తనకి ఏమైపోతుందో అని ఆ కొడుకు పెట్టిన కన్నీళ్లు ఆ తల్లిలో మార్పు తీసుకొచ్చింది. ఆ మార్పు ఎలాంటిదంటే.. గుర్తుపట్టలేనంతంగా ఆమె మారిపోయేలా!సోషల్ మీడియాలో ఓ తల్లి విజయవంతమైన ప్రయత్నం గురించి జోరుగా చర్చ నడుస్తోంది. ఒకప్పుడు 114 కేజీల బరువు ఉన్న ఆమె.. ఏకంగా 62 కేజీలు తగ్గిపోయింది. అంత బరువూ తగ్గడానికి ఒకే ఒక్క కారణం కొడుక్కి తన మీద ఉన్న అమితమైన ప్రేమ.. అది బయటపడేలా చేసిన ఓ చేదు అనుభవం..
అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన సారా లాకెట్ అనే మహిళ 114 కిలో బరువు ఉండేది. ఓరోజు కుటుంబంతో కలిసి సరదాగా బయటకు వెళ్లారు. కొడుకుతోపాటు స్లైడ్‌లోకి వెళ్లగా మలుపు తిరుగుతున్న సమయంలో ఆమె స్లైడ్‌లో ఇరుక్కుపోయింది. తల్లిని చూసిన కొడుకు కంగారు పడిపోయాడు. ఆమెకు ఏమైందోనని కన్నీరు పెట్టుకున్నాడు. చివరికి ఆమె భర్త వచ్చి తనను బయటకు తీశాడు.
అయితే కొడుకు ముందు అలా జరగడం సారాకు ఇబ్బందిగా అనిపించింది. స్లైడ్‌లో చిక్కుకోవడానికి తన బరువే కారణమని బాధపడింది. కొడుకు ముందు అవమానం జరిగిందంటూ భావించి.. అతని కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. ఎలగైనా బరువు తగ్గాలని డిసైడ్ అయ్యింది. కేవలం తన డైట్ మార్చి, వర్కౌట్ల ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నించింది.
చదవండి: మెన్స్ డే.. ఇది జోక్ కాదు బ్రదర్!
ఈ ప్రక్రియలో మహిళకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. తనకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది బరువు తగ్గాలన్న ఆమె ఆశయాన్ని కష్టతరం చేసింది. దీంతో తన లైఫ్‌స్టైల్, డైట్‌ను పూర్తిగా మార్చుకుంది. వైద్యుల సలహా తీసుకొని.. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా జాగ్రత్తలుు తీసుకుంది. వర్కౌట్స్, పోషక విలువులు కలిగిన డైట్ కంటిన్యూ చేసింది.
రోజుకి 3వేల క్యాలరీలు బర్న్ చేయడం ప్రారంభించింది. అల్పాహారంగా టమాటా, బచ్చలికూర, గుడ్డులోని తెల్లసొన.. భోజనంలో కొద్దిగా రైస్, ఉడికించిన కూరగాయాలు, ఆకు కూరలను మాత్రమే క్రమం తప్పకుండా తీసుకుంది. ఫలితంగా ఆమె శరీరంలో భారీ మార్పును చూసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 62 కేజీల బరువు తగ్గింది. ప్రస్తుతం 53 కేజీల బరువుతో ఉంది.
నిజానికి ఆమె మొదట్లో అంత బరువు ఉండేది కాదట. ప్రెగ్నెన్సీ సమయంలో ఆమెకు జరిగిన సర్జరీల కారణంగా అంత బరువు పెరిగిపోయిందట. మొదటి ప్రెగ్నెన్సీ సమంలో 26 కేజీలు పెరిగిందని, అలా మూడో బిడ్డ వరకు 133 కిలోలకు వచ్చినట్లు చెప్పుకొచ్చింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు సరైన ఫుడ్ తీసుకోలేదని, ఎక్కువగా వేయించినవి, పాస్తా, ఫాస్ట్‌ఫుడ్ ఇలా దొరికిన ఆహారాన్ని లాగించేదానినని తెలిపింది. దీంతో బీపీ పెరిగి, డయాబెటిస్ కూడా వచ్చిందని తెలిపింది. అందుకే బరువు పెరిగినట్లు పేర్కొంది.
అయితే ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో వెంటనే బరువు తగ్గాలని నిర్ణయం తీసుకున్నారు. చివరకి ఊహించని విధంగా ట్రాన్స్‌ఫార్మింగ్ చెందారు. బరువుతో ఉన్నవి.. బరువు తగ్గిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఇంత బరువు తగ్గడం అంటే మామూలు విషయం కాదని ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment