బరువు తగ్గేందుకు ప్రస్తుతం రకరకాల డైట్‌లు ట్రెండ్ అవుతున్నాయి. కొందరు మాకు ఆ డైట్ పనిచేసింది, తొందరగా బరువు తగ్గామని చెప్పేస్తుంటే.. ఏది ఫాలో కావాలో తెలియని గందరగోళం ఎదురవ్వుతోంది. పోనీ అవి ఫాలో అయినా.. బరువు తగ్గలేదని కొందరు వాపోతుంటే..ఇదేంట్రా దేవుడా అనిపిస్తుంటుంది. ఇలాంటి అనుభవం చాలామందికి పరిచయమే. అచ్చం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నప్పటికీ.. మొక్కవోని దీక్షతో బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు. అవేమీ వద్దు ఈ డైట్ ఫాలోకండి అంటూ కనివినీ ఎరుగని విధమైన ఆహారపు అలవాట్ల గురించి చెప్పుకొచ్చాడు. తెలిస్తే మాత్రం ఇదా..! అతడి సీక్రెట్ అని విస్తుపోవడం ఖాయం.
అమెరికాకు చెందిన నిక్ జియోప్పో జస్ట్ ఒక్క ఏడాదిలో 48 కిలోలు బరువు తగ్గి అందరూ ఆశ్చర్యపోయే రీతీలో స్లిమ్‌గా తయారయ్యాడు. అంతేగాదు వెయిట్ లాస్ జర్నీలో స్ఫూర్తిగా నిలిచాడు. బరువు తగ్గడం అనేది క్రమానుగుణంగా జరిగితేనే సత్ఫలితాలిస్తుందని చెబుతున్నాడు నిక్. అతను సోషల్ మీడియాలో చెప్పే చిట్కాలు, ప్రముఖలు చెప్పే ప్రతి డైట్‌ని ఫాలో అయ్యేవాడనని, ఐతే మొదట్లో బరువు తగ్గినా.. సరైన లక్ష్యం మాత్రం చేరుకోలేకపోయినట్లు తెలిపాడు.
ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్న ప్రతీ డైట్‌ని ఫాలో అయినట్లు చెప్పాడు. ఐతే అవేమీ తనకు మంచి ఫలితాన్ని అందివ్వకపోగా, ఆహారంపై నియంత్రణ లేకపోవడం, తినలేకపోతున్న బాధ ఇంకా ఎక్కువయ్యాయని వెల్లడించారు. తనకు ఈ ప్రయత్నాల వల్ల తెలిసిందేంటంటే..ఎవ్వరు బరువు తగ్గాలన్నా.. ముందుగా మానసికంగా మైండ్‌ని సెట్ చేసుకోవాలి.
ఆ తర్వాత తినడంలో కామెన్ సెన్స్‌తో వ్యవహరించాలి. అప్పుడే మనం ఎలాంటి డైట్‌ని అనుసరించినా.. మంచి రిజల్ట్ వస్తుందని చెబుతున్నాడు. తాను మాత్రం కామెన్ సెన్స్ డైట్‌ని ఫాలో అయ్యి తొందరగా బరువు తగ్గినట్లు తెలిపాడు నిక్కీ.
కామెన్ సెన్స్ డైట్ అంటే..
ఏం తింటున్నామో.. దానిపై ధ్యాస ఉండాలి.
తగ్గాలి కాబట్టి తక్కువగా తినాలనుకోవద్దు. ఆరోగ్యం కోసం మితంగా తింటున్నా అనే భావనతో మొదలుపెట్టాలి.
నోరు ఎండబెట్టేసుకునేలా కఠిన పత్యం వద్దు. ఇష్టమైన వాటిని హాయిగా తినేసి..మరుసటి రోజు అందుకు తగ్గట్టు వర్కౌట్‌లు లేదా కాస్త డైట్ ఎక్కువగా పాటించాలి. అలా అని శృతిమించేలా తినొద్దు.
కేవలం నచ్చిన పదార్థాలు దూరం చేసుకోకండా ఆరోగ్యంగా తినేలా ప్రాధాన్యత వహించండి.
తింటున్నప్పుడు కాస్త కామెన్ సెన్స్‌తో వ్యహరించండి చాలు. ఇలా చేస్తే..బరువు తగ్గడం ఏమంత కష్టం కాదని నమ్మకంగా చెబుతున్నాడు నిక్. ఇది తన అనుభవాల ద్వారా తెలుసుకున్న సత్యం అని అంటున్నాడు.
పెద్దలు అన్నట్లు అనుభవపూర్వకంగా నేర్చుకున్న జ్ఞానానికి మించి ఏదీ లేదన్నట్లుగా..స్వతహాగా శరీరానికి సరిపడే విధంగా అనుసరించే డైటే మేలు అని చాటిచెప్పాడు కదూ..!.
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి అనుసరించడం ఉత్తమం.
(చదవండి: అంతర్జాతీయ మోడల్ హఠాన్మరణం.)
Comments
Please login to add a commentAdd a comment