కేంద్ర బడ్జెట్ 2024లో ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మండిపడ్డారు. ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను తొలగిస్తే.. రియల్ ఎస్టేట్‌లో భారీగా నల్లధనం వచ్చి చేరుతుంది. కాబట్టి దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ప్రోత్సహించారు. అయితే ఇప్పుడు ఇండెక్సేషన్‌ను తొలగించడం ద్వారా పెట్టుబడిదారీ వర్గం వెనుకడుగు వేస్తుంది. ఇండెక్సేషన్‌ను తీసివేయడం అంటే పన్ను విధించడం కాదు.. పెట్టుబడిదారులకు జరిమానా విధించడంతో సమానం అని అన్నారు.
2024 బడ్జెట్‌లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన ప్రతిపాదనలో పాత ఆస్తులను విక్రయించే వ్యక్తులు అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుందని రాఘవ్ చద్దా తెలిపారు.
బడ్జెట్‌లో, ప్రభుత్వం స్థిరాస్తులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది. అయితే ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయడానికి ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించింది. ఇండెక్సేషన్‌ను పునరుద్దరించకపోతే.. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు తగ్గుతాయి, ప్రజలు తమకు నచ్చిన డ్రీమ్ హోమ్‌లను కొనుగోలు చేయడం సాధ్యం కాదని చద్దా అన్నారు.
ఇండెక్సేషన్ అనేది బాండ్లు, స్టాక్‌లు, రియల్ ఎస్టేట్ వంటి పెట్టుబడులను ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేసే పద్ధతి. సాధారణంగా ఇందులో పెట్టుబడి ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఉంటాయి. అయితే ద్రవ్యోల్బణం వల్ల వాస్తవ పెట్టుబడి విలువ తగ్గిపోతుంది. ఈ సమయంలో అప్పటికి ఉన్న ధరలకు అనుకూలంగా అడ్జస్ట్ చేయడానికి ఇండెక్సేషన్ ఉపయోగపడుతుంది.
Removal of ‘Indexation’ benefit from the Investor is a grave mistake by the Government.
I explain in detail. Please watch. pic.twitter.com/AhB7vViy0n— Raghav Chadha (@raghav_chadha) July 25, 2024
Comments
Please login to add a commentAdd a comment