
కోలీవుడ్ నటి శ్రుతి
తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేస్తామని బెదిరింపులు వస్తున్నట్లు నటి శ్రుతి ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి, విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస తమిళులను మోసం చేసి డబ్బు దోచుకున్న ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యి కలకలం సృష్టించిన నటి శ్రుతి ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. సేలంకు చెందిన బాలమురుగన్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కోవై, పాపనాయగన్‌పాళైయంకు చెందిన నటి శ్రుతిని ఆమెకు సహకరించిన తల్లిదండ్రులు, సోదరుడిని పోలీసులు గత ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు. ఆ తరువాత శ్రుతిపై పలు కేసులు నమోదయ్యాయి. ఆమె సోదరుడు సుభాష్‌తో పాటు మరో ముగ్గురిని గూండా చట్టం క్రింద అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.
నటి శ్రుతి మాత్రం ఇటీవల నిబంధనలతో కూడిన బెయిల్‌పై విడుదలైయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం ఆమె కోవై 5వ నేర విభాగ కోర్టుకు వచ్చి సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనపై పోలీసుల బెదిరింపుల పరంపర కొనసాగుతోందని పేర్కొన్నారు. విచారణ సమయంలో పోలీసు అధికారులు బలవంతపు ఒత్తిడి గురించి మానవహక్కుల సంఘం, మహిళా సంఘాలకు ఫిర్యాదు చేశానని, వారికి అందుకు తగిన ఆధారాలను అందించనున్నట్లు తెలిపారు. కొందరు అగంతకులు తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. దీంతో తనకు బయటకు రావాలంటేనే భయమేస్తోందని శ్రుతి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment