హర్యానా: ఆప్‌ మరో జాబితా.. వినేశ్‌పై కవితా దళాల్‌ పోటీ | Haryana Assembly elections: AAP releases 4th list of 21 candidates | Sakshi
Sakshi News home page

హర్యానా: ఆప్‌ మరో జాబితా.. వినేశ్‌పై కవితా దళాల్‌ పోటీ

Published Wed, Sep 11 2024 4:17 PM | Last Updated on Wed, Sep 11 2024 5:25 PM

Haryana Assembly elections: AAP releases 4th list of 21 candidates

చంఢీఘడ్‌:  హర్యానా అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ తాజాగా మరో అభ్యర్థులు జాబితా విడుదల చేసింది. 21 మందితో నాలుగో జాబితా బుధవారం విడుదల చేసింది. కీలకమైన జులానా అసెంబ్లీ స్థానం నుంచి స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌పై కవితా దళాల్‌ను ఆప్‌ బరిలోకి దింపింది. 

ఇక.. ఇప్పటికే 20 మందితో తొలి జాబితాను ఆప్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజా జాబితాతో కలిపి ఇప్పటివరకు ఆప్‌ మొత్తం ఆప్‌ 61 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. హర్యానాలో ఉన్న 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబరు 5న పోలింగ్‌ జరగనుంది. 8న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడికానున్నాయి.

కవితా దళాల్ కూడా ప్రొఫెషనల్ రెజ్లర్, గతంలో ఈమె WWE లాంటి ప్రపంచ ప్రఖ్యాత ప్రొఫెషనల్‌ పోటీల్లో పాల్గొన్నారు. 2021లో కవితా దళాల్ WWE నుంచి వైదొలిగినట్లు ప్రకటించారు. 

చదవండి: హర్యానా బీజేపీ రెండో జాబితా: వినేశ్‌పై పోటీ ఎవరంటే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement