న్యూఢిల్లీ: ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కొనసాగడం సందిగ్ధంలో పడింది. కాంగ్రెస్,ఆప్ నేతలు పరస్పరం చేసుకుంటున్న విమర్శలు రెండు పార్టీల మధ్య దూరం పెంచుతున్నాయి. కాంగ్రెస్ అనేది ఒక చరిత్రగా మారిందని పంజాబ్ సీఎం, ఆప్ అగ్రనేత భగవంత్‌మాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
‘ఆమ్ ఆద్మీ పార్టీ తీహార్ జైలులో పుట్టింది. ఆ పార్టీకి చెందిన సగం మంది నేతలు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఆప్ నమ్మదగిన పార్టీ కాదు. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు పొత్తు రాజకీయాలు అర్థం కావు. ఆప్ ఇండియా కూటమిలో ఉందో లేదో వాళ్లకే తెలియాలి. కూటమిలో ఉండాలంటే ఆప్ ఇతర పార్టీలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది’అని కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ అన్నారు.
కాంగ్రెస్‌ను ఉద్దేశించి పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సోమవారం ఘాటు విమర్శలు చేశారు. ఢిల్లీ, పంజాబ్‌లలో ఆ పార్టీ గురించి తల్లులు పిల్లలకు కథలు కథలుగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్ అనే పార్టీ ఉండేదని పిల్లలకు కథ చెప్పొచ్చని ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్, ఆప్‌పై విరుచుకుపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment