నాడు తమ్ముడు నేడు అన్నతో సిక్స్ ప్యాక్
చెన్నై: దర్శకుడు పూరీ జగన్నాథ్ టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ను సిక్స్ ప్యాక్ లో చూపించారు. తాజాగా ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ తో పూరీ ఇజమ్ సినిమా చేస్తున్నారు. కథలో పాత్ర డిమాండ్ మేరకు కళ్యాణ్ ను సిక్స్ ప్యాక్ లో చూపించనున్నారని సమాచారం. ఇందుకోసం కళ్యాణ్ రామ్ నాలుగు నెలలుగా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అదితి ఆర్య, ప్రతినాయకునిగా జగపతి బాబు నటిస్తున్నారు.