
జగన్నాథుని దేవస్థానం
భువనేశ్వర్/పూరీ: జగన్నాథుని దేవస్థానం వల్లభ సేవకుడు సంతోష్ కొరొని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. జగన్నాథుని దర్శనం కోసం విచ్చేసిన మహిళా భక్తులపట్ల ఆయన అభ్యంతరకరంగా వ్యవహరించినట్లు ఫిర్యాదు దాఖలైంది. ఈ నేపథ్యంలో శ్రీ మందిరం సింహ ద్వారం ఠాణా పోలీసులు ఆయనను అరెస్టు చేసి కోర్టుకు తరలిం చారు. లోగడ సేవల్లో జాప్యం ఇతరేతర సమస్యలతో జగన్నాథుని దేవస్థానం నిత్యం వార్తల్లో స్థానం పొంది సంచలనం సృష్టించేది.
ఇటీవల కాలంలో పరిస్థితి తలకిందులైంది. పలు ప్రాంతా ల నుంచి విచ్చేస్తున్న భక్తులపట్ల దురుసు వ్యవహా రం వగైరా ఆరోపణలు దేవస్థానం పాలక మండ లి కార్యాచరణకు కళంకం తెస్తున్నాయి. తాజా సంఘటన ఇలా జరిగింది. జగన్నాథుని దర్శనం కోసం విచ్చేసిన మహిళా భక్తులపట్ల సేవాయత్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణ. గంజాం జిల్లా బరంపురం నుంచి విచ్చేసిన తల్లీ కూతుళ్లపట్ల సేవాయత్ ఇలా ప్రవర్తించినట్లు ఫిర్యాదు దాఖలైంది.
ఈ నేపథ్యంలో వల్లభ సేవకుడు సంతోష్ కొరొని నిందితునిగా గుర్తించారు. ఒలొతా లగ్గి సేవ దర్శనం సందర్భంగా శ్రీ మందిరం నాట్య మండపం ప్రాంగణంలో మహిళ పట్ల సేవా యత్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆదివారం శ్రీ మందిరం సింహద్వారం పోలీసు ఠాణాలో ఫిర్యా దు నమోదు చేశారు.
రాష్ట్రంలో మహిళలు, బాలికలపట్ల నేరాలకు పాల్పడితే కఠినంగా స్పందిస్తామ ని నిత్యం ప్రచార, ప్రసార కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం శ్రీ మందిరం సేవాయత్‌లపట్ల మెతక వైఖరి ప్రదర్శించడంలో ఆంతర్యం ఏమిటో అంతు చిక్కని విషయంగా మిగిలిపోతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.