హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆయా రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. పట్టు విడుపులు లేకుండా పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే తాము కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు సిద్దమేనంటూ సంకేతాలిచ్చిన ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం..అక్టోబర్ 5న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ కలయత్,కురుక్షేత్ర అసెంబ్లీ స్థానాలు తమకే కావాలని చర్చలు జరుతుంది.
ఓవైపు ఆప్ పొత్తు చర్చలు జరుపుతూనే కాంగ్రెస్, బీజేపీ రెబల్ అభ్యర్థులకు గాలం వేసే పనిలో పడింది. ఏ పార్టీతో పొత్తు లేదనుకుంటే రెబల్ అభ్యర్థులను తమ పార్టీలోకి చేర్చుకుని అసెంబ్లీ స్థానాల్ని ఖరారు చేయనుంది.
రంగంలోకి రాఘవ్ చద్దా
ఇది లావుండగా,ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆదివారం మాట్లాడుతూ..పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, చర్చలు సఫలం అవుతాయనే నమ్మకంతో ఉన్నామని చెప్పారు.హర్యానా ప్రజల సంక్షేమం కోసం రెండు జాతీయ పార్టీలు కూటమిగా ఏర్పడితే గెలుపు తధ్యమన్నారు. పొత్తు విషయమై కాంగ్రెస్‌తో రాఘవ్ చద్దా చర్చలు జరుపుతున్నారు. కాగా, హర్యానాలో అక్టోబరు 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు వెల్లడికానున్నాయి.
90 స్థానాల్లో పోటీ చేస్తాం
ఇక చర్చలపై ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ మాట్లాడుతూ.. ఆప్ మొత్తం 90 స్థానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.క్షేత్రస్థాయిలో తమ పార్టీ బలంగా ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment