Sevayatlu
-
వివాదాస్పదం..
భువనేశ్వర్: జగన్నాథుని దేవస్థానంలో భారీ సంస్కరణలకు సుప్రీం కోర్టు నడుం బిగించింది. ఈ కార్యాచరణలో భాగంగా వంశపారంపర్య సంప్రదాయబద్ధంగా సేవాయత్‌ల నియామకం సంస్కరణ అనివార్యంగా సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు పూరీ జిల్లా జడ్జి దాఖలు చేసిన సంస్కరణ మార్గదర్శకాల ఆధారంగా సేవాయత్ల్ని ఇతర సిబ్బంది తరహాలో నియమించి వంశపారంపర్య సంప్రదాయానికి తెర దించాలని సుప్రీం కోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై జగన్నాథుని సంస్కృతితో పలు విధాలుగా సంపర్కం కలిగిన వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా సేవాయత్ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. పూరీ జిల్లా జడ్జి సిఫారసులకు ముందు త్రిసభ్య కమిటీ విచారణ నిర్వహించింది. ఈ నేపథ్యంలో సేవాయత్ వర్గం పలు అంశాలకు సంబంధించి పూర్తి వివరణ విచారణ కమిషన్‌కు దాఖలు చేసింది. ఈ వివరాలపై సుప్రీం కోర్టు దృష్టి పడకపోవడం ఏమిటని సేవాయత్ వర్గం రాష్ట్ర ముఖ్యమంత్రిని నిలదీసింది. పూరీ ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి మహేశ్వర మహంతి, లోక్ సభ సభ్యుడు పినాకి మిశ్రా సారథ్యంలో 22 మంది సభ్యుల సేవాయత్ ప్రతినిథి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో ఆదివారం భేటీ అయింది. దేవస్థానం సంస్కరణల నేపథ్యంలో విచారణ కమిటీకి తమ వర్గం ప్రతిపాదించిన వివరాల్ని విస్మరించి సుప్రీం కోర్టుని దారి తప్పించినట్టు సేవాయత్ వర్గం ఆరోపించింది. ఈ పరిస్థితుల్ని సవరించాలని ముఖ్యమంత్రి చొరవ కల్పించుకోవాలని అభ్యర్థించారు. జగన్నాథుని తీరే వేరు: పినాకి మిశ్రా శ్రీమందిరం సంస్కరణలు పురస్కరించుకుని సేవాయత్‌ల ప్రత్యక్ష నియామకం ప్రతిపాదన తీవ్ర కలకలం రేకెత్తించింది. జగన్నాథుని సంస్కృతిని ఇతర దేవస్థానాలతో పోల్చి నిర్ణయాలు తీసుకోకుండా ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉంది. ఇతర దేవస్థానాల్లో మూల విరాట్ల స్థితిగతులు, ఆచారవ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాల్ని సమీక్షిస్తే ఈ పరిస్థితులు స్పష్టం అవుతాయి. ఈ దేవస్థానంలో సజీవ మూర్తులు పూజలు, సేవలు, అర్చనలు అందుకుంటున్న విషయాన్ని సంస్కరణ నిపుణులు పరిగణనలోకి తీసుకోవడం అవసరం. ఈ పరిస్థితుల్ని సుప్రీం కోర్టుకు సవివరంగా తెలియజేయగలిగితే సమస్యకు నిర్మాణాత్మక పరిష్కారం లభిస్తుందని సేవాయత్ వర్గానికి ప్రాతినిథ్యం వహించిన పూరీ లోక్ సభ సభ్యుడు పినాకి మిశ్రా తెలిపారు. సుప్రీం కోర్టు సంప్రదింపులతో యామికస్ క్యూరే గోపాల సుబ్రహ్మణ్యం రాష్ట్రానికి త్వరలో విచ్చేస్తారన్నారు. ఆయన రాక పురస్కరించుకుని పూరీ జగన్నాథుని ప్రాచీన సంస్కృతి ప్రధానంగా సజీవ మూర్తులకు అర్చన ఆరాధనలు జరుగుతున్న అద్భుత సంస్కృతిని వివరించాల్సి ఉందన్నారు. దీంతో ముడిపడిన సేవాయత్‌ల నియామకం ఆవిర్భావం సవివరంగా తెలియజేస్తే పరిస్థితి కుదుట పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తుల అభిప్రాయం కీలకం విశ్వవ్యాప్తంగా జగన్నాథుని భక్తులు విస్తరించి ఉన్నారు. శ్రీ మందిరం సంస్కరణలు పురస్కరించుకుని ఈ వర్గం అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం అనివార్యం. దీంతో పూరీ గజపతి మహా రాజా దివ్య సింఘ్ దేవ్, గోవర్థన పీఠాధిపతి ఆది శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతి, 36 వర్గాల నియోగుల అభిప్రాయాల్ని క్రోఢీకరించి సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని పినాకి మిశ్రా ప్రతిపాదించారు. -
పూరీ జగన్నాథుని సేవాయత్ అరెస్ట్
భువనేశ్వర్/పూరీ: జగన్నాథుని దేవస్థానం వల్లభ సేవకుడు సంతోష్ కొరొని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. జగన్నాథుని దర్శనం కోసం విచ్చేసిన మహిళా భక్తులపట్ల ఆయన అభ్యంతరకరంగా వ్యవహరించినట్లు ఫిర్యాదు దాఖలైంది. ఈ నేపథ్యంలో శ్రీ మందిరం సింహ ద్వారం ఠాణా పోలీసులు ఆయనను అరెస్టు చేసి కోర్టుకు తరలిం చారు. లోగడ సేవల్లో జాప్యం ఇతరేతర సమస్యలతో జగన్నాథుని దేవస్థానం నిత్యం వార్తల్లో స్థానం పొంది సంచలనం సృష్టించేది. ఇటీవల కాలంలో పరిస్థితి తలకిందులైంది. పలు ప్రాంతా ల నుంచి విచ్చేస్తున్న భక్తులపట్ల దురుసు వ్యవహా రం వగైరా ఆరోపణలు దేవస్థానం పాలక మండ లి కార్యాచరణకు కళంకం తెస్తున్నాయి. తాజా సంఘటన ఇలా జరిగింది. జగన్నాథుని దర్శనం కోసం విచ్చేసిన మహిళా భక్తులపట్ల సేవాయత్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణ. గంజాం జిల్లా బరంపురం నుంచి విచ్చేసిన తల్లీ కూతుళ్లపట్ల సేవాయత్ ఇలా ప్రవర్తించినట్లు ఫిర్యాదు దాఖలైంది. ఈ నేపథ్యంలో వల్లభ సేవకుడు సంతోష్ కొరొని నిందితునిగా గుర్తించారు. ఒలొతా లగ్గి సేవ దర్శనం సందర్భంగా శ్రీ మందిరం నాట్య మండపం ప్రాంగణంలో మహిళ పట్ల సేవా యత్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆదివారం శ్రీ మందిరం సింహద్వారం పోలీసు ఠాణాలో ఫిర్యా దు నమోదు చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపట్ల నేరాలకు పాల్పడితే కఠినంగా స్పందిస్తామ ని నిత్యం ప్రచార, ప్రసార కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం శ్రీ మందిరం సేవాయత్లపట్ల మెతక వైఖరి ప్రదర్శించడంలో ఆంతర్యం ఏమిటో అంతు చిక్కని విషయంగా మిగిలిపోతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
లొంగిపోకపోతే ఆస్తుల జప్తు
తమకు అడ్డులేదన్నట్లు ప్రవర్తించిన సేవాయత్‌లు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నీలాద్రి విజే ఉత్సవంలో అధికారులను దూషించడంతో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న సేవాయత్‌లు అదృశ్యమయ్యారు.. సేవాయత్‌లు లొంగిపోవాలని లేకపోతే ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తూ పోస్టర్లు వెలువరించారు. పూరీ/భువనేశ్వర్: శ్రీ జగన్నాథుని నీలాద్రి విజే ఉత్సవంలో అనుచిత రీతిలో ప్రవర్తించిన సేవాయత్‌లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వివాదం జరిగిన తర్వాత కనిపించని సేవాయత్‌ల ఫొటోలతో ఉన్న పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అతికించి, వారి ఆచూకీ తెలియజేస్తే పారితోషికం అందజేస్తామని పూరీ జిల్లా యంత్రాంగం ప్రకటించింది. అయినా ఫలితం లేకపోవడంతో జిల్లా యంత్రాంగం మరో ముందడుగు వేసింది. నెల రోజుల గడువులోగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సేవాయత్‌లు స్వచ్ఛందంగా కోర్టు లేదా పోలీసు స్టేషన్లలో లొంగిపోకపోతే వారి ఆస్తుల్ని జప్తు చేస్తామనిహెచ్చరించారు. ఈ మేరకు కోర్టు అనుమతి లభించిందని అధికారులు తెలిపారు.జన సందోహిత ప్రాంతాలు, కలెక్టరేట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో కూడా ఈ పోస్టర్లను అతికిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరారైన సేవాయత్‌ల ఫొటోలతో పోస్టర్లను జన సం దోహిత ప్రాంతాల్లో అతికిస్తున్నట్లు పూరీ జిల్లా పోలీ సు సూపరింటెండెంట్ సార్థక్ షడంగి తెలిపారు. క్షమాభిక్ష కోరితే.. ఊహాతీతంగా పొరబాటు జరిగిందని, చర్చల తో ఈ వివాదానికి తెరదించాలని సేవాయత్‌లు కోరుతున్నా రు. సేవాయత్‌లపై కేసులు తొలగించాలని, వారిని క్షమించాలని జిల్లా కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారుల ను సీనియర్ సేవాయత్‌లు కోరారు. సమస్య పరిష్కారానికి కాకుండా మరింత కఠిన ంగా అధికారులు చర్యలు చేపట్టడం సరికాదని పేర్కొన్నారు. ఇదీ వివాదం ఈ ఏడాది జులై 17న నిర్వహించిన శ్రీజగన్నాథుని వార్షిక రథయాత్రలో తుది ఘట్టమైన నీలాద్రి విజేలో మూల విరాట్లను రథాల పైనుంచి ప్రధాన దేవస్థానం గర్భ గుడి రత్న వేదికపైకి తరలించే కార్యక్రమానికి సేవాయత్‌లు అంతరాయం కలిగించారు. దీనిపై ప్రశ్నించిన పూరీ జిల్లా కలెక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించారు. సేవాయత్‌ల తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ తరుణంలో కలెక్టర్‌తో వారు ప్రవర్తిం చిన తీరు అధికారులను ఆగ్రహానికి గురి చేసింది. దీంతో వారి ఆగడాలకు కళ్లెం వేయాలని భావించారు. అధికారుల చర్యలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న సేవాయత్‌లు ఈప్సిత్ ప్రతిహారి, రొబి నారాయణ దాస్, దామోదర్ మహా సువార్, భీమ్ సేన్ పొలంక్ధారి, కాశీ ఖుంటియా, భగీరథి ఖుంటియా, హరి నారాయణ ఖుంటియా, జయకృష్ణ మహా సువార్ అదృశ్యమయ్యారు. కోర్టు అనుమతితో జిల్లా యంత్రాంగం అనుమానిత ప్రాంతాల్లో గాలించినా ప్రయత్నాలు ఫలించలేదు. పూరీ జిల్లా పోలీసు యం త్రాంగం స్థానిక ఎస్డీజేఎమ్ కోర్టును ఆశ్రయించడంతో గత నెల 27న సేవాయత్‌లపై బెయిలు రహిత అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. శనివారం పోలీసులు మరో అడుగు ముం దుకు వేశారు. పరారైన సేవాయత్‌ల ఆస్తులను జప్తు చేసేందుకు కోర్టు అనుమతి పొందింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ - సీఆర్పీసీ 83వ సెక్షన్ కింద కోర్టు జిల్లా యంత్రాంగానికి ఈ అనుమతి మంజూరు చేసినట్లు పూరీ జిల్లా ఎస్పీ తెలిపారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పరారైన సేవాయత్‌ల ఫొటోలతో కూడిన పోస్టర్లు అంటిస్తుంది. బస్టాండ్లు, రైల్వే స్టేషను, శ్రీమందిర్ పాలనా కార్యాల యం, టౌను పోలీసు స్టేషను ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. సెప్టెంబరు 12వ తేదీలోగా పరారీలో ఉన్న సేవాయత్‌లు స్వచ్చంధంగా లొంగకుంటే చట్టపరంగా వీరి ఆస్తుల్ని జప్తు చేయడం అనివార్యమవుతుందని పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంటు సార్థక్ షడంగి హెచ్చరించారు.