hindi dubbing version
-
థియేటర్లలో మళ్లీ రిలీజ్ కానున్న అల వైకుంఠపురములో..
పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'తో సూపర్ డూపర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి హిందీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అల వైకుంఠపురములో హిందీ డబ్బింగ్ వర్షన్ జనవరి 26న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 'పుష్ప ప్రభంజనం తర్వాత అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేయనున్నాడు. తెలుగులో ఎంతగానో హిట్ అయిన ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ జనవరి 26న రిలీజ్ కానుంది' అని పేర్కొన్నాడు. 2020వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీ ఎన్నో రికార్డులను తిరగరాసింది. రాములా రాములా.., సామజవరగమన.., బుట్టబొమ్మ బుట్టబొమ్మ.. పాటలు ఎంత సెన్సేషనో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ అక్కడ షెహజాదాగా రీమేక్ అవుతోంది. బన్నీ, పూజా హెగ్డే పాత్రల్లో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ కనిపించనున్నారు. ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో టబు పాత్రలో బాలీవుడ్ నటి మనీషా కొయిరాల నటిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ALLU ARJUN: AFTER 'PUSHPA', NOW HINDI DUBBED VERSION OF 'ALA VAIKUNTHAPURRAMULOO' IN CINEMAS... After the historic success of #PushpaHindi, #AlluArjun's much-loved and hugely successful #Telugu film #AlaVaikunthapurramuloo has been dubbed in #Hindi and will release in *cinemas*. pic.twitter.com/1jqkcqCEzI — taran adarsh (@taran_adarsh) January 17, 2022 -
తగ్గని ‘ఇస్మార్ట్ శంకర్’ హవా.. రామ్ పోతినేని సరికొత్త రికార్డు
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన మాస్ మసాలా చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ హవా ఇంకా తగ్గట్లేదు. యూట్యూబ్‌లో ఈ మూవీ దూసుకెళ్తోంది. తాజాగా 200మిలియన్ల(20 కోట్లు) మార్క్‌ను దాటేసి సత్తా చాటింది. 2019లో విడుదలైన ఈ మూవీ హిందీ వెర్షన్‌ని గతేడాది ఫిబ్రవరిలో యూట్యూబ్‌లో పెట్టారు. టాలీవుడ్ ప్రేక్షకుల మాదిరే బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి కూడా ఇస్మార్ట్ శంకర్‌కి నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటివరకు 1.9మిలియన్ల లైకులలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆన్లైన్లో డబ్బింగ్ సినిమాల ద్వారా 20 కోట్ల పైగా వ్యూస్ తెచ్చుకోవడం హీరో రామ్‌కు ఇది నాలుగోసారి. సౌత్ ఇండియా నుంచి నాలుగు సినిమాలను 200 మిలియన్ల వ్యూస్‌కు చేర్చిన తొలి హీరోగా రామ్ ఘనతను దక్కించుకొన్నారు .మొత్తానికి ఇస్మార్ట్ హీరో రామ్ నటనకు ఇపుడు సౌత్ ప్రేక్షకులే కాదు.. నార్త్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారని యూట్యూబ్ రికార్డులే తెలియజేస్తున్నాయి. -
‘ఇస్మార్ట్ శంకర్’.. హవా మామూలుగా లేదు!
‘ఇస్మార్ట్ శంకర్’ హవా ఇంకా తగ్గలేదు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో గతేడాది వచ్చిన ఈ సినిమా యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. తాజాగా 100 మిలియన్ల(10 కోట్లు) మార్క్‌ను దాటేసి సత్తా చాటింది. ఫిబ్రవరి 16న యూట్యూబ్‌లో పెట్టిన హిందీ వెర్షన్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటివరకు 10 లక్షలకు పైగా లైకులు కూడా తెచ్చుకుంది. ఆన్లైన్లో డబ్బింగ్ సినిమాల ద్వారా 10 కోట్ల వ్యూస్, 10 లక్షలకు పైగా లైకులు తెచ్చుకోవడం హీరో రామ్‌కు ఇది నాలుగోసారి. ఈ ఘనత సాధించిన మొదటి హీరో రామ్ అని చిత్రయూనిట్ పేర్కొంది. కాగా, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలోని దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్ కూడా ఇటీవల 100 మిలియన్ వ్యూస్ మార్క్‌ని దాటింది. ఈ సందర్భంగా అభిమానులకు హీరో రామ్ ధన్యవాదాలు తెలిపారు. కాగా, కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆయన నటించిన ‘రెడ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ఏప్రిల్ 9 విడుదల చేయాలనుకున్నారు. కరోనా సంక్షోభం కారణంగా లాక్డౌన్ ప్రకటించడంతో విడుదల వాయిదా పడింది. (100 మిలియన్ మార్కును దాటిన 'ఇస్మార్ట్' పాట) -
‘ఇస్మార్ట్ శంకర్’.. ఇరగదీస్తుండు!
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో గతేడాది వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా హవా ఇంకా కొనసాగుతోంది. వరుస పరాజయాల నుంచి పూరి జగన్నాథ్‌ను బయటపడేసి భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా యూట్యూబ్‌లోనూ సత్తా చాటుతోంది. ఫిబ్రవరి 16న యూట్యూబ్‌లో పెట్టిన హిందీ వెర్షన్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. నాలుగు రోజుల్లో 50 మిలియన్ల వ్యూస్ (5 కోట్లకు పైగా) దక్కించుకుని దూసుకుపోతోంది. 8.6 లక్షల లైకులతో ప్రేక్షకాదరణ కొనసాగుతోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ హిందీ వెర్షన్‌ను ఆదిత్య మూవీస్ యూట్యూబ్‌లో విడుదల చేసిన 24 గంటల్లోనే 2 కోట్ల వ్యూస్, 5 లక్షల లైకులు దక్కించుకోవడం విశేషం. శివరాత్రికి స్పెషల్ షోలు కాగా, శివరాత్రి సందర్భంగా ‘ఇస్మార్ట్ శంకర్’ మరోసారి ధియేటర్లలో సందడి చేయనున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని పలు ధియేటర్ల ప్రత్యేక షోలు ప్రదర్శించనున్నారు. ఆర్టీసీ క్రాస్రోడ్స్తో పాటు పలు ప్రాంతాల్లో స్పెషల్ షోలు ఉంటాయని ‘పూరి కనెక్ట్స్’ ట్విటర్ ద్వారా వెల్లడించింది. మరోవైపు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ‘ఫైటర్’ సినిమాను పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో హిందీ తెరకు పరిచయమైన అనన్య పాండే హీరోయిన్గా నటించనుంది. (చదవండి: విజయ్ దేవరకొండతో అనన్యా పాండే) -
డబ్బింగ్ సినిమాకు రూ. 60 కోట్ల వసూళ్లు!
సాధారణంగా హిందీలో తీసిన సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేయడం మనకు ఇంతవరకు తెలుసు. సల్మాన్ ఖాన్ ఎప్పుడో నటించిన 'మైనే ప్యార్ కియా' సినిమా 'ప్రేమ పావురాలు'గా డబ్ అయి.. తెలుగులో కూడా బంపర్ హిట్ అయ్యింది. అలా అటు నుంచి ఇటు రావడం తప్ప, ఇటు నుంచి అటు.. అంటే తెలుగులో తీసిన సినిమాలను హిందీలోకి డబ్ చేయడం, అవి భారీస్థాయిలో హిట్ కావడం మనకు పెద్దగా తెలియదు. చాలా తెలుగు సినిమాలను హిందీలోకి డబ్ చేసినా, అవి పెద్దగా వసూళ్లు సాధించకపోవడంతో ఆ విషయం ప్రచారంలోకి రాలేదు. కానీ ఇప్పుడు ఒక తెలుగు సినిమాను హిందీలోకి డబ్ చేస్తే.. ఏకంగా అక్కడ రూ. 60 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పటికే అది ఏ సినిమానో అర్థమైపోయి ఉంటుంది కదూ.. అదే బాహుబలి! ఆదివారం వరకు మొత్తం రూ. 60.12 కోట్ల రూపాయల వసూళ్లు ఈ సినిమా హిందీ వెర్షన్‌కు వచ్చాయని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. తెలుగు వెర్షన్‌ను హిందీలోకి, తమిళ వెర్షన్‌ను మళయాళంలోకి డబ్ చేసిన విషయం తెలిసిందే. హిందీ వెర్షన్‌కు 7.5 కోట్ల రూపాయల వసూళ్లు వస్తే చాలని మొదట్లో అనుకున్నారు. అది కాస్తా ఇప్పుడు ఏకంగా దానికి పదిరెట్లు వసూలు చేసేలా కనిపిస్తోంది. ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి మరి! #Baahubali [dubbed Hindi version; Week 2] crosses ₹ 60 cr mark: Fri 3.25 cr, Sat 4.70 cr, Sun 5.40 cr. Total: ₹ 60.12 cr. FANTABULOUS! — taran adarsh (@taran_adarsh) July 20, 2015