ఢిల్లీ: హర్యానా, జమ్ము కశ్మీర్‌కు సంబంధించి ఎగ్జిట్‌పోల్స్ నేడు విడుదలయ్యాయి. ఈ క్రమంలో పలు సర్వే సంస్థలు హర్యానాలో కాంగ్రెస్‌కు అధికారం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. హర్యానాలో 90 నియోజకవర్గాలకు గానూ 55కి పైగా స్థానాల్లో హస్తం పార్టీ గెలుస్తుందని సర్వేలు చెప్పాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీఎం ఎవరు అనే చర్చ మొదలైంది.
హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి స్థానం ఎవరిది? అనే చర్చ రాజకీయంగా చర్చనీయాశంగా మారింది. ప్రధానంగా పార్టీలో సీనియర్ నేతలు కుమారి సెల్జా, రణ్‌దీప్ సూర్జేవాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ సీఎం ఎవరు అనే అంశం పార్టీ హైకమాండ్ నిర్ణయింస్తుందని తెలిపారు. కుమారి సెల్జాకు సీఎం బాధ్యతలు అప్పగించే అవకాశముందా? అని ప్రశ్నించగా.. మనది ప్రజాస్వామ్యం. సీఎం పదవి కోసం ఎవరైనా ఆసక్తి చూపవచ్చు అంటూ కామెంట్స్ చేశారు.
ఇదే సమయంలో..హర్యానాలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని భావిస్తున్నాం. ప్రస్తుత బీజేపీ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. అవినీతి పెరిగిపోయింది. అందుకే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రజలందరూ కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు.
#ElectionsWithNDTV #HaryanaElections #BhupinderHooda pic.twitter.com/wF7Z7WMnqn
— NDTV (@ndtv) October 5, 2024
Comments
Please login to add a commentAdd a comment