
‘ఇస్మార్ట్ శంకర్’ హవా ఇంకా తగ్గలేదు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్‌లో గతేడాది వచ్చిన ఈ సినిమా యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. తాజాగా 100 మిలియన్ల(10 కోట్లు) మార్క్‌ను దాటేసి సత్తా చాటింది. ఫిబ్రవరి 16న యూట్యూబ్‌లో పెట్టిన హిందీ వెర్షన్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా లైకులు కూడా తెచ్చుకుంది. ఆన్‌లైన్‌లో డబ్బింగ్ సినిమాల ద్వారా 10 కోట్ల వ్యూస్, 10 లక్షలకు పైగా లైకులు తెచ్చుకోవడం హీరో రామ్‌కు ఇది నాలుగోసారి. ఈ ఘనత సాధించిన మొదటి హీరో రామ్ అని చిత్రయూనిట్ పేర్కొంది. కాగా, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలోని దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్ కూడా ఇటీవల 100 మిలియన్ వ్యూస్ మార్క్‌ని దాటింది.
ఈ సందర్భంగా అభిమానులకు హీరో రామ్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన నటించిన ‘రెడ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ఏప్రిల్ 9 విడుదల చేయాలనుకున్నారు. కరోనా సంక్షోభం కారణంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో విడుదల వాయిదా పడింది. (100 మిలియన్ మార్కును దాటిన 'ఇస్మార్ట్' పాట)
Comments
Please login to add a commentAdd a comment