ అలెక్సాలో ఇంటరాక్టివ్ సెషన్స్ చేర్చాను. ఈ నైపుణ్యంతో ఏ వయసు వారైనా ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోవచ్చు. కుటుంబంపై పూర్తి శ్రద్ధ నా కెరీర్‌తో పాటు కుటుంబంపై పూర్తి శ్రద్ధ పెట్టాను. నా కెరీర్లో ముందుకు వెళుతున్న సమయంలోనే రెండుసార్లు తల్లిని అయ్యాను. ఈ సమయంలో కొత్తగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ నా భర్త ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచాడు. కెరీర్ మాత్రమే ముఖ్యం కాదు, నా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడమూ ముఖ్యమే. అందుకే, హోమ్‌వర్క్ చేయించడం, వారితో ఆడుకోవడం, వారిని పరీక్షలకు సిద్ధం చేయడం, వారితో సరదాగా గడపడం వంటి ప్రతి అవసరాన్ని తీరుస్తాను. సమతుల్యత అవసరం.. నా దినచర్యలో అడుగడుగునా నా భర్త సపోర్ట్ ఉంది. తన తల్లిదండ్రుల పూర్తి బాధ్యతనూ తీసుకుంటాడు. మేము మా పిల్లలను వ్యక్తిగతంగా చూసుకోవడం, వారితో సమయం గడపడం మంచిదని నమ్ముతాము. బయటి పని, ఇంటి పని ఈ రెండింటి మధ్య సమానమైన సమతుల్యతను పాటిస్తాను. నా పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపడం, కొత్త పనులు చేయడం నాకు ఇష్టం. మల్టిపుల్ టాస్కింగ్ మనల్ని మరింత ఉత్సాహవంతులను చేస్తుంది. ఇందులో భాగంగానే రెండేళ్ల క్రితం జుంబా ఇన్‌స్ట్రక్టర్‌గా మారాను. ఆన్లైన్–ఆఫ్‌లైన్ క్లాసులతోనూ సేవలు అందిస్తుంటాను. మారథాన్ రన్నర్‌గానూ, నా ఇతర అభిరుచుల వైపుగా సాగుతుంటాను’ అని వివరిస్తారు ఈ మల్టీ టాలెంటెడ్ ఉమన్. (క్లిక్ చేయండి: రేణు ది గ్రేట్.. స్త్రీ హక్కుల గొంతుక) -
Ch Nageshu Patro: ఈయనో మూన్‌లైటింగ్ కూలీ
బరంపూర్: మూన్‌లైటింగ్. ఐటీ రంగంలో ఈ మధ్య బాగా పాపులరైన పదం. రెండు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ రెండు చేతులా సంపాదించడాన్ని మూన్‌లైటింగ్ అంటారు. ఒడిశాకి చెందిన ఒక లెక్చరర్ కూడా మూన్‌లైటింగ్ చేస్తున్నారు. కానీ ఈయనది మనసుని కదిలించే కథ. పొద్దున్న పూట కాలేజీలో విద్యార్థులకు పాఠాలు. రాత్రయ్యే సరికి ఎర్రచొక్కా వేసుకొని రైల్వే స్టేషన్లలో కూలీ అవతారం. డబ్బు సంపాదించడం కోసం కాకుండా, తాను ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లో పని చేసే వారికి జీతాలు ఇవ్వడం కోసం కూలీ పని చేస్తున్నారు. ఒడిశాలో గంజామ్ జిల్లాకు చెందిన 31 ఏళ్ల సీహెచ్.నగేశు పాత్రో బరంపూర్ రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేసేవారు. కరోనా సమయంలో రైళ్లు నిలిచిపోవడంతో ఆయనకు పని లేకుండా పోయింది. ఎంఏ వరకు చదువుకున్న పాత్రో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక నిరుపేద విద్యార్థుల కోసం ఒక కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పదో క్లాసు పిల్లలకి పాఠాలు చెప్పసాగారు. కోచింగ్ సెంటర్‌కి ఆదరణ పెరగడంతో 10 నుంచి 12 వేల జీతానికి కొందరు టీచర్లను నియమించారు. వారికి జీత భత్యాలు ఇవ్వడానికి రాత్రయ్యే సరికి మళ్లీ కూలీ పని చేస్తున్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడు పాత్రో సూరత్‌లోని ఒక మిల్లులో, హైదరాబాద్‌లోని ఒక మాల్లో పని చేసి తాను సంపాదించిన డబ్బులతోనే చదువుకున్నారు. -
ఏడు నెలల అజ్ఞాతం.. ఫ్యామిలీకి పెద్ద సర్ప్రైజ్
మనిషి తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదంటారు పెద్దలు. కానీ, గొప్ప విజయాలు ఆగిపోయేది ప్రయత్న లోపం వల్లే!. అది గ్రహించిన ఓ వ్యక్తి.. కష్టంతో తాను అనుకున్నది సాధించాడు. అదీ ఏడు నెలల కఠోర సాధన.. ఇంటికి, స్నేహితులకు దూరంగా అజ్ఞాతవాసంలో ఉంటూ! ఐర్లాండ్ కోర్క్కు చెందిన బ్రయాన్ ఓ కీఫ్ఫె.. పాతికేళ్ల ఈ యువకుడు అతిబరువు సమస్యతో బాధపడేవాడు. 2021లో అతని బరువు అక్షరాల 154 కేజీలు. బరువు తగ్గేందుకు అతగాడు ఎంతో ప్రయత్నించాడు. ఏదీ వర్కవుట్ కాలేదు. అసలు సమస్య ఏంటో అతనికి అర్థమైంది. అది ఇంటి ఫుడ్.. తాను ఎలా ఉన్నా ఫర్వాలేదనుకుంటూ అభిమానించే అయినవాళ్లు. వెంటనే అందరికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దేశం విడిచాడు. సముద్రాలు దాటాడు.. స్పెయిన్‌కు చేరుకున్నాడు. బరువు బాగా తగ్గిపోవాలి. అతని ముందు ఒకే ఒక్క టార్గెట్. ఆ లక్ష్య సాధనలో కఠోర ప్రయత్నాలకు దిగాడు. ఏడు నెలలపాటు విరామం లేకుండా వ్యాయామాలు చేశాడు. ఆ క్రమంలో ఎన్నో గాయాలు. అయినా ప్రయత్నం ఆపలేదు. వాకింగ్, రన్నింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్.. ఇలా అన్నింటిని ప్రయత్నించాడు. నెమ్మది నెమ్మదిగా వర్కవుట్లకు సమయం పెంచుకుంటూ పోయాడు. ఒకానొక టైంలో భారీ కాయంతోనే ఐదు కిలోమీటర్లను 35 నిమిషాల్లోపు పూర్తి చేశాడు కూడా. మరోవైపు బ్రయాన్ డైట్లోనూ ఎన్నో మార్పుల చేసుకున్నాడు. కేలరీలను తగ్గించుకున్నాడు. రోజుకు ఐదు గంటలపాటు వ్యాయామం చేసే స్టేజ్‌కి చేరాడు. ఏడు నెలల కఠోర ప్రయత్నం తర్వాత అతని బరువు 91 కేజీలకు చేరింది. అంటే.. 63 కేజీల బరవు తగ్గాడన్న మాట. ఆ రూపాన్ని అద్దంలో చూసుకుని మురిసిపోయాడు అతను. ఈ ఏడు నెలల కాలంలో తల్లిదండ్రులకు, స్నేహితులకు దూరంగా ఉన్నాడతను. కేవలం క్షేమసమాచారాలను ఫోన్ ద్వారా తెలియజేశాడే తప్ప.. వాళ్లతో వీడియో కాల్స్ సంభాషణలు, తాను ఎలా కష్టపడుతున్నాడనేది చూపించే ప్రయత్నం చేయలేదు. ఎందుకు వాళ్లను వీడాడో అసలు కారణమే చెప్పలేదట!. ఏడు నెలల తర్వాత బరువు తగ్గిన బ్రయాన్ ఇంటికి చేరాడు. బరువు తగ్గిన అతని రూపం.. ఇంట్లో వాళ్లను షాక్‌కు గురి చేసింది. స్నేహితులను సర్ప్రైజ్ చేసింది. ఆనందం పట్టలేకపోయారంతా. ఇప్పుడు బ్రయాన్.. తగ్గిన బరువును అలాగే కొనసాగించే ప్రయత్నంలో ఉన్నాడు. అంతేకాదు.. తన ప్రయత్నాలను వివరిస్తూ తనలాంటి మరికొందరికి సోషల్ మీడియా ద్వారా సలహాలు ఇస్తున్నాడు. -
గరిటె తిప్పే ఆ అమ్మ.. చీరకట్టులో బరువులెత్తుతూ...
ఆమె వయసు 56 యేళ్లు. పక్కా గృహిణి. ఓ చేత్తో వంట గదిలో గరిటె తిప్పుతుంది. అదే చేత్తో వెయిట్‌లిఫ్టింగ్ ద్వారా జిమ్‌లో చెమటలు చిందిస్తుంటుంది. చీరకట్టులో తేలికగా బరువులెత్తడమే కాదు.. హుషారుగా పుషప్స్ కొడుతుంది. ఆమె చూసి మరికొందరు వయసు పైబడిన వాళ్లు శారీరక ఆరోగ్యం కోసం జిమ్‌లకు క్యూ కడుతున్నారు. ప్రత్యేకించి.. వ్యాయామాలకు, ఫిట్‌నెస్‌కు దూరంగా ఉంటున్న ఈ తరం యువతకు ఆమె ప్రయత్నం ఒక మంచి పాఠం కూడా. అందుకేనేమో ఆమె కథ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. విపరీతమైన మోకాళ్ల నొప్పులతో తల్లడిల్లిపోతున్న తల్లిని చూసి.. ఆ కొడుకు దిగులు చెందాడు. చివరకు ఆమెకు ఉపశనమం కలిగించే చిట్కా తన దగ్గరే ఉందని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి ఆమె జిమ్‌లో చేరింది. బరువులెత్తడంలో శిక్షణ తీసుకుంది. కోడలి సమక్షంలో పోటాపోటీగా వ్యాయామాలు చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రయత్నం ఆమె నొప్పులను పోగొట్టడమే కాదు, ఆరోగ్యంగా.. ఫిట్‌గా ఉండేలా చేసింది కూడా. అందుకే 56 ఏళ్ల ఆ మహిళ స్ఫూర్తిదాయక కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హ్యూమన్స్ ఆఫ్ మద్రాస్, మద్రాస్ బార్బెల్ సంయుక్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. మద్రాస్ బార్బెల్ నిర్వాహకుడి కన్నతల్లే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నకథలో అమ్మ. ఇంటి పనులకే అంకితమయ్యే ఆమె.. నాలుగేళ్ల కిందట కాళ్లు, మోకాళ్ల నొప్పులతో అల్లలాడిపోయింది. ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోయింది. దీంతో తల్లిని వెంటపెట్టుకుని ఫిజియోథెరపీల చుట్టూ తిరిగిన అతనికి.. చివరికి వ్యాయామాలు, వర్కవుట్ల ద్వారానే ఆమెకు ఉపశమనం కలుగుతుందని తెలుసుకున్నాడు. నాలుగేళ్ల కిందట.. 52 ఏళ్ల వయసు నుంచి ఆమె జిమ్‌లో వ్యాయామాలను మొదలుపెట్టింది. పక్కనే కోడలు ఉండి ఆమెను ప్రొత్సహిస్తూ వస్తోంది. అలవోకగా వెయిట్లిఫ్ట్లు ఎత్తుతూ, హుషారుగా ఎక్స్ర్సైజులు గట్రా చేస్తోంది. ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకున్న కాలనీవాళ్లు.. ఆమెను ఆదర్శంగా తీసుకున్నారు. వాకింగ్, ఎక్సర్సైజులు మొదలుపెట్టారు. తాజాగా ఫిఫ్టీ ఫ్లస్ కేటగిరీలో నిర్వహించిన వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లోనూ ఆమె విజయం సాధించినట్లు తెలుస్తోంది!. సాధించాలనే తపన ఉండాలేగానీ ఆటంకాలేవీ అడ్డుకోలేవని ధీమాగా చెప్తోంది ఆ అమ్మ. ఆరోగ్యంగా ఉండాలంటే కష్టపడాలని, అదీ ఇష్టంతోనని సూచిస్తోంది. వయస్సు అనేది కేవలం నెంబర్ మాత్రమే.. స్ఫూర్తినిచ్చే అత్తగారు.. ప్రొత్సహించే కొడుకు.. ఆమె అంకితభావానికి మద్దతుగా నిలిచిన కోడలు.. ఈ కథ ఇప్పుడు ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతోంది. View this post on Instagram A post shared by Humans Of Madras (@humansofmadrasoffl) -
కొడుకు కోసం ఏకంగా 62 కిలోల బరువు తగ్గిన మహిళ... వైరలవుతోన్న ఫోటోలు
తనకి ఏమైపోతుందో అని ఆ కొడుకు పెట్టిన కన్నీళ్లు ఆ తల్లిలో మార్పు తీసుకొచ్చింది. ఆ మార్పు ఎలాంటిదంటే.. గుర్తుపట్టలేనంతంగా ఆమె మారిపోయేలా!సోషల్ మీడియాలో ఓ తల్లి విజయవంతమైన ప్రయత్నం గురించి జోరుగా చర్చ నడుస్తోంది. ఒకప్పుడు 114 కేజీల బరువు ఉన్న ఆమె.. ఏకంగా 62 కేజీలు తగ్గిపోయింది. అంత బరువూ తగ్గడానికి ఒకే ఒక్క కారణం కొడుక్కి తన మీద ఉన్న అమితమైన ప్రేమ.. అది బయటపడేలా చేసిన ఓ చేదు అనుభవం.. అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన సారా లాకెట్ అనే మహిళ 114 కిలో బరువు ఉండేది. ఓరోజు కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్లారు. కొడుకుతోపాటు స్లైడ్‌లోకి వెళ్లగా మలుపు తిరుగుతున్న సమయంలో ఆమె స్లైడ్‌లో ఇరుక్కుపోయింది. తల్లిని చూసిన కొడుకు కంగారు పడిపోయాడు. ఆమెకు ఏమైందోనని కన్నీరు పెట్టుకున్నాడు. చివరికి ఆమె భర్త వచ్చి తనను బయటకు తీశాడు. అయితే కొడుకు ముందు అలా జరగడం సారాకు ఇబ్బందిగా అనిపించింది. స్లైడ్‌లో చిక్కుకోవడానికి తన బరువే కారణమని బాధపడింది. కొడుకు ముందు అవమానం జరిగిందంటూ భావించి.. అతని కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. ఎలగైనా బరువు తగ్గాలని డిసైడ్ అయ్యింది. కేవలం తన డైట్ మార్చి, వర్కౌట్ల ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నించింది. చదవండి: మెన్స్ డే.. ఇది జోక్ కాదు బ్రదర్! ఈ ప్రక్రియలో మహిళకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. తనకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది బరువు తగ్గాలన్న ఆమె ఆశయాన్ని కష్టతరం చేసింది. దీంతో తన లైఫ్‌స్టైల్, డైట్‌ను పూర్తిగా మార్చుకుంది. వైద్యుల సలహా తీసుకొని.. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా జాగ్రత్తలుు తీసుకుంది. వర్కౌట్స్, పోషక విలువులు కలిగిన డైట్ కంటిన్యూ చేసింది. రోజుకి 3వేల క్యాలరీలు బర్న్ చేయడం ప్రారంభించింది. అల్పాహారంగా టమాటా, బచ్చలికూర, గుడ్డులోని తెల్లసొన.. భోజనంలో కొద్దిగా రైస్, ఉడికించిన కూరగాయాలు, ఆకు కూరలను మాత్రమే క్రమం తప్పకుండా తీసుకుంది. ఫలితంగా ఆమె శరీరంలో భారీ మార్పును చూసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 62 కేజీల బరువు తగ్గింది. ప్రస్తుతం 53 కేజీల బరువుతో ఉంది. View this post on Instagram A post shared by Sara Lockett 🧚🏼 VSG • Fitness • Fashion Inspo (@sculptingsara) నిజానికి ఆమె మొదట్లో అంత బరువు ఉండేది కాదట. ప్రెగ్నెన్సీ సమయంలో ఆమెకు జరిగిన సర్జరీల కారణంగా అంత బరువు పెరిగిపోయిందట. మొదటి ప్రెగ్నెన్సీ సమంలో 26 కేజీలు పెరిగిందని, అలా మూడో బిడ్డ వరకు 133 కిలోలకు వచ్చినట్లు చెప్పుకొచ్చింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సరైన ఫుడ్ తీసుకోలేదని, ఎక్కువగా వేయించినవి, పాస్తా, ఫాస్ట్‌ఫుడ్ ఇలా దొరికిన ఆహారాన్ని లాగించేదానినని తెలిపింది. దీంతో బీపీ పెరిగి, డయాబెటిస్ కూడా వచ్చిందని తెలిపింది. అందుకే బరువు పెరిగినట్లు పేర్కొంది. అయితే ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో వెంటనే బరువు తగ్గాలని నిర్ణయం తీసుకున్నారు. చివరకి ఊహించని విధంగా ట్రాన్స్ఫార్మింగ్ చెందారు. బరువుతో ఉన్నవి.. బరువు తగ్గిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఇంత బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదని ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
పదే పదే కింద పడినా.. ఎలా పైకి లేచాడో చూడండి!
మనిషి జీవితం.. ఎగుడు దిగుడుల కలబోత. లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్ చాలా సహజం. తన జీవన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుకుడుకులను మనుషులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. లక్ష్యసాధనలో అవాంతరాలు, ఆటుపోట్లు ఉంటూనే ఉంటాయి. వాటన్నింటిని ఓర్పుతో అధిగమించిన వారికే విజయాలు సొంతమవుతాయని చరిత్ర చెబుతున్న సత్యం. పదేపదే ఓటమి ఎదురైనా లెక్కచేయకుండా ముందుకు సాగేవారు విజయులుగా కీర్తిశిఖరాలు అధిరోహిస్తారు. ఇలాంటి ఓ స్ఫూర్తిదాయక వీడియోను బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా తన ట్విటర్లో పేజీలో షేర్ చేశారు. గెలుపుదారిలో పడుతు లేస్తూ.. ఓ కళాకారుడు జీవిత సత్యాన్ని కళ్లకుకట్టిన తీరు వీక్షకలను ఆకట్టకుంటోంది. ఎన్నిసార్లు కిందకు పడినా గెలుపు శిఖరాన్ని అందుకునే వరకు విశ్రమించరాదన్న ఇతివృత్తంతో దీన్ని ప్రదర్శించారు. ‘గెలుపు కోసం ప్రయాణం అంత తేలికైన విషయం కాదు. కిందకు పడిపోయిన ప్రతిసారి మరింత పట్టుదలతో ప్రయత్నించాలన్న సందేశంతో దీన్ని ప్రదర్శించిన ఈ కళాకారుడికి హాట్సాఫ్’ అని కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు. The Stairs to Success best depicted here. It is not an easy journey - filled with repeated slips and falls, but perserverence to rise each time you fall. Hats of to this Artist who demonstrates this in a seemingly effortless manner. pic.twitter.com/D0PKUMXvYw — Kiran Mazumdar-Shaw (@kiranshaw) October 28, 2022 కాగా, కిరణ్ మజుందార్ షా భర్త జాన్ షా (73) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దీపావళి రోజున తుదిశ్వాస విడిచారు. కాన్సర్‌తో బాధపడుతూ ఆమె తల్లి యామిని మజుందార్ షా కూడా ఈ ఏడాది జూన్‌లో కన్నుమూశారు. తల్లిని కోల్పోయిన బాధ నుంచి కోలుకుంటున్న సమయంలో మరో విషాదం ఎదురవడంతో ఆమె తల్లడిల్లుతున్నారు. జీవితంలో ఆటుపోట్లను సమానంతో ఎదుర్కొవాలని తనకు తానే ధైర్యం చెప్పుకుంటున్నారు కిరణ్ మజుందార్ షా. (క్లిక్ చేయండి: శాంసంగ్‌కు వారసుడొచ్చాడు.. కొత్త సవాళ్లు) -
తొమ్మిది నెలల్లో 40 కేజీల బరువు తగ్గి...
అంతవరకు సన్నగా... నాజుగ్గా ఉన్న అమ్మాయిలలో చాలామంది పెళ్లి అయ్యాక శరీరంలో చోటు చేసుకునే మార్పులతో ఒక్కసారిగా బరువు పెరిగిపోతుంటారు. కొంతమంది వ్యాయామం, క్రమబద్ధమైన ఆహారం ద్వారా బరువుని నియంత్రణలో ఉంచుకుంటే, అవేమీ చేయకుండా ఆకృతి మారిన శరీరాన్ని చూసి నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు మరికొందరు. అధిక బరువుతో నిరాశకు గురైన వారు అంత త్వరగా ఆ నిరాశ నుంచి బయటకు రాలేరు. గుమ్మం దాటి బయటకొస్తే తనని చూసి అందరూ నవ్వుతారు అని భయపడిన తులికా సింగ్.. ఇంట్లో వాళ్ల ప్రోత్సాహంతో నలభై కేజీల బరువు తగ్గి, తనే ఫిట్నెస్కోచ్గా రాణిస్తోంది. వారణాసికి చెందిన తులికాసింగ్ ఇంటర్మీడియట్ వరకు చదువుకుని 2004లో జర్నలిజం చదివేందుకు నోయిడాకు వెళ్లింది. జర్నలిజం కోర్సు పూర్తయ్యాక వెంటనే ఉద్యోగం దొరకలేదు. తిరిగి ఇంటికి వెళ్లలేని పరిస్థితి. పొట్టకూటికోసం కొన్నాళ్లపాటు పరాటాలు విక్రయించింది. తరువాత ఓ ప్రొడక్షన్ హౌస్‌లో పనిదొరకడంతో మూడు వేలరూపాయల జీతానికి చేరింది. ఇలా రెండేళ్లు కష్టపడ్డాక 2007లో ఓ న్యూస్ చానల్లో్ల ఉద్యోగం దొరికింది. చక్కగా పనిచేస్తూ కెరీర్లో నిలదొక్కుకుంది. కొంతకాలానికి దిగ్విజయ్ సింగ్‌ను పెళ్లిచేసుకుంది. జోకులు వినలేక... పెళ్లివరకు అనేక కష్టాలు పడినప్పటికీ ధైర్యంగా ముందుకు సాగిన తులికాకు పెళ్లి తరువాత కొత్తరకం కష్టాలు మొదలయ్యాయి. చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా ఉన్న ఆమె పెళ్లి, పిల్లలతో హార్మోన్లలో ఏర్పడిన అసమతుల్యత కారణంగా ఒక్కసారిగా బరువు పెరిగింది. అంత బరువున్నా, ఎప్పుడూ నీరసంగా ఉండేది. దీనికితోడు చుట్టుపక్కల వాళ్లు ఆమె శరీరం మీద రకరకాల జోకులు వేస్తూ, గేలిచేసేవారు. దీంతో తనకు తెలియకుండానే డిప్రెషన్లోకి వెళ్లింది. ఇంట్లో నాలుగు గోడల మధ్య కూర్చోని దిగులు పడుతుండేది. ముంబై నుంచి ఢిల్లీకి మారాక కూడా చానల్లో పనిచేసేది. కానీ అధిక బరువు కారణంగా ఏకాగ్రత పెట్టలేక ఆర్టికల్స్‌ను రాయలేకపోయేది. రోజురోజుకి పెరుగుతోన్న బరువుని నియంత్రించలేక, జనాల ఈసడింపు చూపులు తట్టుకోలేకపోయేది. మరోవైపు పీసీఓడీ సమస్యతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. తొమ్మిది నెలల్లో నలభై కేజీలు... నాలుగో అంతస్థులో ఉండే తులికా, తాను కిందకి దిగితే చూసినవాళ్లు నవ్వుతారన్న భయంతో భర్త, కొడుకు, స్నేహితులు మోటివేట్ చేయడంతో దగ్గర్లో ఉన్న చిన్న పార్క్‌లోకి రాత్రి సమయాల్లో వెళ్లి రహస్యంగా వాకింగ్, రన్నింగ్ చేయడం మొదలు పెట్టింది. రెండు నెలలపాటు రన్నింగ్, వాకింగ్‌లతో పదమూడు కేజీలు బరువు తగ్గింది. ఈ ఉత్సాహంతో ఆహారంలో మార్పులు, జిమ్‌లో చేరి వర్క్ అవుట్లు, యోగా చేయడంతో తొమ్మిది నెలల్లోనే నలభై కేజీలు బరువు తగ్గింది. జిమ్ ట్రైనర్‌ను చూసి... ఒకపక్క డిప్రెషన్‌కు కౌన్సెలింగ్ తీసుకుంటూనే, జిమ్‌లో క్రమం తప్పని వ్యాయామంతో బరువు తగ్గిన తులికా.. తను కూడా జిమ్‌లోని ఫిట్నెస్ కోచ్ కావాలనుకుంది. దీంతో వ్యాయామాలన్ని చక్కగా నేర్చుకుని ఆన్లైన్ తరగతుల ద్వారా శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ప్రస్తుతం చక్కని ఫిట్నెస్ కోచ్‌గా రాణించడమేగాక, నేషనల్ గేమ్స్ ఆస్పిరెంట్స్‌కు శిక్షణ ఇస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లో నలుగురిలో కలవలేనప్పటికీ.. మనలో ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే ఎంతటి బరువునైనా దింపేసుకుని ముందుకు సాగవచ్చనడానికి తులికా జీవితం ఉదాహరణగా నిలుస్తోంది. (క్లిక్: పుష్ప.. 66 వయసులోనూ తగ్గేదేలే..!) మనల్ని మనం ప్రేమించుకోవాలి. అప్పుడే సంతోషంగా ఉండగలుగుతాం. శరీరమే మనకు సర్వస్వం. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కెరీర్ మీద దృష్టిపెడుతూనే ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరచుకుంటే ఎప్పుడూ ఫిట్‌గా ఉంటాము. మన రోజువారి పనుల్లో హెల్దీ లైఫ్‌స్టైల్ భాగం కావాలి. నా స్టూడెంట్స్‌కు ఇదే నేర్పిస్తున్నాను. – తులికా సింగ్ -
బూట్లు ఉతికే లాండ్రి.. కొత్త తరహా ఉపాధి
జీవితంలో ఎన్నో అనుకుంటాం. కానీ అనుకున్నవన్నీ జరగవు. కొంతమంది అనుకున్నవి జరగకపోయినా... ఇప్పటికి ఇదే ప్రాప్తం అనుకుని ఉన్నదానితో సంతృప్తి చెందుతుంటారు. మరికొందరు మాత్రం తాము చేసే పనిలో సంతృప్తి దొరకక నిత్యం మధనపడుతుంటారు. ఇలా మధనపడుతూనే తనకు నచ్చిన పనిని ఎంచుకుని షూ లాండ్రీ యజమానిగా మారి ఎంతో సంతృప్తిగా జీవిస్తోంది షాజియా కైజర్. బీహార్‌లోని భాగల్పూర్కు చెందిన షాజియా ఓ ప్రభుత్వ ఉద్యోగి కూతురు. ఇంటర్మీడియట్ అయిన వెంటనే పెళ్లి చేశారు. షాజియాకేమో పై చదువులు చదవాలని ఆశ. తన కెరీర్‌ను ఉన్నతంగా మలుచుకోవాలన్న కోరిక. ఈ క్రమంలోనే భర్త అనుమతితో ఫిజియో థెరపీలో డిగ్రీ పూర్తి చేసింది. అయితే ఫిజియోథెరపిస్టుగా పనిచేయకుండా రెండేళ్లపాటు టీచర్ ఉద్యోగం చేసింది. తనకు చాలా ఆనందంగా అనిపించింది. కానీ మనసులో ఇంకా ఏదో చేయాలన్న తపన. అదికూడా పెద్దగా చేయాలి. దీంతో టీచర్ ఉద్యోగం మానేసే యూనిసెఫ్‌లో చేరింది. ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ స్వేచ్ఛగా పనిచేసే వెసులుబాటు కనిపించకపోవడంతో ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంది. బూట్లు ఉతికే లాండ్రి ఓ రోజు మ్యాగజీన్ చదువుతోన్న షాజియాకు బూట్లు శుభ్రం చేసే లాండ్రి సర్వీస్ గురించి తెలిసింది. బూట్ల లాండ్రీ పెడితే బావుంటుందన్న ఆలోచనతో షూస్‌ని ఎలా శుభ్రం చేస్తారో తెలుసుకోవడం ప్రారంభించింది. లెదర్‌తో తయారు చేసే షూలను వివిధ రకాల రసాయనాలు ఉపయోగించి క్లీన్ చేస్తారని తెలిసింది. షూ క్లీనింగ్ గురించి మరింతగా తెలుసుకునేందుకు చెన్నైలోని ‘సెంట్రల్ ఫుట్‌వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’లో చేరి పాదరక్షలను తయారు చేసే టెక్నాలజీ, డిజైనింగ్ గురించి పూర్తిగా స్టడీ చేసింది. ఆ తరువాత నోయిడాలోని ‘ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో చేరి లెదర్‌తో తయారు చేసే చెప్పులు, బూట్లు, వివిధ రకాల బ్యాగ్‌ల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. పట్నాలో 2014లో బూట్లు శుభ్రం చేసే ‘రివైవల్ షూ లాండ్రి’ పేరుతో ఇద్దరు పనివాళ్లతో కలిసి ఒక చిన్నపాటి షాపును ప్రారంభించింది. అయితే షూ లాండ్రీ అంటే ఏమిటో తెలియక వీరి షాపుకు చాలామంది చినిగిపోయిన బూట్లు తెచ్చి ఇచ్చేవారు. వారిని ఏమాత్రం విసుక్కోకుండా వాటిని చక్కగా కుట్టి శుభ్రంగా కడిగి కొత్తవాటిలా మార్చి తిరిగి ఇవ్వడంతో లాండ్రీకి వచ్చే కస్టమర్ల సంఖ్య పెరిగింది. దాంతో చూస్తుండగానే ఈ బిజినెస్ పెరిగిపోయింది. వీరి లాండ్రీకి కస్టమర్ల నుంచి ఆదరణ లభించడంతో బీహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ 2016లో షాజియా షూ లాండ్రిని ‘బెస్ట్స్టార్టప్’ అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు లక్షల టర్నోవర్‌తో లాండ్రీ నడుస్తోంది. సీఎం నితీష్‌కుమార్, ఇంకా సీనియర్ ఉన్నతాధికారులు సైతం షాజియా లాండ్రిలో బూట్లు సర్వీసింగ్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం పాట్న వ్యాప్తంగా ఐదు అవుట్లెట్లతో ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తోంది షాజియా లాండ్రీ. అంతేగాక షాజియా దగ్గర షూ క్లీనింగ్‌లో శిక్షణ తీసుకున్న కొంతమంది ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఢిల్లీ, ఒడిషాలలో షూ లాండ్రీలను నడుపుతున్నారు. రంగు వెలిసినా... షాజియా లాండ్రీలో రంగువెలిసిన బూట్లకు కొత్త రంగు వేయడం, ట్రాలీబ్యాగ్స్, బ్యాక్‌ప్యాక్స్, లెదర్, ల్యాప్‌టాప్ బ్యాగ్‌లను రిపేర్ చేయడంతోపాటు షూస్‌ను ఆవిరి మెషిన్ మీద శుభ్రం చేసి ఇస్తుంది. -
కుటుంబాన్ని రిపేర్ చేస్తున్న మెకానిక్ రాధ
ఆ గ్యారేజ్‌లో రెంచ్‌లు, స్క్రూ డైవర్ల సందడితో గాజుల చప్పుడు కలిపి వినిపిస్తుంది. గ్రీజు అంటుకుపోయిన దుస్తులతో ఎప్పుడూ కనిపించే మెకానిక్ కాకుండా ఓ స్త్రీ చేతిలో రెంచీతో కొత్తగా కనిపిస్తుంది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎంపీడీఓ కార్యాలయం రోడ్డులో ఉందీ మెకానిక్ షెడ్. భర్తకు అండగా నిలవడానికి భార్య మెకానిక్‌గా మారిన ఈ కథ ఆసక్తికరం. మట్టి అంటిన చేతులు నిజాయితీకి నిలువుటద్దాలు అంటారు కదా.. అలా నిజాయితీ కలిగిన ఓ మహిళ కథ ఇది. శ్రీకాకుళం: మహిళలు చాలా రంగాల్లో రాణిస్తున్నారు. చాలా మంది టీచర్లయ్యారు, ఇంకొందరు ప్రైవేటు సెక్టార్లలో రాణిస్తున్నారు, మరికొందరు రాజకీయా ల్లో ఉన్నత పదవులు అధిరోహిస్తున్నారు.. అలా రాధ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేసే తత్వం ఉంటే రంగంతో పని లేదని నిరూపిస్తున్నా రు ఈమె. వాస్తవానికి బైక్ మెకానిక్ రంగం మగాళ్ల రాజ్యం. రోజంతా దుమ్ము, ధూళి, గ్రీజులతో ఈ పని మొరటుగా ఉంటుంది. కానీ కుటుంబానికి తోడుగా ఉండేందుకు ఈ పనిని కూడా ఆమె బాధ్యతగా నెత్తికెత్తుకుంది. ► పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయం రోడ్డులో గిరి మెకానిక్ షా పు ఉంది. అక్కడే రాధ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఎలాంటి వాహనం వచ్చినా ఇట్టే సమస్యను పసిగట్టి పరిష్కరించి పంపిస్తారు. వాస్తవానికి రాధ బైక్ మెకానిక్ పనులేవీ నేర్చుకోలేదు. కాలం ఆమెను ఈ రంగం వైపు నడిపించింది. ► పదహారేళ్ల కిందట రాధకు పోల గిరితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి స్వ స్థలం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా రంభ గ్రామం. అక్కడ ఉపాధి లేక పలాస వరకు వలస వచ్చారు. గిరికి బైక్ మెకానిక్ పనులు తెలుసు. కానీ ఆయనకు సరిగ్గా వినిపించదు. దీంతో వ్యాపారంపై ఆ ప్రభావం పడింది. కస్టమర్లు రావడం.. సమస్యను చెప్పడానికి ఆపసోపాలు పడడంతో గిరికి గిరాకీ తగ్గింది. కోవిడ్ రాకతో.. ► అసలే వ్యాపారం అంతంతమాత్రంగా ఉంటే అప్పుడే కోవిడ్ కేసులు ఉద్ధృతం కావడం మొదలయ్యాయి. ఫలితంగా ఉన్న ఉపాధి కాస్తా పోయింది. షెడ్‌కు బళ్లు రావడం మానేశాయి. ఓ వైపు కుటుంబానికి తిండీ తిప్పలు, ఇంటి అద్దె, షాపు అద్దె కట్టాల్సి రావడంతో వీరికి ఏం చేయాలో పాలుపోలేదు. ► ఈ కష్టకాలంలో గిరి భార్య రాధ ఆదర్శ ప్రాయమైన నిర్ణయం తీసుకున్నారు. తాను షెడ్లో ఉంటే తప్ప పరిస్థితులు చక్కబడవని గ్రహించి మెకానిక్ పనులు నేర్చుకోవడం మొదలుపెట్టారు. భర్త తోడుతో.. కోవిడ్ కాలంలో అద్దెల భారం పెరిగి కరోనా సమయంలో ఉపాధి లేక పస్తులు పడ్డా రు. పనిచేసేందుకు ఎవరినైనా పెడదామంటే అంత జీతాలు ఇవ్వలేని పరిస్థితి. దీంతో రాధ స్వయంగా రోజూ దుకాణానికి వచ్చి సాయం చేసేది. సందేహాలు వస్తే గూగుల్, యూట్యూబ్‌లో వీడియోలు చూసి కొన్ని నేర్చుకునేవారు. కరోనా సమయంలో ఇంటి వద్దకు కొన్ని వాహనాలు వస్తే కాదనకుండా మరమ్మతులు చేసి పంపించేవారు. భర్తే ఆమెకు దగ్గరుండి విద్య నేర్పడం గమనార్హం. భర్త నేరి్పన విద్యతో అన్ని రకాల మరమ్మతులు చేస్తూ బైక్ మెకానిక్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. సాధారణ వాహనాలతో పాటు పాతకాలం నాటి యమహా క్రక్స్ వంటి వాహానాలను కూడా ఆమె బాగు చేయగలరు.బీఎస్ 2 నుంచి బీఎస్ 6 వరకు స్కూటీలు, మోటారుసైకిళ్లు బాగు చేస్తున్నారు. భార్యాభర్తలం కష్టపడితేనే పైసలు కనిపిస్తున్నాయని, అందుకే సిగ్గు పడకుండా ఈ వృత్తిలో కొనసాగుతున్నానని ఆమె చెబుతున్నారు. పిల్లలను చక్కగా చదివించుకుని ఇక్కడే స్థిరపడాలని ఉందని ఆమె తెలిపారు. -
ఆహా ఏమి రుచి... ఎంత కృషి!
అవసరమే ఆవిష్కరణలకు కారణం అవుతుంది... అంటారు. అవసరమే అన్నీ నేర్పిస్తుంది... అని కూడా అంటారు. అస్మాఖాన్‌కు వంటలలో ఓనమాలు తెలియవు. ఇంగ్లాండ్‌కు వెళ్లిన కొత్తలో స్వదేశి ఇంటి వంటల రుచులు ఆమెకు దూరం అయ్యాయి. దీంతో పనిగట్టుకొని వంటలు నేర్చుకుంది. అయితే ఆమె అక్కడే ఆగిపోలేదు. ఆల్–ఉమెన్ ‘డార్జిలింగ్ ఎక్స్‌ప్రెస్ రెస్టారెంట్’ ద్వారా సూపర్‌ఫాస్ట్‌గా దూసుకుపోతోంది.. ‘అస్మాఖాన్ ఏమిటి?’ అనే సింగిల్ ప్రశ్నకు ఎన్నో జవాబులు దొరుకుతాయి. అందులో కొన్ని... మంచి చెఫ్: ఆమె గరిట తిప్పితే వంటల రుచులు ఎక్కడికో వెళ్లిపోతాయి. స్టార్ రెస్టారెటర్: వ్యాపారం అంటే ఆషామాషీ విషయం కాదు. అయినప్పటికీ ఆ వ్యాపారంలో దూసుకుపోయింది. ఎంతోమంది ఔత్సాహికులకు ఉత్సాహాన్ని ఇస్తోంది. వంటల పుస్తకాల రచయిత్రి: వంటల పుస్తకాలు చదివించేలా ఉండడమే కాదు, చదువు పూర్తయిన తరువాత వంటగదిలోకి పరుగెత్తేలా చేయాలి... అంటారు. అస్మాఖాన్ పుస్తకాలు అలాంటివే. ఘనత: బిజినెస్ ఇన్సైడర్ ‘100 కూలెస్ట్ పీపుల్ ఇన్ ఫుడ్ అండ్ డ్రింక్’ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. కోల్‌కత్తాలో పుట్టిపెరిగిన అస్మాఖాన్ వివాహం తరువాత కేంబ్రిడ్జి (ఇంగ్లాండ్) కి వచ్చింది. వంటల విషయంలో భర్త అభిప్రాయానికి, తన అభిరుచికి మధ్య చాలా తేడా ఉండేది. ఆయన విషయంలో భోజనం అంటే... జస్ట్ ఫర్ ఎగ్జిస్టింగ్! తనకు మాత్రం భోజనం అనేది కేవలం భోజనం మాత్రమే కాదు... అదొక గొప్ప సంస్కృతి. ఇప్పుడు తాను ఆ సంస్కృతికి దూరం అయింది, పుట్టింట్లో ఇష్టంగా తిన్న వంటకాలు గుర్తుకు వచ్చి నోట్లో నీరు ఊరేది. దీంతో ‘ఎలాగైనా సరే వంటలు నేర్చుకోవాలి’ అనే నిర్ణయానికి వచ్చింది. కేంబ్రిడ్జిలో ఉంటున్న బంధువు దగ్గర వంటలలో ఓనమాలు నేర్చుకుంది. ఆ తరువాత... మూడు నెలల పాటు ఇండియాలో గడపడానికి వచ్చినప్పుడు... తల్లి, ఇంటి వంటమనిషితో పాటు ఎంతోమంది బంధువుల దగ్గర ఎన్నో వంటకాలు నేర్చుకుంది. తక్కువ సమయంలో వాటిలో నేర్పు సాధించి ‘ఆహా ఏమి రుచి!’ అనిపించుకుంది. తిరిగి కేంబ్రిడ్జికి వచ్చిన కొంతకాలానికి... ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ప్రారంభించాలనుకుంది. కానీ అది ఎలాంటి కాలం అంటే... ఇండియన్ రెస్టారెంట్ల విషయంలో ‘నేడు ప్రారంభం’ ‘మూడు రోజుల తరువాత మూసివేత’ అన్నట్లుగా ఉండేది. దీనికి కారణం అక్కడ నివసిస్తున్న భారతీయులు కూడా ‘ట్రెండ్’ పేరుతో రకరకాల రుచులను ఆస్వాదించేవారు తప్ప భారతీయ భోజనాల దగ్గరకు అరుదుగా వచ్చేవారు. రెస్టారెంట్ ఆలోచన భర్తకు నచ్చలేదు. అలా అని ఆయన వద్దని వారించలేదు. ఒక శుభముహుర్తాన లండన్‌లో ఆల్–ఉమెన్ ‘డార్జిలింగ్ ఎక్స్‌ప్రెస్ రెస్టారెంట్’ మొదలుపెట్టింది అస్మాఖాన్. పేరుకు తగ్గట్టే దూసుకుపోయింది. ‘ఆహా ఏమి రెస్టారెంట్’ అనిపించింది. ‘ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్... మొదలైన దేశాల్లో వంటగదులు మహిళల ఆధ్వర్యంలోనే ఉంటాయి. రెస్టారెంట్ల దగ్గరికి వచ్చేసరికి మగ చెఫ్‌లే ఎక్కువగా కనిపిస్తారు’ అంటున్న అస్మాఖాన్ తన రెస్టారెంట్లో మహిళా చెఫ్‌లు, ఉద్యోగులకే ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి ఆదివారం ఈ రెస్టారెంట్ ‘చెఫ్’లుగా రాణించాలనుకుంటున్న మహిళల కోసం శిక్షణ కేంద్రంగా మారుతుంది. వృత్తిలో విజయశిఖరం అందుకున్న అస్మాఖాన్ ఆ విజయం దగ్గర మాత్రమే ఆగిపోలేదు. సామాజిక బాధ్యతను తన కర్తవ్యంగా భావిస్తుంది. 2019లో ఇరాక్‌కు వెళ్లి ఉగ్రవాద బాధిత మహిళల కోసం ‘ఆల్–ఉమెన్ రెస్టారెంట్’ను ప్రారంభించింది. ఇక మనదేశం విషయానికి వస్తే... ‘మళ్లీ ఆడపిల్లే’ అని నిట్టూర్చే కుటుంబాల మానసిక ధోరణిలో మార్పు తీసుకువచ్చేలా ‘సెకండ్ డాటర్ ఫండ్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా కృషి చేస్తోంది అస్మాఖాన్. ఉదా: రెండోసారి ఆడపిల్ల పుట్టిన కుటుంబాలకు స్వీటు ప్యాకెట్లు పంపించడం. స్వీట్లు పంపించడమే కాదు ఆడపిల్లల చదువు విషయంలోనూ తన వంతుపాత్ర పోషిస్తున్న అస్మాఖాన్ భవిష్యత్‌లో మరిన్ని సామాజికసేవా కార్యక్రమాల కోసం సిద్ధం అవుతోంది. రెండోసారి ఆడపిల్ల పుట్టిన కుటుంబాలకు స్వీటు ప్యాకెట్లు పంపించడం. స్వీట్లు పంపించడమే కాదు ఆడపిల్లల చదువు విషయంలోనూ తన వంతుపాత్ర పోషిస్తోంది ఆస్మాఖాన్. -
50 రోజుల పాటు ఒంటరిగా బైక్ రైడ్.. ఎవరీ అంబికా క్రిష్టన్..?
కోచి(కేరళ)కు చెందిన అంబికా క్రిష్టన్ భర్త శివరాజ్ చనిపోయాడు. అప్పుడు ఆమె వయసు పందొమ్మిది సంవత్సరాలు. మూడు నెలల పసిపాప. ఒక్కసారిగా తనను చీకటి కమ్మేసినట్లుగా అనిపించింది. ఎంత మరిచిపోదామన్నా భర్త జ్ఞాపకాలు తనను విపరీతంగా బాధిస్తున్నాయి. ఒకానొక దశలో అయితే... ‘అసలు నేను బతకడం అవసరమా?’ అనుకుంది. ఆ సమయంలో పాప తనవైపు చూస్తుంది. వెంటనే నిర్ణయాన్ని మార్చుకుంది... పాప కోసమైనా బతకాలని! బికామ్ డిగ్రీ పూర్తిచేసింది. సాయంత్రాలు కంప్యూటర్క్లాస్లకు వెళ్లేది. తాను కాలేజికి వెళ్లే రోజుల్లో స్నేహితులు, ఇంటిపక్క వాళ్లు పాపను చూసుకునేవారు. ఒక సంస్థలో తనకు ఎకౌంటెంట్‌గా ఉద్యోగం వచ్చింది. ఎంత ఆత్మవిశ్వాసం వచ్చిందో! ఆ తరువాత ఆకాశవాణి రెయిన్బో 107.5లో పార్ట్–టైమ్ జాబ్‌లో చేరడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడ తనలోని సృజనాత్మకతకు పనిచెప్పే అవకాశం లభించింది. ఎంతోమందిని ఇంటర్యూ్య చేసింది. అవి కాలక్షేపం ఇంటర్వ్యూలు కావు...పదిమందికి స్ఫూర్తి పంచే ఇంటర్య్వూలు. ఈ ఉద్యోగం తనకు నలుగురిని ఆకట్టుకునేలా మాట్లాడే నైపుణ్యాన్ని ఇచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా సామాజిక బాధ్యతను నేర్పింది. ఆకాశవాణి రెయిన్బోలో ఉత్తమ ఆర్జేగా పేరు తెచ్చుకున్న అంబికా ఇప్పుడు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోలోగా ఆల్ ఇండియా బైక్ రైడ్ చేస్తుంది. 50 రోజుల పాటు సాగే ఈ రైడ్ దేశవ్యాప్తంగా ఉన్న 25 రెయిన్బో స్టేషన్లను కనెక్ట్ చేస్తూ సాగుతుంది. ఈ బైక్ యాత్రలో భర్తను కోల్పోయిన సైనికుల భార్యలను కలుసుకుంటుంది. వీరులకు నివాళి అర్పిస్తుంది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన మహిళలతో మాట్లాడుతుంది. వారు మానసికంగా ఒంటరి ప్రపంచంలో ఉంటే...తన జీవితాన్నే ఉదాహరణగా చెప్పి ధైర్యం చెబుతుంది. వారికి తన పరిధిలో చేతనైన సహాయం చేస్తుంది. ఒకప్పుడు ఏ పాప ముఖం చూసి అయితే తాను కచ్చితంగా బతకాలని నిర్ణయించుకుందో...ఆ పాప ఆర్యా ఇప్పుడు ఇన్ఫోసిస్‌లో మంచి ఉద్యోగం చేస్తోంది. ‘50 రోజుల పాటు ఒంటరిగా బైక్ రైడా! ఎందుకొచ్చిన రిస్క్’ అన్నారు కొద్దిమంది స్నేహితులు. ‘రిస్క్’ అనుకుంటే అక్కడే ఆగిపోతాం. ఆ ఆలోచనను బ్రేక్ చేస్తేనే ముందుకు వెళ్లగలమనే విషయం ఆమెకు తెలియందేమీ కాదు. భర్త చనిపోయిన తరువాత... ‘నీ జీవితం రిస్క్‌లో పడింది. ఎలా నెట్టుకొస్తావో ఏమో’ అనేవారు కొందరు. నిజమే అనుకొని తాను ఆ నిరాశపూరిత భావన దగ్గరే నిస్సహాయకంగా ఉండి ఉంటే ఏమై ఉండేదోగానీ...ముందుకు కదిలింది. చిన్నా చితాక ఉద్యోగాలు చేసింది. సొంతకాళ్ల మీద నిలబడింది. బిడ్డను బాగా చదివించింది. అంబికా యాత్ర వృథా పోదు. ప్రతి ఊరికి తమవైన స్ఫూర్తిదాయకమైన కథలు ఉంటాయి. వాటిని సేకరిస్తూ, పంచుతూ వెళ్లడం ఎంత గొప్పపని! -
టీచర్ నుంచి పోలీస్.. ఆమె ప్రయాణం వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!
ఖండఖండాంతరాల్లో పర్వతాలు అధిరోహించేలా శిఖరాగ్రానికి ఆహ్వానం పలికాయి. పోలీస్ విధుల్లోనూ ప్రశంసలు నక్షత్రాలుగా భుజాలపై మెరిశాయి. కృషి, పట్టుదలే ఆలంబనగా పలువురు మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు సిక్కోలు కొత్త ఎస్పీ జీఆర్ రాధిక. అటు పర్వతారోహణలో మేటిగా నిలిచిన ఆమె ఇటు పోలీస్ డ్యూటీలో కూడా ఘనాపాటిగా నిరూపించుకున్నారు. లెక్చరర్‌గా పనిచేస్తూ గ్రూప్ 1 ద్వారా పోలీస్ బాసయ్యారు. ఎస్పీ అయ్యేనాటికే ఆరు ఖండాల్లోని పర్వతాలు ఆమె పాదాక్రాంతం అయ్యాయి. తాజాగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆమె సిక్కోలు శాంతిభద్రతలకే తొలి ప్రాధాన్యం అంటున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సవాళ్లను స్వీకరించడం కొందరికి సరదా. అలాంటి కోవకే వస్తారు జిల్లా కొత్త ఎస్పీ జిఆర్ రాధిక. ఓవైపు వృత్తి.. మరోవైపు కుటుంబం.. అయినా తాను అనుకున్నది సాధించే వరకు వదల్లేదు. కొన్ని పనులను కేవలం మగవారే చేయగలరన్న నానుడికి స్వస్తి పలికి తాము కూడా చేయగలమని నిరూపించిన వారిలో రాధిక ఒకరు. ఎంచుకున్న లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలో సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. విజయవంతంగా ముందుకు సాగుతున్న ఆమె ‘సాక్షి’ ముఖాముఖిలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బాల్యం, విద్యాభ్యాసం.. పుట్టింది అనంతపురంలో. బాల్యం, విద్యాభ్యాసం అంతా కడపలోనే. ఇంటర్మీడియెట్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో పూర్తిచేశా. పోస్ట్‌గ్రాడ్యుయేషన్(ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్) ఎస్వీ యూనివర్సిటీ తిరుపతిలో చేశాను. తొలి ఉద్యోగం ఇంగ్లిష్ లెక్చరర్.. ఏపీపీఎస్సీలో జూనియర్ లెక్చరర్ (ఇంగ్లీష్)గా 2002లో ఎంపికై మెదక్‌లో మూడేళ్లు పనిచేశాను. తర్వాత కర్నూలులో ఉద్యోగం చేస్తుండగానే 2007లో గ్రూప్–1కు ఎంపికయ్యాను. మెదక్‌లో లెక్చరర్‌గా ఉన్నప్పుడు ఎన్ఎస్ఎస్ ప్రొగ్రామ్ ఆఫీసర్‌గా చేశా. నాన్న టీచర్, అమ్మ రిటైర్డ్ ప్రిన్సిపాల్. మాది కులాంతర ప్రేమ వివాహం. భర్త బిజినెస్ చేస్తున్నారు. ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి ఎంఎస్ ఫైనలియర్, చిన్నబ్బాయి బీటెక్ ఫస్టియర్. ఇద్దరూ యూఎస్‌లో చదువుతున్నారు. అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముళ్లు, అక్కా చెల్లెల్లు అంతా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడినవారే. చాలెంజింగ్ జాబ్స్ ఇష్టం.. ప్రతి రోజూ జిమ్, సైక్లింగ్, వాకింగ్ చేస్తూ ఫిట్నెస్కి ప్రాధాన్యమిస్తాను. ఆరోగ్యంగా ఉండాలి.. ఇతరులకు సాయపడాలి. ఇలాంటి ఆలోచనలు ఉంటేనే మానవ జీవితానికి సార్థకత ఉంటుంది. చాలెంజింగ్ జాబ్స్ అంటే ఇష్టం. అవార్డులు చాలా వచ్చాయి. రోల్ మోడల్: రాజీవ్ త్రివేది సీఐడీ డీజీ సునీల్‌కుమార్ టెక్నాలజీని ఉపయోగించే విధానం ఎంతో ఆకట్టుకుంటుంది. వినూత్నమైన ఆలోచనలతో కొత్త యాప్‌ల ద్వారా డిపార్ట్మెంట్ని తీర్చిదిద్దుతున్నారు. బెస్ట్ ఫ్రెండ్: ఇండియా హాకీ టీమ్ గోల్‌కీపర్ రజిని(చిత్తూరు) అభిరుచులు: బుక్‌రీడింగ్, రైటింగ్ చాలా ఇష్టం: యాక్షన్, హర్రర్, థ్రిల్లర్ పోలీసింగ్ వంటి సినిమాలు అన్ని జీవరాశుల్లో మానవ జన్మ గొప్పది. దీన్ని ప్రతి ఒక్కరూ అదృష్టంగా భావించాలి. దేవుడిపై నమ్మకంతో మనుగడ సాగిస్తే సంతోషంగా ఉండవచ్చు. ప్రతి సమస్య నుంచి ఒక పాఠం నేర్చుకుంటా. ప్రతి దాన్ని సవాలుగా స్వీకరిస్తా. పర్వతారోహణ మొదలైందిలా.. 2012లో మానస సరోవర్ యాత్రకు వెళ్లాను. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించాలంటే ముందుగా 45 రోజుల మౌంటెనింగ్ కోర్సు పూర్తి చేయాలి. దీనికోసం నాతో పాటు మరో ఇద్దరు మేల్ కానిస్టేబుళ్లు దరఖాస్తు చేశారు. డిపార్ట్మెంట్ పర్మిషన్ కోసం పెట్టాను. మౌంటెనింగ్ కోర్సు కాశ్మీర్లో చేయాల్సి ఉంది. లేడీ ఆఫీసర్ని అంతదూరం పంపించడం సేఫ్ కాదని అడిషనల్ డీజీ రాజీవ్ త్రివేది వద్దన్నారు. ఎలాగైనా అనుమతి ఇవ్వాలని, ప్రైవేటుగా డబ్బులు పెట్టుకుని వెళ్లడానికి సిద్ధపడి ప్లాన్ బీ పెట్టుకున్నాను. ఈలోపు ఇద్దరు కానిస్టేబుళ్లకు రిజర్వేషన్ దొరక్కపోవడంతో నాకు అవకాశం వచ్చింది. ఆరు ఖండాల్లో శిఖరాలు అధిరోహించా.. సెవెన్ సమ్మిట్ చాలెంజ్ విన్నాను. ఏడు ఖండాల్లో ఎత్తైన శిఖరాలు అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఆ దిశగానే ప్రయత్నం చేసి ముందుగా లడఖ్‌లోని జాస్కర్ రేంజ్ పరిధిలో మౌంట్ గోలిప్ కాంగ్రీ(5995మీటర్లు)ని 2013 సెప్టెంబర్ 7న ఎక్కాను. తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లోని మౌంట్ మెంతోసా(6443మీటర్లు), కార్గిల్‌లోని మౌంట్ కున్(7007 మీటర్లు) అధిరోహించాను. –సివెన్ సమ్మిట్ చాలెంజ్‌లో భాగంగా 2016 మే 20న ఎవరెస్ట్(8848మీటర్లు)తో ప్రారంభించాను. తర్వాత కిలిమంజారో(ఆఫ్రికా), ఆస్ట్రేలియా ఖండంలోని కొస్కియస్‌జ్కో, ఐరోపా ఖండంలోని ఎల్బ్రస్, దక్షిణా ఆమెరికా ఖండంలోని అకోన్కాగ్వా, అంటార్కిటికా ఖండంలోని విన్సన్ మౌంట్ , డెనాలీమౌంటెన్ ఎక్కాను. నార్త్ అమెరికాలోని అలెస్కాలో మాత్రం 300 మీటర్ల దూరానికి సమీపంలో వెనుదిరిగాను. 2021లో నేపాల్‌లోని ఇస్లాండ్ పర్వతాన్ని అధిరోహించాను. ఏపీ పోలీస్ అకాడమీ, హైదరాబాద్‌లో పోలీస్ ఉద్యోగంలో చేరాక ఫిజికల్ యాక్టివిటీవ్స్‌లో భాగంగానే శిఖరాలన్నీ ఎక్కే ప్రయత్నం చేశాను. డీఎస్పీగా విధుల్లో చేరాక ఈ అచీవ్మెంట్స్ అన్నీ సాధించగలిగాను. అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాను. మౌంట్ కున్ని అధిరోహించిన మొదటి ఇండియన్ మహిళగా, ఎవరెస్ట్‌ను అధిరోహించిన మొదటి మహిళా పోలీస్ ఆఫీసర్‌గా రికార్డులు దక్కాయి. -
స్టెనో నుంచి న్యాయమూర్తిగా.. ఆమె జర్నీ సాగిందిలా..
సాక్షి,విశాఖ లీగల్: నగరంలోని 7వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో స్టెనోగా పనిచేస్తున్న సాయి సుధ న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఈ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన ఆమె హైస్కూలు విద్యను తాటిపూడి బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పూర్తి చేశారు. ఎన్వీపీ న్యాయ కాలేజీలో న్యాయశాస్తంలో పట్టా తీసుకున్నారు. అనంతరం కోర్టులో స్టెనోగా విధుల్లో చేరారు. ఇటీవల జరిగిన న్యాయమూర్తి పరీక్షల్లో సాయి సుధ ప్రతిభ చాటారు. తన విజయం వెనుక తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఉన్నారని ఆమె చెప్పారు. ఆమె న్యాయమూర్తిగా ఎంపిక కావడం పట్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాథ శర్మ, ఇతర న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాది గొలగాని అప్పారావు, సీనియర్ న్యాయవాది గోలి శ్రీనివాసరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ఎస్.కృష్ణమోహన్, రాష్ట్ర ఉపాద్యక్షుడు కె.రామజోగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: అల వీరాపురంలో అతిథులు.. చూసొద్దాం రండి! -
Pradeep Mehra: ఈ కుర్రాడి కథ మన పిల్లలకు స్ఫూర్తి
స్కూల్‌కు ఏసి బస్. అడిగిన వెంటనే షూస్. కోరిన సీట్ రాకపోయినా డొనేషన్ సీట్. ఉద్యోగానికి తెలిసిన మిత్రుడి కంపెనీలో రికమండేషన్. పిల్లలు వారి శక్తి వారు ఎప్పుడు తెలుసుకోవాలి? కుటుంబానికి సమాజానికి శక్తిగా ఎప్పుడు నిలబడాలి? కష్టాలను ఎదుర్కొనడమూ ప్రతికూలతను జయించడమూ జీవితమే అని ఎప్పుడు తెలుసుకోవాలి. పిల్లల్ని గారం చేసి బొత్తిగా బలహీనులను చేస్తున్నామా? నోయిడాలో అర్ధరాత్రి 10 కిలోమీటర్లు పరిగెడుతూ యువతకు సందేశం ఇచ్చిన ప్రదీప్ మెహ్రా నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి? ముందు ప్రదీప్ మెహ్రా గురించి తెలుసుకొని మళ్లీ మన పిల్లల దగ్గరకు వద్దాం. మొన్నటి శనివారం రోజు. అర్ధరాత్రి. ఢిల్లీ సమీపంలో ఉండే నోయిడా. సినిమా దర్శకుడు వినోద్ కాప్రి తన కారులో వెళుతుంటే ఒక యువకుడు బ్యాక్‌ప్యాక్‌తో పరిగెడుతూ వెళుతున్నాడు. అయితే అతడు అర్జెంటు పని మీద పరిగెడుతున్నట్టుగా లేడు. ఒక వ్యాయామంగా పరిగెడుతున్నట్టున్నాడు. వినోద్ కాప్రికి ఆశ్చర్యం వేసింది... ఈ టైమ్‌లో ఈ కుర్రాడు ఎందుకు పరిగెడుతున్నాడు అని. కారులో అతణ్ణే ఫాలో అవుతూ అద్దం దించి మాట్లాడుతూ అదంతా వీడియో రికార్డ్ చేశాడు. ‘ఎందుకు పరిగెడుతున్నావ్?’ ‘వ్యాయామం కోసం’ ‘ఈ టైమ్‌లోనే ఎందుకు?’ ‘నేను మెక్‌డోనాల్డ్స్‌లో పని చేస్తాను. వ్యాయామానికి టైం ఉండదు. అందుకని ఇలా రాత్రి డ్యూటీ అయ్యాక పరిగెడుతూ నా రూమ్‌కు చేరుకుంటాను’ ‘నీ రూమ్ ఎంతదూరం?’ ‘10 కిలోమీటర్లు ఉంటుంది’ ‘అంత దూరమా? కారెక్కు. దింపుతాను’ ‘వద్దు. నా ప్రాక్టీసు పోతుంది’ ‘ఇంతకీ ఎందుకు వ్యాయామం?’ ‘ఆర్మీలో చేరడానికి’ ఆ సమాధానంతో వినోద్ కాప్రి ఎంతో ఇంప్రెస్ అయ్యాడు. ఇంతకీ ఆ అబ్బాయి పేరు ప్రదీప్ మెహ్రా. వయసు 19. ఊరు ఉత్తరాఖండ్ అల్మోరా. నోయిడాలోని బరోలాలో తన అన్న పంకజ్‌తో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. తల్లి సొంత ఊరిలో జబ్బు పడి ఆస్పత్రిలో ఉంది. తండ్రి ఆమెకు తోడుగా ఉన్నారు. అన్నదమ్ములు నగరానికి వచ్చి కష్టపడుతున్నారు. ప్రదీప్‌కు ఆర్మీలో చేరాలని కోరిక. ఆ లోపు బతకడానికి నోయిడా సెక్టార్ 16లో ఉండే మెక్‌డొనాల్డ్స్‌లో చేరాడు. ఉదయం నుంచి రాత్రి వరకూ డ్యూటీ. మళ్లీ వంట పని. వీటి వల్ల వ్యాయామానికి టైమ్ ఉండదు. అందువల్ల ప్రతిరోజూ డ్యూటీ అయ్యాక (రాత్రి 10.40కి) బ్యాక్‌ప్యాక్ తగిలించుకుని బరోలా వరకు పరుగు మొదలెడతాడు. ‘కనీసం కలిసి భోం చేద్దాం రా’ అని వినోద్ కాప్రి అడిగితే ప్రదీప్ మెహ్రా చెప్పిన జవాబు ‘వద్దు. రూమ్‌లో అన్నయ్య ఎదురు చూస్తుంటాడు. నేను వెళ్లి వండకపోతే పస్తు ఉండాల్సి వస్తుంది. వాడికి నైట్ డ్యూటీ’ అన్నాడు. వినోద్ కాప్రి ఈ వీడియోను ఆదివారం ట్విట్టర్లో పోస్ట్ చేస్తే గంటల వ్యవధి లో 40 లక్షల మంది చూశారు. ప్రదీప్‌ను ప్రశంసలతో దీవెనలతో ముంచెత్తారు. ఆర్మీ నుంచి రైటర్ అయిన ఒక ఉన్నతాధికారి ప్రదీప్ ఆర్మీలో చేరడానికి తాను ట్రైనింగ్ ఇప్పిస్తానన్నాడు. ఒక సినిమా నిర్మాత వెంటనే ప్యూమా నుంచి బూట్లు, బ్యాక్‌ప్యాక్ బ్యాగ్ పంపించాడు. ఆనంద్ మహీంద్ర అయితే ‘ఇలాంటి వాళ్లే నా సోమవారం రోజును ఉత్సాహంగా మొదలెట్టిస్తారు’ అని ట్వీట్ చేశాడు. ‘ఈ కాలపు పిల్లలు ఇతణ్ణి చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అన్నారు ఎందరో. నిజం. తప్పక నేర్చుకోవాల్సింది ఉంది. ప్రదీప్ మెహ్రా నుంచి మన పిల్లలు నేర్చుకోవాల్సింది ఏమిటి? 1. లక్ష్యం కలిగి ఉండటం: ప్రదీప్ మెహ్రాకు ఒక లక్ష్యం ఉంది. తనకేం కావాలో అతడు నిశ్చయించుకున్నాడు. కాని అందుకు ఎన్నో ఆటంకాలు, బాధ్యతలు అడ్డుగా నిలిచి ఉన్నాయి. వాటిని తృణీకరించకుండా, నిర్లక్ష్యం చేయకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అతడు నిశ్చయించుకున్నాడు. 2. చిత్తశుద్ధి: లక్ష్యం కలిగి ఉండటమే కాదు. దానిని చేరుకునే చిత్తశుద్ధి కూడా ఉండాలి. ప్రదీప్ తన రొటీన్‌ను ఏ మాత్రం మార్చుకోవడం లేదు. ఉదయాన్నే లేచి వంట, మళ్లీ రాత్రి రూమ్‌కు వెళ్లి వంట, మధ్యలో డ్యూటీ... ఇవన్నీ చేస్తూ పరుగు. రోజూ రాత్రిళ్లు అతడు పరిగెడుతుంటే ఎందరో లిఫ్ట్ ఇస్తామని అడుగుతారు. ఈ ఒక్కరోజు బండెక్కుదాం అని అనుకోకుండా పరుగెడుతున్నాడు. దర్శకుడు వినోద్ కాప్రి అడిగినా అతడు కారు ఎక్కలేదు. 3. కుటుంబం ముఖ్యం: ప్రదీప్‌కు కుటుంబం ముఖ్యం అనే బాధ్యత ఉంది. కుటుంబం పట్ల ఎంతో ప్రేమ ఉంది. అన్న పట్ల అనురాగం ఉంది. అన్న పస్తు ఉండకుండా త్వరగా వెళ్లి వంట చేయాలని ఉంది. ఆర్మిలో చేరి కుటుంబాన్ని ఆదుకోవాలని ఉంది. ఈ దృష్టి ముఖ్యం. 4. ఆకర్షణలకు లొంగకపోవడం: గత 24 గంటల్లో ప్రదీప్ స్టార్ అయిపోయాడు. ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. మీడియా వెంటపడుతోంది. ప్రదీప్ వయసున్న కుర్రాళ్లు తబ్బిబ్బయ్యి ఆ ఊపులో కొట్టుకుని పోవచ్చు. కాని ‘నన్ను డిస్ట్రబ్ చేయకండి. పని చేసుకోనివ్వండి’ అన్నాడు ప్రదీప్. 5. కష్టేఫలీ: ‘మిడ్నైట్ రన్నర్’గా కొత్త హోదా పొందాక ‘నువ్వు ఇచ్చే సందేశం’ అని అడిగితే ‘కష్టపడాలి. కష్టపడితే లోకం తల వొంచుతుంది’ అని జవాబు చెప్పాడు. పిల్లలను పూర్తి కంఫర్ట్ జోన్లో పెట్టాలని తల్లిదండ్రులు ఆరాటపడటంలో తప్పు లేదు. కాని సవాళ్లను ఎదుర్కొని, ఎదురుదెబ్బలకు తట్టుకుని, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకుని, విలువలు కోల్పోకుండా కష్టపడి పైకి రావాలని పిల్లలకు చెప్పడానికి ప్రదీప్ మెహ్రాకు మించిన సజీవ ఉదాహరణ లేదు. తాతల, తండ్రుల జీవితాల్లోని విజయగాథలు ఈనాటి పిల్లల జీవితాల్లో ఉంటున్నాయా అని చూసుకుంటే వారిని ఉక్కుముక్కల్లా పెంచుతున్నామా లేదా ఇట్టే తెలిసిపోతుంది. ఇవాళ పరిశీలించి చూడండి. Watch #PradeepMehra’s 20 second SPRINT to lift your Monday SPIRITS ❤️ https://t.co/UnHRbJPdNa pic.twitter.com/nLAVZxwauq — Vinod Kapri (@vinodkapri) March 21, 2022 -
ఆత్మస్థైర్యం.. అక్షరం నేర్చిన పాదం
అల్లంత దూరన సన్నని తీగపై అటు ఇటూ పట్టు తప్పకుండా నడుస్తున్న పాదాలు.. తీగపై నడక ఆగిపోగానే డబ్బులు ఏరుకుంటున్న ఆటగాళ్లను చూసి ఆమె ఓ కల కన్నది. ‘నాకు రెండు చేతులు లేకపోతేనేం... పాదమే చేయిగా మారదా’ అనుకుంది. పట్టుబట్టింది. సాధన చేసింది. పాదం రాతతోనే తన తల రాతను మార్చుకుంది ఉత్తర్‌ప్రదేశ్ లక్నోలో ఉంటున్న కామిని శ్రీవాస్తవ. కాళ్లతో రాయడం మొదలుపెట్టినప్పుడే చుట్టూ ఉన్న ప్రపంచం ఆమెను మెచ్చుకుంది. జీవితాన్ని నిలబెట్టుకోవడం అంటే ఏంటో చూపాక ఎన్నో అవార్డులూ, ప్రశంసలూ అందుకుంది కామిని శ్రీవాస్తవ. నాలుగేళ్ల వయసులో రైలు ప్రమాదంలో రెండు చేతులు పోగొట్టుకున్న శ్రీవాస్తవకు ముందున్న జీవితం గురించి ఆప్పుడేమీ తెలియదు. నలుగురు అన్నదమ్ముల మధ్య ఒక్కతే ఆడపిల్ల. తల్లిదండ్రికి గారాబు తనయ. తండ్రి రైల్వేలో డ్రైవర్. ఓ రోజు మారాం చేస్తే తనతో పాటు డ్యూటీకి తీసుకెళ్లాడు. కానీ, అనుకోకుండా అక్కడ జరిగిన ప్రమాదంలో రెండు చేతులు, ఎడమపాదం ఐదు వేళ్లూ తెగిపోయాయి. అయితేనేం మొక్కవోని ఆమె ధైర్యం ఉన్నతశిఖరాలను చేర్చిన విధానం ఇలా వివరిస్తుంది.. ‘‘ఆ సమయంలో జీవితం ఏంటి అనే పెద్ద విషయాలు ఏమీ తెలియవు. కానీ, అందరిమాదిరిగా నాకు చేతులు లేవు. ఏ పనీ చేయలేకపోతున్నాను. నిద్రలేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేవరకు ఇదే బాధ. చేతులు లేకుంటే ప్రతి పనికీ ఇతరులపై ఆధారపడాల్సిందే. కొన్నాళ్లు డిప్రెషన్ నన్ను కమ్మేసింది. ఎవరితోనూ మాట్లాడకుండా రోజుల తరబడి గడిపాను. ఆలోచనలో పడేసిన సందర్భాలు.. ఓ రోజు మార్కెట్‌కు వెళుతున్నప్పుడు ఒక దగ్గర రెండు పోల్స్‌పైన కట్టిన సన్నని తీగపై ఒక అమ్మాయి అటూ ఇటూ నడవడం చూశా. చుట్టూ జనాలు ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. ‘కాళ్లు అంత శక్తిమంతమైనవా!’ అనుకున్నాను. అదే విషయం మా నాన్నను అడిగాను. మా నాన్న ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్‌లో ఛాంపియన్. అతను కూడా సన్నని తాడు మీద నడిచి చూపించాడు. సంకల్పం ఉంటే ఏమైనా చేయచ్చు అని కళ్లకు కట్టాడు. అప్పటి నుంచి కాళ్లతో పనులు చేయడం నేర్చుకున్నాను. అక్షరాలు రాయడం సాధన చేశాను. ఈ విషయంలో ఒక పోరాటయోధురాలిగా మారిపోయాను. చేతులు మినహా నా శరీరం అంతా బాగుందని నేను అంగీకరించాను. అసలు చేతులు అనేవి పుట్టుకతోనే లేకపోతే... అనే ఆలోచన వచ్చాక ఏ పనైనా అవలీలగా చేయగలను అనిపించింది. పనిలో పదోన్నతులు.. డిగ్రీ చేశాక ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం మొదలుపెట్టాను. అందులో.. చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అండ్ నూట్రిషన్ విభాగంలో సూపర్వైజర్గా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఆ విభాగంలోనే మరికొన్నాళ్లకు ఆఫీసర్‌గా ప్రమోషన్ వచ్చింది. ఉద్యోగంతో పాటు ఎకనామిక్స్, సోషియాలజీలో ఎంఏ చేశాను. ఇందిరా మహిళా సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ స్కీమ్ కింద అధ్యయన బృందంలో సభ్యురాలిగా ఇండోనేషియాకు వెళ్లొచ్చాను. కుటుంబం.. అవార్డులు.. నాకు అడుగడుగునా అండగా నిలిచే భర్త లభించాడు. ఇరవై ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఉమ్మడి కుటుంబంలోనే మా జీవనం ఆనందంగా సాగిపోయింది. అత్తమామలు, ఆడపడచులు.. అందరూ నన్ను బాగాచూసుకున్నారు. చిన్నప్పటి నుంచి నాకు చదవడం, రాయడం అంటే చాలా ఇష్టం. నా రచనలు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రసారం చేయబడ్డాయి. అనేక వార్తాపత్రికలలో కూడా ప్రచురించబడ్డాయి. కవి సమ్మేళనాల్లో పాల్గొన్నాను. కవితా సంకలనాలు రాశాను. వాటిలో ‘ఖిల్తే ఫూల్ మెహక్తా అంగన్’, ‘డోర్’ కథా సంకలనం, భారతరత్న ఇందిర, అస్మాప్త రహీన్’నవలలు ప్రచురించబడ్డాయి. ఎన్నో సత్కారాలు అందుకున్నాను. నా ఉద్యోగం, అభిరుచి రెండింటికీ సమాన ప్రాముఖ్యతను ఇచ్చాను. దీని ఫలితంగా 1994లో మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాల్ శర్మచే జాతీయ అవార్డు, ఆ తర్వాత ముఖ్యమంత్రులు, గవర్నర్ల చేతుల మీదుగా అవార్డులు తీసుకున్నాను. సాహిత్యరంగంలో అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి. నా పట్టుదల, శ్రమ అందరిలోనూ స్ఫూర్తి నింపుతోందని అనేవారు. నమ్మకమే మనం.. ఈ రోజు నేను ఈ దశకు చేరుకున్నాన ంటే నా చుట్టూ ఉన్న వ్యక్తుల సహాయసహకారాల వల్లనే అనుకుంటాను. ఇప్పటికి నాలుగు పుస్తకాలు రాసి, ప్రచురించాను. ప్రతిరోజూ నా రచనను సోషల్ మీడియా మాధ్యమంగా పంచుకుంటాను. ప్రతి ఒక్కరి జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మనం ఆ సమస్యలను ఎలా ఎదుర్కొంటామన్నదే చాలా పెద్ద విషయం. దుఃఖంలో కూడా సంతోషంగా జీవించాలి. అంతులేని దుఃఖం తర్వాత నా మీద నాకు ఎనలేని ఆత్మవిశ్యాసం పెరిగింది. అందుకే నన్ను నేను ఎప్పుడు వికలాంగురాలిని అనుకోలేద’’ని ఒక్కో మెట్టును అధిగమించిన విధానాన్ని కళ్లకు కడతారు శ్రీవాస్తవ. ప్రతి ఒక్కరి జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మనం ఆ సమస్యలను ఎలా ఎదుర్కొంటామన్నదే చాలా పెద్ద విషయం. దుఃఖంలో కూడా సంతోషంగా జీవించాలి. అంతులేని దుఃఖం తర్వాత నా మీద నాకు ఎనలేని ఆత్మవిశ్యాసం పెరిగింది. అందుకే నన్ను నేను ఎప్పుడూ వికలాంగురాలిని అనుకోలేదు – శ్రీవాస్తవ -
చదువుకి మధ్యలో ఫుల్ స్టాప్.. అప్పుడు తీసుకున్న రిస్క్ మిలియనీర్‌గా మార్చింది!
లండన్: చదువు అంతగా అబ్బలేదు. దీంతో 16 ఏళ్లకే స్కూల్‌కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. బతకడానికి డ్రైవింగ్ వృత్తిని ఎంచుకున్నాడు, ఉద్యోగంతో జీతం వస్తుంది గానీ జీవితం కాదని తెలుసుకున్నాడు. ఉన్న అనుభవంతో వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి మిలియనీర్‌గా మారాడు యూకేలోని యోర్క్‌షైర్‌కు చెందిన స్టీవ్ పార్కిన్. వివరాల్లోకి వెళితే.. స్టీవ్ పార్కిన్ తన చిన్నతనంలో చదవడమంటే పెద్దగా నచ్చేది కాదు. దీంతో 1992లో చదువు మానేసి హెవీ గూడ్స్ వెహికల్ లైసెన్స్ పొంది బతకడం కోసం డ్రైవర్‌గా మారాడు. అలా అతను చేసిన ఉద్యోగాలలో ఒకటి హడర్స్‌ఫీల్డ్ బోన్మార్చే దుస్తుల కంపెనీకి డ్రైవింగ్ చేయడం. ఇక అప్పటి నుంచి దొరికిన పని చేస్తూ జీవితంలో ముందుకు కదిలాడు. అయితే ఉద్యోగం కన్నా వ్యాపారమే మిన్నా అనే విషయం తెలుసుకున్నాడు. అయితే వ్యాపారం అంటే అంత సులువుగా కాదని తెలుసు కానీ ఆ సమయంలో రిస్క్ తీసుకుని తన దగ్గర ఉన్న డబ్బులు, అతనికున్న అనుభవంతో వ్యాపారం మొదలుపెట్టాడు. అలా చిన్నగా మొదలైన అతని క్లిప్పర్ అనే ఆన్లైన్ లాజిస్టిక్స్ కంపెనీని గత ఏడాది మాత్రమే £45 మిలియన్ (రూ. 450 కోట్లు) అర్జించే సంపన్నుడిగా మారాడు. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం.. యార్క్‌షైర్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలో "మ్యాన్ విత్ ఎ వ్యాన్"గా ప్రారంభమైన పార్కిన్ 10వ స్థానంలో ఉన్నాడు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాపారాలను ప్రభావితం చేసి, తిరోగమనం వైపు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. కానీ ఇళ్లలో చిక్కుకుపోయిన ప్రజల కోసం.. కావాల్సిన వస్తువులను పంపించి తన కంపెనీ వాల్యూను ఒక్కసారిగా పెంచుకోగలిగాడు. ఈ సమ్మర్లోనే తన కంపెనీ టర్నోవర్ 39.1 శాతం పెరిగడంతో పాటు కంపెనీ విలువ కూడా 700 మిలియన్ పౌండ్లకు చేరింది. దీంతో ఇటీవలే మరో 2000 మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. ప్రస్తుతం స్టీవ్ కంపెనీలో 10వేల మంది పనిచేస్తున్నారు. చదవండి: Frida Kahlo Paintings: బాప్రే! ఈ పేయింటింగ్ ధర రూ. 260 కోట్లా!! -
‘అడుక్కోవాలని లేదు.. పెన్నులు కొనండి చాలు’
ముంబై: కొంతమంది ఆరోగ్యపరంగా ఏ లోపాలు లేకున్నా, పని చేసే సామర్థ్యం ఉన్నా చేయలేక యాచించేవాళ్లని, ఇతరులపై ఆధారపడే వాళ్లని చూస్తుంటాం. ఇంకొందరు కష్టపడి పని చేయలేక సులభమైన దారిలో డబ్బు సంపాదనకై ఇతరులను మోసం చేస్తూ సంపాదిస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో ఇలాంటి ఘటనలు మనం వింటూనే ఉంటాం. కానీ వయసు మీదపడినా కూడా ఓ బామ్మ మాత్రం ఎవరి దగ్గర చేయి చాపడం ఇష్టం లేదని ఈ వయసులోనూ తన కష్టం మీదే తన జీవనాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆ బామ్మకి సంబంధించిన ఫోటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడతూ హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల రీఅప్ స్టూడియో వ్యవస్థాపకురాలు శిఖా రథి తన స్నేహితులతో కలిసి పూణేలోని ఎమ్‌జి రోడ్లో వెళ్తున్నప్పుడు ఈ బామ్మను(రతన్) కలిసింది. ఆ సమయంలో ఆ బామ్మ రంగురంగుల పెన్నులను కార్డ్‌బోర్డ్‌తో తయారు చేసిన పెట్టెలో పెట్టి అమ్ముతోంది. అయితే ఆ కార్డ్‌బోర్డ్‌పై ఉన్న ఓ లైన్ చూసి అశ్చర్యపోయింది. ఆ నోట్లో.. ‘నాకు ఎవరీ దగ్గర చేయి చాచను. దయచేసి రూ.10/- బ్లూ కలర్ పెన్నులు కొనండి చాలు. థ్యాంక్యు. బ్లెస్ యూ’.. అని రాసుంది. కాగా ఆ బామ్మ రోడ్లపై తిరుగుతూ విద్యార్థులను, ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఆగిన వాహనదారులను రిక్వెస్ట్ చేస్తూ పెన్నులు అమ్ముతోంది. సాయంత్రం వరకు అక్కడే ఉండి.. పెన్నులు అమ్మగా వచ్చిన డబ్బుతో తన జీవితాన్ని సాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రతి ఆమె ఫోటో తీసి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన కొందరు నెటిజన్లు బామ్మకు హేట్సాఫ్ చెప్పడంతో పాటు మన వంతు సాయం చేయాలని కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Shikha Rathi (@sr1708) చదవండి: Snakes Found Home: ఆ ఇంట పాములు బాబోయ్ పాములు.. చూస్తే చెమటలు పట్టాల్సిందే! -
దేశంలోనే మొదటి వ్యక్తిగా మరగుజ్జు శివలాల్ రికార్డు
-
‘షేర్షా’ డైలాగులు అదుర్స్.. జయహో అంటున్న ఫ్యాన్స్
సాక్షి,ముంబై: కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘షేర్షా’ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. 75 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవాల కాలంలో విడుదలైన ఈ మూవీలో ముఖ్యమైన సన్నివేశాలు, డైలాగులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. కార్గిల్ యుద్ధంలో దేశ రక్షణ కోసం అమరుడైన కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్రలో సిద్దార్థ్ మల్హోత్ర నటన, ఉద్వేగ సన్నిశాల డైలాగ్స్‌తో యువ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. జయహో అంటున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది. ‘‘ఒక్కసారి సైనికుడిగా ఉంటే ఇక జీవితాతం అతడు సైనికుడే’’ ‘‘అయితే జెండా చేత బూని వస్తా.. లేదంటే త్రివర్ణ పతాకం చుట్టుకొని వస్తా.. కచ్చితంగా తిరిగి రావడం మాత్రం ఖాయం.’’ సహచరుడిని కోల్పోయిన తరుణంలో నీళ్లు నిండిన కళ్లతో కెప్టెన్ బాత్రా తన తోటి జవాన్లతో ఇలా అంటాడు.. "ఏ వార్ బడీ కుత్తీ ఛీజ్ హై యార్" యుద్ధంలో విజయం సాధించిన ఉద్వేగభరిత సన్నివేశంలో ‘ఏ దిల్ మాంగే మోర్’ అంటూ నినదిస్తాడు. చిన్నతనం నుంచే ఆర్మీలో చేరాలని కలలు కన్న విక్రమ్ భాత్రా యుద్ధంలో విజయం సాధించిన ఉద్వేగభరిత సన్నివేశంలో ‘ఏ దిల్ మాంగే మోర్’ అంటాడు. సాధారణ పౌరుడి జీవితంలో అనుకున్నది సాధించడం వేరు...కానీ ఒక సైనికుడిగా దేశ రక్షణ పోరాటంలో నిర్దేశిత మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఉద్వేగపూరిత సన్నిశంలో ఈ డైలాగ్ మరింత ఎమోషనల్‌గా ఉంటుంది. దీంతోపాటు ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుందన్నట్టుగా కెప్టెన్ విక్రమ్ బాత్రా అతని స్నేహితురాలు డింపుల్ చీమా అందించిన ఉత్సాహాన్ని, ధైర్యాన్నికూడా షేర్షా బాగా హైలైట్ చేసింది. వీరి పెళ్లికి డింపుల్ తండ్రి అడ్డుపడ్డ సన్నివేశం, ఆర్మీలో చేరాలనే బాత్రా కల కోసం అందించిన ప్రోత్సాహంతోపాటు, ఆమె తెగువకు, ప్రేమకు సెల్యూట్ చేస్తుందీ సినిమా. నరనరాన దేశభక్తిని నింపుకున్న వీరజవాన్ విక్రమ్ పాత్రలో సిద్దార్థ్ మల్హోత్ర ఫుల్మార్క్లు కొట్టేయగా, విక్రమ్ ప్రేయసి డింపుల్ క్యారెక్టర్లో కియారా అద్వానీ అటు అందంతో ఆకట్టుకోవడంతోపాటు ఇటు తెగువ, ధైర్యం ఉన్న మహిళగా అభినయంలోనూ జీవించింది. అలాగే కెప్టెన్ సంజీవ్‌గా శివ్ పండిట్, మేజర్ అజయ్ సింగ్‌గా నికితిన్ ధీర్, విక్రమ్ స్నేహితుడు సన్నీ పాత్రలో సాహిల్ వైద్ ఇలా అందరూ తమ నటనతో ఆకట్టుకున్నారు. -
18 ఏళ్లకే భర్త వదిలేస్తే.. ఐస్ క్రీం అమ్మకం నుంచి నేడు ఎస్సై
తిరువనంతపురం: యుక్త వయసు వచ్చిందంటే చాలు.. చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రుల ఆలోచన అమ్మాయి పెళ్లి గురించే ఉంటుంది. ఆమె ఇష్టానికి, ఆశలకు, ఆశయానికి పెళ్లి పేరిట సంకెళ్లు వేస్తారు. ఇక దురదృష్టం కొద్ది కట్టుకున్న వాడు వదిలేస్తే.. కొన్ని చోట్ల కన్నవారు కూడా ఆదరించరు. అలాంటి సందర్భాల్లో చాలా మంది ఆడవారు మరణమే శరణం అనుకుంటారు. కానీ కొందరు మహిళలు మాత్రం ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి.. తాను కన్నీరు పెట్టిన చోటే సగర్వంగా తలెత్తుకుని నిలబతారు.. పది మందికి ఆదర్శంగా నిలుస్తారు. ఈ కోవకు చెందిన వారే కేరళకు చెందిన అని శివ. 18వ ఏట భర్త వదిలేస్తే.. చేతిలో ఆరు నెలల బిడ్డతో రోడ్డున పడ్డ శివ.. నేడు అదే చోట ప్రొబేషనరీ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ వివరాలు.. కేరళకు చెందిన అని శివ 18వ ఏట డిగ్రీ ఫస్టియర్ చదువుతుండగా.. ఆమెకు ఇష్టం లేకపోయిన బలవంతంగా పెళ్లి చేశారు తల్లిదండ్రులు. ఐపీఎస్ కావాలనే ఆమె కలకు అక్కడితో శుభం కార్డు పడింది. వైవాహిక జీవితం కూడా సవ్యంగా సాగలేదు. బిడ్డ పుట్టిన ఆరు నెలలకు భర్త ఆమెను వదిలేశాడు. ఆదరించాల్సిన కన్నవారు.. దూరం పెట్టారు. దాంతో తన నానమ్మకు సంబంధించిన చిన్న రేకుల షెడ్డులో బిడ్డతో కలిసి జీవించసాగింది అని శివ. ఇక బతుకుతెరువు కోసం ఏ పని దొరికినా చేసేది. వర్కాలా శివగిరి ఆశ్రమ ప్రాంతంలో నిమ్మ రసం, ఐస్‌క్రీములు మొదలు హస్తకళలకు చెందిన పలు వ్యాపారాలు చేసింది. కానీ అన్నింట్లో అపజయమే. ఇలా ఉండగా ఓ సారి ఆమెను గమనించిన ఓ వ్యక్తి.. చదువుకోమని సూచించి.. ఆర్థిక సాయం చేశాడు. ఆ తర్వాత ఆ అజ్జాత వ్యక్తి సూచన మేరకు ఎస్సై జాబ్‌కు అప్లై చేసి.. కొలువు సంపాదించింది. ఈ క్రమంలో కేరళ పోలీసు డిపార్ట్మెంట్ ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది. ‘‘నిజమైన ఆత్మవిశ్వాసానికి, మనో స్థైర్యానికి ప్రతీకగా నిలిచారు అని శివ. 18వ ఏట భర్త ఆమెను రోడ్డున పడేశాడు. కుటుంబం ఆమె గురించి పట్టించుకోలేదు. కానీ ఆమె వీటన్నింటిని తట్టుకుని నేను ఎస్సై ఉద్యోగం సాధించింది’’ అని ప్రశంసిస్తూ ట్వీట్ చేయడంతో ఆమె స్టోరి తెగ వైరలయ్యింది. ఈ సందర్భంగా అని శివ మాట్లాడుతూ.. ‘‘నా గురించి తెలిసి ఎవరెవరో నన్న ప్రశంసిస్తూ మెసేజ్‌లు చేస్తున్నారు. వర్కాలా పోలీస్ స్టేషన్లో నాకు పోస్టింగ్ ఇచ్చారని కొన్ని రోజుల క్రితమే తెలిసింది. ఎక్కడైతే నేను కన్నీరు కార్చానో.. ఎవరి మద్దతు లేకుండా నా బిడ్డ జీవితం కోసం పోరాడానో.. నేడు అక్కడే ఎస్సైగా విధులు నిర్వహిస్తాను అని తలుచుకుంటేనే చాలా గర్వంగా అనిపిస్తుంది. నా భావాలను వ్యక్తం చేయడానికి మాటలు రావడం లేదు’’ అన్నారు. చదవండి: స్వయంగా బావిలోకి దిగి శవాన్ని వెలికి తీసిన ఎస్ఐ -
Zomato Girl: ఆకలి చూపిన ఉపాధి
కటక్‌కు చెందిన బిష్టుప్రియ సీనియర్ ఇంటర్. క్లాసులు కట్టిపెట్టి తండ్రి బైక్‌ను ఎక్కి జొమాటో టీషర్ట్ వేసుకుంది. లాక్డౌన్లో రాత్రి పూట ఒంటరి రోడ్ల మీద ఫుడ్ డెలివరి ఇస్తూ కనిపిస్తుంది. ఆమెను అందరూ మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇంటి ఆకలి తీర్చడానికి ఈ రిస్క్ ఉన్న పనిని సైతం ఎంచుకుంది కనుక. కటక్ ఓన్లీ జొమాటో గర్ల్ బిష్ణు డబ్బు, సంపాదన ఉన్నవారికి డబ్బు, సంపాదన వల్ల ఆకలి తీరకపోవడం మంచిదే. అంటే డబ్బు, సంపాదన ఉన్నా వేళకు వండుకోవాలి. లేదంటే బయటి భోజనం తినాలి. డబ్బు తిని ఉండలేరు కదా. ప్రపంచం అటుదిటు అయినా మనిషికి ఆకలి పోదు. ఈ కథలో ఒకరి ఆకలి ఇంకొకరి ఆకలిని తీర్చింది. ఆకలి ఉన్నవారు ఆహార పదార్థాలు ఇంటికి తెప్పించుకునే వీలున్న జొమాటో సర్వీస్ ఒక కుటుంబం ఆకలి తీర్చింది. అలా తీర్చేందుకు కష్టపడుతున్న అమ్మాయి బిష్ణుప్రియ ఈ కథకు కథానాయిక. కటక్ అమ్మాయి ఫస్ట్‌వేవ్ నుంచి బయటపడి ఎలాగోలా బతుకీడుస్తున్న బడుగు జీవుల మీద సెకండ్ వేవ్ వచ్చి పడింది. మళ్లీ లాక్డౌన్స్ తప్పలేదు. కటక్ శైలబాల విద్యాలయాలో సిబిఎస్ఇ 12వ తరగతి చదువుతున్న బిష్ణుప్రియ చదువులో బ్రైట్. ఇంటర్ అయ్యాక మెడిసిన్ చేయాలని కోరిక. తండ్రి టాక్సీ డ్రైవర్. కాని లాక్డౌన్ వల్ల అతని ఉద్యోగం పోయింది. ఇంట్లో మెల్లమెల్లగా ఆకలి మొదలయ్యింది. ‘నేను నా కాలేజీ ఫీజు కోసం ఇంటి దగ్గర రోజూ ట్యూషన్ చెప్పేదాన్ని. అయితే కరోనా భయంతో పిల్లలు రావడం మానేశారు. ఆ డబ్బు కూడా ఆగిపోయింది. ఏం చేయాలో తోచలేదు’ అంది బిష్ణుప్రియ. ఇంట్లో బిష్ణుప్రియే పెద్ద కూతురు. ఆమె తర్వాత ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ‘నాన్నకు వేరే ఏ పనీ రాదు. అమ్మ టైలరింగ్ చేస్తుంది కాని ఆ పని నడవడం లేదు. ఇక నేను నా చదువును కొంతకాలం పక్కనపెడదామని అనుకున్నాను’ అంటుంది బిష్ణుప్రియ. చదువుకుంటున్న బిష్ణుప్రియ జొమాటో ఉద్యోగి ‘ఈ లాక్డౌన్లో నేను ఏపని చేయగలను రోజూ ఏపని దొరుకుతుంది అని చూస్తే నాకు జొమాటో ఒక మార్గంగా కనిపించింది. కటక్‌లో వాళ్ల బ్రాంచీకి వెళ్లి ఉద్యోగం కావాలన్నాను. నాకు ఈ సంవత్సరమే 18 నిండాయి. వాళ్లు ఉద్యోగం ఇచ్చారు. నాన్న బైక్ నాకు నడపడం వచ్చు. వెంటనే పనిలో దిగాను’ అంటుంది బిష్ణు. అయితే కటక్‌లో ఇలా జొమాటోలో డెలివరీ కి పని చేస్తున్న ఆడపిల్లలు లేరు. బిష్ణు మొదటి అమ్మాయి. మామూలు రోజుల్లో డెలివరీ ఒక పద్ధతి. లాక్డౌన్ అంటే నిర్మానుష్య వీధుల్లో తిరగాలి. డెలివరీ కోసం రాత్రి వరకూ పని చేయాలి. ‘అయినా ఇప్పటివరకూ నాకు ఏ ఇబ్బందీ రాలేదు. పైగా నా పనిని చూసి నలుగురూ మెచ్చుకుంటున్నారు’ అంది బిష్ణు. ఆమెను చూసి తల్లిదండ్రులు కూడా ఆనందిస్తున్నారు. ‘మా అమ్మాయి చాలామందికి స్ఫూర్తినిస్తోంది. నాకు అదే సంతోషం’ అన్నాడు బిష్ణు తండ్రి. చెడు కాలం వచ్చినప్పుడు మనిషిలోని ఎదుర్కొనే శక్తులు బయటకి వస్తాయి. ఇలాంటి అమ్మాయిల శక్తి ఇప్పుడు దేశంలో చాలా కుటుంబాలను ఆదుకుంటోంది. చదవండి: జొమాటో సంచలనం.. నోయిడాలో అమల్లోకి.. చదవండి: కరోనా వ్యాప్తి.. స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్ బంద్ -
నీటిని నిలిపి.. పొలాలు తడిపి..
కష్టాలు ఆలోచనలకు పదునుపెట్టాయి. ఒక ఆలోచన దిశ చూపింది. సంకల్పం చేతులు కలిపింది. పొలం తడిసింది. జలం జీవం పోసింది. పంట పండింది. గ్రామస్తుల దశ మారింది. కళ్లముందే నీరున్నా పొలానికి అందక ఏళ్ల తరబడి ఇబ్బందులు పడిన ఆ గ్రామస్తులు ఇప్పుడు రెండు పంటలు పండిస్తున్నారు. నిరంతరం పారే నీటికి చిన్న అడ్డుకట్ట వేసి పొలాలకు మళ్లించారు. నీటి ఎద్దడే లేదు. వంద ఎకరాలు సస్యశ్యామలమయ్యాయి. నీరు లేక పంటలు పండించే అవకాశంలేక అటవీ ఉత్పత్తులు సేకరించి జీవనం గడిపిన వారు ఇప్పుడు స్వయంగా పంటలు పండించుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. ఈ ఘనత సాధించిన విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని గుంటబద్ర గ్రామస్తులు.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. మక్కువ (సాలూరు): గుంటబద్ర గ్రామంలో సుమారు వంద గిరిజన కుటుంబాలున్నాయి. గ్రామం పక్కనే ప్రవహించే అడారు గెడ్డ ఉంది. ఒడిశా రాష్ట్రంలోని కొండలపైనుంచి నిరంతరం వచ్చే నీటితో ఈ గెడ్డ ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ పొలాలకు నీరందించే లక్ష్యంతో చేపట్టిన అదనపు ఆనకట్ట పనులు ఆగిపోవడంతో వరుణుడు కరుణిస్తేనే పంట పండేది. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలా అని అందరూ చర్చించుకున్నారు. అడారు గెడ్డ నీటిని ఎలా మళ్లించాలా అని ఆలోచించారు. గెడ్డకు అడ్డంగా రాళ్లు వేసి ప్రవాహాన్ని కొంత అయినా అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అందరూ కలిసి రాళ్లను సేకరించి అడారు గెడ్డ మధ్యలో గట్టులా వేశారు. అక్కడ ఆగిన నీరు పొలాలకు వెళ్లేలా కాలువ తవ్వారు. రాళ్ల మధ్య నుంచి కిందకు వెళ్లేనీరు పోగా కాలువకు వస్తున్న నీటితో వంద ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. ఖరీఫ్‌లో వందెకరాల్లో వరి పండించిన ఈ గ్రామస్తులు రబీ సీజన్లో 70 ఎకరాల్లో మొక్కజొన్న, 30 ఎకరాల్లో చిరుధాన్యాలు సాగు చేస్తున్నారు. అటవీ అభ్యంతరాలతో ఆగిన అదనపు ఆనకట్ట నిర్మాణం మక్కువ, పార్వతీపురం, సాలూరు మండలాలకు చెందిన 1,876 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో మకు్కవ మండలం పనసబద్ర పంచాయతీ మూలవలస గ్రామ సమీపంలో 1955లో సురాపాడు చెక్‌డ్యాం నిర్మించారు. చెక్‌డ్యాం శిథిలావస్థకు చేరడం, కాలువల్లో పూడిక పేరుకోవడంతో ప్రస్తుతం వెయ్యి ఎకరాలకు కూడా నీరందడం లేదు. ఎగువనున్న కొండలపై నుంచి అడారుగెడ్డ ద్వారా వచ్చిననీరు వచ్చినట్లు వృథాగా పోతోంది. అడారుగెడ్డపై నుంచి వచ్చిన నీటిని నిల్వ చేసేందుకు సురాపాడు ప్రాజెక్టు దిగువన 2,500 ఎకరాలకు సాగు నీరందించేలా అదనపు ఆనకట్ట (మినీ రిజర్వాయర్) నిర్మించాలని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తలపెట్టారు. ఇందుకోసం రూ.1.2 కోట్లు మంజూరుచేశారు. 2006 మే 28న అప్పటి రాష్ట్ర అటవీ పర్యావరణశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించిన ఆరు నెలలకే అటవీ శాఖాధికారులు అడ్డుకోవడంతో ఆగిపోయాయి. దీంతో మక్కువ మండలంలోని మూలవలస, ఆలగురువు, గుంటబద్ర, చెక్కవలస, నగుళ్లు, పార్వతీపురం మండలంలోని అడారు గ్రామాల పొలాలకు నీరందక ఏటా గిరిజన రైతులు నష్టపోతున్నారు. నీటి సమస్య తీరింది గ్రామస్తులమంతా ఏకమై అడారు గెడ్డ మధ్యలో రాళ్లను గట్టులా వేశాం. కొంతమేర కిందకు వెళ్లగా మిగిలిన నీటిని కాలువ ఏర్పాటుచేసి పొలాలకు మళ్లిస్తున్నాం. మా పంటపొలాలకు నీరు సక్రమంగా అందుతోంది. పంటలు పండించుకుంటున్నాం. - సీదరపు లాండు, గుంటబద్ర, రైతు పంటలు పండించుకుంటున్నాం ఏటా వరుణదేవుడిపై ఆధారపడి పంటలు సాగుచేస్తూ నష్టపోతూనే ఉండేవాళ్లం. ఇప్పుడు అడారు గెడ్డ మధ్యలో రాళ్లతో గట్టుకట్టి నీటిని పొలాలకు మళ్లించుకున్నాం. పంటలు పండించుకుంటున్నాం. సంతోషంగా ఉంది. - కర్రా రామారావు, గుంటబద్ర, రైతు కోర్టులో కేసు ఉంది సురాపాడు ప్రాజెక్టు సమీపంలో 2006లో అదనపు ఆనకట్ట నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రదేశం రిజర్వ్‌ఫారెస్ట్ ఏరియాలో ఉంది. అందువల్ల అటవీ శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో కేసు వేసింది. ఇంతవరకు ఎటువంటి ఉత్తర్వులు అందలేదు. అందువల్ల పనులు అలాగే నిలిచిపోయాయి. -కె.నారాయణరావు, అటవీ అధికారి, మక్కువ -
వైకల్యం ఓడిపోయింది.. స్ఫూర్తి గాథలు
ప్రొద్దూటూరు/రాజంపేట టౌన్/ రూరల్/ జమ్మలమడుగు/సంబేపల్లె/అట్లూరు/ చాపాడు: వారంతా దివ్యాంగులే... పుట్టుకతో విధి వంచితులే.. అయినా బెదరలేదు.. కన్నీరు కార్చలేదు.. పట్టుదల, ఆత్మస్థైర్యంతో జీవన పోరాటం సాగిస్తున్నారు. ఒకరిపై ఆధారపడకుండా, వ్యాపారం చేసుకుంటూ తమదైన నైపుణ్యంతో రాణిస్తూ, ఆదాయం పొందుతూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. పదుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ అధైర్యపడకుండా ఒకరి సాయం కోసం ఎదురుచూడకుండా జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని కొంతమంది దివ్యాంగులపై ప్రత్యేక కథనం. చిరు వ్యాపారమే ఆసరా ఇక్కడ కన్పిస్తున్న దివ్యాంగుడి పేరు ప్రొద్దుటూరు రెహామాన్. మైదుకూరు పట్టణం నంద్యాల రోడ్డు కాల్వకట్ట వద్ద నివాసం ఉంటున్నాడు. రోడ్డు పక్కన చిన్న బంకు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు. గతంలో సంచులు కుట్టేవాడు. ‘‘కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడ్డానని, లాక్డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే వ్యాపారం బాగా జరుగుతోందని, పెట్టుబడి పోయి మిగిలిన ఆదాయంతో పాటు, ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తో కుటుంబాన్ని పోషించుకుంటున్నానని’’ చెబుతున్నాడు. మొక్కవోని ధైర్యంతో.. ఇతని పేరు అహమ్మద్‌బాషా. పుట్టుకతోనే దివ్యాంగుడు. రాజంపేట పట్టణం రైల్వేస్టేషన్ సమీపంలో టైలరింగ్ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. కరోనాతో ఆదాయం పూర్తిగా పడిపోయింది. లాక్డౌన్ కారణంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో షాపు మూసివేశాడు. ప్రస్తుతం చౌకదుకాణంలో నెలకు రెండుమార్లు ఇచ్చే రేషన్ బియ్యం, సరుకులతో భార్య, డిగ్రీ చదివే ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ షాపులో కూర్చుంటే కనీసం రూ. 100 వస్తుందన్న ఆశ ఇతనిది. కరోనా ఇబ్బందులు తాత్కాలికమే అంటూ, ధైర్యంతో మొండిగా బతుకుబండిని లాగుతున్నట్లు చెబుతున్నాడు రెక్కల రిక్షా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఈ దివ్యాంగుని పేరు కరీముల్లా. చిన్నప్పుడే ప్రమాదంలో కుడిచేతిని పోగొట్టుకున్న ఈయన ఎంతో ధైర్యంగా జీవనం సాగిస్తున్నారు. ప్రత్యేకంగా రిక్షాను తయారు చేయించుకుని సీజన్ వ్యాపారం చేస్తున్నాడు. ప్రస్తుతం రోజూ హోల్‌సేల్ మార్కెట్లో వేరుశనగ కాయలు కొని ఊరంతా తిరిగి విక్రయిస్తాడు. సీజన్‌ను బట్టి రేగిపండ్లు, జామకాయలు, మామిడికాయలు అమ్మి జీవనం సాగిస్తున్నాడు. మరో విశేషం ఏమిటంటే ఈయన సతీమణి ఖాదర్‌బీ దివ్యాంగురాలే. చిన్నప్పుడే పోలియోతో కాలు చచ్చుబడిపోయింది. సతీమణి ఇంటిలో అన్నం వండిపెట్టడం మినహా ఏ పని కావాలన్నా తాను ఒంటిచేత్తోనే చేస్తానని ఎంతో ధైర్యంతో కరీముల్లా ఈ సందర్భంగా చెబుతున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వెరీ ‘గుడ్డు’రఫి జమ్మలమడుగుకు చెందిన మహమ్మద్‌రఫి పుట్టుకతోనే పోలియో సోకడంతో దివ్యాంగుడిగా మారాడు. ఒకరి మీద ఆధారపడకుండా సొంతంగా కోడి గుడ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరోనా నేపథ్యంలో దుకాణాలు మూతపడి వ్యాపారం కుంటుపడింది. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా మళ్లీ దుకాణాలు తెరుచుకున్నాయి. మరోవైపు కరోనా మహమ్మారిని జయించడంలో గుడ్డు ఎక్కువగా సహకరిస్తుందన్న డాక్టర్ల సూచనతో వ్యాపారం ఇప్పుడు పరుగులు పెడుతోంది. దీంతో రఫీ రోజంతా బిజీబిజీగా ఉంటున్నాడు. సేవకుడయ్యాడు.. రాజంపేటకు చెందిన ఎన్. శ్రీనివాసులు డిగ్రీ వరకు చదివాడు. తండ్రి అనారోగ్యం పాలై మంచం పట్టాడు. ఇతనికి తల్లి, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. కుటుంబ పోషణ శ్రీనివాసులుపైనే పడింది. పెద్దతమ్ముడికి సెలూన్‌షాపు ఏర్పాటు చేయించాడు. మరో సోదరుడిని చదివిస్తున్నాడు. జననేత ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థతో 19వ వార్డులో ప్రస్తుతం వలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తూ.. ప్రజలకు సేవ చేస్తున్నాడు. బతుకు ‘చిత్రం’ ఇదే.. ఏపీ దివ్యాంగుల సంక్షేమ సమితి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న షాకీర్‌హుసేన్ పట్టణంలోని ఓ ఫొటో స్టూడియోలో ఆల్బమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ స్టూడియోకు వెళ్లి కంప్యూటర్లో ఫొటోలు డిజైన్ చేస్తున్నాడు. ఒక్కో ఫొటోకు రూ.3 చొప్పున తనకు కమీషన్ ఇస్తారని, రోజూ 200 ఫొటోలుపైగా డిజైన్ చేస్తానని ఈ సందర్భంగా షాకీర్ తెలిపాడు. కుట్టుకుంటూ.. నెట్టుకుంటూ సంబేపల్లె మండలం పీఎన్‌కాలనీ పంచాయతీ రేగడగుంటపల్లెకు చెందిన ఈశ్వరయ్యకు రెండు కాళ్లు లేవు. అయినా కష్టపడి టైలరింగ్ చేస్తూ అమ్మానాన్నకు ఆసరాగా ఉంటూ వచ్చాడు. దురదృష్టవశా>త్తూ కన్నవారు కూడా కాలం చేశారు. ఆత్మస్థైర్యంతో తను నేర్చుకున్న చేతి వృత్తితో కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఒకరి మీద ఆధారపడకుండా సొంతంగా జీవనం సాగిస్తున్నాడు. తల్లి కోసం రాజంపేట మండలం ఎర్రబల్లికి చెందిన ఖమ్మం నాగేంద్రరెడ్డి బీఎస్సీ, బీఈడీ చదివాడు. తండ్రి మరణించడంతో తల్లిని పోషించేందుకు చిన్న పాటి కిరాణా షాపును ఏర్పాటు చేసుకున్నాడు. చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్కపోయినా నిరాశ చెందకుండా జీవనం సాగిస్తున్నాడు. షాపులో వచ్చిన ఆదాయంతో తల్లిని బాగా చూసుకుంటున్నాడు. కష్టాలకు బెదరలేదు.. ఈ ఫొటోలేని వ్యక్తి పేరు మద్దూరు నరసింహులు. అట్లూరు మండలం కొండూరు ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. పుట్టుకతోనే దివ్యాంగుడు. అవయవాలు ఎదగలేదు. అయితే టైలర్ పని నేర్చుకున్నాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇద్దరి పిల్లలకు తండ్రి అయ్యాడు. కరోనా కష్టాల్లోనూ బెదరకుండా టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అందరికీ అండగా .. రాజంపేట మండలం మన్నూరు గ్రానికి చెందిన షేక్ జైనులు దివ్యాంగుడు. డిగ్రీ చదివాడు. తల్లి, భార్య, కుమార్తె, తమ్ముడు ఉన్నారు. అందరినీ పోషించాల్సిన బాధ్యత జైనులుపై పడింది. ఇంటిలోనే టైలరింగ్ చేస్తూ కుటుంబానికి అండగా నిలిచాడు. ఇతని పట్టుదల కింద వైకల్యం ఓడిపోయింది. -
అస్సాం ప్రజల్లో తెలుగు‘కీర్తి’
ఆమె తల్లిదండ్రులకు హైదరాబాద్‌లో కరోనా వచ్చింది.అయినా అస్సాంలో విధులను వదులుకోకుండా ప్రజల్లోనే ఉంది కీర్తి.ఐదారు రోజుల క్రితం వివాహం చేసుకుంది.అయినా మరుసటి రోజే కోవిడ్ స్పెషల్ వార్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమైంది కీర్తి.స్త్రీల రక్తహీనతకు విరుగుడుగా ఉసిరి మురబ్బాను పంచి జనం మెచ్చుకోలు పొందింది కీర్తి.ఎన్నికలలో స్త్రీల భాగస్వామ్యాన్ని ప్రచారం చేసి రాష్ట్రపతి ప్రణబ్ ప్రశంసలు పొందింది కీర్తి.2013 బ్యాచ్ తెలంగాణ ఐ.ఏ.ఎస్ కీర్తి జెల్లి. ఇవాళ అస్సాం ప్రజల్లో స్త్రీ సామర్థ్యాన్ని,తెలుగువారి సామర్థ్యాన్ని నిరూపించి అభినందనలు అందుకుంటోంది ‘కీర్తి’. మొన్నటి సెప్టెంబర్ మొదటివారంలో అస్సాంలోని ‘కచార్’ జిల్లా హెడ్‌క్వార్టర్స్ అయిన ‘సిల్చార్’లో కొంత మంది ప్రభుత్వ ముఖ్యాధికారులకు ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానం పంపింది కచార్ జిల్లా డిప్యూటి కమిషనర్ కీర్తి జెల్లి. ‘మా ఇంట్లో సెప్టెంబర్ 10న వినాయకపూజ ఉంది. రండి’ అని ఆ ఆహ్వానం సారాంశం. జిల్లాలోని ముఖ్యాధికారులు ఆ రోజు కీర్తి జెల్లి బంగ్లాకు చేరుకున్నారు. అక్కడకు వెళ్లాక తమలాగే మొత్తం 25 మంది అతిథులు కనిపించారు. తాము వచ్చింది కేవలం వినాయక పూజకు మాత్రమే కాదనీ కీర్తి జెల్లి వివాహానికి అని అక్కడకు వెళ్లాకగాని వారికి తెలియలేదు. తమ జిల్లా ముఖ్యాధికారి అంత నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడం చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆనందించారు. వరుడు ఆదిత్యా శశికాంత్ వ్యాపారవేత్త. పూణె నుంచి వచ్చి క్వారంటైన్ నియమాలు పాటించాకే ఈ పెళ్లి జరిగింది. వీరిద్దరి పెళ్లి ముందే నిశ్చయమైనా లాక్డౌన్ వల్ల పోస్ట్‌పోన్ అయ్యింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విధులను వదులుకునే పరిస్థితి లేదు కనుక తన పని చోటులోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని కీర్తి తెలిపింది. దాంతో కేవలం కొద్దిమంది సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ‘జూమ్’ ద్వారా మరో 800 మంది బంధుమిత్రులు వీక్షించారు. తల్లిదండ్రులు కరోనా నుంచి కోలుకుంటున్నారు కనుక కేవలం చెల్లెలు ఐశ్వర్య మాత్రం అమ్మాయి తరఫున హాజరయ్యింది. పెళ్లికి కీర్తి ప్రత్యేకంగా సెలవు తీసుకోలేదు. పెళ్లయిన మరుసటి రోజే విధులకు హాజరయ్యి ఎప్పటిలాగే విధుల పట్ల తన అంకితభావాన్ని నిరూపించుకుంది. వరంగల్ అమ్మాయి కీర్తి జెల్లి స్వస్థలం వరంగల్. తండ్రి జెల్లి కనకయ్య న్యాయవాది. తల్లి వసంత గృహిణి. 2011లో బి.టెక్ పూర్తి చేసిన కీర్తి తన చిరకాల కోరిక అయిన ఐ.ఏ.ఎస్ ఎంపికను నెరవేర్చుకోవడానికి కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్లింది. ఆమె కుటుంబంలో, బంధువుల్లో ఎవరూ ఐ.ఏ.ఎస్‌కు వెళ్లలేదు. పైగా చదువు పూర్తయిన వెంటనే పెళ్లి చేయడం గురించి బంధువుల ఆలోచనలు ఉండేవి. కాని కీర్తి తండ్రి కనకయ్యకు కుమార్తెను ఐ.ఏ.ఎస్ చేయాలని పట్టుదల. చిన్నప్పటి నుంచి ఆయన ఇందిరా గాంధీ వంటి ధీర మహిళలను ఉదాహరణగా చూపిస్తూ కీర్తిని పెంచారు. ఐ.ఏ.ఎస్ కోచింగ్‌లో చేర్పించారు. రెండేళ్లు కష్టపడిన కీర్తి 2013 సివిల్స్‌లో జాతీయస్థాయిలో 89వ ర్యాంకూ, రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకూ సాధించింది. అస్సాంలో దూకుడు ఐ.ఏ.ఎస్ ట్రయినింగ్ పూర్తయ్యాక కీర్తికి అస్సాంలో వివిధ బాధ్యతల్లో పని చేసే అవకాశం లభించింది. జోర్హట్ జిల్లాలోని తితబార్ ప్రాంతానికి సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా కీర్తి పని చేస్తున్నప్పుడు 2016 అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చాయి. సాధారణంగా అస్సాం ప్రజలు ఎన్నికల పట్ల నిరాసక్తంగా ఉంటారు. అది గమనించిన కీర్తి తన నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెంచడానికి, ముఖ్యంగా మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరగడానికి ‘భోని’ (చిన్నచెల్లెలు) అనే ‘ప్రచారకర్త బొమ్మ’ (మస్కట్)ను తయారు చేసి అన్నిచోట్ల ఆ బొమ్మ ద్వారా ప్రజలను ఉత్సాహపరిచింది. అస్సాం సంస్కృతిలో ‘చిన్న చెల్లెలు’ అంటే మురిపం ఎక్కువ. అందుకని ఆ ప్రచారం పని చేసింది. ఇది ఎలక్షన్ కమిషన్‌కు నచ్చింది. దాంతో కీర్తికి నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘బెస్ట్ ఎలక్టొరల్ ప్రాక్టిసెస్ అవార్డ్’ ఇప్పించింది. రక్తహీనతకు ఉసిరి మురబ్బా 2019లో ‘హైలాకండి’ జిల్లాలో డెప్యూటి కమిషనర్‌గా కీర్తి బాధ్యతలు తీసుకున్నప్పుడు అక్కడి పరిస్థితులు ఆమెకు సవాలుగా మారాయి. అక్కడ 47 శాతం మహిళలు, ముఖ్యంగా టీ ఎస్టేట్స్‌లో పని చేసే కార్మిక మహిళలు రక్తహీనతతో బాధ పడుతున్నారు. ఇక 33 శాతం ఐదేళ్లలోపు పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారు. పౌష్టికాహారలోపం విపరీతంగా ఉంది. స్త్రీలకు రక్తహీనత పోవడానికి అక్కడ విస్తృతంగా దొరికే కొండ ఉసిరి నుంచి ‘ఉసిరి మురబ్బా’ (బెల్లంపాకంలో నాన్చి ఎండబెట్టిన ఉసిరి ముక్కలు) తయారు చేసి పంచడంతో గొప్ప ఫలితాలు వచ్చాయి. ఇక అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు అందించే ఆహారంతో పాటు వారంలో ఒకరోజు తల్లులు తమ ఇంటి తిండి క్యారేజీ కట్టి పిల్లలతో పంపే ఏర్పాటు చేసింది కీర్తి. అంగన్వాడీ కేంద్రాలలో ‘డిబ్బీ ఆదాన్ ప్రధాన్’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించింది. అంటే పిల్లలు ఆ రోజు తమ బాక్స్ వేరొకరికి ఇచ్చి వేరొకరి బాక్స్ తాము తింటారు. దాని వల్ల ఇతర రకాల ఆహారం తిని వారి పౌష్టికాహారం లోపం నుంచి బయట పడతారు. ఇది కూడా మంచి ఫలితాలు ఇచ్చి కీర్తికి కీర్తి తెచ్చి పెట్టింది. కోవిడ్ విధులలో 2020 మే నెల నుంచి కచార్ జిల్లా డిప్యూటి కమిషనర్‌గా ఇటు పాలనా విధులు, ఇటు కోవిడ్ నియంత్రణ కోసం పోరాటం చేస్తోంది కీర్తి. సిల్చార్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో 16 పడకల ఐ.సి.యు కోవిడ్ పేషెంట్స్‌కు సరిపోవడం లేదు కనుక కీర్తి ఆధ్వర్యంలో ఆఘమేఘాల మీద అక్కడ కొత్త ఐ.సి.యు యూనిట్ నిర్మాణం జరుగుతోంది. పెళ్లి చేసుకున్న మరుసటి రోజున కీర్తి ఈ నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి హాజరవడం చూస్తే ఆమె పని స్వభావం అర్థమవుతుంది. కీర్తి ప్రచారానికి, ఇంటర్య్వూలకు దూరంగా ఉంటుంది. తన గురించి తాను కాకుండా తన పని మాట్లాడాలని ఆమె విశ్వాసం. అది ఎలాగూ జరుగుతోంది. ప్రజలూ, పత్రికలు ఆమెను మెచ్చుకోకుండా ఎందుకు ఉంటాయి? -
చీకటిని వెలిగించాడు
సముద్ర కెరటాన్ని మించిన ప్రాక్టికల్ లెసన్ ఉంటుందా? పడినా తిరిగి లేస్తుంది.. తీరాన్ని తాకేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది! కెరటాన్ని స్ఫూర్తిగా తీసుకున్న మనుషులూ ఉన్నారు.. నలుగురిలో ఒకరిగా కాకుండా నలుగురు గర్వించదగిన స్థాయికి ఎదగాలనే తపనతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా గమ్యం చేరుకున్న విజేతలు! అలాంటి అచీవరే ఎమ్డీ షకీర్...చిన్నతనంలోనే చూపును కోల్పోయిన ఈ యువకుడు కళ్లు లేవని బెంగపడలేదు. ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంటుంది అనే ప్రాక్టికాలిటీ అర్థమైన వ్యక్తి కావడంతో అంధత్వాన్ని తన లక్ష్యసాధనకు అడ్డుగా ఏమాత్రం భావించలేదు. అనుకున్నది సాధించి కళ్లున్నవాళ్లకూ స్ఫూర్తిగా కనిపిస్తున్నాడు. మోటివేటర్‌గా ఎంతోమందిలో ఆత్మవిశ్వాసం నింపుతున్న షకీర్‌కి అయిదారేళ్ల వయసులో చూపు పోయింది. అయినా చదువు ఆపలేదు. పట్టుదలతో బ్రెయిలీ లిపి నేర్చుకుని చదువు కొనసాగించాడు. అంధుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన తొలి ఆంధ్రుడిగా నిలిచాడు. అంతేకాదు ముస్లింల పవిత్ర గ్రం«థమైన ఖురాన్‌ను బ్రెయిలీ లిపిలో రచించి, లిమ్కా బుక్‌లో స్థానం పొంది, నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ నుంచి ఎక్స్‌లెన్స్ అవార్డునూ అందుకున్నాడు. 2017, డిసెంబరులో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించిన అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ద్వారా ‘వినూత్న రత్న’ పురస్కారాన్నీ పొందాడు. షకీర్ గురించి మరిన్ని వివరాలు అతని మాటల్లోనే.. వింటూ.. అర్థం చేసుకుంటూ మాది సాధారణ కుటుంబం. మా నాన్న (సయ్యద్ ఇస్మాయేల్) పద్దెనిమిదేళ్లు మిలటరీలో పనిచేశారు. అమ్మ (రహీమా బేగం) గృహిణి. నేను యూకేజీలో ఉన్నప్పుడు గ్లకోమాతో చూపు పోయింది. మా పేరెంట్స్ మేనరిక వివాహమే ఇందుకు కారణమన్నారు. నాకు గ్లకోమా అని తేలగానే మా నాన్న ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేశారు. ఎంతో మంది డాక్టర్లకు చూపించారు. ప్రయోజనం లేదనే అన్నారంతా. యూకేజీదాకా మామూలు బడికి వెళ్లిన నేను ఒకటో తరగతికి చెన్నైలోని స్పెషల్ స్కూల్లో చేరాను. బ్రెయిలీ లిపి ద్వారా అక్కడే అయిదో తరగతి వరకు చదువుకున్నా. ఆ తరువాత నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని మామూలు బడిలోనే చేరి ఆరు నుంచి పదవ తరగతి వరకు చదివా. టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ, క్లాస్మేట్స్ గట్టిగా చదువుతుంటే అర్థం చేసుకుంటూ.. బ్రెయిలీలో పరీక్షలు రాసేవాడిని. ఇంటర్, డిగ్రీ (బీఏ, ఇంగ్లిష్ లిటరేచర్)లో మాత్రం క్లాస్‌లో లెసన్స్‌ను రికార్డ్ చేసుకునే వాడిని. ఇంటికి వెళ్లాక ప్లే చేసుకుని వినేవాడిని. ఇట్లాగే 2002లో ఎంబీఏ పూర్తి చేశాను. ఆ తరువాత తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్ చేశాను. ఆ సమయంలోనే 2002లో కుప్పంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (వికలాంగుల కోటాలో) జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. అంతా రికార్డు వర్క్‌కు సంబంధించిన ఉద్యోగం కావడంతో కంటి చూపులేక ఏ పనీ చెప్పేవారు కాదు. ఖాళీగా కూర్చోవలసి వచ్చేది. ఎగతాళితో పట్టుదల ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్‌గా ఉద్యోగం చేయాలని ఉండేది. ఎంబీఏ కంప్లీట్ అయ్యాక కొన్ని కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాను. కానీ ఏ కంపెనీ నుంచీ కాల్ లెటర్ రాలేదు. టీచింగ్‌లోకి వద్దామని ప్రైవేట్ కాలేజెస్‌ను సంప్రదించా. వాళ్లూ సుముఖత చూపించలేదు. ‘‘చూపు లేదు కదా, బోర్డు పై ఎలా రాస్తావ్? క్లాసులో స్టూడెంట్స్‌ను ఎట్లా మేనేజ్ చేస్తావ్?’’ అంటూ ఎగతాళి చేశారు. దాంతో నాలో కసి పెరిగింది. ఉద్యోగం కోసం ఎవ్వరినీ అర్థించకూడదు, నేనే నలుగురికి ఉద్యోగాలు ఇచ్చేలా ఉండాలని డిసైడ్ అయ్యా. డిసెంబరు 15, 2005లో విజయవాడలో సొంతంగా ‘ఎంపవర్ ట్రైనింగ్ సొల్యూషన్స్’ని పెట్టి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ స్టార్ట్ చేశా. ఈ 14 ఏళ్లలో 850 వరకు క్లాసెస్ నిర్వహించా. ఈ విషయం తెలుసుకుని నాడు జాబ్ ఇవ్వడానికి ఇష్టపడని కంపెనీలు, కాలేజెస్ ‘‘మా దగ్గర ఉద్యోగం చేయండి’’ అంటూ జాబ్ ఆఫర్లు ఇస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు ఇవ్వాలనేదే నా లక్ష్యం. ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే ఉన్నా. స్టీవెన్స్ హావీ, టీనీరాబిన్స్, బ్రెయిన్ట్రెసీ వంటి అమెరిక్ రచయితల పుస్తకాలను బాగా చదువుతుంటా. ప్రతి నెలా ఏదో ఓ కొత్త పుస్తకం చదువుతాను. సాధారణంగా పుస్తక పఠనం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నాకు మెమొరీ కూడా ఎక్కువే. నా సెల్ ఫోన్లో ఉన్న 600 నంబర్లను ఎలా అడిగినా టక్కున చెప్పగలను. బ్రెయిలీ లిపిలో ఉన్న రిస్ట్ వాచ్‌ను, అలాగే టాకింగ్ కంప్యూటర్ను వాడతాను. కుటుంబం.. మేము నలుగురు అన్నదమ్ములం. నేనే ఆఖరు వాడిని. మూడో అన్నకూ కంటి చూపులేదు. తనూ నాలాగే బ్రెయిలీలో డిగ్రీ వరకు చదువుకుని జగ్గయ్యపేట కాలేజ్‌లో ఇంగ్లిష్ లెక్చరర్‌గా జాబ్ చేస్తున్నాడు. పెద్దవాళ్లిద్దరూ కెనడా, యూఎస్ఏలో సాప్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. స్ట్రీట్ లైట్ కాదు.. లైట్ హౌస్ ఇంటర్లో ఉన్నప్పుడు బ్రెయిలీలో ఖురాన్‌ను రాసి లిమ్కా బుక్‌లో స్థానం సంపాదించా. అబ్దుల్ కలామ్ నుంచి ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకుంటున్నప్పుడు .. ‘నీవు స్ట్రీట్ లైట్‌వి కావు, లైట్ హౌస్వి’ అని ఆయన అన్న మాటలు నాకెప్పటికీ ప్రేరణే. వ్యక్తిత్వ వికాసంపై ఉర్దూ, తెలుగు, తమిళం, ఇంగ్లి్లష్, హిందీలలో అనర్గళంగా క్లాసెస్ ఇవ్వగలను. పర్సనాల్టీ డెవలప్మెంట్ పై 2016లో ’స్టార్ట్ ఏ న్యూ లైఫ్ నౌ’ అనే పుస్తకాన్నీ రాశా ఇంగ్లి్లష్‌లో. 2018లో ‘విజయీభవ’ పేరుతో తెలుగులో కూడా పబ్లిష్ అయింది. ప్రపంచమే క్లాస్ రూమ్ నన్నో మోడల్‌గా చూపించి, పది మందిని చైతన్యపర్చడానికి భగవంతుడు ఇలా చేశాడని భావిస్తుంటాను. జాబ్ ట్రయల్స్‌లో ఉన్నప్పుడు అంధత్వం గురించి కొద్దిగా బాధపడేవాడిని. మోటివేషన్ క్లాసులు ఇవ్వడం మొదలుపెట్టాక ఆ బాధ ఎప్పుడూ లేదు. ఇప్పుడు నాకు ప్రపంచమే క్లాస్ రూమ్. యువత ఉద్యోగమే కావాలనుకోకుండా స్వశక్తిపై వృద్ధిలోకి వచ్చి, మరో పదిమందికి ఉపాధి చూపించేలా తయారుకావాలి. వైకల్యం ఉన్నవాళ్లు దాన్నో లోపంగా భావించి బాధపడకుండా ఆత్మవిశ్వాసంతో అధిగమించాలి. మంచి జీవితానికి బాటలు వేసుకోవాలి. – గంధం రమణ, రాజానగరం, రాజమహేంద్రవరం -
రామకృష్ణరాజు ఆదర్శప్రాయుడు
పిచ్చాటూరు: పిచ్చాటూరు సమితి వూజీ ఉపాధ్యక్షుడు డీ.రామకృష్ణరాజు రాజకీయూల్లో ఆదర్శనీయుడిగా నిలిచారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయుణస్వామి పేర్కొన్నారు. ఆది వారం రావుకృష్ణరాజు ప్రథవు వర్ధం తిని పిచ్చాటూరు వుండలంలోని స్వగ్రావుం అడవిశంకరాపురంలో నిర్వహిం చారు. వుుఖ్య అతిథులుగా నారాయుణ స్వామి, పార్టీ సత్యవేడు నియోజకవర్గ సవున్వయుకర్త ఆది వుూలం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ.భాస్కర్ నాయుుడు పాల్గొని రావుకృష్ణ రాజు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. నారాయుణస్వామి వూట్లాడుతూ రావుకృష్ణరాజు సమితి ఉపాధ్యక్షుడిగా వుండలానికి చేసిన సేవలు చిరస్మరణీయువున్నారు. తాను సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఆయన తోడు నీడగా ఉండేవారని తెలిపారు. పార్టీ సత్యవేడు నియోజకవర్గ సవున్వయుకర్త ఆదివుూలం వూట్లాడుతూ రావుకృష్ణరాజు అడుగు జాడల్లో నడుస్తూ గత ఏడాది గ్రావుంలో వంద శాతం వురుగుదొడ్లు నిర్మించి నిర్మల్ గ్రావు పురస్కార్ జాతీయు అవార్డు అందుకున్న ఘనత ఆయున కువూరుడు పద్మనాభరాజుకు దక్కిందన్నారు. ఈ కార్యక్రవుంలో పార్టీ వుండలాధ్యక్షుడు టి.హరిశ్చంద్రారెడ్డి, వూజీ ఎంపీపీ కె.కైలాసరెడ్డి, వైస్ ఎంపీపీ ఢిల్లీరాజు, టీడీపీ వుండలాధ్యక్షుడు ఇళంగోవన్ రెడ్డి, సర్పంచ్ తొప్పయ్యు, వూజీ సర్పంచ్‌లు జయుచంద్ర నాయుుడు, చెంగల్రాయు రెడ్డి, ఆర్ఎస్.రాజు, ఎంపీటీసీ అశోకన్, శ్రీనివాసులు, రవి, శంకర్, భక్తన్, వినాయుగం పాల్గొన్నారు. -
ఎల్లన్న ఇక లేరు
నారాయణపేట రూరల్: జిల్లాలో ఎల్లన్న అని పిలిస్తే పలికే నేతగా.. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు సుపరిచితులైన మాజీమంత్రి, మక్తల్ మాజీఎమ్మెల్యే ఎల్కోటి ఎల్లారెడ్డి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కనుమూశారు. భార్య పద్మమ్మ మూడేళ్లక్రితమే చనిపోయారు. ఆయనకు నలుగురు కొడుకులు ఉన్నారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన వార్డుసభ్యుడి నుంచి రాష్ట్రమంత్రి వరకు ఎదిగారు. నేటి తరానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. 1939 అక్టోబర్ 1న ఊట్కూర్ గ్రామానికి చెందిన మున్నురుకాపు ఎల్కొటి ఎంకమ్మ, ఆశన్నలకు ఎల్లారెడ్డి జన్మించారు. చిన్నతనంలోనే తల్లి ఎంకమ్మ మరణించడంతో తల్లిప్రేమకు దూరమయ్యాడు. నాయనమ్మ లక్ష్మమ్మ వద్దే పెరిగాడు. ఎల్లారెడ్డి ప్రాథమిక విద్యను ఊట్కూర్లోనే ప్రారంభించారు. హెచ్‌ఎల్‌సీసీ నారాయణపేటలో పూర్తిచేశారు. పీయూసీ హైదారాబాద్‌లోని న్యూసైన్స్ కళాశాలలో చదివారు. వార్డు సభ్యుడిగా.. గ్రామ రాజీకయాల్లో చురుకుగా పాల్గొంటూ మొట్టమొదటిసారిగా 1965లో గ్రామపంచాయతీ సభ్యులుగా ఎన్నికయ్యారు. తన రాజకీయ గురువు చిట్టెం నర్సిరెడ్డితో విభేదించి నందమూరి తారకరామరావు సమక్షంలో 1988లో ఎల్లన్న టీడీపీలో చేరారు. రెండు ద ఫాలుగా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1994లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తల కోరిక మేరకు మక్తల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి తన రాజకీయ గురువు చిట్టెం నర్సిరెడ్డిపై విజయం సాధించారు. అయితే టీడీపీ సంక్షోభంలో చంద్రబాబు నాయుడు వంచన చేరడంతో ఎల్లారెడ్డికి 1997లో మంత్రి పదవి లభించింది. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రిగా పనిచేశారు. 1999 రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. టీడీపీ నుంచి 2009లో ఎమ్మెల్యేగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి సూగప్పపై ఎల్లారెడ్డి 10వేల ఓట్ల మెజార్టీతో నారాయణపేట తొలి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో టీఆర్ ఎస్‌లో చేరిక.. 25ఏళ్లుగా టీడీపీలో ఉన్న ఎల్లారెడ్డి మక్తల్ అసెంబ్లీ నుంచి టీడీపీ టికెట్ ఆశించి భంగపడటంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. 2014 ఏప్రిల్ జరిగిన ఎన్నికల్లో చిట్టెం రాంమోహన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. టీడీపీలో ఉన్న సమయంలో తన అనుచరులను ఒక్కొక్కరిని తన గూటికి చేర్చుకుంటూ ప్రత్యర్థుల గుండెల్లో అలజడి రేపారు. ఎల్లారెడ్డి తన రాజకీయ జీవితంలో ఎవరితోనూ ముక్కుసూటిగా మాట్లాడలేదు. కానీ తనను నమ్మినవారి కోసం ఎదుటివాళ్లను మందలిస్తూ పనులు చక్కబెట్టేవారు.