Kumari Selja
-
కాంగ్రెస్ దే హార్యానా.. సీఎం పీఠం ఎవరిదంటే..!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందంటూ మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. మొత్తం 90 నియోజకవర్గాలకు గానూ 55కి పైగా స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ఇక రేపు(అక్టోబర్ 8) అధికారిక ఫలితాలు వెలువడనున్న ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు ఎవరు చేపడతారన్న దానిపై చర్చ మొదలైంది.ప్రధానంగా సీఎం పదవికి ముందంజలో ఉన్న పార్టీ సీనియర్ నేతలు కుమారి సెల్జా, రణ్‌దీప్ సూర్జేవాలా పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ఎంపీ కుమారి సెల్జా స్పందించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. అయితే ఆ పదవికి కావాల్సిన అర్హతలు, అనుభవం తనకు ఉందని పేర్కొన్నారు.@నేనేమీ చెప్పలేను. నేనే కాదు. ఎవరూ ఏం చెప్పలేరు.. సీఎం ఎవరనే విషయం హైకమాండ్ ప్రకటన తర్వాతే తెలుస్తుంది.. హైకమాండ్ నిర్ణయాన్ని అందరూ అంగీకరిస్తారు.. నేను ఇప్పటికే పబ్లిక్ డొమైన్లో మాట్లాడాను.. ఈ విషయం హైకమాండ్‌కు తెలుసు. అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది.’ అని కుమారి సెల్జా సోమవారం తెలిపారు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర’ ఆయనపై. పార్టీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని మార్చేసిందని పేర్కొన్నారు. ‘రాహుల్ యాత్రతో మొత్తం మారిపోయింది. ఆయనపై ప్రజల్లో ఉన్న అవగాహన, కాంగ్రెస్‌పై ఉన్న అభిప్రాయం, బీజేపీపై ఉన్న అభిప్రాయం మారిపోయింది. అందుకే లోక్‌సభలో బీజేపీ సీట్లు ఎలా తగ్గాయో చూశాం. హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది.’ అని పేర్కొన్నారు. -
హర్యానాలో కాంగ్రెస్ హవా.. వారిద్దరిలో సీఎం ఎవరు?
ఢిల్లీ: హర్యానా, జమ్ము కశ్మీర్‌కు సంబంధించి ఎగ్జిట్‌పోల్స్ నేడు విడుదలయ్యాయి. ఈ క్రమంలో పలు సర్వే సంస్థలు హర్యానాలో కాంగ్రెస్‌కు అధికారం వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. హర్యానాలో 90 నియోజకవర్గాలకు గానూ 55కి పైగా స్థానాల్లో హస్తం పార్టీ గెలుస్తుందని సర్వేలు చెప్పాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీఎం ఎవరు అనే చర్చ మొదలైంది.హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ముఖ్యమంత్రి స్థానం ఎవరిది? అనే చర్చ రాజకీయంగా చర్చనీయాశంగా మారింది. ప్రధానంగా పార్టీలో సీనియర్ నేతలు కుమారి సెల్జా, రణ్‌దీప్ సూర్జేవాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ సీఎం ఎవరు అనే అంశం పార్టీ హైకమాండ్ నిర్ణయింస్తుందని తెలిపారు. కుమారి సెల్జాకు సీఎం బాధ్యతలు అప్పగించే అవకాశముందా? అని ప్రశ్నించగా.. మనది ప్రజాస్వామ్యం. సీఎం పదవి కోసం ఎవరైనా ఆసక్తి చూపవచ్చు అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో..హర్యానాలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని భావిస్తున్నాం. ప్రస్తుత బీజేపీ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. అవినీతి పెరిగిపోయింది. అందుకే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రజలందరూ కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. #ElectionsWithNDTV #HaryanaElections #BhupinderHooda pic.twitter.com/wF7Z7WMnqn— NDTV (@ndtv) October 5, 2024 -
Haryana Assembly Elections 2024: బీజేపీలో చేరాలంటూ సెల్జాకు ఖట్టర్ ఆఫర్
చండీగఢ్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కుమారి సెల్జాను బీజేపీలో చేరాల్సిందిగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత మనోహర్ లాల్ ఖట్టర్ ఆహ్వానించారు. ప్రముఖ దళిత నేత కూడా అయిన సెల్జా వచ్చే నెలలో జరిగే హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారన్న వార్తల నేపథ్యంలో మంత్రి ఈ ఆఫర్ ఇవ్వడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా సీఎం అభ్యర్థి ఎవరనే విషయమై రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత పోరు తీవ్రతరమైందని మంత్రి ఖట్టర్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఘరువాండాలో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో మాట్లాడారు. -
సీఎం రేసులో నేనెందుకు ఉండకూడదు?
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధిస్తే హరియాణా సీఎం రేసులో తాను కూడా ఉంటానని సీనియర్ నాయకురాలు, ఎంపీ కుమారి సెల్జా స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా, సామాజికవర్గంగా ప్రజలకు ఆకాంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబరు ఒకటో తేదీన జరగనున్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో సిర్సా నుంచి లోక్‌సభకు ఎన్నికైన దళిత నాయకురాలు సెల్జా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటున్నట్లు సంకేతాలిచ్చారు. రాష్ట్రంలో పనిచేయాలనేది తన అభిమతమని, ఈ విషయంలో పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. హరియాణా కాంగ్రెస్ భూపిందర్ సింగ్ హుడా, సెల్జా వర్గాలుగా చీలిపోయింది. ఇది కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతిస్తోందనే వాదనను సెల్జా కొట్టిపారేశారు. ఎన్నికలు వచి్చనపుడు అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ శిబిరంగా బరిలోకి దిగుతామని చెప్పారు. “్ఙనేను చాలా వాస్తవిక దృక్పథంతో ఉంటాను. ముక్కుసూటిగా సమాధానాలు చెబుతాను. ఏ సంస్థలో తీసుకొన్నా ఆధిపత్య పోరాటం ఉంటుంది. ఆకాంక్షలు, పార్టీ కోసం శ్రమించడం, స్థానాన్ని పదిలపర్చుకునే ప్రయత్నం.. అన్నీ ఉంటాయి. అయితే పార్టీ అభ్యర్థులను ప్రకటించే వరకే ఇవన్నీ. తర్వాత అందరూ ఒక్కటై క్షేత్రస్థాయిలోకి వెళ్లడమే’ అని సెల్జా చెప్పుకొచ్చారు. ఎన్నికల తర్వాత ఇతర పారీ్టలతో కూటమి కట్టే అవకాశాలపై మాట్లాడుతూ.. హరియాణాలో హంగ్ రానేదాదని, కాంగ్రెస్ అద్భుత మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవుతున్నామని, ప్రజలంతా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. అధికారంలో లేనపుడు సీఎం అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు వెళ్లే సంప్రదాయం కాంగ్రెస్ పారీ్టలో లేదన్నారు. -
హరియాణాలో తదుపరి సర్కార్ మాదే..
చండీగఢ్ : హరియాణాలో కాంగ్రెస్ పార్టీ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కుమారి సెల్జా చెప్పారు. హరియాణా ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారని, బీజేపీ వైఫల్యాలను వారు ఇక ఎంతమాత్రం సహించబోరనే సంకేతాలు పంపారని సెల్జా గురువారం ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకత్వంలో హరియాణా తిరిగి నూతన జవసత్వాలు అందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. హరియాణాలో 90 అసెంబ్లీ స్ధానాలకు గాను బీజేపీ 37 స్ధానాల్లో, కాంగ్రెస్ 32 స్ధానాల్లో, ఇతరులు 21 స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46 స్ధానాలకు బీజేపీ చాలా దూరంలో నిలవడంతో దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ కింగ్ మేకర్‌గా నిలిచింది. ఆ పార్టీ మద్దతు కోసం కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. -
హరియాణాలో రాజకీయ వేడి
హరియాణాలో రాజకీయ వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ అగ్రనాయకులంతా హరియాణాలో మకాం వేస్తున్నారు. దీంతో హోరాహోరీ నెలకొంది. రాష్ట్రంలో 2009 వరకు కాంగ్రెస్ హవా కొనసాగినా 2014 తొలిసారి బీజేపీ పాగా వేసింది. గత మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పదికి పది స్థానాల్లోనూ విజయఢంకా మోగించిన కమలం ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం తమదేనని ధీమాతో ఉంది. మరోవైపు కాంగ్రెస్‌లో అంతర్గ కుమ్ములాటలు కూడా బీజేపీకి మరింత బలాన్నిస్తున్నాయి. అయితే కుమారి సెల్జా నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఎలాగైనా పగ్గాలు చేజిక్కించుకోవాలని కసరత్తు చేస్తోంది. ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్‌ల మధ్యే ఉండనుంది. ‘కశ్మీర్’ పనిచేస్తుందా? బీజేపీకి తీవ్రమైన వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే బీజేపీ ప్రజాప్రదర్శనలాంటి పలు కార్యక్రమాలు చేపట్టింది. అస్సాంలో మాదిరిగా హరియాణాలో అక్రమ వలసల నివారణకు ప్రభుత్వం యత్నిస్తోంది. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో బీజేపీ ఎదుర్కోనున్న ప్రధాన సవాల్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ) నుంచే. అయితే మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలైన కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు, ముస్లిం మైనారిటీ మహిళల హక్కులను కాపాడే త్రిపుల్ తలాక్ రద్దు చట్టం ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలన్నది నిపుణుల అంచనా. హరియాణాలో 18 ఏళ్ళ తరువాత జాట్‌యేతరుడైన ఖట్టర్ సీఎం అయ్యారు. అయినా జాట్ల ఉద్యమాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయారన్న విమర్శలున్నాయి. అయితే ఈసారి ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ శాయశక్తులా కృషి చేస్తోంది. ఎన్నికలు అత్యంత సమీపంలో ఉన్న వేళ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు అలుముకున్నాయి. మోదీతో సహా బీజేపీ అగ్రనేతలంతా ప్రచారానికి దిగుతున్నారు. దీంతో అంతర్గత కుమ్ములాటలు చల్లారే అవకాశం ఉంది. భూపేందర్ స్థానమెక్కడ? హరియాణాలో 27 శాతం జాట్ సామాజికవర్గాలే ఉన్నాయి. గతంలో ఐదుగురు ముఖ్యమంత్రులు ఇదే సామాజికవర్గం నుంచి ఉన్నారు. స్వయంగా భూపేందర్ సింగ్ హుడా, అతని కుమారుడు దీపేందర్ సింగ్ హుడా సోనాపేట్, రోహతక్‌ల నుంచి 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. జాట్ సామాజిక వర్గం ఆధిపత్యంలోని ఈ ప్రాంతం ఒకప్పుడు భూపేందర్‌కి బలమైన ప్రాంతం. ఈసారి సైతం కష్టతరమేనని నిపుణులు అభిప్రాయం. కాంగ్రెస్‌లో లుకలుకలు రాష్ట్రంలో పునర్వైభవాన్ని తీసుకొచ్చే మాట అటుంచి, అసలు పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు అంతేలేదు. స్వయంగా రాహుల్ గాంధీయే ఏరికోరి పీసీసీ అధ్యక్షుడిని చేసిన దళిత నేత అశోక్ తన్వర్‌ని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ పై ఈ వర్గాలు తాడోపేడో అన్నట్టున్నాయి. అంతేకాదు. ఏకంగా ఢిల్లీలో సోనియా నివాసం ముందు ధర్నాకి కూడా దిగారు. దీంతో విసిగిపోయిన శ్రేణులు బీజేపీలో చేరిపోయారు. రేపటి నుంచి రాహుల్ ప్రచారం ప్రారంభమౌతున్నా కాంగ్రెస్‌ని నిరాశాభావం వెంటాడుతోంది. -
ఉద్యోగాల్లో మహిళలకు 33% కోటా
చండీగఢ్: హరియాణా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మహిళలపైనే దృష్టి సారించింది. శుక్రవారం విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు, రైతులకు రుణ మాఫీ హామీలను ప్రకటించింది. ఈ మేనిఫెస్టోను సంకల్పయాత్రగా అభివర్ణించిన ఆ పార్టీ హరియాణా రోడ్‌వే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం కోటా అమలు చేస్తామంది. రైతులకు రుణమాఫీ, ఎస్సీ విద్యార్థులు, అత్యంత వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఏడాదికి 12 వేల రూపాయల స్కాలర్ షిప్, పదకొండు, పన్నెండు తరగతులకు ఏడాదికి 15 వేల రూపాయలు స్కాలర్ షిప్ ఇస్తామని హరియాణా కాంగ్రెస్ చీఫ్ కుమారి సెల్జా వెల్లడించారు. షెడ్యూల్డ్ కులాల కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
అధికారంలోకి వస్తే రుణమాఫీ
న్యూఢిల్లీ/చండీగఢ్: హరియాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల, రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కుమారి సెల్జా ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే హామీలను నెరవేరుస్తామని, ఎప్పుడు చేస్తామన్న విషయాన్ని వివరించే టైమ్‌లైన్ కూడా విడుదల చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పూర్తవుతోందని, త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. తన్వార్ రాజీనామా గురించి మాట్లాడుతూ.. పార్టీ ఆయన్ను స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటిస్తే ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారన్నారు. తమకు వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమని తెలిపారు. ఎన్నికల ఫలితాల తర్వాత హరియాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. మనం భారత్‌మాతా కీ జై అంటే వారు... కాంగ్రెస్ పార్టీ నేతలకు దేశం కంటే అధిష్టానమే ముఖ్యమని, అందుకే వారు సోనియా మాతాకీ జై అంటారని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వ్యాఖ్యానించారు. గూర్గాన్‌కు చెందిన కాంగ్రెస్ నామినీ సోనియా గాంధీకీ జై అంటూ నినాదాలు చేసిన వీడియో బయటకు రావడంతో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీకి దేశం ప్రాధాన్యమని అందుకే తాము భారత్ మాతాకీ జై అంటామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రస్తుతం ప్రపంచ నేతగా ఎదిగారని ఆయన తెలిపారు. -
హరియాణా కాంగ్రెస్‌కు కొత్త సారథి..
న్యూఢిల్లీ : హరియాణా కాంగ్రెస్ నూతన సారథిగా కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా నియమితులయ్యారు. ఈ ఏడాది చివర్లో హరియాణా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని ముఖ్య నాయకుల మధ్య విభేదాలు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సెల్జా నియామకం వైపు మొగ్గు చూపింది. దళిత సామాజిక వర్గానికి చెందిన సెల్జా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి సెల్జా సన్నిహితురాలుగా ఉన్నారు. రాష్ట్రంలో 19 శాతం ఉన్న దళిత ఓటర్లను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెల్జా తండ్రి చౌదరి దల్వీర్‌సింగ్ కూడా హరియాణా కాంగ్రెస్ అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు. తనను కాంగ్రెస్ చీఫ్‌గా నియమించడంపై స్పందించిన సెల్జా.. ఇది తనపై బాధ్యతను మరింతంగా పెంచిందని తెలిపారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాననని స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉన్న అశోక్ తన్వార్, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్‌కు మధ్య గత కొంతకాలంగా విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అశోక్ తన్వార్‌ను పీసీసీ అధ్యక్ష బాధ్యతల తొలగించాలని భూపిందర్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భూపిందర్‌సింగ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించవద్దని అశోక్ కోరుతున్నారు. అయితే ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ అధిష్టానం సెల్జాకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. భూపిందర్‌సింగ్‌ను పార్టీ ఎలక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమించింది. కాగా, 90 స్థానాలున్న హరియాణా అసెంబ్లీకి.. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 47 స్థానాల్లో గెలుపొంది అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 15 స్థానాలకే పరిమితమైంది. -
మంత్రి విచారం వ్యక్తం చేసినా....
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ కుమారి షెల్జాపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో గందరగోళం రేగింది. గోయల్ విచారం వ్యక్తం చేసినా సభా కార్యకలాపాలు సాగలేదు. సభను దారిలోకి తెచ్చేందుకు చైర్మన్ హమీద్ అన్సారీ, డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తన కులం కారణంగా కొన్నేళ్ల కిందట గుజరాత్ లోని ద్వారక ఆలయంలో వివక్షకు గురయ్యానని కుమారి షెల్జా వెల్లడించడంతో వివాదం మొదలైంది. ఇదంతా ఆమె కల్పించి చెప్పారని గోయల్ వ్యాఖ్యానించారు. దీంతో గోయల్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. వెల్ లోకి దూసుకొచ్చి ఆందోళన తెలిపారు. దీంతో సభను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. తర్వాత గోయల్ క్షమాపణ చెప్పినా పరిస్థితి సద్దుమణగకపోవడంతో సభా కార్యక్రమాలు సజావుగా సాగలేదు. -
'షెల్జాకు కుల వివక్ష'పై రాజ్యసభలో రగడ
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని ఓ ఆలయంలో తాను కులవివక్ష ఎదుర్కొన్నానని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు కుమారి షెల్జా .. రాజ్యసభలో వెల్లడించడం దుమారాన్ని రేపింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాజ్యసభ సమావేశాల తొలిరోజు బుధవారం రాజ్యాంగంపై జరిగిన చర్చలో షెల్జా మాట్లాడుతూ.. 'గుజరాత్లో ఓ ఆలయ దర్శనానికి వెళ్లినపుడు నా కులం గురించి అడిగారు' అని చెప్పారు. దీనిపై రాజ్యసభ నాయకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. ప్రధాన ఆలయంలో ఆమె కులం గురించి అడగలేదని అన్నారు. దీనిపై షెల్జా జోక్యం చేసుకుంటూ.. ద్వారక ఆలయంలో తనను కులం గురించి అడగలేదన్ని విషయాన్నిస్పష్టంగా చెప్పానని, ఆలయ సందర్శనకు వెళ్లినపుడు తనకు ఎదురైన సంఘటనను మంత్రి పక్కనబెట్టి, తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. షెల్జాకు కాంగ్రెస్ సభ్యులు మద్దతుగా నిలిచారు. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలియజేస్తూ రాజ్యసభ చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సభను రెండుమార్లు వాయిదా వేశారు. -
కేంద్ర మాజీ మంత్రి సెల్జా నివాసంలో మృతదేహం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు కుమారి సెల్జా నివాసంలో సోమవారం ఉదయుం ఒక వ్యక్తి మృత దేహం కనిపించడం కలకలం సష్టించింది. మరణించిన వ్యక్తి పేరు సంజయ్(42) అని, అతను మధ్య ఢిల్లీలోని సునెహ్రీబాగ్లోని సెల్జా నివాసంలో పనిచేసే మహిళ భర్త అని పోలీసులు తెలిపారు. సంజయ్ మతదేహాన్ని ఉదయుం 8 గంటలకు సెక్యూరిటీ గార్డు చూశాడు. పోలీసులకు వెంటనే సమాచారం అందించడంతో ఉన్నతాధికారులతో పాటు తిలక్‌మార్గ్ పోలీస్‌స్టేషన్ అధికారులు, ఫోరెన్సిక్ సిబ్బంది, నేర విభాగం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంజయ్ మరణం సహజమైనది కాదని పోలీసులు అనుమానిస్తున్నారు. సంజయ్ శరీరంపై గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు. -
కేంద్ర మాజీమంత్రి ఇంట్లో మృతదేహం
-
కేంద్ర మాజీమంత్రి నివాసంలో మృతదేహం
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కుమారి శెల్జా నివాసంలో సోమవారం ఓ మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన వ్యక్తిని శెల్జా నివాసంలో పనిమనిషి భర్త సంజయ్ (42)గా పోలీసులు గుర్తించారు. అడిషనల్ పోలీస్ కమిషనర్ ఎస్బీఎస్ త్యాగి మాట్లాడుతూ తమకు ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో మృతదేహం గురించి పోలీస్ కంట్రోల్ రూమ్‌కి శెల్జా నివాసం నుంచి ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ సిబ్బంది ఆధారాలు సేకరిస్తోంది. సంజయ్ మృతిపై విచారణ జరుపుతున్నట్లు త్యాగి పేర్కొన్నారు. -
కేంద్రమంత్రి సెల్జా రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం!
కేంద్రమంత్రి కుమారి సెల్జా రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. సెల్జా రాజీనామా చేయడంతో ఆ శాఖను రైల్వే మంత్రి మల్లికార్జున్ కు అప్పగించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో సెల్జాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కుమారి సెల్జా మంత్రివర్గం నుంచి తప్పుకుని పార్టీకి సేవలందించడానికి రాజీనామా సమర్పించారు. నాలుగు సార్లు లోకసభకు ఎంపికైన సెల్జా తన స్వంత రాష్ట్రం హర్యానా నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ సంవత్సరం చివరన హర్యానాలో జరిగే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసేందుకు మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు.