లొంగిపోకపోతే ఆస్తుల జప్తు | Inappropriate behavior mode Sevayatlu in sri jagannath niladri vije | Sakshi
Sakshi News home page

లొంగిపోకపోతే ఆస్తుల జప్తు

Published Sun, Aug 14 2016 4:49 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

లొంగిపోకపోతే ఆస్తుల జప్తు

లొంగిపోకపోతే ఆస్తుల జప్తు

తమకు అడ్డులేదన్నట్లు ప్రవర్తించిన సేవాయత్‌లు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నీలాద్రి విజే ఉత్సవంలో అధికారులను దూషించడంతో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న సేవాయత్‌లు అదృశ్యమయ్యారు.. సేవాయత్‌లు లొంగిపోవాలని లేకపోతే ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తూ పోస్టర్లు వెలువరించారు.
 
 పూరీ/భువనేశ్వర్: శ్రీ జగన్నాథుని నీలాద్రి విజే ఉత్సవంలో అనుచిత రీతిలో ప్రవర్తించిన సేవాయత్‌లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వివాదం జరిగిన తర్వాత కనిపించని సేవాయత్‌ల ఫొటోలతో ఉన్న పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అతికించి, వారి ఆచూకీ తెలియజేస్తే పారితోషికం అందజేస్తామని పూరీ జిల్లా యంత్రాంగం ప్రకటించింది. అయినా ఫలితం లేకపోవడంతో జిల్లా యంత్రాంగం మరో ముందడుగు వేసింది.  నెల రోజుల గడువులోగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సేవాయత్‌లు స్వచ్ఛందంగా కోర్టు లేదా పోలీసు స్టేషన్లలో లొంగిపోకపోతే  వారి ఆస్తుల్ని జప్తు చేస్తామనిహెచ్చరించారు. ఈ మేరకు కోర్టు అనుమతి లభించిందని అధికారులు తెలిపారు.జన సందోహిత ప్రాంతాలు, కలెక్టరేట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో కూడా ఈ పోస్టర్లను అతికిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరారైన సేవాయత్‌ల ఫొటోలతో పోస్టర్లను జన సం దోహిత ప్రాంతాల్లో అతికిస్తున్నట్లు పూరీ జిల్లా పోలీ సు సూపరింటెండెంట్ సార్థక్ షడంగి తెలిపారు.
 
 క్షమాభిక్ష కోరితే..
 ఊహాతీతంగా పొరబాటు జరిగిందని, చర్చల తో ఈ వివాదానికి తెరదించాలని సేవాయత్‌లు కోరుతున్నా రు. సేవాయత్‌లపై కేసులు తొలగించాలని, వారిని క్షమించాలని జిల్లా కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారుల ను సీనియర్ సేవాయత్‌లు కోరారు. సమస్య పరిష్కారానికి కాకుండా మరింత కఠిన ంగా అధికారులు చర్యలు చేపట్టడం సరికాదని పేర్కొన్నారు.
 
 ఇదీ వివాదం
 ఈ ఏడాది జులై  17న నిర్వహించిన శ్రీజగన్నాథుని వార్షిక రథయాత్రలో తుది ఘట్టమైన నీలాద్రి విజేలో మూల విరాట్లను రథాల పైనుంచి ప్రధాన దేవస్థానం గర్భ గుడి రత్న వేదికపైకి తరలించే కార్యక్రమానికి సేవాయత్‌లు అంతరాయం కలిగించారు. దీనిపై ప్రశ్నించిన పూరీ జిల్లా కలెక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించారు. సేవాయత్‌ల తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ తరుణంలో కలెక్టర్‌తో వారు ప్రవర్తిం చిన తీరు అధికారులను ఆగ్రహానికి గురి చేసింది. దీంతో వారి ఆగడాలకు కళ్లెం వేయాలని భావించారు.
 
 అధికారుల చర్యలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న సేవాయత్‌లు ఈప్సిత్ ప్రతిహారి, రొబి నారాయణ దాస్, దామోదర్ మహా సువార్, భీమ్ సేన్ పొలంక్‌ధారి, కాశీ ఖుంటియా, భగీరథి ఖుంటియా, హరి నారాయణ ఖుంటియా, జయకృష్ణ మహా సువార్ అదృశ్యమయ్యారు. కోర్టు అనుమతితో జిల్లా యంత్రాంగం అనుమానిత ప్రాంతాల్లో గాలించినా ప్రయత్నాలు ఫలించలేదు. పూరీ జిల్లా పోలీసు యం త్రాంగం స్థానిక ఎస్డీజేఎమ్ కోర్టును ఆశ్రయించడంతో గత నెల 27న సేవాయత్‌లపై బెయిలు రహిత అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. శనివారం పోలీసులు మరో అడుగు ముం దుకు వేశారు. పరారైన సేవాయత్‌ల ఆస్తులను జప్తు చేసేందుకు కోర్టు అనుమతి పొందింది.
 
 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ - సీఆర్పీసీ 83వ సెక్షన్ కింద కోర్టు జిల్లా యంత్రాంగానికి ఈ అనుమతి మంజూరు చేసినట్లు పూరీ జిల్లా ఎస్పీ తెలిపారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పరారైన సేవాయత్‌ల ఫొటోలతో కూడిన పోస్టర్లు అంటిస్తుంది. బస్టాండ్లు, రైల్వే స్టేషను, శ్రీమందిర్ పాలనా కార్యాల యం, టౌను పోలీసు స్టేషను ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. సెప్టెంబరు 12వ తేదీలోగా పరారీలో ఉన్న సేవాయత్‌లు స్వచ్చంధంగా లొంగకుంటే చట్టపరంగా వీరి ఆస్తుల్ని జప్తు చేయడం అనివార్యమవుతుందని పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంటు సార్థక్ షడంగి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement