అప్పుడు తమ్ముడు.. ఇప్పుడు అన్న! | Kalyan Ram New Movie Titled as Ravana | Sakshi

అప్పుడు తమ్ముడు.. ఇప్పుడు అన్న!

Jul 3 2019 3:24 PM | Updated on Jul 3 2019 3:24 PM

Kalyan Ram New Movie Titled as Ravana - Sakshi

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన సూపర్‌ హిట్ సినిమా జై లవ కుశ. ఈ సినిమాలో ఎన్టీఆర్ చేసిన రావణ్‌ మహరాజ్‌ పాత్రకు ఆ పాత్రలో ఎన్టీఆర్‌ పలికించిన హావభావాలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు అదే పేరుతో ఎన్టీఆర్ అన్న నందమూరి కల్యాణ్‌ రామ్‌ సినిమా చేయనున్నాడు.

‍మల్లిడి వేణు దర్శకుడిగా కల్యాణ్ రామ్‌ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ట్స్‌ బ్యానర్‌పై ఈసినిమాను తెరకెక్కించనున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఈ సినిమాకు తుగ్లక్‌ అనే టైటిల్‌ను పరిశీలించినా ఫైనల్‌గా రావణ అయితే బాగుటుందని ఫిక్స్‌ అయ్యారు. అయితే ఈ టైటిల్‌తో మోహన్‌బాబు ప్రధాన పాత్రలో 100 కోట్లతో పౌరాణిక చిత్రాన్ని ప్లాన్‌ చేశారు.

మరి ఇప్పుడు అదే టైటిల్‌తో కల్యాణ్‌ రామ్‌ సినిమా అంటూ వార్తలు వస్తుండటంతో మంచు ఫ్యామిలీ స్పందన ఎలా ఉంటుందో అన్న చర్చ జరుగుతోంది. 118 హిట్‌తో తిరిగి ఫాంలోకి వచ్చిన కల్యాణ్ రామ్‌ ఆ జోష్‌ను కంటిన్యూ చేసేందుకు కష్టపడుతున్నాడు. మరి రావణ మరో హిట్ ఇస్తాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement