Haryana Assembly election
-
చట్టపరమైన చర్యలకు వెనుకాడం: ఈసీపై కాంగ్రెస్ ధ్వజం
న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు సమయంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలు బాధ్యతారారహిత్యమైనవని తెలిపింది. తమకు ఫలితాలు అనుకూలంగా రాకపోవడంతో కాంగ్రెస్ నిరాధార అరోపణలు చేస్తోందని మండిపడింది. ఇలాంటి పనికిమాలిన ఫిర్యాదులు చేసే ధోరణిని అరికట్టేలా పార్టీ చర్యలు తీసుకోవాలని సూచించింది.ఈసీ సమాధానంపై తాజాగా కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఎన్నికల సంఘం తరుచూ కాంగ్రెస్ పార్టీని, పార్టీ నతేలను టార్గెట్ చేసుకొని దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ఇలాంటి వ్యాఖ్యలే కొనసాగిస్తే తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్ ఈసీకి లేఖ రాసింది. సమస్యలను తెలియజేసేందుకు మాత్రమే భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, అంతేగానీ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఈసీ కార్యాలయాన్ని గౌరవిస్తున్నామని పేర్కొంది. కానీ ఎన్నికల సంఘం సమాధానాలు మాత్రం మరోలా ఉంటున్నాయని తెలిపింది. తన స్వతంత్రతను పూర్తిగా పక్కనపెట్టడమే ప్రస్తుతం ఈసీ లక్ష్యంగా పెట్టుకుందని, ఆ విషయంలో ఎన్నికల సంఘం అద్భుతమైన పనితీరు చూపుతోందని విమర్శలు గుప్పించింది. ‘ఎన్నికల సంఘం తమకు తాను క్లీన్ చిట్ ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఈసీ స్పందన, వాడిన భాష, పార్టీపై చేసిన ఆరోపణలు వంటి అంశాలు మేము తిరిగి లేఖ రాసేందుకు కారణమయ్యాయి. ఎన్నికలు, ఫలితాలపై లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయడం ఎన్నికల సంఘం బాధ్యత. అయితే తన విధిని ఈసీ మరిచిపోయినట్లు అనిపిస్తోంది. ఈసీ స్పందన కాంగ్రెస్ పార్టీపై, నాయకులపై దాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈసీ ఇదే తరహా భాషను కొనసాగిత్తే.. అలాంటి వ్యాఖ్యలను తొలగించేందుకు న్యాయపరమైన ఆశ్రయం పొందడం తప్ప తమకు మరో మార్గం లేదు’ లేఖలో తీవ్రంగా స్పందించింది. ఈ లేఖపై కేసీ వేణుగోపాల్, అశోక్ గహ్లోత్, అజయ్ మాకెన్ సహా తొమ్మిది మంది సీనియర్ నేతలు సంతకం చేశారు. -
ఈవీఎంలపై అనుమానాలు బలపర్చిన హర్యానా ఫలితాలు!
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం)లపై మళ్లీ చర్చ మొదలైంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ ఫలితాలను అంగీకరించేది లేదని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పార్టీ వైఖరికి తగ్గట్టుగానే కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఈవీఎంలపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. హర్యానా ఎన్నికల సందర్భంగా ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్‌లో కనిపించిన తేడాను విసృ్తతంగా ప్రచారం చేస్తున్నారు వీరు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన చోట్ల ఈవీఎంల బ్యాటరీ ఛార్జ్ 70 శాతం మాత్రమే ఉంటే.. బీజేపీ గెలిచిన స్థానాల్లో 99 శాతం ఉండటం ఎలా సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఇదే విషయాన్ని కేరళ కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.హిస్సార్, మహేంద్ర ఘడ్, పానిపట్ జిల్లాలలో ఈవీఎం బ్యాటరీల ఛార్జింగ్ 99 శాతం ఉందని కాంగ్రెస్ గుర్తించింది. అంటే ఇక్కడ ఈవీఎంల టాంపరింగ్ జరిగిందన్న అభియోగాన్ని మోపుతున్నారు. నౌమాల్ అనే శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర సింగ్ ఈవీఎంల బాటరీ ఛార్జింగ్‌పై అభ్యంతరం చెబుతూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు కూడా. తొమ్మిది ఓటింగ్ యంత్రాల నెంబర్లు ఇస్తూ, వాటిలో బ్యాటరీ ఛార్జింగ్ 99 శాతం ఎలా ఉందంటూ ప్రశ్నించారు. దీనిని బట్టి ఎంపిక చేసుకున్న కొన్ని పోలింగ్ కేంద్రాల్లో టాంపరింగ్ జరిగిందన్న అనుమానాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరిగి ఉంటే ప్రజాస్వామ్యానికి అది పెను ప్రమాదమే అవుతుంది. ఎన్నికలు ఒక ఫార్స్ గా మిగిలిపోతాయి.ఎన్నికల కమిషన్ ఇప్పటికే పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలకు గురి అవుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఏపీలో మాదిరే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితం ప్రజలను గందరగోళంలో పడేసిందని వ్యాఖ్యానించారు. అమెరికాతో సహా పలు ప్రజాస్వామ్య దేశాలలో ఈవీఎంలు వాడడం లేదని, పేపర్ బాలెట్నే వాడుతున్నారని, దేశంలోనూ పేపర్ బాలెట్ రావాలని ఆయన సూచించారు. ఈ విషయంలో ఆయన దేశానికి మార్గదర్శకత్వం వహించారని అనుకోవాలి.ఏపీలో ఈవీఎంల టాంపరింగ్‌పై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి. ఆశ్చర్యకరంగా ఈ ఆరోపణలు, అనుమానాలను నివృత్తి చేయాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రంలోని ఎన్నికల అధికారులు కాని ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. పైగా మాక్ ఓటింగ్ చేస్తామంటూ ప్రజల్లో అనుమానాలు మరింత బలపడేలా వ్యవహరించారు. ఉదాహరణకు ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంల డేటానున వీవీప్యాట్ స్లిప్‌లతో పోల్చి చూపాలని వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇందుకు అవసరమైన ఛార్జీలను కూడా చెల్లించారు. కానీ ఈ పని చేయాల్సిన ఎన్నికల అధికారులు ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకునేలా చేసేందుకు ప్రయత్నించారు. అభ్యర్థి అంగీకరించక పోవడంతో కొత్త డ్రామాకు తెరలేపుతూ.. వీవీప్యాట్ స్లిప్‌లు లెక్కించబోమని నమూనా ఈవీఎంలో మాక్ పోలింగ్ జరుపుతామని ప్రతిపాదించారు. ఇందుకు వైసీపీ అభ్యర్థి ససేమిరా అన్నారు. హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వాదోపవాదాలు జరిగాయి. తీర్పు రిజర్వులో ఉంది. చిత్రంగా రెండు నెలలు అయినా తీర్పు వెలువడలేదు. ఈ పరిణామాలన్నీ ప్రజల సందేహాలకు మరింత బలం చేకూర్చాయి.విజయనగరం జిల్లాలో వైసీపీ ఎంపీ అభ్యర్ధి చంద్రశేఖర్, గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థి అప్పల నరసయ్యలు కూడా బాలినేని మాదిరిగానే ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. కానీ ఫలితం మాత్రం తేల లేదు. అధికారులు వీవీప్యాట్ స్లిప్‌లు లెక్కించబోమని భీష్మించుకున్నారు. మరోవైపు పోలింగ్ జరిగిన రెండు నెలలైనా ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ 99 శాతం ఉండటంపై వివరణ ఇవ్వాల్సిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) అధికారులు తమకు ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవంటూ తప్పించుకున్నారు. ఈ విషయాలన్నీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ ఈవీఎంల ఏదో మతలబు ఉందని చాలామంది అభిప్రాయపడే స్థితికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ ఈవీఎంల మోసానికి పాల్పడిందన్న ఆరోపణలు చేశారు. అందుకు తగ్గ ఉదాహరణలూ ఇచ్చారు. ఈ సందేహాలన్నింటిపైఎన్నికల సంఘం తగిన వివరణ ఇచ్చి ఉంటే అనుమానాలు బలపడకపోవును. ఇంకోపక్క వీవీప్యాట్ స్లిప్‌లను పోలింగ్ తరువాత 45 రోజుల పాటు భద్రపరచాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా కాదని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారులు పది రోజులకే స్లిప్‌లు దగ్ధం చేయాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది.వీవీప్యాట్ స్లిప్‌లు ఉండీ ప్రయోజనం ఏమిటి?లెక్కించనప్పుడు వివిపాట్ స్లిప్‌ల రూపంలో ఒక వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసినట్లు అన్న ప్రశ్నలిప్పుడు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం మొండిగా వ్యవహరిస్తూ జవాబిచ్చేందుకు నిరాకరించడం ఎంత వరకూ సబబు?హర్యానా అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌దే విజయమని ఢంకా భజాయించి మరీ చెప్పాయి. ఒక్కటంటే ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని చూచాయగా కూడా చెప్పలేదు. బీజేపీకి మద్దతిచ్చే జాతీయ ఛానళ్లు కూడా ఇదే మాట చెప్పాలి. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఫలితాలు బీజేపీకి అనుకాలంగా రావడం గమనార్హం.కౌంటింగ్ మొదలైన తరువాత గంటన్నర పాటు కాంగ్రెస్ పార్టీ 20 నియోజకవర్గాల్లో మెజార్టీలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తరువాత బీజేపీ చాలా నాటకీయంగా పుంజకోవడమే కాకుండా.. మెజార్టీ మార్కును దాటేసింది కూడా. కౌంటింగ్ సందర్భంగా ఆయా రౌండ్ల ఫలితాల వెల్లడి విషయంలోనూ ఎన్నికల సంఘం చాలా ఆలస్యం చేసిందని, దీని వెనుక కూడా కుట్ర ఉందని కాంగ్రెస్ అనుమానిస్తోంది.ప్రజలు నిజంగానే ఓటేసి బీజేపీని గెలిపించి ఉంటే అభ్యంతరమేమీ ఉండదు కానీ.. ఏదైనా అవకతవకలు జరిగి ఉంటే మాత్రం అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుంది. ఏపీలో ఇదే తరహా పరిణామాలు జరిగినప్పుడు రాహుల్ గాంధీ వంటివారు స్పందించి ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించి ఉంటే కాంగ్రెస్ పార్టీ నైతికంగా వ్యవహరించినట్లు అయ్యేది. తాజా పరిణామాలతో తన వాదనను బలంగా వినిపించే అవకాశమూ దక్కేది. అప్పట్లో సందీప్ దీక్షిత్ అనే కాంగ్రెస్ నేత ఏపీలో ఓట్ల శాతం పెరిగిన వైనం, ఈవీఎం ల తీరుపై విమర్శలు చేసినా, వాటికి ఈసీ స్పందించలేదు. ఇంకా పెద్ద స్థాయి నేతలు మాట్లాడి ఉండాల్సింది.ట్యాంపరింగ్ సాధ్యమేనా?సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయిన నేపథ్యంలో ఈవీఎంల టాంపరింగ్ పెద్ద విషయం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు అవకాశం ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది. కానీ ఈసీ స్వతంత్రంగా వ్యవహరించడం మానేసి, కేంద్రంలో ఉన్న పార్టీకి తొత్తుగా పనిచేస్తోందన్న విమర్శలు ఎదుర్కుంటోంది. టాంపరింగ్ అవకాశం ఉంటే జమ్ము-కాశ్వీర్ లో కూడా జరిగేది కదా అని కొందరు వాదిస్తున్నారు. అందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ, అన్ని చోట్ల చేయాలని లేదు. ప్రస్తుతం అది కేంద్ర పాలిత ప్రాంతం కనుక కేంద్ర పెత్తనం అక్కడ ఎలాగూ సాగుతుంది. కానీ ఉత్తర భారత దేశం మధ్యలో ఉండే హర్యానాలో బీజేపీ ఓటమి పాలైతే దాని ప్రభావం పరిసర రాష్ట్రాలపై కూడా పడే అవకాశం ఉందని భయపడి ఉండవచ్చని, అందుకే సెలెక్టివ్‌గా టాంపరింగ్ జరిగి ఉంటుందన్నది కాంగ్రెస్ నేతల వాదనగా ఉంది.2009 ముందు వరకు ఈవీఎంలపై ఆరోపణలు పెద్దగా రాలేదు. 2009లో తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడమే కాకుండా, టాంపరింగ్ ఎలా చేయవచ్చో, కొందరు నిపుణుల ద్వారా ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. 2014లో ఆయన విభజిత ఏపీలో గెలిచిన తరువాత మాత్రం దీని ప్రస్తావనే చేయలేదు. 2019లో ఓటమి తర్వాత ఈవీఎంలపై కోర్టుకు వెళ్లిన వారిలో ఈయన కూడా ఉన్నారు.ఆ క్రమంలోనే సుప్రీం కోర్టు వీవీప్యాట్ స్లిప్ లపై మార్గదర్శకాలు ఇచ్చింది. అయినా సరే ఎన్నికల అధికారులు వాటిని పట్టించుకోకపోవడం విశేషం. 2024లో టీడీపీ కూటమి మళ్లీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు కాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని ఈవీఎంల టాంపరింగ్ ఊసే ఎత్తలేదు. పలు ఆరోపణలు వస్తున్నా, వారు కిమ్మనకపోవడం కూడా ఆసక్తికరంగానే ఉంది. ప్రజలలో అనుమానాలు మరింత బలపడ్డాయని చెప్పవచ్చు.ఈసీ ప్రజల సంశయాలు తీర్చకుండా ఇప్పటిలాగానే వ్యవహరిస్తే దేశంలో ఎవరూ ఎన్నికలను నమ్మని పరిస్థితి వస్తుంది. ప్రజాభిప్రాయాన్ని వమ్ము చేస్తున్నారని రాజకీయ పార్టీలు ఆరోపిస్తాయి. భవిష్యత్తులో జరిగే వివిధ రాష్ట్రాల ఎన్నికలలో ఈ సమస్య మళ్లీ ముందుకు రావచ్చు. 2029 లోక సభ ఎన్నికలు బాలెట్ పత్రాలతో జరగాలన్న డిమాండ్ పెరుగుతోంది. అందుకు కేంద్రం అంగీకరించకపోతే ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించే అవకాశం ఉంటుందా అన్నది అప్పుడే చెప్పలేం. బ్యాలెట్ పత్రాల పద్దతి ఉంటే రిగ్గింగ్ జరగదా? జరగదని చెప్పజాలం.1972 లో పశ్చిమబెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రిగ్గింగ్ చేసిందని ఆరోపిస్తూ సీపీఎం ఎన్నికలను బహిష్కరించింది. ఆ తర్వాత 1978 ఎన్నికలలో ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది.ఇప్పుడు సీసీటీవీల వ్యవస్థ వచ్చింది కనుక బ్యాలెట్ పత్రాల రిగ్గింగ్‌ను కొంతమేర నిరోధించవచ్చు. ఈవీఎంల వ్యవస్థ వల్ల సులువుగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నా, వాటిని మానిప్యులేట్ చేస్తున్నారని జనం నమ్మితే మాత్రం ఈవీఎంలు అత్యంత ప్రమాదకరంగా మారినట్లు అవుతుంది. ఏది ఏమైనా ఈవీఎంల టాంపరింగ్ కు అవకాశం లేని టెక్నాలజీని వాడాలి. లేదా బాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించడమే మంచిది కావచ్చు. కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘ఇలా ఆంధ్రా అంతా ఈవీఎంల ట్యాంపరింగ్’
ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించగా.. కాంగ్రెస్ భంగపడింది. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. హర్యానా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో .. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై విజయసాయిరెడ్డి.. సీఎం చంద్రబాబుపై సెటైర్లు చేశారు. ‘ప్రపంచ బ్యాంకు జీతగాడు..చంద్రబాబు మోసగాడు’ అన్న కమ్యూనిస్టు పార్టీల పాత పాట గుర్తుకొస్తుందని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో విజయసాయిరెడ్డి ఇంకా ఏం అన్నారంటే?హర్యానా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో .......ఆంధ్రఎన్నికలకు సంబంధించి ........."ప్రపంచ బ్యాంకు జీతగాడు...చంద్రబాబు మోసగాడు"......అన్న కమ్యూనిస్టుపార్టీల పాత పాట గుర్తుకొస్తుంది. ~ఎలెక్షన్ కమిషన్ 3 నెలలు తర్వాత "ఫార్మ్ 20" వెబ్ సైట్ లో పెట్టింది . పోలింగ్ బూత్ వారీగా ఏ పార్టీకి…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 9, 2024 ‘హర్యానా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో .. ఆంధ్రఎన్నికలకు సంబంధించి ..‘ప్రపంచ బ్యాంకు జీతగాడు..చంద్రబాబు మోసగాడు’ అన్న కమ్యూనిస్టుపార్టీల పాత పాట గుర్తుకొస్తుంది. ఎలెక్షన్ కమిషన్ 3 నెలలు తర్వాత ‘ఫార్మ్ 20’ వెబ్సైట్లో పెట్టింది . పోలింగ్ బూత్ వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో చూసుకోవచ్చు .ఎన్నికలు ఫలితాలు వెలువతున్నప్పుడు ఆ తర్వాత మొదటి రెండు వారాలు ఎవరూ కోర్టుకి వెళ్లకుండా ప్రజల్లో చర్చ జరగకుండా టీడీపీ గూండాలు అరాచకం చేశారు. ఫారం 20 వివరాలు బయటకి రాగానే లడ్డు వ్యవహారం వాళ్ళ కుట్రలో భాగంగా పక్కా స్కెచ్‌తో మొదలుపెట్టారు. చంద్రబాబుకు నిజానిజాలతో పనిలేదు. ఇది నెయ్యికోసమో భగవంతుడి కోసమో మొదలెట్టింది కాదు. ఈవీఎం మోసాలని కప్పిపెట్టటానికి మొదలెట్టిన అరాచకం. చంద్రబాబు సరిగ్గా గుజరాత్ వెళ్లి వచ్చిన 6 రోజుల తర్వాత కుట్రలో భాగంగానే ఈ తప్పుడు రిపోర్ట్‌ని ముందుగా గుజరాత్ నుండి తెప్పించి పెట్టుకుని టీటీడీకి పాలకమండలి వేయకుండా తాత్సారం చేస్తూ వచ్చాడు.ప్రజలెవ్వరూ..బూత్ వారీ లెక్కలు గురించి మాట్లాడుకోకుండా లడ్డు దీక్షలు, వగైరా..వగైరా ..ఇదీ స్థూలంగా జరుగుతున్న కుట్ర .. ఉదాహరణకు హిందూపురం ఒక వార్డులో వచ్చిన ఓట్లు ..( ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పెట్టారు ) అసెంబ్లీ -- వైఎస్సార్సీపీ - 1టీడీపీ - 95బీఎస్పీ - 5 కాంగ్రెస్ - 464 అదే వార్డులో పార్లమెంట్ వైస్సార్సీపీ - 472 కాంగ్రెస్ - 1 టీడీపీ - 8 బీఎస్పీ - 83 ఇది సాధ్యమా ?ఇలా ఆంధ్రా అంతా ఈవీఎంల ట్యాంపరింగే దేశం మొత్తం మీద మొదటి నాలుగు దశల పోలింగులో బీజేపీకి ఎదురుగాలి వీచిందని స్పష్టంగా అర్థమైంది . రిజల్ట్స్ కూడా అలాగే వచ్చాయి . కానీ అయిదు ఆరు దశలలో జరిగిన రాష్ట్రాలలో ముఖ్యంగా అసెంబ్లీకి పార్లమెంట్ కి కలిపి జరిగిన ఆంధ్రాలో ఈవీఎంలు (ట్యాంపరింగ్) మోసం చేశారు.ఇది చంద్రబాబు, లోకేష్, హరిప్రసాద్, టెర్రాసొఫ్ట్ మరి కొంతమంది కలిసి చేసిన కుట్ర. ఎన్నికల ముందు చంద్రబాబు జర్మనీ, దుబాయ్, లోకేష్ ఇటలీ, జర్మనీ, దుబాయ్ ప్రయాణాలు ఈ ఈవీఎంల టాంపరింగ్ మరియు డబ్బులు బదిలీ కోసమే అన్నది సుస్పష్టం.చంద్రబాబుకు,లోకేష్‌కు హిందూమతంపై కానీ, భగవంతుడిపై కానీ నమ్మకంలేదు. వారి కులమే ఒక మతం అని నమ్మే వ్యక్తులు. చంద్రబాబు ఈ మోసాలు వెన్నతో పెట్టిన విద్య. అందరూ కలిసి ఈ అరాచకానికి తెరదీశారు ప్రజాస్వామ్యం ఖూనీ అవుతూ ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది ఈ దోపిడీదొంగల టీడీపీ’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు. -
హర్యానాలో కాంగ్రెస్ హవా.. వారిద్దరిలో సీఎం ఎవరు?
ఢిల్లీ: హర్యానా, జమ్ము కశ్మీర్‌కు సంబంధించి ఎగ్జిట్‌పోల్స్ నేడు విడుదలయ్యాయి. ఈ క్రమంలో పలు సర్వే సంస్థలు హర్యానాలో కాంగ్రెస్‌కు అధికారం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. హర్యానాలో 90 నియోజకవర్గాలకు గానూ 55కి పైగా స్థానాల్లో హస్తం పార్టీ గెలుస్తుందని సర్వేలు చెప్పాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీఎం ఎవరు అనే చర్చ మొదలైంది.హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి స్థానం ఎవరిది? అనే చర్చ రాజకీయంగా చర్చనీయాశంగా మారింది. ప్రధానంగా పార్టీలో సీనియర్ నేతలు కుమారి సెల్జా, రణ్‌దీప్ సూర్జేవాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ సీఎం ఎవరు అనే అంశం పార్టీ హైకమాండ్ నిర్ణయింస్తుందని తెలిపారు. కుమారి సెల్జాకు సీఎం బాధ్యతలు అప్పగించే అవకాశముందా? అని ప్రశ్నించగా.. మనది ప్రజాస్వామ్యం. సీఎం పదవి కోసం ఎవరైనా ఆసక్తి చూపవచ్చు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో..హర్యానాలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని భావిస్తున్నాం. ప్రస్తుత బీజేపీ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. అవినీతి పెరిగిపోయింది. అందుకే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రజలందరూ కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. #ElectionsWithNDTV #HaryanaElections #BhupinderHooda pic.twitter.com/wF7Z7WMnqn— NDTV (@ndtv) October 5, 2024 -
Congress Prty: 7 కీలక హామీలు
సాక్షి, న్యూఢిల్లీ: హరియాణా శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ బుధవారం తమ హామీల చిట్టీని బహిర్గతం చేసింది. తాము అధికారంలోకి వస్తే ప్రజల సంక్షేమం కోసం ఏం చేస్తామనే విషయాన్ని మేనిఫెస్టోలో వివరించింది. పేద, మధ్య తరగతి ప్రజలు, మహిళలు, రైతులకు వరాలు కురిపించింది. మహిళలకు ప్రతి నెల రూ.2,000 ఆర్థికసాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్ సహా పలు వర్గాలపై వరాల జల్లు కురిపించింది. ఏడు కీలకమైన హామీలు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, హరియాణ మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాన్ల సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 53 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు.ఏడు గ్యారంటీలు ఇవే → మహిళా సాధికారత: 18 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.2,00 చొప్పున ఆర్థికసాయం. రూ.500కే గ్యాస్ సిలిండర్ → సామాజిక భద్రత: వృద్ధులు, దివ్యాంగులు, వితంతులకు రూ.6,000 పెన్షన్ → యువతకు: రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ → ఉచితాలు: రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్→ పేదలకు: ప్రతి పేద కుటుంబానికి 100 గజాల స్థలంలో ఇల్లు. ఇందులో రూ.3.5 లక్షల ఖర్చుతో రెండు గదుల ఇళ్లు → రైతులకు: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత → వెనుకబడిన వర్గాలకు: కులగణన చేసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తగు చర్యలు తీసుకోవడం. క్రిమిలేయర్ పరిమితిని రూ.10లక్షలకు పెంపు గెలిచాకే సీఎం అభ్యర్థి ఖరారు: ఖర్గే హరియాణలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇచి్చన ఏడు హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు ‘‘దాదాపు 35 లక్షల ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయకుండా నిలిపివేసింది. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఒక ఇంజన్ ముందుకు తీసుకెళ్తుంటే మరో ఇంజన్ వెనక్కి లాగుతోంది. మేం మేనిఫెస్టోలో చెప్పిన ఏడు ప్రధాన వాగ్దానాలను అధికారంలోకి రాగానే నెరవేరుస్తాం. తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రానికి బీజేపీ చేసిన నష్టాన్ని సరిదిద్దటంతోపాటు రాష్ట్రంలో వృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు ‘అభివృద్ధి ఎక్స్‌ప్రెస్ ఇంజన్’జత చేస్తాం’’అని ఖర్గే వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించాకే ముఖ్యమంత్రి అభ్యరి్థని ప్రకటిస్తామని ఖర్గే స్పష్టంచేశారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ హుడా సైతం మాట్లాడారు. ‘‘నాటి ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ హయాంలో 1966లో మా రాష్ట్రం ఏర్పాటైంది. నాటి నుంచి 2014 వరకు రాష్ట్రం అభివృద్ధి చెందింది. అయితే తొమ్మిదిన్నరేళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయింది. మేం అధికారంలోకి వచ్చాక మళ్లీ హరియాణాను నంబర్ వన్ చేస్తాం’అని హూడా అన్నారు. -
హర్యానా: ఆప్ మరో జాబితా.. వినేశ్‌పై కవితా దళాల్ పోటీ
చంఢీఘడ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా మరో అభ్యర్థులు జాబితా విడుదల చేసింది. 21 మందితో నాలుగో జాబితా బుధవారం విడుదల చేసింది. కీలకమైన జులానా అసెంబ్లీ స్థానం నుంచి స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై కవితా దళాల్‌ను ఆప్ బరిలోకి దింపింది. ఇక.. ఇప్పటికే 20 మందితో తొలి జాబితాను ఆప్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజా జాబితాతో కలిపి ఇప్పటివరకు ఆప్ మొత్తం ఆప్ 61 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. హర్యానాలో ఉన్న 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబరు 5న పోలింగ్ జరగనుంది. 8న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడికానున్నాయి.కవితా దళాల్ కూడా ప్రొఫెషనల్ రెజ్లర్, గతంలో ఈమె WWE లాంటి ప్రపంచ ప్రఖ్యాత ప్రొఫెషనల్ పోటీల్లో పాల్గొన్నారు. 2021లో కవితా దళాల్ WWE నుంచి వైదొలిగినట్లు ప్రకటించారు. Aam Aadmi Party (AAP) released the fourth list of 21 candidates for Haryana Assembly electionsSo far, AAP has announced the names of 61 candidates pic.twitter.com/9YmkzmLMKe— ANI (@ANI) September 11, 2024చదవండి: హర్యానా బీజేపీ రెండో జాబితా: వినేశ్‌పై పోటీ ఎవరంటే.. -
కుదరని ఆప్, కాంగ్రెస్ పొత్తు
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్, ఆప్ ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. కురుక్షేత్ర ప్రాంతంలో ఎక్కువ సీట్లు కావాలని ఆప్ పట్టుబట్టింది. మొత్తంగా 10 సీట్లు కావాలని కోరగా ఐదుకు మించి ఇచ్చేది లేదని కాంగ్రెస్ తెగేసి చెప్పింది. దీంతో చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. ఎవరికి వారే పోటీచేయడం ఖాయమైంది. దీంతో ఆప్ 20 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను సోమవారం విడుదలచేసింది. జాబితా విడుదలపై ఆప్ హరియాణా చీఫ్ సుశీల్ గుప్తా మాట్లాడారు. ‘‘ సోమవారం సాయంత్రంకల్లా మీ నిర్ణయం చెప్పాలని కాంగ్రెస్‌కు స్పష్టంచేశాం. అయినా కాంగ్రెస్ నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదు. సెప్టెంబర్ 12కల్లా నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. వాళ్ల కోసం నిరీక్షణ ముగిసింది. అందుకే ఒంటరిగా పోటీచేయాలని నిర్ణయించుకున్నాం’ అని ఆయన అన్నారు. ఆప్ తొలి జాబితా ప్రకారం ఆప్ సీనియర్ నేత అనురాగ్ ధండా కలాయత్‌లో పోటీచేస్తారు. బెడిసికొట్టిన చర్చలుబీజేపీకి ఉమ్మడిగా ఓడిద్దామని ఆప్, కాంగ్రెస్ భావించాయి. అందులోభాగంగానే పొత్తు కోసం చర్చలకు సిద్ధమయ్యాయి. కొన్ని చోట్ల ఉమ్మడిగా ఒక్కరినే నిలబెట్టాలని భావించాయి. కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, దీపక్ బాబరియా, ఆప్ నుంచి రాఘవ్ చద్దా తదితరులు కొద్ది రోజుల క్రితమే చర్చలు మొదలెట్టారు. అయితే కొన్ని స్థానాల్లో మేమంటే మేము పోటీచేస్తామని ఆప్, కాంగ్రెస్ పట్టుబట్టడంతో ఏకాభిప్రాయం కష్టమైంది. హరియాణా అసెంబ్లీకి అక్టోబర్ ఐదో తేదీన పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. -
ఓ వైపు కాంగ్రెస్‌తో పొత్తంటూనే.. పక్క చూపులు చూస్తున్న కేజ్రీవాల్?
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆయా రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. పట్టు విడుపులు లేకుండా పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే తాము కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు సిద్దమేనంటూ సంకేతాలిచ్చిన ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం..అక్టోబర్ 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ కలయత్,కురుక్షేత్ర అసెంబ్లీ స్థానాలు తమకే కావాలని చర్చలు జరుతుంది. ఓవైపు ఆప్ పొత్తు చర్చలు జరుపుతూనే కాంగ్రెస్, బీజేపీ రెబల్ అభ్యర్థులకు గాలం వేసే పనిలో పడింది. ఏ పార్టీతో పొత్తు లేదనుకుంటే రెబల్ అభ్యర్థులను తమ పార్టీలోకి చేర్చుకుని అసెంబ్లీ స్థానాల్ని ఖరారు చేయనుంది. రంగంలోకి రాఘవ్ చద్దాఇది లావుండగా,ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆదివారం మాట్లాడుతూ..పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, చర్చలు సఫలం అవుతాయనే నమ్మకంతో ఉన్నామని చెప్పారు.హర్యానా ప్రజల సంక్షేమం కోసం రెండు జాతీయ పార్టీలు కూటమిగా ఏర్పడితే గెలుపు తధ్యమన్నారు. పొత్తు విషయమై కాంగ్రెస్‌తో రాఘవ్ చద్దా చర్చలు జరుపుతున్నారు. కాగా, హర్యానాలో అక్టోబరు 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.90 స్థానాల్లో పోటీ చేస్తాంఇక చర్చలపై ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ మాట్లాడుతూ.. ఆప్ మొత్తం 90 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.క్షేత్రస్థాయిలో తమ పార్టీ బలంగా ఉందని చెప్పారు. -
మొన్న కుల్దీప్, నిన్న చిన్మయానంద్.. నేడు..
న్యూఢిల్లీ : యువతి ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న గోపాల్ కందను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం బీజేపీకి తగదని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చురకలు అంటించారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడే బీజేపీ నేతలను భారత నారీమణులంతా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర, హరియాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడైన విషయం తెలిసిందే. అయితే హరియాణాలో హంగ్ ఏర్పడటంతో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీలు స్థానిక జేజేపీతో పాటు స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా పావులు కదిపి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకుంది. దీంతో మరోసారి హరియాణాలో బీజేపీ సర్కారు కొలువుదీరనుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రంగంలో దిగినప్పటికీ చేదు ఫలితం ఎదురుకావడంతో పార్టీ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో అధికారం కోసం బీజేపీ నేరస్తులను సైతం ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తోందని ప్రియాంక విమర్శించారు. ఎమ్మెల్యే గోపాల్ కందను ఉద్దేశించి ట్విటర్లో బీజేపీ తీరును విమర్శించారు. ఈ మేరకు... ‘ తొలుత కుల్దీప్ సెంగార్, తర్వాత చిన్మయానంద్.. ఇప్పుడు గోపాల్ కందా.... ఆత్మగౌరవం ఉన్న ప్రతీ భారతీయ మహిళ బీజేపీని, బీజేపీ నాయకులను బహిష్కరించాలి. ఇకపై వారెన్నడూ మహిళల గౌరవం గురించి మాట్లాడే ధైర్యం చేయకుండా బుద్ధి చెప్పాలి’ అని మహిళలకు విఙ్ఞప్తి చేశారు. కాగా దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ నేత కుల్దీప్ సెంగార్(తర్వాత పార్టీ నుంచి తొలగించారు) ప్రధాన నిందితుడన్న విషయం తెలిసిందే. అదే విధంగా చిన్మయానంద్ సైతం అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక హరియాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో భూపీందర్ సింగ్ హుడా కేబినెట్లో గోపాల్ కంద మంత్రిగా ఉండేవారు. అయితే గోపాల్ కందా వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ... ఆయన నిర్వహిస్తున్న ఏవియేషన్ కంపెనీలో పనిచేస్తున్న గీతిక శర్మ అనే ఎయిర్‌హోస్టెస్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ గోపాల్‌ను టార్గెట్ చేసి కేబినెట్ నుంచి వైదొలిగేలా చేసింది. అయితే ప్రస్తుతం హంగ్ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకే లోక్‌హిత్ పార్టీ తరఫున ఏకైక ఎమ్మెల్యేగా గెలుపొందిన గోపాల్ కంద మద్దతు తీసుకుంది. కాగా ఈ విషయంపై స్పందించిన మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘గోపాల్ కందా నిర్దోషా లేదా అమాయకుడా అన్న విషయాన్ని కోర్టు నిర్ణయిస్తుంది. అయితే అధికారం చేపట్టే క్రమంలో నైతిక విలువలు కోల్పోవడం మంచిది కాదు. అయినా ఓ నిందితుడు ఎన్నికల్లో గెలుపొందినంత మాత్రాన అతడు సచ్ఛీలుడు కాలేడు అని ఆమె ట్వీట్ చేశారు. First Kuldip Sengar, then Chinmayanand, now Gopal Kanda....every self respecting Indian woman should boycott the BJP and its leaders if they EVER dare to speak of respecting women again.#SayNoToKanda — Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 25, 2019 -
హరియాణాలో ఎగ్జిట్ ఫోల్స్‌కు షాక్
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ ఫోల్స్‌కు షాక్ ఇచ్చాయి. ప్రముఖ సంస్థలు ఇండియాటుడే, ఆక్సిస్ వన్ మినహా అన్ని ఎగ్జిట్ ఫోల్స్ బీజేపీకి 90 సీట్లకుగాను 70 సీట్లు సాధిస్తాయని తెలిపాయి. కానీ, ఫలితాలు ఎగ్జిట్ ఫోల్స్ అంచనాలకు బిన్నంగా రావడం గమనార్హం. ప్రస్తుత ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ బట్టి చూస్తే బీజేపీకి 40సీట్లు, కాంగ్రెస్‌కు 31సీట్లు, జేజేపీ 10, ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించాయి. 2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి 58శాతం ఓట్లు రాగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో 36శాతానికి పడిపోవడంతో రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జాట్యేతర సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌ను సీఎంగా నియమించడం వల్ల జాట్లు బీజేపీకి దూరమయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవా వీస్తున్నప్పటికి స్థానిక నాయకత్వం వాటిని ఓట్ల రూపంలో మలుచుకోవడంలో విఫలమయ్యారని పలువురు విశ్లేషిస్తున్నారు. -
‘నేను రాజీనామా చేయలేదు’
న్యూఢిల్లీ: తాను రాజీనామా చేయలేదని హరియాణా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బారాలా తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినమేర ఫలితాలు రాబట్టడంలో విఫలమవడంతో నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో సుభాష్ బారాలాపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన రాజీనామా చేశారని వార్తలు వచ్చాయి. మరోవైపు అమిత్ షా ఇప్పటికే.. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను ఢిల్లీకి రప్పించి, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చలు జరిపారు. 75 సీట్లు కచ్చితంగా గెలుస్తామనే నినాదంతో ముందుకెళ్లిన బీజేపీ, ఈసారి లెక్క తప్పింది. బీజేపీకి చెందిన ఏడుగురు మంత్రులు వెనుకంజలో ఉండడంతో.. ప్రస్తుతం మనోహర్ లాల్ ఖత్తర్ ప్రభుత్వం చిక్కుల్లో ఉంది. సుభాష్ పోటీ చేసిన ఫతేహబాద్ జిల్లాలోని తోహన స్థానంలోనూ వెనుకంజలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి ఎన్నికల ప్రచారం చేసినా బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించలేకపోయింది. అక్కడ దుష్యంత్ చౌతాలా నేతృత్వం వహిస్తున్న జన్నాయక్ జనతా పార్టీ ముందంజలో ఉంది. హరియాణా అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు గెలవాలి. తాజా ఫలితాల్లో బీజేపీ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ) 10 సీట్లలో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటులో జేజేపీ కీలకంగా మారింది. -
ప్రియాంక.. ఎందుకు వెళ్లనట్టు?
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మహారాష్ట్ర, హరియాణ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎందుకు ప్రచారం చేయలేదన్న ప్రశ్న ఉత్పమన్నమవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయడంపైనే ప్రధానంగా ఆమె దృష్టి పెట్టారని కాంగ్రెస్ నాయకుడొకరు వెల్లడించారు. ‘ఆమె(ప్రియాంక గాంధీ) ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పునర్నిర్మాణం, పునరుద్ధరణపై దృష్టి సారించార’ని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక ప్రచారం చేసినా యూపీలో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరలేదు. తమ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న అమేథీ స్థానం నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ 50 వేలకు పైగా ఓట్ల తేడాతో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. రాయబరేలి నుంచి సోనియా గాంధీ విజయం సాధించగలిగారు. యూపీలో కాంగ్రెస్‌కు ఉన్న లోక్‌సభ సీటు ఇదొక్కటే కావడం గమనార్హం. జనవరి 23న అధికారికంగా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా యూపీతో పాటు గుజరాత్, అసోం, పంజాబ్, హరియాణా, కేరళ రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించారు. చివరి అస్త్రంగా ప్రియాంకను ప్రయోగించేందుకే ఆమెను అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పంపలేదని హరియణాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ రాజేంద్ర శర్మ అభిప్రాయపడ్డారు. కాగా, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా మహారాష్ట్ర, హరియణా శాసనసభా ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లలేదు. రాహుల్ గాంధీ ఒక్కరే ప్రచారం చేశారు. మహారాష్ట్రలో 6, హరియాణాలో 2 ఎన్నికల సభల్లో ఆయన పాల్గొన్నారు. (చదవండి: అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు) -
మహారాష్ట్ర, హరియాణా ఎగ్జిట్ పోల్స్
-
మహారాష్ట్ర, హరియాణా ఎగ్జిట్ పోల్స్
సాక్షి, ముంబై : చెదురుమదురు ఘటనలు మినహా మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ మందకొడిగానే సాగింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. మహారాష్ట్రలోని 288, హరియాణాలోని 90 స్థానాలకు నేడు పోలింగ్ జరిగింది. కాగా పోలింగ్ అనంతరం విడులైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కమలం వైపే మొగ్గు చూపాయి. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన (SSP) కూటమి తిరుగులేని మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు వెల్లడించాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన రెండోసారి విజయదుందుభి మోగించనున్నదని ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించింది. గతంలో కంటే కాంగ్రెస్‌కు తక్కువ స్థానాలు వస్తాయని ప్రకటించింది. కాంగ్రెస్ కంటే ఎన్సీపీకి ఎక్కువ స్థానాలు వస్తాయని పేర్కొంది. బీజేపీకి గరిష్టంగా 124 స్థానాలు, శివసేన 70, కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. టెమ్స్ నౌ సర్వే ప్రకారం.. మహారాష్ట్రలో బీజేపీ 230, కాంగ్రెస్ 48, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించనున్నారు. రిపబ్లిక్ జన్‌కీ బాత్ ప్రకారం బీజేపీ 142, కాంగ్రెస్ 24 స్థానాల్లో విజయం సాధించనున్నాయి. సీఎన్ఎన్ న్యూస్ 18 సర్వేప్రకారం.. బీజేపీ 243, కాంగ్రెస్ 41, ఇతరులు 4 స్థానాలను కైవసం చేసుకోనుంది. ఏబీపీ న్యూ.సిఓటర్ ప్రకారం బీజేపీ 204, కాంగ్రెస్ 69, ఇతరులు 15 సీట్లను కైవసం చేసుకోనున్నారు. న్యూస్24 ప్రకారం.. బీజేపీ 230, కాంగ్రెస్ 48, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించనున్నారు. -
2 రాష్ట్రాల్లో ఓటేసిన సినీ క్రీడా రాజకీయ ప్రముఖులు
-
కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ
హిసార్: హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, సీనియర్ నేత ప్రొఫెసర్ సంపత్ సింగ్ సోమవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. పార్టీలో సరైన గౌరవం దక్కకపోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంపత్ సింగ్ భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఆయన గతంలో ఐఎన్ఎల్డీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 2009లో హరియాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేశానని, అయినా కష్టానికి తగిన గుర్తింపు దక్కలేదని సంపత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 21న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మార్వా నుంచి టిక్కెట్ ఆశించారు. కాంగ్రెస్ అధిష్టానం మొండిచేయి చూపడంతో పార్టీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు తగదని లేదా కాంగ్రెస్ పార్టీకి తాను తగనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు తన అవసరం లేనందు వల్లే రాజీనామా చేశానని చెప్పారు. నాలుగు రోజుల క్రితమే పీసీసీ మాజీ అధ్యక్షుడు అశోక్ తన్వర్ వైదొలిగిన విషయం తెలిసిందే. సంపత్ సింగ్ బీజేపీలో చేరనున్నారా అని ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్‌ను విలేకరులు ప్రశ్నించగా.. ‘ఆయన మంచి వ్యక్తి. మంత్రిగా ఉన్నప్పుడు బాగా పనిచేశారు. ఆయన మా పార్టీలో చేరాలనుకుంటే మీకు తెలిసే జరుగుతుంద’ని సమాధానమిచ్చారు. -
‘ఢిల్లీ రికార్డ్‌ను బద్ధలు కొడతాం’
హరియాణా : ఢిల్లీలో మాదిరిగానే హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం హిసర్‌లో కేజ్రీవాల్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2019 ఎన్నికల్లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ‘హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి.. గతంలో ఢిల్లీలో నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేస్తాం. గత యాభైఏళ్లుగా హరియాణాను అభివృద్ధి చేయటంలో పాలకులు విఫలమయ్యారు. పుట్టినగడ్డ రుణం తీర్చుకునే అవకాశం నాకు కల్పించండి’ అని ప్రజలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. ఢిల్లీలో తన పాలనలో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను అభివృద్ధి చేశానని, ఒక్క అవకాశం ఇస్తే హరియాణాలోనూ అదే అభివృద్ధిని చేపడతాని ఆయన అన్నారు. హరియాణా ప్రభుత్వం ప్రజల మధ్య మతఘర్షణలను పోత్సహిస్తోందని సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌ను ఉద్దేశించి కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్ అవినీతితో విసిగిపోయిన హరియాణా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. కానీ, బీజేపీ కూడా అదే అడుగుజాడల్లో నడుస్తోంది. కాబట్టి, మాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి’ అని ఆయన ప్రజలను కోరారు. ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ.. రైతులను ఆదుకోవడంలో విఫలమైందని.. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
'వెన్నుపోటు పొడవలేదు, పొత్తు వదులుకున్నాం'
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్టాల్లో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో తమ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే అని చెప్పారు. అయితే శివసేనకు వ్యతిరేకంగా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. శివసేనను తాము వెన్నుపోటు పొడవలేదని, ఆ పార్టీతో పొత్తు మాత్రమే వదులుకున్నామని చెప్పారు. హర్యానాలో కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాలని ఓటర్లు నిర్ణయించుకున్నారని అన్నారు. ఎన్నికల తర్వాత హర్యానాలో ప్రభుత్వ పగ్గాలు తమ చేతికే వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, హర్యానాలో ఈనెల 15న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.