యూట్యూబ్లో దుమ్మురేపుతున్న'ఇజం' ట్రైలర్!
'పటాస్'తో చాలా కాలం తరువాత హిట్ కొట్టిన టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్. ఈ నందమూరి యంగ్ హీరో మాస్ బాట పట్టి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇజం సినిమాలో నటిస్తున్నాడు. గతంలో టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ను సిక్స్ ప్యాక్ లో చూపించిన పూరీ, ఈ మూవీ కోసం కళ్యాణ్ రామ్ తో సిక్స్ ప్యాక్ చేయించాడు. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఇజం మూవీ థియరిటికల్ ట్రైలర్ సెప్టెంబర్ 5న విడుదలైంది. తమ అభిమాన హీరో సిక్స్ ప్యాక్ లో ఎలా కనిపిస్తాడో చూడాలని నందమూరి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దీంతో సోమవారం విడుదలైన ఇజం ట్రైలర్ ను యూట్యూబ్ లో ఇప్పటికే 3.5 లక్షల మంది వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.
ఇటీవలే స్పెయిన్‌లో ఇజం మూవీ భారీ షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల మూవీలేవీ లేకపోవడంతో ఇజం మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తూ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ జోడీగా అదితీ ఆర్య కనిపించనుంది. విజయ దశమి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయాలని మూవీ యూనిట్ భావిస్తుంది. జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ల భరణి, పోసాని తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.