inappropriate behavior
-
సిరాజ్ మ్యాచ్ ఫీజులో కోత
అడిలైడ్: మైదానంలో భారత పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్, ఆ్రస్టేలియా స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ల అనుచిత ప్రవర్తనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. డే నైట్ రెండో టెస్టు సందర్భంగా ధాటిగా శతకం బాదిన హెడ్‌ను సిరాజ్ క్లీన్»ౌల్డ్ చేశాడు. ప్రత్యర్థి బ్యాటర్ ని్రష్కమిస్తుంటే చేతిని అతనివైపు చూపిస్తూ ‘పో... పో...’ అని సంజ్ఞలు చేశాడు. దీనికి బదులుగా హెడ్ కూడా ఏదో పరుషంగా మాట అని పెవిలియన్ వైపు నడిచాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరు ఆటగాళ్లను మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగళె పిలిచి మాట్లాడారు. ఇద్దరు తమ తప్పును అంగీకరించడంతో తదుపరి విచారణేది లేకుండా ఐసీసీ శిక్షలు ఖరారు చేసింది. నోరు పారేసుకోవడం, దూషించడంతో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆరి్టకల్ 2.5ను అతిక్రమించినట్లేనని ఇందుకు శిక్షగా మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించింది. పరుషంగా మాట అని వెళ్లిపోయిన హెడ్ నియమావళిలోని 2.13 ఆరి్టకల్‌ను అతిక్రమించాడని, దీంతో అతను జరిమానా నుంచి తప్పించుకున్నప్పటికీ... డీ మెరిట్ పాయింట్‌ను విధించింది. సిరాజ్‌కు జరిమానాతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్‌ను విధించింది. వచ్చే 24 నెలల్లో ఇలాంటి ప్రవర్తనతో మళ్లీ డీ మెరిట్ పాయింట్లకు గురైతే మ్యాచ్ నిషేధం విధించే అవకాశాలుంటాయి. ఇదిలా ఉండగా ఆదివారం మ్యాచ్ ముగియగానే ఇద్దరు కరచాలనం చేసుకొని అభినందించుకున్నారు. మా మధ్య వివాదమేమీ లేదని చెప్పారు. సిరాజ్...ఏమైనా పిచ్చిపట్టిందా? సిరాజ్ ప్రవర్తనను భారత దిగ్గజాలు విమర్శిస్తున్నారు. ఇదివరకే గావస్కర్, రవిశా్రస్తిలాంటి వారు అలా సంజ్ఞలు చేయాల్సింది కాదని అన్నారు. తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్ ఘాటుగా విమర్శించారు. ‘హెడ్ మనతో ఓ ఆట ఆడుకున్నాడు. నిర్దాక్షిణ్యంగా బాదాడు. సిరాజ్ నీకేమైనా మతి చెడిందా? నువ్వేం చేశావో తెలుసా? నీ బౌలింగ్‌లో అతను అదేపనిగా దంచేశాడు. చకచకా 140 పరుగులు సాధించాడు. అతని ప్రదర్శనకు ప్రశంసించాల్సింది పోయి ఇలా చేస్తావా? ఒకవేళ నీవు అతన్ని డకౌట్ లేదంటే 10 పరుగుల లోపు అవుట్ చేస్తే సంబరాలు చేసుకోవాలి. కానీ నువ్వు అదరగొట్టిన ఆటగాడిపై దురుసుగా ప్రవర్తించావు’ అని శ్రీకాంత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. -
రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘన, అనుచిత ప్రవర్తన, ధిక్కార వైఖరి ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గుర య్యారు. ఆయన సస్పెన్షన్‌పై శుక్రవారం రాజ్యసభ నేత పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. దేశ రాజధాని ఢిల్లీ(సవరణ) బిల్లు–2023పై ప్రతిపాది త సెలెక్ట్ కమిటీకి అనుమతి తీసుకోకుండానే కొందరు సభ్యుల పేర్లను చేర్చినందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి, నివేదిక ఇచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపింది. ఆప్ మరో నేత సంజయ్ సింగ్ సస్పెన్షన్ పొడిగించే తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. వర్షాకాల సమావేశాల ప్రారంభంలోనే సంజయ్ సింగ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. -
టీటీఈలకు బాడీ కెమెరాలు
న్యూఢిల్లీ: టికెట్ల తనిఖీలో పారదర్శకత, రైలు ప్రయాణికుల అనుచిత ప్రవర్తనను అరికట్టేందుకు టికెట్ తనిఖీ అధికారుల(టీటీఈ)లకు బాడీ కెమెరాలు అమర్చేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై డివిజన్‌కు చెందిన 50 మంది టీటీలకు బాడీ కెమెరాలను సిద్ధం చేసింది. ఒక్కో కెమెరా ఖరీదు రూ.9 వేలు. ఇవి 20 గంటల ఫుటేజీని రికార్డు చేయగలుగుతాయి. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే దేశమంతటా అమలు చేస్తామని అధికారులు తెలిపారు. ఇటీవల సెంట్రల్ రైల్వేలో ఓ టీటీఈ మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో అధికారులు సస్పెండ్ చేశారు. ఇటువంటి ఘటనలను నివారించి, సిబ్బందిలో బాధ్యత పెంచేందుకు కూడా ఇవి సాయపడతాయని సెంట్రల్ రైల్వే పేర్కొంది. -
హెల్త్ వర్కర్‌తో అనుచిత ప్రవర్తన.. ఒక్కసారిగా షాకైన మహిళ!
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ హెల్త్ వర్కర్‌ను గుర్తు తెలియని యువకుడు వేధింపులకు గురిచేశాడు. ఆసుపత్రిలో ఫోన్ మాట్లాడుతున్న మహిళను వెనుక వచ్చి బలవంతంగా కౌగిలించుకుని, ముద్దుపెట్టుకుని వేధించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. బీహార్‌లోని జముయ్ జిల్లాలో బాధితురాలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది. కాగా, ఈనెల 10వ తేదీన ఆమె విధుల్లో ఉన్న సమయంలో ఫోన్ మాట్లాడుతున్న క్రమంలో ఓ యువకుడు అనుచితంగా ప్రవర్తించాడు. వెనుక నుంచి వచ్చి ఆమెను బలవంతంగా ముద్దుపెట్టి, కౌగిలించికున్నాడు. ఈ క్రమంలో బాధితురాలు విడిపించుకునే ప్రయత్నం చేసింది. దీంతో, వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం, ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్బంగా బాధితురాలు మాట్లాడుతూ.. అతనెవరో నాకు తెలియదు. నన్ను మానసికంగా హింసించాడు. ఆసుపత్రి కాంపౌండ్ గోడ దూకి ఎందుకు వచ్చాడు. అతడు నాతో తప్పుగా ప్రవర్తించినప్పుడు నేను ప్రతిఘటించాను. వెంటనే నా చేతిలో నుంచి తప్పించుకున్నాడు. ఇంతలో ఆసుపత్రి సిబ్బందిని పిలిచాను. కానీ, గోడ దూకి అతను పారిపోయాడు. దీనికి కారణమైన అతడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలి. సరిహద్దు గోడ చాలా చిన్నదిగా ఉంది. ముళ్ల కంచె వేసి ఆసుపత్రికి తరచుగా వచ్చే మహిళలను రక్షించాలని అధికారులను అభ్యర్థిస్తున్నాను అని తెలిపారు. ఇక, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు స్థానిక పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
SpiceJet: ఢిల్లీ-హైదరాబాద్ ఫ్లైట్‌లో వికృత చేష్టలు?!
ఢిల్లీ: ఎయిరిండియా మూత్రవిసర్జన ఘటన మరిచిపోక ముందే.. మరో ప్రయాణికుడి వికృత చేష్టల వ్యవహారం?! వెలుగు చూసింది. ఢిల్లీ-హైదరాబాద్‌కు చెందిన స్పైస్‌జెట్ విమానంలో ఇవాళే(సోమవారం) ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. స్పైస్‌జెట్ విమానం ఎస్జీ-8133.. ఢిల్లీ నుంచి బయలుదేరాల్సి ఉంది. ఆ సమయంలో ఓ ప్యాసింజర్ క్యాబిన్ సిబ్బందిలోని ఓ యువతితో అనుచితంగా ప్రవర్తించాడు.యువతిని అసభ్యంగా తాకినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె అతనితో వాగ్వాదానికి దిగింది. ఆ సమయంలో తోటి సిబ్బంది ఆ యువతికి మద్ధతుగా వచ్చారు. కాసేపటికి ఈ విషయాన్ని పైలట్ ఇన్ కమాండ్, సెక్యూరిటీ స్టాఫ్‌కు సిబ్బంది తెలియజేశారు. దీంతో.. ఆ ప్రయాణికుడిని, అతనితో ఉన్న మరో ప్యాసింజర్‌ను దించేశారు. వారిని భద్రతా సిబ్బందికి అప్పజెప్పినట్లు స్పైస్‌జెట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికుడి నుంచి క్షమాపణ పత్రం తీసుకున్నప్పటికీ.. వ్యవహారం ముదరకుండా ఉండేందుకు వాళ్లను దించేసినట్లు తెలుస్తోంది. అయితే తోటి ప్రయాణికుల్లో కొందరు మాత్రం అది కావాలని జరిగిన ఘటన కాదని, ఇరుకుగా ఉండడంతో పొరపాటున తగిలాడనని చెప్తుండడం గమనార్హం. #WATCH | "Unruly & inappropriate" behaviour by a passenger on the Delhi-Hyderabad SpiceJet flight at Delhi airport today The passenger and & a co-passenger were deboarded and handed over to the security team at the airport pic.twitter.com/H090cPKjWV — ANI (@ANI) January 23, 2023 -
బైక్ మీదే వెకిలి చేష్టలు.. గ్రామస్థుల దెబ్బకు క్షమాపణలు
పట్నా: జంతువులకు, మనుషులకు మధ్య ప్రధాన తేడా.. వాటికి విచక్షణ జ్ఞానం ఉండదు.. మనకు ఉంటుంది. మంచేదో.. చెడేదో మనుషులకు తెలుసు. మనకు సిగ్గు, బిడియం, కోపం వంటి లక్షణాలుంటాయి. అలాగే మనషుల దైనందిన జీవితంలో నలుగురిలో చేసే పనులు.. నాలుగ్గోడల మధ్య చేసే పనులు కొన్ని ఉంటాయి. ఇది ప్రకృతి ధర్మం. దాన్ని కాదని.. సిగ్గు, శరం వదిలేసి నాలుగ్గోడల మధ్య చేసే పనిని బహిరంగంగా చేస్తే.. జంతువులకు మనకు తేడా ఏముంటుంది. మనకంటే అవే చాలా బేటర్ అనిపిస్తుంది. చుట్టూ ఉన్నవాళ్లు తమ చేతులకు, నోటికి పని చెప్తారు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే.. బిహార్‌లో ఓ జంట చేసిన పని చూసి జనాలు, నెటిజనులు ఇలానే దుమ్మెత్తి పోస్తున్నారు. మీకు ఏమాత్రం సిగ్గు, శరం లేవా అని ప్రశ్నిస్తున్నారు. వారి సిగ్గుమాలిన పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆవివరాలు.. కొన్ని రోజుల క్రితం బిహార్, గయ జిల్లాకు చెందిన ఓ జంట రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద ప్రయాణం చేస్తుంటారు. సాధారణంగా కూర్చునేదానికి భిన్నంగా.. యువతి బైక్ నడిపే వ్యక్తికి ఎదురుగా.. ఫ్యూయెల్ ట్యాంక్ మీద కూర్చుని ఉంటుంది. అలా బైక్ డ్రైవ్ చేస్తూనే.. రోడ్డు మీద పట్టపగలు ఆ జంట సరసాలాడటం ప్రారంభించారు. వీరి వికృత చేష్టలు గమనించిన స్థానికులు.. వాటిని వీడియో తీయడం ప్రారంభించారు. తమ చేష్టలను వీడియో తీస్తున్నారని గ్రహించిన యువతి.. వారిపై మండిపడింది. ఈ క్రమంలో స్థానికులకు, జంటకు మధ్య గొడవ జరగింది. రోడ్డు మీద ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయడం ఏంటని జంటను గట్టిగానే మందలించారు స్థానికులు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇలా ఇష్టారీతిగా ప్రవర్తించడం ఏంటి.. మీ వల్ల ఏదైనా జరగకూడని ప్రమాదం జరిగితే.. ఎవరు బాధ్యత వహిస్తారు.. ఇంత నీచంగా ప్రవర్తించడం ఏంటని తిట్టి పోశారు. క్షమాపణలు చెప్పాకే ఆ జంటను వదిలేశారు. ఇంకెప్పుడు ఇలాంటి పనికి మాలిన పనులు చేయవద్దని.. తమ గ్రామంలోకి రావద్దని హెచ్చరించారు స్థానికులు. -
టీషర్ట్ వేసుకొచ్చినందుకు అసెంబ్లీ నుండి గెంటేశారు..
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చూడసమా జీన్స్, టీషర్ట్ ధరించి రావడంతో ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాజేంద్ర త్రివేది అతన్ని అసెంబ్లీ నుండి బయటకు పంపించేశారు. గుజరాత్‌లోని సోమనాథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన విమల్ చూడసమా.. బ్లాక్ కలర్ టీషర్ట్ ధరించి అసెంబ్లీకి వచ్చారు. స్పీకర్ రాజేంద్ర త్రివేది ఎమ్మెల్యే డ్రస్ చేసుకున్న విధానంపై అభ్యంతరం చెప్పడంతో సభలో రగడ మొదలైంది. టీషర్ట్ ధరించి అసెంబ్లీకి రావొద్దనే చట్టాలేమైనా ఉన్నాయా..? ఉంటే అవి సభ ముందుకు తీసుకురావాలంటూ ఎమ్మెల్యే పట్టుబట్టడంతో స్పీకర్ ఆయనను మూడు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. తక్షణమే ఈ చర్య అమల్లోకి రావాలని స్పీకర్ ఆదేశించడంతో సదరు ఎమ్మెల్యేను సభ నుంచి బయటకు పంపించేశారు. కాగా, సభలో సభ్యులు సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండే దుస్తులు ధరించి అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ రాజేంద్ర త్రివేది బడ్జెట్ సమావేశాల తొలిరోజునే సభ్యులకు సూచించారు. అయితే, స్పీకర్ సూచనలను పక్కనపెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే టీషర్ట్, జీన్స్ ధరించి సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ వ్యవహారంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కలుగజేసుకుని ఎమ్మెల్యే సభ గౌరవాన్ని కాపాడేలా దుస్తులు ధరించి రావడం మంచిదని హితవు పలికారు. -
మహిళపై సిద్దరామయ్య ఫైర్
మైసూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మహిళా కార్యకర్తతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ కార్యకర్తపై సిద్ధరామయ్య గట్టిగా కేకలు వేయడం, మైక్‌ను లాగినపుడు ఆమె చేతిలోని మైక్‌తోపాటు దుపటా ఆయనచేతిలోకి రావడం వివాదమైంది. మైసూరులోని గర్గేశ్వర గ్రామంలో సిద్దరామయ్య అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో సిద్దరామయ్య కొడుకు, స్థానిక ఎమ్మెల్యే యతీంద్రతోపాటు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాలూకా పంచాయతీ ఉపాధ్యక్షురాలు జమలాల్ లేచి.. తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే యతీంద్ర గెలిచాక మళ్లీ రానేలేదని చెప్పారు. ‘యతీంద్రను ఎన్నికల తర్వాత మళ్లీ ఈ రోజే చూస్తున్నా’ అని అన్నారు. దీంతో సిద్దరామయ్య ఆగ్రహంతో ఊగిపోయారు. నియోజకవర్గానికి యతీంద్ర వస్తూనే ఉన్నారని సిద్ధరామయ్య చెప్పినా జమలాల్ బల్లగుద్ది మరీ వాదించారు.. దీంతో సిద్దరామయ్య ‘నా ముందే టేబుల్‌పై కొట్టి మాట్లాడతావా? ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో, లేదా నోరు మూసుకుని కూర్చో’అని పరుషంగా ఆదేశించారు. అయినా సరే జమలాల్ మరోసారి బల్లగుద్ది మాట్లాడారు. దీంతో సిద్ధరామయ్య అరుస్తూ ఆమె చేతిలో ఉన్న మైకును లాగేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె ధరించిన దుపట్టా జారింది. ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనను సుమోటొగా నమోదు చేస్తున్నట్లు జాతీయ మహిళా హక్కుల కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్పర్సన్ రేఖా శర్మ తెలిపారు. మహిళా కార్యకర్తతో సిద్దరామయ్య అనుచిత ప్రవర్తనపై విచారణ జరిపి, చర్య తీసుకోవాలని కర్ణాటక పోలీసులను కోరనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కౌరవుల ప్రభుత్వం నడుస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. -
లొంగిపోకపోతే ఆస్తుల జప్తు
తమకు అడ్డులేదన్నట్లు ప్రవర్తించిన సేవాయత్‌లు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. నీలాద్రి విజే ఉత్సవంలో అధికారులను దూషించడంతో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న సేవాయత్‌లు అదృశ్యమయ్యారు.. సేవాయత్‌లు లొంగిపోవాలని లేకపోతే ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తూ పోస్టర్లు వెలువరించారు. పూరీ/భువనేశ్వర్: శ్రీ జగన్నాథుని నీలాద్రి విజే ఉత్సవంలో అనుచిత రీతిలో ప్రవర్తించిన సేవాయత్‌లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వివాదం జరిగిన తర్వాత కనిపించని సేవాయత్‌ల ఫొటోలతో ఉన్న పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అతికించి, వారి ఆచూకీ తెలియజేస్తే పారితోషికం అందజేస్తామని పూరీ జిల్లా యంత్రాంగం ప్రకటించింది. అయినా ఫలితం లేకపోవడంతో జిల్లా యంత్రాంగం మరో ముందడుగు వేసింది. నెల రోజుల గడువులోగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సేవాయత్‌లు స్వచ్ఛందంగా కోర్టు లేదా పోలీసు స్టేషన్లలో లొంగిపోకపోతే వారి ఆస్తుల్ని జప్తు చేస్తామనిహెచ్చరించారు. ఈ మేరకు కోర్టు అనుమతి లభించిందని అధికారులు తెలిపారు.జన సందోహిత ప్రాంతాలు, కలెక్టరేట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో కూడా ఈ పోస్టర్లను అతికిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరారైన సేవాయత్‌ల ఫొటోలతో పోస్టర్లను జన సం దోహిత ప్రాంతాల్లో అతికిస్తున్నట్లు పూరీ జిల్లా పోలీ సు సూపరింటెండెంట్ సార్థక్ షడంగి తెలిపారు. క్షమాభిక్ష కోరితే.. ఊహాతీతంగా పొరబాటు జరిగిందని, చర్చల తో ఈ వివాదానికి తెరదించాలని సేవాయత్‌లు కోరుతున్నా రు. సేవాయత్‌లపై కేసులు తొలగించాలని, వారిని క్షమించాలని జిల్లా కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారుల ను సీనియర్ సేవాయత్‌లు కోరారు. సమస్య పరిష్కారానికి కాకుండా మరింత కఠిన ంగా అధికారులు చర్యలు చేపట్టడం సరికాదని పేర్కొన్నారు. ఇదీ వివాదం ఈ ఏడాది జులై 17న నిర్వహించిన శ్రీజగన్నాథుని వార్షిక రథయాత్రలో తుది ఘట్టమైన నీలాద్రి విజేలో మూల విరాట్లను రథాల పైనుంచి ప్రధాన దేవస్థానం గర్భ గుడి రత్న వేదికపైకి తరలించే కార్యక్రమానికి సేవాయత్‌లు అంతరాయం కలిగించారు. దీనిపై ప్రశ్నించిన పూరీ జిల్లా కలెక్టర్‌తో అనుచితంగా ప్రవర్తించారు. సేవాయత్‌ల తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఈ తరుణంలో కలెక్టర్‌తో వారు ప్రవర్తిం చిన తీరు అధికారులను ఆగ్రహానికి గురి చేసింది. దీంతో వారి ఆగడాలకు కళ్లెం వేయాలని భావించారు. అధికారుల చర్యలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న సేవాయత్‌లు ఈప్సిత్ ప్రతిహారి, రొబి నారాయణ దాస్, దామోదర్ మహా సువార్, భీమ్ సేన్ పొలంక్ధారి, కాశీ ఖుంటియా, భగీరథి ఖుంటియా, హరి నారాయణ ఖుంటియా, జయకృష్ణ మహా సువార్ అదృశ్యమయ్యారు. కోర్టు అనుమతితో జిల్లా యంత్రాంగం అనుమానిత ప్రాంతాల్లో గాలించినా ప్రయత్నాలు ఫలించలేదు. పూరీ జిల్లా పోలీసు యం త్రాంగం స్థానిక ఎస్డీజేఎమ్ కోర్టును ఆశ్రయించడంతో గత నెల 27న సేవాయత్‌లపై బెయిలు రహిత అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. శనివారం పోలీసులు మరో అడుగు ముం దుకు వేశారు. పరారైన సేవాయత్‌ల ఆస్తులను జప్తు చేసేందుకు కోర్టు అనుమతి పొందింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ - సీఆర్పీసీ 83వ సెక్షన్ కింద కోర్టు జిల్లా యంత్రాంగానికి ఈ అనుమతి మంజూరు చేసినట్లు పూరీ జిల్లా ఎస్పీ తెలిపారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పరారైన సేవాయత్‌ల ఫొటోలతో కూడిన పోస్టర్లు అంటిస్తుంది. బస్టాండ్లు, రైల్వే స్టేషను, శ్రీమందిర్ పాలనా కార్యాల యం, టౌను పోలీసు స్టేషను ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. సెప్టెంబరు 12వ తేదీలోగా పరారీలో ఉన్న సేవాయత్‌లు స్వచ్చంధంగా లొంగకుంటే చట్టపరంగా వీరి ఆస్తుల్ని జప్తు చేయడం అనివార్యమవుతుందని పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంటు సార్థక్ షడంగి హెచ్చరించారు. -
ఎస్సై అనుచిత ప్రవర్తన - పరిస్థితి ఉద్రిక్తం
ప్రయాణికుల కోసం బస్సు ఆపి.. పక్కన టీ తాగుతున్న కండక్టర్‌పై దురుసుగా ప్రవర్తించిన ఎస్సైపై ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం ప్రాంతంలో కృష్ణా జిల్లా బంటుమిల్లిలో చోటుచేసుకుంది. బంటుమిల్లి నుంచి మచిలీపట్నం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు బంటుమిల్లి ప్రధాన సెంటర్లో రోడ్డు పక్కన ఆపి ఉంది. బస్సు కండక్టర్ పక్కనే ఉన్న హోట్‌లో టీ తాగుతున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన స్థానిక ఎస్సై పి.వాసు బస్సు ఆగి ఉండటాన్ని గమనించి కండక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థులు వచ్చే టైం అయిందని, ఐదు నిమిషాలు ఆగితే వెళ్లిపోతామని కండక్టర్ నచ్చజెప్పారు. ఇదేమీ పట్టించుకోని ఎస్సై.. కండక్టర్ చొక్కా పట్టుకుని అసభ్యంగా దూషిస్తూ ఆయన చేతిలో ఉన్న టికెట్ల యంత్రాన్ని (టిమ్స్) లాక్కుని వెళ్లాడు. పరిస్థితి గమనించిన ప్రయాణీకులు ఎస్సై తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన ఆర్టీసీ యూనియన్ నేతలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.