jithendra
-
‘రాఘవ్ చద్దా ఎక్కడ?’.. పోస్ట్ డిలీట్ చేసిన ఎన్సీపీ నేత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై.. ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయన అరెస్ట్‌ను ఆప్ మంత్రులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఇకప్పటికీ స్పందించకపోవటంపై ఎన్సీపీ (శరద్ పవార్) నేత జితేంద్ర అవధ్ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు చేశారు. అయితే ప్రతిపక్షాల కూటమిలో భాగంగా.. ఎన్సీపీ, ఆప్ భాగస్వామ్య పార్టీలు ఉన్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఎంపీ రఘవ్ చద్దా స్పందించలేదని ఎన్సీపీ నేత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. ‘రఘవ్ చద్దా ఎక్కడ?’ అని ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టిన ఎన్సీపీ నేత జితేంద్ర అవధ్ తర్వాత దాన్ని డిలీట్ చేయటం గమనార్హం. శనివారం జితేంద్ర అవధ్ మాట్లాడుతూ.. ‘ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి రాజ్యసభ ఎంపీ రఘవ్ చద్దా కనిపించటం లేదు. ఆ పార్టీ నేతలు కేజ్రీవాల్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. కానీ, ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎంపీ రాఘవ్ చద్దా మాత్రం కనిపించటం లేదు. ఆప్‌కు రాఘవ్ చద్దా కీలకమైన నేత.. ఆయన ఇక్కడ లేకపోవటం, అరెస్ట్‌పై స్పందించకపోవటం కార్యకర్తలను అవనించినట్లే’ అని జితేంద్ర అన్నారు. దూరంగా వేరే దేశంలో ఉన్నంత మాత్రనా ప్రజలతో కనెక్ట్కాలేని రోజుల కాలం కాదు. ఆయన లండన్‌లో ఉన్పటికీ కనీసం స్పందిచకపోవటం చాలా విచిత్రం. ఒక వీడియో సందేశమైనా పార్టీకి, కార్యకర్తలకు పంపాలి. రఘవ్ చద్దా పూర్తిగా కనిపించకుండా, పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండటాన్ని ప్రశ్నిస్తున్నా’ అని ఎనన్సీపీ నేత జితేంద్ర అవధ్ అన్నారు. ఇక.. రఘవ్ చద్దా, ఆయన భార్య పరిణితి చోప్రాతో కలిసి లండన్ వెళ్లారు. కంటికి సంబంధించిన చికిత్స కోసం అక్కడికి వెళ్లినట్లు తెలుసస్తోంది. ఢల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 1తో ఈడీ కస్టడీ ముగియనుంది. -
ఆ నటి గొంతు నాకన్నా ఘోరంగా ఉంది
జితేంద్ర అసలు పేరు రవికపూర్. కాని సినిమాల్లో రవీంద్ర కపూర్ అనే నటుడు ఉండటంతో తన పేరును జతేంద్ర అని మార్చుకున్నాడు. దాంతో జతిన్ ఖన్నాగా అసలు పేరు కలిగిన రాజేష్ ఖన్నా జితేంద్రకు దగ్గరగా ఉండే తన పేరు కాదని రాజేష్ ఖన్నా అని మార్చుకోవాల్సి వచ్చింది. రవికపూర్ (ఆర్.కె) అలా జితేంద్ర కపూర్ (జె.కె) అయితే జతిన్ ఖన్నా (జె.కె) పేరు మార్చుకుని రాజేష్ ఖన్నా (ఆర్.కె) అయ్యాడు. ఈ తారుమార్ల సంగతి ఇండియన్ ఐడెల్ తాజా ఎపిసోడ్లో ప్రేక్షకులతో పంచుకున్నారు జితేంద్ర. మార్చి 14న టెలికాస్ట్ అయిన ఇండియన్ ఐడెల్ ‘జితేంద్ర స్పెషల్’లో పాల్గొన్న ఆయన ముంబైలో ‘చాల్’లో తన 20వ ఏట వరకూ జీవించానని చెప్పారు. దాని వల్ల తాను పంజాబీ అయినా మరాఠి చాలా బాగా నేర్చుకోగలిగానని చెప్పారు. ‘మా ఇంట్లో మొదటిసారి ఫ్యాన్ బిగిస్తే దానిని చూడటానికి చాల్లో ఉన్న 60 ఇళ్ల వాళ్లూ వచ్చారు. అదో వింత. ట్యూబ్‌లైట్ బిగించినా వారికి వింతే. గణపతి పూజను కులమతాలకు అతీతంగా చేసేవారం. ఆ రోజులు మళ్లీ రావు’ అన్నాడాయన.‘నాకు జీవితంలో రెండు కోరికలు ఉన్నాయి. కలలు అనొచ్చు. ఒకటి ఇండియా బ్యాంటింగ్‌లో ఆరు వికెట్లు కోల్పోయినప్పుడు నేను బ్యాటింగ్‌కు వెళ్లి ఇండియాను గెలిపించడం. రెండు... మంచి గాయకుణ్ణి కావడం. కాని నా గొంతు చాలా చెడ్డగా ఉంటుంది. పాటల చిత్రీకరణలో నేను పెద్దపెద్దగా పాడుతూ యాక్ట్ చేస్తాను. కాని సౌండ్‌లో నా కఠినమైన గొంతు ఎవరికీ వినిపించేది కాదు. ఒకసారి ఇలాగే షాట్లో పెద్ద పెద్దగా పాడుతూ నటిస్తున్నాను. ఇంతలో ఏదో వైర్ తెగి పాట ఆగిపోయింది. నా గొంతు మాత్రం అసహ్యంగా అందరికీ వినిపించింది. అయితే కొంతలో కొంత మేలు ఏమిటంటే నాతో పాటు నటిస్తున్న ఆశా పరేఖ్ కూడా నాలాగే పెద్దగా పాడుతూ యాక్ట్ చేస్తోంది. ఆమె గొంతు నాకన్నా ఘోరంగా ఉంది’ అని నవ్వించారాయన. జితేంద్ర వయసు ఇప్పుడు 78 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఆయన చలాకీగా స్టెప్పులేయడం విశేషం. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలోని నార్పల క్రాస్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు... శింగనమల మండలం కొరివిపల్లి గ్రామానికి చెంది ఈశ్వరయ్య బీకేఎస్‌లోని ఐకేపీలో సీసీగా పని చేస్తున్నాడు. ఇతని కుమారుడు జితేంద్ర (11) నగరంలోని శారదానగర్ కాలనీలో శ్రీసాయి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. జితేంద్రకు అక్కడ పాఠశాలలో చదవడం ఇష్టం లేకపోవడంతో పాఠశాల నుంచి కొరివిపల్లి ఇంటికి నడుచుకుంటూ బయలు దేరాడు. అయితే బీకేఎస్ మండల కేంద్రంలోని నార్పల క్రాస్ వద్ద తాడిపత్రి నుంచి అనంతపురం వెళ్తున్న ఓ కారు జితేంద్రను ఢీ కొంది. కారు డ్రైవరే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. పోలీసులు కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
కొలిమిగుండ్ల (కర్నూలు జిల్లా): అప్పటి వరకూ సరదాగా ఆడుతూ, కేరింతలు కొడుతూ కనిపించిన చిన్నారి నోరు మూగబోయింది. ఆడుకుంటూ స్నానాలగదిలోకి వెళ్లిన రెండేళ్ల బాలుడు నీటి బకెట్లో తలకిందులుగా పడిపోవడంతో మృతి చెందాడు. ఆలస్యంగా జరిగిన దారుణాన్ని చూసిన ఆ చిన్నారి తల్లిదండ్రులు బాధతో కుప్పకూలిపోయారు. ఈ ఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం కోటపాడు ఎస్పీ కాలనీలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఎల్ల కిట్టయ్య, లక్ష్మీదేవి దంపతుల రెండేళ్ల కుమారుడు జితేంద్ర ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు వారి పనుల్లో వారు ఉన్నారు. అయితే, జితేంద్ర స్నానాల గదిలోకి వెళ్లగా కాలు జారి బకెట్లో తలకిందులుగా పడిపోవడంతో ఊరిరాడక మృతి చెందాడు. గాలికి బాత్రూమ్ డోర్ కూడా మూసుకుపోవడంతో జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలియలేదు. చిన్నారి మాట వినిపించకపోవడంతో ఎవరో ఒకరు ఎత్తుకుని ఉంటారులే అనుకున్నారు. కానీ, కొద్దిసేపటికి బాత్రూమ్లోని నీటి బకెట్లో జితేంద్ర విగతజీవిగా కనిపించడంతో... కిట్టయ్య, లక్ష్మీదేవి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే చుట్టుపక్కల వారు కూడా చలించిపోయారు.