లండన్: చదువు అంతగా అబ్బలేదు. దీంతో 16 ఏళ్లకే స్కూల్‌కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. బతకడానికి డ్రైవింగ్ వృత్తిని ఎంచుకున్నాడు, ఉద్యోగంతో జీతం వస్తుంది గానీ జీవితం కాదని తెలుసుకున్నాడు. ఉన్న అనుభవంతో వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి మిలియనీర్‌గా మారాడు యూకేలోని యోర్క్‌షైర్‌కు చెందిన స్టీవ్ పార్కిన్. వివరాల్లోకి వెళితే.. స్టీవ్ పార్కిన్ తన చిన్నతనంలో చదవడమంటే పెద్దగా నచ్చేది కాదు.
దీంతో 1992లో చదువు మానేసి హెవీ గూడ్స్ వెహికల్ లైసెన్స్ పొంది బతకడం కోసం డ్రైవర్‌గా మారాడు. అలా అతను చేసిన ఉద్యోగాలలో ఒకటి హడర్స్‌ఫీల్డ్ బోన్‌మార్చే దుస్తుల కంపెనీకి డ్రైవింగ్ చేయడం. ఇక అప్పటి నుంచి దొరికిన పని చేస్తూ జీవితంలో ముందుకు కదిలాడు. అయితే ఉద్యోగం కన్నా వ్యాపారమే మిన్నా అనే విషయం తెలుసుకున్నాడు. అయితే వ్యాపారం అంటే అంత సులువుగా కాదని తెలుసు కానీ ఆ సమయంలో రిస్క్ తీసుకుని తన దగ్గర ఉన్న డబ్బులు, అతనికున్న అనుభవంతో వ్యాపారం మొదలుపెట్టాడు. అలా చిన్నగా మొదలైన అతని క్లిప్పర్ అనే ఆన్‌లైన్ లాజిస్టిక్స్ కంపెనీని గత ఏడాది మాత్రమే £45 మిలియన్ (రూ. 450 కోట్లు) అర్జించే సంపన్నుడిగా మారాడు.
బిజినెస్ ఇన్‌సైడర్ ప్రకారం.. యార్క్‌షైర్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలో "మ్యాన్ విత్ ఎ వ్యాన్"గా ప్రారంభమైన పార్కిన్ 10వ స్థానంలో ఉన్నాడు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాపారాలను ప్రభావితం చేసి, తిరోగమనం వైపు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. కానీ ఇళ్లలో చిక్కుకుపోయిన ప్రజల కోసం.. కావాల్సిన వస్తువులను పంపించి తన కంపెనీ వాల్యూను ఒక్కసారిగా పెంచుకోగలిగాడు. ఈ సమ్మర్‌లోనే తన కంపెనీ టర్నోవర్ 39.1 శాతం పెరిగడంతో పాటు కంపెనీ విలువ కూడా 700 మిలియన్ పౌండ్లకు చేరింది. దీంతో ఇటీవలే మరో 2000 మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. ప్రస్తుతం స్టీవ్ కంపెనీలో 10వేల మంది పనిచేస్తున్నారు.
చదవండి: Frida Kahlo Paintings: బాప్‌రే! ఈ పేయింటింగ్ ధర రూ. 260 కోట్లా!!
Comments
Please login to add a commentAdd a comment