‘ఫోర్లు, సిక్స్‌లు కొట్టడంలో తనకు తానే పోటీ’.. కేజ్రీపై మాన్‌ | AAP Will Be Part Central Government After June 4th Said Punjab CM Bhagwant Mann, Details Inside | Sakshi
Sakshi News home page

‘ఫోర్లు, సిక్స్‌లు కొట్టడంలో తనకు తానే పోటీ’.. కేజ్రీపై మాన్‌

Published Sat, May 11 2024 3:26 PM | Last Updated on Sat, May 11 2024 4:21 PM

Aap Will Be Part Central Government After June 4th Said Bhagwant Mann

కేజ్రీవాల్ రిటైర్డ్ హర్ట్ మాత్రమే సిక్స్, ఫోర్లు అదే ఉత్సాహంతో కొడతారు. కాబట్టే జూన్ 4న కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో ఆప్ భాగస్వామ్యమని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు దాటవని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆప్‌ పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ భగవంత్‌ మాన్‌ ప్రసంగించారు. కేజ్రీవాల్‌ నియంతృత్వ శత్రువు. ప్రతి చోటా నేను ఇదే మాట చెప్పాను. చెబుతున్నాను. కేజ్రీవాల్ ఒక వ్యక్తి కాదు ఒక ఆలోచన. మీరు ఆ వ్యక్తిని అరెస్టు చేయొచ్చు. కానీ ఆలోచనను కాదు అని ప్రశంసల వర్షం కురపించారు. కష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలిచిన ఢిల్లీ ఆప్‌ కార్యకర్తలకు భగవంత్‌ మాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

సమయం లేదు మిత్రమా
‘కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉన్నందున కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు కేవలం 20 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 12 గంటలకు బదులుగా మాకు 18 గంటలు పని ఉంది. మొదటి మూడు రౌండ్ల సర్వేలు మోదీ 400 సీట్లు గెలవలేరని తేలింది.  దర్యాప్తు సంస్థల‍్ని ఉసిగొల్పి ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తే ఎన్నికల్లో గెలవలేరని’ ఆయన ఆరోపించారు.  

ఫోర్లు, సిక్స్‌లు కొట్టడంలో
క్రికెట్‌ పరిభాషలో క్రేజీవాల్‌ను ఉద్దేశిస్తూ ‘కేజ్రీవాల్ రిటైర్డ్ హర్ట్ మాత్రమే సిక్స్, ఫోర్లు అదే ఉత్సాహంతో కొడతారని’అన్నారు. అదే ఉత్సాహంతో పంజాబ్‌లో ఆప్‌ హవా కొనసాగుతుంది. బీజేపీ, కాంగ్రెస్‌లు తుడిచిపెట్టుకుపోయి. మొత్తం 13 లోక్‌సభ సీట్లు ఆప్‌కే దక్కుతాయని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ జోస్యం చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement