![AAP MP Raghav Chadha suspended from Rajya Sabha - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/12/CHADDA.jpg.webp?itok=Avsvv0Vs)
న్యూఢిల్లీ: నిబంధనల ఉల్లంఘన, అనుచిత ప్రవర్తన, ధిక్కార వైఖరి ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభ నుంచి సస్పెన్షన్‌కు గుర య్యారు. ఆయన సస్పెన్షన్‌పై శుక్రవారం రాజ్యసభ నేత పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
దేశ రాజధాని ఢిల్లీ(సవరణ) బిల్లు–2023పై ప్రతిపాది త సెలెక్ట్ కమిటీకి అనుమతి తీసుకోకుండానే కొందరు సభ్యుల పేర్లను చేర్చినందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి, నివేదిక ఇచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపింది. ఆప్ మరో నేత సంజయ్ సింగ్ సస్పెన్షన్ పొడిగించే తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. వర్షాకాల సమావేశాల ప్రారంభంలోనే సంజయ్ సింగ్ సస్పెన్షన్‌కు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment