![Nitish Kumar Likely To Be Appointed Convenor Of INDIA Bloc - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/3/nitishkumar_img.jpg.webp?itok=IESevXhG)
ఢిల్లీ: ఇండియా కూటమి కన్వినర్‌గా బిహార్ సీఎం నితీష్ కుమార్‌ను నియమించనున్నారు. ఈ నిర్ణయాన్ని ఆమోదించడానికి ప్రతిపక్ష పార్టీల వర్చువల్ సమావేశం ఈ వారంలో జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదిత నియామకాన్ని నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లతో కాంగ్రెస్ ఇప్పటికే చర్చించింది.
భారత కూటమిలోని ఇతర భాగస్వాములను కూడా సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదే విషయమై నితీష్ కుమార్ నిన్న ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడారు. నితీష్ కుమార్‌ను కన్వీనర్‌గా నియమించే ఆలోచనకు ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ మద్దతును వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇండియా కూటమి నేతలు డిసెంబర్ 19న నాలుగవ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలోనే కూటమికి అధ్యక్షునిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను నియమించాలనే ప్రతిపదానను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురు నేతలు తీసుకున్నారు. ఈ సమావేశంలోనే సీట్ల పంపకం సహా 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనడానికి కావాల్సిన వ్యూహాలపై చర్చించారు.
ఇదీ చదవండి: మూడోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా
Comments
Please login to add a commentAdd a comment