
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయన అరెస్ట్‌ను ఆప్ మంత్రులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఇకప్పటికీ స్పందించకపోవటంపై ఎన్సీపీ (శరద్ పవార్) నేత జితేంద్ర అవధ్ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు చేశారు. అయితే ప్రతిపక్షాల కూటమిలో భాగంగా.. ఎన్సీపీ, ఆప్ భాగస్వామ్య పార్టీలు ఉన్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఎంపీ రఘవ్ చద్దా స్పందించలేదని ఎన్సీపీ నేత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. ‘రఘవ్ చద్దా ఎక్కడ?’ అని ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టిన ఎన్సీపీ నేత జితేంద్ర అవధ్ తర్వాత దాన్ని డిలీట్ చేయటం గమనార్హం.
శనివారం జితేంద్ర అవధ్ మాట్లాడుతూ.. ‘ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి రాజ్యసభ ఎంపీ రఘవ్ చద్దా కనిపించటం లేదు. ఆ పార్టీ నేతలు కేజ్రీవాల్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. కానీ, ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎంపీ రాఘవ్ చద్దా మాత్రం కనిపించటం లేదు. ఆప్‌కు రాఘవ్ చద్దా కీలకమైన నేత.. ఆయన ఇక్కడ లేకపోవటం, అరెస్ట్‌పై స్పందించకపోవటం కార్యకర్తలను అవనించినట్లే’ అని జితేంద్ర అన్నారు. దూరంగా వేరే దేశంలో ఉన్నంత మాత్రనా ప్రజలతో కనెక్ట్‌కాలేని రోజుల కాలం కాదు. ఆయన లండన్‌లో ఉన్పటికీ కనీసం స్పందిచకపోవటం చాలా విచిత్రం. ఒక వీడియో సందేశమైనా పార్టీకి, కార్యకర్తలకు పంపాలి. రఘవ్ చద్దా పూర్తిగా కనిపించకుండా, పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటాన్ని ప్రశ్నిస్తున్నా’ అని ఎనన్సీపీ నేత జితేంద్ర అవధ్ అన్నారు.
ఇక.. రఘవ్ చద్దా, ఆయన భార్య పరిణితి చోప్రాతో కలిసి లండన్ వెళ్లారు. కంటికి సంబంధించిన చికిత్స కోసం అక్కడికి వెళ్లినట్లు తెలుసస్తోంది. ఢల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 1తో ఈడీ కస్టడీ ముగియనుంది.