
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ నటి కృతి సనన్ సీతగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. జూన్ 16న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలిరోజే మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం కావడంతో సినీ విమర్శలకు ఆగ్రహానికి గురైంది. ఈ చిత్రంలోని కొన్ని పాత్రలు, డైలాగ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
సినిమాలో రావణుడిని చూపించిన విధానంపై ఇప్పటికే పలువురు మండిపడ్డారు. రావణుడి విచిత్రమైన హెయిర్ స్టైయిల్‌తో పాటు రెండు వరుసలలో పది తలకాయలను చూపించడం.. ఇలా పలు విషయాలు భారీ వివాదాలకు దారి తీశాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు ఓం రౌత్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
(ఇదీ చదవండి: కేపీ చౌదరితో సురేఖా వాణి కూతురి ఫోటో వైరల్)
అయితే జూ.ఎన్టీఆర్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జై లవకుశ సినిమా విడుదల సందర్భంగా జూ. ఎన్టీఆర్ రావణుడి పాత్ర వేసినప్పుడు రామాయణంతో పాటు రావణుడి గురించి ఎక్కడ సమాచారం సేకరించాడో తెలిపాడు. పౌరాణికానికి సంబంధించిని సినిమాలు చేస్తున్నప్పుడు అందులోని పాత్రల సమాచారం కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ అందులోని విషయాన్ని పాడు చేయకుంటే చాలని ఎన్టీఆర్ ఇలా తెలిపాడు.
'జై లవకుశ' సినిమా ప్రారంభానికి ముందే రావణుడి గురించి తెలుసుకునేందుకు.. ఆనంద్ నీలకంఠ రాసిన 'అసుర' అనే పుస్తకాన్ని చదివాను. రావణుడు 18 లోకాలకు రాజు మాత్రమే కాదు అసురుల చక్రవర్తి కూడా.. అన్ని లోకాలకు అధిపతి అయ్యాడంటే అతడికి ఎంత నేర్పు ఉండాలి. అలాంటి వ్యక్తి కళ్లు ఎలా ఉండాలి. ఇవన్నీ రావణుడిలో కనిపించాలి. అందుకే రాముడు కూడా యుద్ధం సమయంలో రావణాసురుడు చూడగానే ఇంత గొప్ప వ్యక్తివా నువ్వు అని పద్యాన్ని అందుకున్నాడు.
అలా రావణడు ఎక్కడైనా నిలబడితే శత్రువు సైతం అతడిని పొగిడేలా ఉండాలి. అలా ఆ పాత్ర చేసేటప్పుడు నేను కూడా ఎలా మాట్లాడాలి? అన్న విషయాలను తెలుసుకున్నాను.' అని చెబుతూనే ఆ పుస్తకం తనకు జై లవకుశ సినిమా కోసం సహాయపడిందని తెలిపాడు.
(ఇదీ చదవండి: వ్యూహం టీజర్..ఒక్క డైలాగ్‌తో అంచనాలు పెంచేసిందిగా!)
ఒక సినిమాలో కేవలం రావణుడి పాత్ర చేస్తున్న ఎన్టీఅరే తన క్యారెక్టర్ కోసం అంత పరిశోధన చేస్తే.. ఆదిపురుష్‌లో రావణుడి పాత్ర కోసం మూవీ మేకర్స్ ఎంతలా కసరత్తు చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోవైపు జైలవకుశ సమయంలో ఎన్టీఆర్ చేసిన కసరత్తుపై తన అభిమానులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా ద్వారా మెచ్చుకుంటున్నారు.
@tarak9999 did research like this for a small character then how much research should be done to make Ravan's Character 🤷♂️#ManOfMassesNTR #Ntr30 #Devara #Ravana pic.twitter.com/9leIW2FQf3
— Narasimha (@NTRNarasimha_) June 19, 2023