
ప్రతి ఆడపిల్ల ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. అప్పుడే మనం ఏం చెప్పిన నెగ్గుతుంది. ఎంతటి ధనవంతుడిని పెళ్లి చేసుకున్న ధైర్యంగా ఉండలేం. ఆర్థికంగా బాగుంటేనే స్థైర్యం దాతనంతటే అదే తన్నుకుంటూ వస్తుంది. ఆ విషయంలో నాకు మా అమ్మే స్ఫూర్తి అంటోంది బాలీవుడ్ నటి సొనాలీ బెంద్రే. అదెలాగో ఆమె మాటల్లో చూద్దామా..!.
ఎలాగంటే...‘మేము ముగ్గురం అక్కచెల్లెళ్లం. ఆడపిల్లలకు చదువు, ఆర్థిక స్వాతంత్య్రం చాలా ముఖ్యమని నమ్ముతుంది మా అమ్మ (పేరు.. రూప్సీ బెంద్రే). నేను మోడలింగ్ ట్రయల్స్‌లో ఉన్న రోజుల్లో ఒకసారి.. నన్ను, నా సిస్టర్స్‌ని కూర్చోబెట్టుకుని చెప్పి ‘మీరు ఎంత సంపన్నులను తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పినా నేను పర్మిషన్ ఇవ్వను.
మీ కాళ్ల మీద మీరు నిలబడి.. ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ అయ్యాకే.. పెళ్లి! ఆర్థిక స్వాతంత్య్రం ఉంటేనే మీకు వాయిస్ ఉంటుంది.. గుర్తుపెట్టుకోండి’ అని చెప్పింది. ఆ మాట మంత్రంలా పనిచేసింది మాకు. కెరీర్‌లో ఎదగడానికి స్ఫూర్తినిచ్చింది.
నేనీ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే స్ఫూర్తి అమ్మే! నిజంగానే ఆడపిల్లకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలి. దాని వల్ల ఒక భరోసా వస్తుంది. ఆ భరోసా మనల్ని స్ట్రాంగ్‌గా నిలబెడుతుంది!’.
(చదవండి: ఆ చేప పోరాటానికి ఫిదా కావాల్సిందే..!)