‘ఇలా ఆంధ్రా అంతా ఈవీఎంల ట్యాంపరింగ్‌’ | YSRCP MP Vijayasai Reddy Satire On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘ఇలా ఆంధ్రా అంతా ఈవీఎంల ట్యాంపరింగ్‌’

Published Wed, Oct 9 2024 12:01 PM | Last Updated on Wed, Oct 9 2024 12:55 PM

YSRCP MP Vijayasai Reddy Satire On Chandrababu Naidu

ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించగా.. కాంగ్రెస్ భంగపడింది. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.  

హర్యానా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో .. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై విజయసాయిరెడ్డి.. సీఎం చంద్రబాబుపై సెటైర్లు చేశారు. ‘ప్రపంచ బ్యాంకు జీతగాడు..చంద్రబాబు మోసగాడు’ అన్న కమ్యూనిస్టు పార్టీల పాత పాట గుర్తుకొస్తుందని ట్వీట్ చేశారు.  ఆ ట్వీట్‌లో విజయసాయిరెడ్డి ఇంకా ఏం అన్నారంటే?

 

‘హర్యానా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో .. ఆంధ్రఎన్నికలకు సంబంధించి ..‘ప్రపంచ బ్యాంకు జీతగాడు..చంద్రబాబు మోసగాడు’ అన్న కమ్యూనిస్టుపార్టీల పాత పాట గుర్తుకొస్తుంది. ఎలెక్షన్ కమిషన్ 3 నెలలు తర్వాత  ‘ఫార్మ్ 20’ వెబ్‌సైట్‌లో పెట్టింది . పోలింగ్ బూత్ వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో చూసుకోవచ్చు .

ఎన్నికలు ఫలితాలు వెలువతున్నప్పుడు ఆ తర్వాత మొదటి రెండు వారాలు ఎవరూ కోర్టుకి వెళ్లకుండా ప్రజల్లో చర్చ జరగకుండా టీడీపీ గూండాలు అరాచకం చేశారు.  

ఫారం 20  వివరాలు బయటకి రాగానే లడ్డు వ్యవహారం వాళ్ళ కుట్రలో భాగంగా పక్కా స్కెచ్‌తో మొదలుపెట్టారు.  చంద్రబాబుకు నిజానిజాలతో పనిలేదు. ఇది నెయ్యికోసమో భగవంతుడి కోసమో మొదలెట్టింది కాదు. ఈవీఎం మోసాలని కప్పిపెట్టటానికి మొదలెట్టిన అరాచకం. చంద్రబాబు సరిగ్గా గుజరాత్ వెళ్లి వచ్చిన 6 రోజుల తర్వాత కుట్రలో భాగంగానే ఈ తప్పుడు రిపోర్ట్‌ని ముందుగా గుజరాత్ నుండి తెప్పించి పెట్టుకుని టీటీడీకి పాలకమండలి వేయకుండా తాత్సారం చేస్తూ వచ్చాడు.

ప్రజలెవ్వరూ..బూత్ వారీ లెక్కలు గురించి మాట్లాడుకోకుండా లడ్డు దీక్షలు, వగైరా..వగైరా ..ఇదీ స్థూలంగా జరుగుతున్న కుట్ర .. ఉదాహరణకు హిందూపురం ఒక వార్డులో వచ్చిన ఓట్లు ..( ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో పెట్టారు ) 
అసెంబ్లీ -- 
వైఎస్సార్సీపీ - 1
టీడీపీ - 95
బీఎస్పీ - 5 
కాంగ్రెస్ - 464 

అదే వార్డులో పార్లమెంట్ 
వైస్సార్సీపీ - 472 
కాంగ్రెస్ - 1 
టీడీపీ - 8 
బీఎస్పీ - 83 
ఇది సాధ్యమా ?
ఇలా ఆంధ్రా అంతా ఈవీఎంల ట్యాంపరింగే  

దేశం మొత్తం మీద మొదటి నాలుగు దశల పోలింగులో బీజేపీకి ఎదురుగాలి వీచిందని స్పష్టంగా అర్థమైంది . రిజల్ట్స్ కూడా అలాగే వచ్చాయి . కానీ అయిదు ఆరు దశలలో జరిగిన రాష్ట్రాలలో ముఖ్యంగా అసెంబ్లీకి పార్లమెంట్ కి కలిపి జరిగిన ఆంధ్రాలో ఈవీఎంలు (ట్యాంపరింగ్‌) మోసం చేశారు.

ఇది చంద్రబాబు, లోకేష్, హరిప్రసాద్, టెర్రాసొఫ్ట్ మరి కొంతమంది కలిసి చేసిన కుట్ర. ఎన్నికల ముందు చంద్రబాబు జర్మనీ, దుబాయ్, లోకేష్ ఇటలీ, జర్మనీ, దుబాయ్ ప్రయాణాలు ఈ ఈవీఎంల టాంపరింగ్ మరియు డబ్బులు బదిలీ కోసమే అన్నది సుస్పష్టం.

చంద్రబాబుకు,లోకేష్‌కు హిందూమతంపై కానీ, భగవంతుడిపై  కానీ నమ్మకంలేదు.  వారి కులమే ఒక మతం అని నమ్మే వ్యక్తులు. చంద్రబాబు ఈ మోసాలు వెన్నతో పెట్టిన విద్య. అందరూ కలిసి ఈ అరాచకానికి తెరదీశారు ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూ ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది ఈ దోపిడీదొంగల టీడీపీ’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement