పిల్లలకోసం, పిల్లల కోరికమేరకు కొండ మీది కోతిని తెమ్మన్నా తేవడానికి సిద్ధంగా ఉంటారు తల్లిదండ్రులు. పిల్లల సంతోషం కోసం ఎంత కష్టమైనా భరించడానికి సన్నద్దమవుతారు. అలా 40 ఏళ్ల తండ్రి చేసిన సాహసం గురించి వింటే ఔరా అంటారు. నిబద్దతతో ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించాడు. క్షణం ఆలస్యం చేయకుండా అంతటి ఆశ్చర్యకరమైన స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి మరి..
సుమిత్ దబాస్ (40) రీటైల్ మేనేజర్‌గా పనిచ్తేస్తున్నారు. తన ఆరోగ్యం గురించి లేదా శరీరం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. అప్పటికి అతను బరువు 90 కిలోలు. గతంలో ఉన్నంత బలం లేదు. అయితే ఏడేళ్ల కుమారుడి కోరిక మేరకు 40 ఏళ్ల వయసులో సాహసానికి పూనుకున్నాడు. ఏకంగా 22 కిలోల బరువు తగ్గి సిక్స్‌ప్యాక్ బాడీ సాధించాడు అయితే ఈ ప్రయాణం అంత ఈజీగా ఏమీ సాగలేదు. క్రమశిక్షణతో ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని, వ్యాయామం సాయంతో అనుకున్నది సాధించి స్ఫూర్తిగా నిలిచాడు.
ఇంతకీ కొడుకు కోరిక ఏమిటంటే
కానీ అతని కొడుకు నివాన్ ఒక రోజు తండ్రిని చూసి "నాన్న, మీ బలమైన శరీరాన్ని ఎప్పుడూ చూడలేదు. మీరు మళ్ళీ ఫిట్ బాడీని పొందగలరానా స్నేహితులకు చూపించాలని ఉంది’’ అన్నాడు. అంతే ఎలి అయినా సిక్స్ ప్యాక్‌తో ఫిట్ బాడీ సాధించాలనుకున్నాడు.
సుమిత్‌కు క్రికెట్ అతనికి ఇష్టమైన ఆట. కానీ అంత పెద్ద భారీ కాయంతో క్రికెట్ ఆడే ఓపిక లేదు. ప్రొఫెషనల్ పర్సనల్ ట్రైనర్ అయిన సుమిత్, తన బరువు తగ్గే ప్రయాణంలో, మనస్తత్వాన్ని మార్చుకోవడం ముఖ్యమని కూడా అర్థమైంది.
తొలి అడుగు
తొలి ఆరు నెలలు విపరీతంగా కష్టపడ్డాడు. కానీ చాలా అర్థమైంది. జీవనశైలి మార్పులుతో 15 కిలోల బరువు తగ్గి 90 కాస్త 75కి వచ్చింది. కానీ ఇంకా తగ్గాలి. కండలు రావాలి. సిక్స్ ప్యాక్ బాడీ రావాలంటే, ప్రొఫెషనల్ ట్రైనర్ అవసరమని గ్రహించాడు.
హేమంత్ అనే ఫిట్‌నెస్ కోచ్ ఆధ్వర్యంలో ట్రాక్‌లోకి వచ్చింది. అధిక ప్రోటీన్, తక్కువ కేలరీల ఆహారాన్ని సిద్ధం చేశాడు. ఇక వ్యాయామం విషయానికి వస్తే, సుమిత్ హెవీ ఎక్సర్‌సైజ్‌ల మక్కువ పెంచుకున్నాడు. ఇదే కండల నిర్మాణంలోనూ మొత్తం శారీరక రూపాన్ని అందంగా మార్చడంలో తోడ్పడింది అంటాడు కండలు తిరిగిన దేహంతో సుమిత్.
మొత్తానికి ఏడాది కష్టం తరువాత ఇపుడు సుమిత్ బరువు 68 కిలోలు. తన కొడుకుకు గర్వకారణమైన తండ్రిగా నిలిచాడు. తన పిల్లలతో ఆడుకోవడమైనా, తనకు ఇష్టమైన క్రీడ క్రికెట్ ఆడటమైనా, గతంలో కష్టంగా కాకుండా, ఇష్టంగా,హాయిగా ఆడుతున్నాడు. ఈ వెయిట్ లాస్ జర్నీలో సహకరించిన కుటుంబానికి, కోచ్‌కీ సుమిత్ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రతి దశలోనూ తన భార్య , కుమార్తె ప్రోత్సహించారని, నివాన్ ఉత్సాహం తన బరువు తగ్గే ప్రయాణాన్ని సులభతరం చేసిందని సుమిత్ చెప్పాడు.
బరువు తగ్గాలనుకునే వారికి సుమిత్ ఇచ్చే చిట్కాలు ఏమిటి?
చీట్ మీల్ తీసుకున్నా లేదా అప్పుడప్పుడు వ్యాయామం దాటవేసినా పెద్దగా బాధపడకండి.
చేయాల్సిన దానిపై దృష్టిపెట్టి, ముందుకు సాగండి. పట్టుదలగా లక్ష్యం వైపు సాగండి
కుటుంబం, స్నేహితులు , కోచ్ సహాయం తప్పనిసరిగా తీసుకోండి.
ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది...బరువు తగ్గడం అనేది రాత్రికి రాత్రే అయ్యే పనికాదు.
సుదీర్ఘకాలంపాటు పట్టుదలగా క్రమశిక్షణతో చేయాలి.
ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి, ఏ దశలోనూ ప్రయత్నాన్ని వదులుకోవద్దు.
Comments
Please login to add a commentAdd a comment